Intinti Gruhalakshmi: పండుగ రోజే దివ్యకు షాక్.. జానూ ప్లాన్ ఫెయిల్.. తులసి ఇంటికి రత్నప్రభ రావడంతో!

దాదాపు ఇరవై ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే:శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. వినాయక చవితి సందర్భంగా దివ్య స్వయంగా పూజకు కావాల్సిన అన్ని పనులు చేస్తుంది. అలాగే, పిండి వంటలు కూడా వండుతుంది. వాటిలో కొన్నింటిని పుట్టింటికి కూడా పంపుతుంది. అది చూసి వాళ్లంతా సంతోషిస్తారు. ఇక, దివ్యను ఎలాగైనా దెబ్బకొట్టాలని ల్యాండ్ డాక్యూమెంట్లను మాయం చేయాలని రాజ్యలక్ష్మి ప్లాన్ చేస్తుంది. ఇక, తన ఇంట్లో ఉన్న లాస్యను భాగ్య బాగా అవమానిస్తుంది. చివర్లో హనీకి పనిమనిషి బిస్కెట్లు తెచ్చివ్వడం చూసిన రత్నప్రభ.. సీరియస్ అవడంతో పాటు ఆమెకు సైతం తిండి విషయంలో శిక్ష విధిస్తుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode October 2nd 2023

తులసి ఇంటికి రత్నప్రభ రాక:వినాయక చవితి రోజున పూజ చేసుకునేందుకు తులసి వాళ్లు రెడీ అవుతారు. అంతలోనే అక్కడకు రత్నప్రభ, ధనుంజయ్ కలిసి వస్తారు. వాళ్లను చూసిన తులసి ఫ్యామిలీ ఆశ్చర్యపోతుంది. అప్పుడు తులసి 'మీరు కొత్తగా కంపెనీ బాధ్యతలు తీసుకున్నారని తెలిసింది. అందుకే బిజీగా ఉన్నారు ఏమోనని పూజకు పిలవలేదు' అని చెబుతుంది. తర్వాత 'మీతో పాటు హనీని కూడా తీసుకొస్తే బాగుండేది' అంటుంది. దీంతో రత్నప్రభ 'తీసుకురావడం బాగానే ఉన్నా తీసుకెళ్ళేటప్పుడు కష్టం. తను ఏడుస్తుంది మేం కొప్పడతాం. ఇవన్నీ అవసరమా' అంటుంది.

రత్నప్రభ వాళ్లతో నందూ ఢీ:రత్నప్రభ మాటలకు తులసి 'తీసుకురావడం తీసుకురాకపోవడం మీ ఇష్టం మేం మామూలుగా అడిగాం' అంటుంది. అప్పుడు ధనుంజయ్ 'ఇటువైపు వెళ్తూ పలకరిద్దామని ఆగాము' అంటాడు. అనంతరం వాళ్లను పక్కకు తీసుకు వెళ్లిన నందూ 'మాట మీద నిలబడటం చేతకాదా? అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు' అని గొడవకు దిగుతాడు. అప్పుడు రత్నప్రభ 'మేము కావాలనే తులసి కోసం వచ్చాము. తనతో మాకు పని ఉంది. అనవసరంగా రెచ్చిపోవద్దు' అంటూ నందూకు సీరియస్ కౌంటర్ ఇచ్చేస్తుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode October 2nd 2023

విక్రమ్‌కు మరొక పక్కన జానూ:రాజ్యలక్ష్మి ఇంట్లో కూడా వినాయక చవితి పూజ ప్రారంభం అవుతుంది. పీటల మీద కూర్చోడానికి రెడీ అయి వచ్చిన దివ్య, విక్రమ్‌ను చూసిన ప్రియ.. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేలా ఉన్నారని చెప్తుంది. ఆ తర్వాత జానూను చూసి విక్రమ్ తాతయ్య పెళ్లెప్పుడు చేసుకుంటావు అని అడుగుతాడు. దీనికామె 'నేను పెళ్ళికి రెడీగానే ఉన్నాను. అబ్బాయిని అత్తయ్య చూస్తుంది' అని చెప్తుంది. అనంతరం పూజ చేసే వాళ్ళని వచ్చి పీటల మీద కూర్చోమని అంటే దివ్య, విక్రమ్ కూర్చుంటారు. విక్రమ్‌కు మరొక వైపు జానూ వెళ్ళి కూర్చుంటుంది. దీంతో అందరూ షాక్ అయిపోతారు.

