For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: శృతి రూమ్‌లో ప్రేమ్ ఫొటో చూసిన అక్షర.. ఆ మాట చెప్పడంతో అనుమానం

  |

  మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగులో ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో ఓ లుక్కేద్దాం పదండి!

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఎంగేజ్‌మెంట్ కోసం వచ్చిన శృతి డ్రెస్ చూసి అక్షర నిరాశ చెందుతుంది. అంతేకాదు, ఆ వెంటనే తన చీరను తీసి ఆమెకు ఇస్తుంది. మొదట దాన్ని తీసుకోడానికి ఆమె నిరాకరించినా.. తర్వాత తీసుకుంటుంది. శృతితో అక్షర వ్యవహరిస్తున్న తీరును చూసి తులసి ఎంతగానో సంతోషిస్తుంది. ఆ తర్వాత నందూ, జీకే కుటుంబాలు ఎంగేజ్‌మెంట్‌ను సరదాగా జరుపుతారు. మనసులో బాధతోనే ప్రేమ్.. అక్షరకు ఉంగరాన్ని తొడుగుతాడు. ఇక, జీకే ఢిల్లీ వెళ్తుండడంతో అక్షర.. తులసి ఇంటికి వెళ్తానని చెబుతుంది.

  బికినీ ఫొటో అడిగిన కుర్రాడికి అనుపమ ఆఫర్: అడ్రెస్ పంపమంటూ లైవ్‌లోనే ఊహించని విధంగా!

  శృతి రూమ్‌లోకి అక్షర.. వద్దని చెప్పినా

  శృతి రూమ్‌లోకి అక్షర.. వద్దని చెప్పినా

  తన కోరిక ప్రకారమే అక్షర.. పెళ్లి అవకముందే తులసి ఇంటికి వస్తుంది. ఆ సమయంలో 'నేను చాలా లక్కీ కదా ఆంటీ. ప్రేమ్‌ను పెళ్లి చేసుకుంటాననడం దానికి మా డాడీ.. మీరూ ఒప్పుకోవడం.. ఇప్పుడు పెళ్లికి ముందే మీ ఇంటికి రావడం.. ఇదంతా చాలా సంతోషంగా ఉంది. అవును.. నేను ఇప్పుడు ఎవరి రూమ్‌లో ఉండాలి' అని అడుగుతుంది. అప్పుడు లాస్య తన రూమ్‌లో ఉండమంటుంది. కానీ, అక్షర 'మీకు నాకు జనరేషన్ గ్యాప్ ఉంది. కాబట్టి శృతి రూమ్‌‌లో ఉంటా' అంటుంది. దీనికి అందరూ వద్దని చెప్పినా తులసి మాత్రం శృతితో ఉండమని చెబుతుంది.

  శృతి దగ్గర ప్రేమ్ ఫొటో... అక్షర అలా

  శృతి దగ్గర ప్రేమ్ ఫొటో... అక్షర అలా

  అక్షర.. శృతి రూమ్‌లోకి వెళ్లి చూసి సంతోషిస్తుంది. అంతేకాదు, ఎంతో క్లీన్‌గా ఉందని ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతుంది. 'నీ రూమ్ ఎంతో చక్కగా ఉంది. అదే నా రూమ్ అయితేనా సునామీ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇది నాకు ఎంతగానో నచ్చేసింది. అయినా నేను పెళ్లి కాకముందే ఇక్కడికి వచ్చేశాను. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నాకు అందరూ నచ్చారు. ప్రేమ్ మరీ నచ్చాడు. తులసి ఆంటీ అతనికి ప్రేమ్ అని పేరు పెట్టింది అతడిలో కొండంత ప్రేమ ఉండబట్టే' అని అంటుంది. అంతలో తన బెడ్ మీద ప్రేమ్ ఫొటో చూస్తుంది శృతి.

