For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: అడ్డంగా దొరికిపోయిన తులసి.. అందరి ముందే పరువు పోయేలా!

  |

  దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఆడిషన్స్‌లో ప్రేమ్ సెలెక్ట్ అవడంపై తోటి కంటెస్టెంట్ అభ్యంతరం వ్యక్తం చేస్తాడు. అంతేకాదు, తులసి, సామ్రాట్‌ను బుట్టలో వేసుకుని ప్రేమ్‌కు ఈ అవకాశం వచ్చేలా చేసిందని నిందిస్తాడు. దీంతో ప్రేమ్ అతడిని కొడతాడు. అప్పుడు వాళ్లను పోలీసులు అరెస్ట్ చేస్తారు. దీంతో ప్రేమ్ వెంటనే సామ్రాట్‌కు ఫోన్ చేస్తాడు. అప్పుడతను వెళ్లి ప్రేమ్‌ను విడిపిస్తాడు. మరోవైపు, తులసిని సామ్రాట్ దూరం పెట్టేలా చేసుకుంటాడు. ఈ క్రమంలోనే ఆమె భోజనం కోసం ఫోన్ చేయగా ఓ రేంజ్‌లో సీరియస్ అవుతూ ఆమెలో సందేహాలు కలిగిస్తాడు.

  డ్రెస్ సైజ్ తగ్గించిన దీప్తి సునైనా: పైనా కిందా పరువాల ప్రదర్శన

  తులసి సైలెంట్.. అనసూయ డౌట్

  తులసి సైలెంట్.. అనసూయ డౌట్

  తులసి వచ్చినా ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండడంతో అనసూయకు డౌట్లు మరింతగా పెరుగుతాయి. అంతేకాదు, తులసి క్యారెక్టర్‌ను అనుమానిస్తుంది. అదే సమయంలో సామ్రాట్ అసలు ఈ విషయం చెప్పాడా? లేదా అని అనుకుంటుంది. అప్పుడే అభి ఆమె దగ్గరకు వచ్చి 'ఏమైంది నానమ్మ? అమ్మ విషయంలో ఏదో చేస్తానన్నావుగా. ఇంతకీ అది చేశావా? ఇంక మామ్ సామ్రాట్ గారి ఆఫీస్‌కు వెళ్లకుండా ఉంటుందా' అని అడుగుతాడు. అప్పుడామె 'తులసికి అన్యాయం చేయలేను. నేను ఆ పని చూసుకుంటా నువ్వు వెళ్లు' అని సమాధానం చెబుతుంది.

  సామ్రాట్‌కు మళ్లీ వార్నింగ్ అంటూ

  సామ్రాట్‌కు మళ్లీ వార్నింగ్ అంటూ

  అభి మాట్లాడిన తర్వాత అనసూయ మళ్లీ ఆలోచనలో పడిపోతుంది. అసలు ఈ విషయంలో ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో తులసి వచ్చి ఆమెకు పాలు ఇస్తుంది. అప్పుడు అసలు విషయం తెలుసుకోవాలని అనుకున్న అనసూయ.. తులసిని రేపు ఆఫీసు ఉందా అని అడుగుతుంది. దీనికి తులసి 'ఉంది అత్తయ్య.. బాధ్యత పెరిగిన తర్వాత పని ఎక్కువైంది. అందుకే ఎక్కువగా అలిసిపోతున్నా' అని అంటుంది. దీంతో అనసూయ 'అంటే సామ్రాట్ నా మాట వినలేదు. కాబట్టి ఆయనకు మరోసారి గట్టిగా చెప్పాలి' అని అనుకుంటుంది.

  బట్టలు లేకుండా షాకిచ్చిన కేతిక శర్మ: ఈ ఫొటోలో ఆమెను చూస్తే పిచ్చెక్కిపోద్ది!

  బాబాయిపైనా కోప్పడిన సామ్రాట్

  బాబాయిపైనా కోప్పడిన సామ్రాట్

  ఇంట్లో ఒంటరిగా ఉన్న సామ్రాట్.. తులసి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ల బాబాయి వచ్చి 'ఏం చేస్తున్నావ్? తులసితో లంచ్ చేద్దామని చెప్పి నిన్న ఫోన్ చేస్తే విసుక్కున్నావట ఎందుకు? తనను కసురుకొని కాల్ కట్ చేశావట కదా ఏమైంది' అని ప్రశ్నిస్తాడు. దీంతో సామ్రాట్ 'ఏంటి తను కంప్లయింట్ చేసిందా? చూడు బాబాయి.. మనిషి అన్నాక, మనసు అన్నాక ఎప్పుడూ ఒకేలా ఉండటం కుదరదు. మూడ్ బాగలేకపోతే చిరాకు పడి ఉంటాను. దాన్ని భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు. దీన్ని ఇక్కడితే వదిలేయ్' అంటూ కోప్పడతాడు.