డాక్యూమెంట్లు లేకపోవడంతో:పూజ ప్రారంభం అవడానికి ముందే విక్రమ్ ల్యాండ్ డాక్యుమెంట్స్ తీసుకురమ్మని దివ్యకు చెప్తాడు. అప్పుడు ఆమె 'పూజ చేసుకోకుండానే చవితి చంద్రుడిని చూశాను. ఏం జరుగుతుందో ఏమో' అని టెన్షన్ పడుతుంది. గదిలోకి వెళ్ళి డాక్యుమెంట్స్ కోసం వెతుకుతుంది కానీ అవి ఎక్కడా కనిపించవు. అప్పుడు దివ్య భయంభయంగానే కిందకి వచ్చి డాక్యుమెంట్స్ కనిపించలేదని చెబుతుంది. దీంతో విక్రమ్ సీరియస్ అవుతాడు. అంతేకాదు, 'అవి ఎంత ముఖ్యమైన డాక్యుమెంట్స్ అని చెప్పాను కదా అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నావ్' అంటూ కోప్పడతాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode October 2nd 2023

బసవయ్య మీద డౌట్ రాగానే:డాక్యూమెంట్లు కనిపించడం లేదని దివ్య చెప్పడంతో రాజ్యలక్ష్మి 'నేను తీయక, దివ్య తీయక డాక్యుమెంట్స్ ఎక్కడికి పోయాయి' అని మనసులో అనుకుంటుంది. అప్పుడు దివ్య 'నిజంగానే కనిపించడం లేదు. ఎవరో తీసినట్టు ఉన్నారు' అంటుంది. దీంతో అందరూ బసవయ్య వైపు చూస్తారు. అప్పుడతను 'చవితి చంద్రుడిని చూశానని నన్ను బలి ఇచ్చే మేకని చూసినట్టు చూస్తారు ఏంటి? ఏదో ఒకసారి జరిగిందని ప్రతి సారి నామీద వేస్తారా? ఎవరో తీసారంటే మా అక్క తీసినట్టా' అంటుంది. దీనికి రాజ్యలక్ష్మి అలా అని వాళ్ళు ఏమి అనలేదు కదా అంటుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode October 2nd 2023

మూడ్ మొత్తం చెడగొట్టావు:ఆ తర్వాత బసవయ్య 'నువ్వు వాటిని దాచి పెట్టి కావాలని అలా చేశావు. అయినా డాక్యుమెంట్స్ ఇచ్చింది ఎందుకు చిత్తు కాగితాలు మాదిరిగా పడేయడానికా' అంటూ దివ్యను మందలిస్తూ విక్రమ్‌ను రెచ్చగొడతాడు. దీంతో విక్రమ్ 'పండగ పూట నా మూడ్ చెడగొట్టావు. అవి ఎంత ముఖ్యమో నీకు తెలుసు. పూజలో వాటిని పెట్టుకోవాలని అనుకుంటున్నా అని తెలుసు. అయినా ఇంత నిర్లక్ష్యమా' అని తిడతాడు. అప్పుడు తాత 'అవి ఇంట్లోనే ఉంటాయి ఎక్కడికి పోవు. పూజ పూర్తయిన తర్వాత వెతకొచ్చు కదా తప్పు చేసిన దానిలా నిందించడం ఎందుకు' అంటాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode October 2nd 2023

ప్లాన్ ఫెయిల్ అయిందని:తాతయ్య మాటలకు విక్రమ్ 'తను ఈ ఇంటి పెద్ద కోడలు ఆఅ మాత్రం జాగ్రత్త ఉండకపోతే ఎలా' అని అడుగుతాడు. అప్పుడు ఇంట్లో వాళ్లందరూ ముందు పూజ చేసుకోండి అని చెబుతారు. దీనికి విక్రమ్ 'నాకు పూజ చేసే మూడ్ లేదు దివ్యని చేసుకోండి' అంటాడు. అంతలోనే పూజారి 'డాక్యుమెంట్స్ ఎక్కడికి పోవు ఇంట్లోనే ఉంటాయి. ఒక కాగితం మీద ఓం అని రాస్తాను డాక్యుమెంట్స్ దొరికిన తర్వాత పూజ చేసిన కాగితం దానికి జత చేయండి సరిపోతుంది' అంటాడు. దీంతో జానూ తన ప్లాన్ ఫెయిల్ అయిందని అనుకుంటుంది. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X