Intinti Gruhalakshmi Today Episode: తులసి గొప్పది నేను వేధవను అంటూ నందూ.. లాస్య ప్లాన్ అట్టర్ ఫ్లాప్

సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై వచ్చే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. శృతిని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని భావిస్తోన్న అంకిత.. అభి లేని సమయంలో అతడి లాప్‌టాప్‌ను పగలకొడుతుంది. ఆ తర్వాత దాన్ని శృతిపైకి నెట్టేస్తుంది. దీంతో ఇంట్లో పెద్ద గొడవ అవుతుంది. అప్పుడు అభి.. శృతిపై ఫైర్ అవుతాడు. అనంతరం తులసి కోరిక మేరకు ఉద్యోగులంతా ఆఫీస్‌కు వస్తారు. దీంతో ఆమె ఎంతగానో సంతోషించి నందూకు చెబుతుంది. అప్పుడతను అఇష్టంగానే వచ్చి వాళ్లకు వెల్‌కం చెబుతాడు. ఆ సమయంలో స్టాఫ్ మొత్తం తులసిని బాగా పొగుడుతుంటారు. దీంతో నందూ, లాస్య కుల్లుకుంటారు.

లాస్య ప్లాన్ ఫ్లాప్.. ఉడికించిన తులసి

లాస్య ప్లాన్ ఫ్లాప్.. ఉడికించిన తులసి

ఆఫీస్‌కు వెళ్లేప్పుడు లంచ్ బాక్స్ తీసుకెళ్లమన్నా వినకుండా వచ్చిన లాస్య, నందూ పిజ్జాలు తెప్పించుకుంటారు. అప్పుడు లాస్య, తులసిని ఉడికించేలా మాట్లాడుతుంది. కానీ, అవేమీ పట్టించుకోకుండా తినడంతో పాటు తులసి కూడా శృతి పంపిన వంటలు అదిరిపోయాయని చెప్పి వాళ్లకు నోరు ఊరేలా చేస్తుంది. మరోవైపు వీళ్లిద్దరూ లాస్య ఆర్డర్ ఇచ్చిన పిజ్జాలు తింటూ ఉంటారు. కానీ అవి బాగా లేవని గ్రహిస్తారు. అప్పుడు తులసికి తెలిస్తే పరువు పోతుందని గ్రహించి.. ఇద్దరూ సైలెంట్‌గా ఉండిపోతారు. అంతేకాదు, వాటిని బలవంతంగా తింటుంటారు.

లాస్యను చంపుతానని అన్న నందూ

లాస్యను చంపుతానని అన్న నందూ

పరువు పోతుందని అనుకున్న నందూ బలవంతంగానే పిజ్జాలను తింటుంటాడు. అది గమనించిన తులసి వెంటనే శృతికి ఫోన్ చేస్తుంది. 'అమ్మా శృతి నువ్వు వెళ్లి వెంటనే మా అత్తగారి దగ్గర దిష్టి తీయించుకో. ఎందుకంటే నువ్వు పెట్టిచ్చిన వంటలు అంత బాగున్నాయి. పాయసం అయితే నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది' అంటూ వాళ్లకు నోరూరేలా చేస్తుంది. దీంతో నందూ, లాస్య తెగ ఫీల్ అవుతుంటారు. అప్పుడు లాస్య 'నువ్వేం బాధ పడకు నందూ.. రేపు మంచి పిజ్జాలు తెప్పిస్తా' అంటుంది. దీనికి నందూ 'మళ్లీ పిజ్జాలు అంటే చంపేస్తా' అంటూ వెళ్లిపోతాడు.

నందూను అవమానించిన ఉద్యోగులు

నందూను అవమానించిన ఉద్యోగులు

పిజ్జాలు బాలేదని బయటకు వచ్చిన నందూకు ఊహించని అనుభవం ఎదురవుతుంది. కంపెనీలో పని చేసే ఉద్యోగులు 'నందూ సార్ పనే బాగుంది రా. ఆయన కంపెనీ దివాళా తీసినా పక్కన ఇద్దరు ఆడవాళ్లను పెట్టుకుని మంచి కంపెనీ తీసుకుంటున్నాడు. ఆయనకు ఏమీ చేతకాకపోయినా ఓ వైపు మాజీ భార్యను, మరోవైపు లవర్‌ను పెట్టుకుని తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. వాళ్లిద్దరి వల్ల బతుకున్నాడు. అయినా ఆయనకు ఏ పనీ చేయడం చేతకాదురా. అందుకే ఒకరికి విడాకులు ఇచ్చాడు. ఇంకొకరిని పెళ్లి చేసుకోకుండా ఆగిపోయాడు' అని మాట్లాడి అవమానిస్తారు.