  షర్ట్ విప్పేసి షాకిచ్చిన బిగ్ బాస్ సరయు: బ్రాతో ఘాటు ఫోజులిస్తూ.. వామ్మో చూస్తే తట్టుకోలేరు

   ఫొటో చూసిన అక్షర.. లైట్ తీసుకుని

  ఫొటో చూసిన అక్షర.. లైట్ తీసుకుని

  ఒకవైపు అక్షర మాట్లాడుతున్నా శృతి ఫోకస్ మొత్తం ప్రేమ్ ఫొటో మీదే ఉంటుంది. అప్పుడు ఆమె ఈ ఫొటోను చూడకూడదని మనసులో కోరుకుంటుంది. కానీ, అక్షర మాత్రం దాన్ని చూసేస్తుంది. అప్పుడు శృతి భయపడుతుండగా ఆమె 'ప్రేమ్ ఫొటో.. ఇందులో ఎంత అందంగా ఉన్నాడో. నా దగ్గర చాలా ఫొటోలు ఉన్నా ఇదే అన్నింటి కంటే బాగుంది' అని అంటుంది. అప్పుడు శృతి 'ఇది ఇక్కడికెలా వచ్చిందో నాకు తెలీదు' అంటుంది. అప్పుడు అక్షర 'ఇది ప్రేమ్ ఇల్లు.. సో అతడి ఫొటోలు ఉండడంలో ఆశ్చర్యం ఏముంది' అని లైట్ తీసుకుంటుంది.

  మీరెందుకు విడిపోయారు.. నందూనే

  మీరెందుకు విడిపోయారు.. నందూనే

  అక్షరను కూర్చోబెట్టి 'నీకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండు' అని అంటాడు నందూ. అప్పుడామె 'మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనా? మీరూ తులసి ఆంటీ ఎందుకు విడిపోయారు' అని సూటిగా ప్రశ్నిస్తుంది. అప్పుడు తులసి 'ఇప్పుడవన్నీ ఎందుకులేమ్మా.. కొన్ని గుర్తు చేసుకోవాలని అనుకోనివి ఉంటాయి. అలాంటి వాటిని మళ్లీ మళ్లీ చెప్పకూడదు' అని బదులిస్తుంది. దీనికి అక్షర 'అదేంటి ఆంటీ అలా మాట్లడతారు? నేను ఈ ఇంటికి కాబోయే కోడలిని. అందుకే ఇక్కడ జరిగినవి అన్నీ తెలుసుకోవాలి. అందులో తప్పేముంది' అంటూ ప్రశ్నిస్తుంది.

  Bigg Boss: నాలుగో వారం ఆ ఇద్దరిలో ఒకరు ఔట్.. ఒక్కరోజులో మారిన ఓటింగ్.. టైటిల్ ఫేవరెట్లకు బిగ్ షాక్

   అలా అయితే పీఏను పెట్టుకోవచ్చుగా

  అలా అయితే పీఏను పెట్టుకోవచ్చుగా

  అక్షర అలా అనగానే అంకిత 'ఇద్దరికీ సెట్ అవలేదు. అందుకే విడిపోయారు. ఆంటీకి చదువు లేదు. ఏ పని చేయడం చేతకాదు. అదే లాస్య ఆంటీ ఆఫీస్‌లో బిజినెస్‌లో సపోర్టుగా ఉంటుంది' అంటుంది. అప్పుడు అక్షర 'అదేంటి తులసి ఆంటీని చూస్తే అలా అనిపించరు. ఆమె ఇప్పుడు ఫ్యాక్టరీని రన్ చేస్తున్నారు. పది మందికి శాలరీలు ఇస్తున్నారు. అన్ని పనులను ఒంటి చేత్తో చేస్తున్నారు. అయినా పెళ్లి చేసుకునే ముందే ఇవన్నీ తెలుసుకోవచ్చు కదా. అది కాదు.. అసలు కంపెనీ పనుల కోసం అయితే పీఏను పెట్టుకోవచ్చుగా పెళ్లి చేసుకోడం ఎందుకు' అంటుంది.