  చూడకుండా సంతకం చేయడంతో

  చూడకుండా సంతకం చేయడంతో

  జనరల్ మేనేజర్ అయిన తులసి ఆఫీసులో ఫైల్స్ చూస్తుంటుంది. ఆమెకు ఝాన్సీ సహాయం చేస్తూ ఆ ఫైళ్ల గురించి వివరిస్తుంది. అప్పుడు లాస్య చూసి ఈవిడ గారు ఫైల్స్ మీద సంతకం పెట్టడం కోసం ఇంకొకరు ఈమెకు విడమరిచి చెప్పాలా అని అనుకుంటుంది. ఆ తర్వాత ఝాన్సీ ఒకటి ఓల్డ్ ఫైల్ మేడమ్. దీని మీద సంతకం పెట్టండి అని అంటుంది. దీంతో తులసి సరే అని సంతకం పెడుతుంది. అప్పుడామె ఇక్కడ కూడా చేయండి అని చెబుతుంది. దీనికి తులసి 'పక్కనుండి నువ్వు హెల్ప్ చేస్తున్నావు కాబట్టి నా పని తేలికగా అవుతోంది ఝాన్సీ' అంటుంది.

  యాంకర్ రష్మీ హాట్ షో: పై భాగాలు కనిపించేలా అందాల ప్రదర్శన

  తులసి పొరపాటు.. నందూ కోపం

  తులసి పొరపాటు.. నందూ కోపం

  ఆ తర్వాత సామ్రాట్ కంపెనీకి వస్తాడు. అప్పుడు తులసిని చూసినా చూడనట్లుగా వెళ్లిపోతాడు. ఇంతలో నందూ అక్కడకు వచ్చి నీ వల్ల కంపెనీకి లాస్ అని అరుస్తాడు. అంతేకాదు, 'కంప్లయింట్ ఉన్న ఫైల్ మీద సంతకం చేసి బకాయిలుగా ఉన్న 10 కోట్లను రిలీజ్ చేయాలంటూ ఇష్యూ చేసింది. మన రంగనాథ్ దగ్గర ఫైల్ చూసి అనుమానం వచ్చి చూశాను. లేకపోతే కంపెనీకి 10 కోట్ల నష్టం వచ్చి ఉండేది' అంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన సామ్రాట్.. 'థాంక్స్ నంద గోపాల్ గారు. కంపెనీకి నష్టం రాకుండా చూసినందుకు థ్యాంక్స్' అంటాడు.

  తులసిపై సామ్రాట్ ఫైర్ అవుతూ

  తులసిపై సామ్రాట్ ఫైర్ అవుతూ

  ఆ తర్వాత సామ్రాట్ తులసిపై కోప్పడతాడు. అప్పుడు వాళ్ల బాబాయి తప్పు ఎందుకు జరిగిందో తులసిని కూడా ఒక మాట అడిగి తెలుసుకోవాలి కదా అంటాడు. దీంతో సామ్రాట్ 'హంతకుడు కూడా తన తప్పును సమర్థించుకుంటాడు. అంత మాత్రం చేత తప్పు తప్పు కాకుండా పోతుందా. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే బాబాయి. తను తప్పు చేయలేదని తులసి గారు చెబితే అప్పుడు డిస్కస్ చేద్దాం. అసలు నేను వెరిఫై చేయని ఫైల్ మీదగ్గరికి ఎలా వచ్చింది. ఎలా సైన్ చేశారు' అని అడుగుతాడు. దీంతో తులసికి ఏం జరుగుతుందో అర్థం కాదు.

  దీపిక - రణ్‌వీర్ విడాకులు: నగ్నంగా చేసిన పని వల్లే.. హీరోనే స్వయంగా చెప్పడంతో!

  ఝాన్సీని ప్రశ్నించిన తులసి

  ఝాన్సీని ప్రశ్నించిన తులసి

  సామ్రాట్ సమాధానం చెప్పమని అడుగుతున్న సమయంలో తులసి.. ఝాన్సీ మీద కంప్లయింట్ చేస్తే అనవసరంగా తన జాబ్ పోతుంది అని అనుకుంటుంది. దీంతో 'తప్పు నాదే.. ఇక నుంచి ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడతాను' అని అంటుంది. దీంతో లాస్య రెచ్చిపోతుంది. 'ఈ కంపెనీ కిరాణ షాప్ కాదు.. ఒక్క తప్పుకు మూల్యం కోట్లలో ఉంటుంది' అంటూ అందరి ముందే అరుస్తుంది. ఆ తర్వాత ఝాన్సీని కలిసిన తులసి 'అక్కడ ఆ ఫైల్ ఎందుకు పెట్టావు? నీ ఉద్యోగానికి ఏం కాదు. ఎవరు నీతో ఈ పని చేయించారు? నువ్వే చెప్పావా ఎవరైనా చెప్పించారా' అని ప్రశ్నిస్తుంది. ఇది చూసిన లాస్య తెగ కంగారు పడుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 753: Nandu and Lasya Come up with An Evil Plan to Corner Tulasi. After That Samrat Misunderstands Tulasi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X