 తులసి మేడమే మనకు బాస్ అంటూ

తులసి మేడమే మనకు బాస్ అంటూ

నందూ గురించి వాళ్లు మాట్లాడుతూ 'అయినా నందూ గారికి కంపెనీ పనులు కూడా చేతకావురా. అందుకే ఒకవైపు లాస్యను పట్టుకుని పని చేయించుకున్నాడు. ఇప్పుడు మళ్లీ మాజీ భార్య తులసి మేడాన్ని కూడా తీసుకుని వచ్చాడు. వీళ్లిద్దరితోనే కంపెనీ వ్యవహారాలు చూసుకుంటున్నాడు. ఎంతైనా తులసి గారు చాలా నిజాయితీపరురాలు. ఆవిడే మనకు శాలరీ ఇస్తానని చెప్పారు. అంటే ఇప్పుడామె మనకు బాస్ అన్నట్లు లెక్క. వామ్మో ఈ విషయం గట్టిగా మాట్లాడకూడదు. నందూ వింటే ఫీలై చచ్చిపోతాడు' అని మాట్లాడతారు. దీంతో నందూలో మరింత ఆగ్రహం పెరుగుతుంది.

తులసి గొప్పది.. నేను ఎదవను అని

తులసి గొప్పది.. నేను ఎదవను అని

ఆఫీస్‌లో ఉద్యోగులు అన్న మాటలకు కోపంతో ఉన్న నందూ ఇంటికి రాగానే పెద్ద గొడవ చేస్తాడు. 'నువ్వు కావాలనే ఉద్యోగుల ముందు నన్ను చులకన చేశావ్. అందుకే వాళ్లు నన్ను చాలా చీప్‌గా మాట్లాడుతున్నారు. ఏదో ఒక నెల శాలరీలు ఇచ్చేసి కంపెనీకి బాస్ అయిపోదాం అనుకుంటున్నావా? ఇప్పుడేంటి తులసి గొప్పది.. నేను ఎదవను అనిపించుకోవాలా? అసలు నేను కంపెనీకి రాను. ఆ ప్రాజెక్టు పూర్తవకపోయినా పర్వాలేదు' అని అంటాడు. దీంతో తులసి సర్ధి చెప్పే ప్రయత్నం చేసినా.. అభి, లాస్య, అనసూయ, నందూలు ఆమెనే నిందిస్తూ మాట్లాడతారు.

కూతురి వల్ల తులసికి మరో సమస్య

కూతురి వల్ల తులసికి మరో సమస్య

నందూ అన్న మాటలతో ఒంటరిగా ఉండి బాధ పడుతోన్న తులసి దగ్గరకు దివ్య వస్తుంది. అప్పుడు కూతురు ఏడుస్తూ ఉండగా.. తులసి ఏమైందని ప్రశ్నిస్తుంది. కానీ, దివ్య మాత్రం ఏమీ చెప్పదు. అప్పుడు తులసి 'ఏమ్మా నువ్వు కూడా ఇంట్లో వాళ్లలా నాకేమీ చేతకాదని అనుకుంటున్నావా' అని ప్రశ్నిస్తుంది. దీనికి దివ్య 'నేను ఫీజ్ కట్టలేదని ఆన్‌లైన్ క్లాస్ నుంచి లాగౌట్ అవ్వమని మా ఫ్రెండ్స్ ముందే చెప్పారమ్మా. నువ్వు బాధలో ఉన్నావని నీకు చెప్పలేదు' అని అంటుంది. దీంతో తులసి కూతురికి సర్ధి చెబుతూ 'ఈ కంపెనీ గొడవల్లో పడి నువ్వు చెప్పినా ఫీజు గురించి మర్చిపోయా. నా అసమర్ధత వల్ల నువ్వు మాటలు పడ్డావు' అని అంటుంది. ఆ తర్వాత ఫీజు కడతానని అంటుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తైపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X