  చెబితే అర్థం కాదు.. లాస్య ఆగ్రహంగా

  చెబితే అర్థం కాదు.. లాస్య ఆగ్రహంగా

  అక్షర.. లాస్యను తక్కువ చేసి మాట్లాడుతుండగా.. లాస్య కోపంగా వెళ్లిపోతుంది. అప్పుడు నందూ 'మేమంతా లాస్య గురించి తప్పుగా ఆలోచించడం కాదమ్మా.. తులసి గురించే నువ్వు ఓవర్‌గా థింక్ చేస్తున్నావని అనిపిస్తుంది. అయినా నువ్వు ముందు ముందు ఇక్కడే ఉంటావు కదా. అన్నీ తెలుసుకుంటావులే' అని అంటాడు. ఆ సమయంలో తులసి కూడా వెళ్లిపోతుంది. దీంతో అక్షర తప్పు చేశానా అని అనుకుంటుంది. ఇక, లాస్య తన రూమ్‌లోకి వచ్చి అక్షర మాటలకు ఆగ్రహంతో ఉంటుంది. అప్పుడు తనలో తానే మాట్లాడుకుంటూ రగిలిపోతూ ఉంటుంది.

  అరాచకమైన ఫొటోలతో షాకిచ్చిన అమలా పాల్: బీచ్‌లో బికినీతో అందాలు మొత్తం కనిపించేంత ఘాటుగా!

  అవసరమైతే పెళ్లి కూడా చెడగొడతా

  అవసరమైతే పెళ్లి కూడా చెడగొడతా

  లాస్య తనలో తాను రగిలిపోతుండగా అక్కడకు నందూ వస్తాడు. ఆ సమయంలో 'అక్షర నన్ను పిచ్చిదాన్ని చేస్తుంది. కావాలని మాట్లాడుతుందో అమాయకంగా మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. అయినా నా ఆత్మాభిమానం మీద మాట్లాడితే నాకు కాలిపోతుంది. అలాంటి వాళ్ల చెంప చెల్లుమనిపిస్తా. అవసరమైతే ఈ పెళ్లి కూడా ఆపేస్తా' అంటుంది. అప్పుడు నందూ 'పిచ్చి పిచ్చిగా మాట్లాడకు లాస్య. మన కష్టాలన్నీ పోవాలంటే ఈ పెళ్లి జరగాలి. అలా అవ్వాలంటే నువ్వు జీకేతో, అక్షరతో కామ్‌గా ఉండాలి. లేకపోతే మొదటికే మోసం వస్తుంది' అంటూ వార్నింగ్ ఇస్తాడు.

  అక్షరలో అనుమానం.. శృతి మాటతో

  అక్షరలో అనుమానం.. శృతి మాటతో

  అక్షర మాట్లాడుతుండగా తులసి వచ్చేయడంతో ఆమె కూడా వెనకాలే వస్తుంది. ఆ సమయంలో 'ఏంటి ఆంటీ నా మాటలకు కోపం వచ్చిందా? మధ్యలోనే వచ్చేశారు. అయినా మీరెందుకో ఎప్పుడూ మూడీగా ఉంటున్నారు ఎందుకు?' అని ప్రశ్నిస్తుంది. ఆ తర్వాత ఆమెను డైవెర్ట్ చేయడం కోసం 'ప్రేమ్ గురించి ఏమైనా చెప్పండి. లేదంటే నేను అడిగిన వాటికి సమాధానం చెప్పండి' అంటూ ప్రేమ్‌కు నాన్ వెజ్ ఇష్టమా? ముద్దపప్పు ఆవకాయ్ ఇష్టమా అని ప్రశ్నిస్తుంది. దీనికి శృతి టక్కున సమాధానం ఇస్తుంది. దీంతో అక్షర షాక్ అవుతుంది. దీంతో ఈ ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 440: Nandhu and Lasya Unhappy about Akshara Behaviour with Shruthi. Then Nandhu Gave Warning to Lasya about Akshara.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X