For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: శృతి గురించి నిజం తెలుసుకున్న తులసి.. ఆమెకు నందూ వార్నింగ్

  |

  తెలుగులో ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. పెళ్లికి ముందే అత్తగారి ఇంటికి వచ్చిన అక్షర.. శృతి రూమ్‌లో ఉంటానని చెబుతుంది. అప్పుడామె వ్యవహరిస్తోన్న తీరుపై నందూ, లాస్య అసంతృప్తిగా ఉంటారు. ఇక, రూమ్‌లోకి వెళ్లిన తర్వాత ప్రేమ్ ఫొటో కనిపిస్తుంది. దీన్ని అక్షర లైట్ తీసుకుంటుంది. ఆ తర్వాత అక్షర.. నందూతో తులసిని ఎందుకు వదిలేశారని అడుగుతుంది. అలాగే, లాస్యను అవమానించేలా మాట్లాడుతుంది. అప్పుడామెకు తీవ్ర స్థాయిలో కోపం వస్తుంది. అప్పుడు అక్షరతో చక్కగా ఉండమని నందూ, లాస్యకు వార్నింగ్ ఇవ్వడంతో కామ్ అవుతుంది.

  షర్ట్ విప్పేసి షాకిచ్చిన బిగ్ బాస్ సరయు: బ్రాతో ఘాటు ఫోజులిస్తూ.. వామ్మో చూస్తే తట్టుకోలేరు

  ప్రేమ్‌, అక్షర కలిసేందుకు శృతి సాయం

  ప్రేమ్‌, అక్షర కలిసేందుకు శృతి సాయం

  ప్రేమ్ గురించి తెలుసుకునేందుకు సహాయం చేయమని తులసిని అడుగుతుంది అక్షర. అంతేకాదు, ప్రేమ్‌కు ఏమేం నచ్చుతాయో చెప్పమని కోరుతుంది. అందుకు అనుగుణంగానే అతడికి ఎలాంటి ఫుడ్ అంటే ఇష్టం? అతడు ఎలాంటి బట్టలను వేసుకుంటాడు? ఇలా పలు రకాల ప్రశ్నలను అడుగుతుంది. అయితే, వీటికి తులసి కాకుండా శృతి సమాధానాలు చెబుతుంది. దీంతో అక్షర షాక్ అవుతుంది. అప్పుడు ‘గ్రేట్.. నువ్వు ప్రేమ్ గురించి బాగానే తెలుసుకున్నావు. కాబట్టి మా ఇద్దరినీ కలిపేందుకు నువ్వే నాకు సహాయం చేయాలి' అంటూ రిక్వెస్ట్ చేస్తుంది.

  తన ప్రేమ గురించి అక్షరకు చెప్పిన శృతి

  తన ప్రేమ గురించి అక్షరకు చెప్పిన శృతి

  శృతితో మాట్లాడుతోన్న సమయంలోనే అక్షర ‘అవును శృతి.. నువ్వు ఎవరినైనా ప్రేమించావా?' అని ప్రశ్నిస్తుంది. దీనికి చాలా సేపు ఆలోచించిన తర్వాత ‘ప్రేమించడం గొప్ప కాదు అక్షర. అందరికీ ప్రేమించాలని ఉంటుంది. కానీ, అందరికీ ఎదుటి వాళ్ల ప్రేమను అందుకోవడం కూడా కుదరదు. నీ లాంటి అదృష్టం దక్కదు కదా' అంటుంది. అప్పుడు అక్షర ‘అవును శృతి. నేను ప్రేమ్‌ను ప్రేమించడం.. దానికి అందరూ ఓకే చెప్పడం.. అన్నింటికీ మించి నన్ను అమ్మలా చూసుకునే అత్తయ్య దొరకడం అదృష్టమే' అని తులసికి ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

  అరాచకమైన డ్రెస్‌తో రెచ్చిపోయిన దిశా పటానీ: వామ్మో అందాలు మొత్తం కనిపించేంత దారుణంగా!

  ప్రేమ్‌కు కాఫీ ఇచ్చిన అక్షర... శృతి వల్లే

  ప్రేమ్‌కు కాఫీ ఇచ్చిన అక్షర... శృతి వల్లే

  శృతి.. ప్రేమ్‌కు కాఫీ తీసుకుని వెళ్తుండగా.. అక్కడకు వచ్చిన అక్షర ‘శృతి ఎక్కడికి వెళ్తున్నావు. ప్రేమ్‌కు కాఫీ ఇస్తావా? దాన్ని నాకివ్వు నేనే తీసుకెళ్లి ఇస్తాను' అని ఆమె దగ్గర తీసుకుంటుంది. ఆ తర్వాత ప్రేమ్‌కు ఇవ్వగానే ‘నువ్వు తీసుకొచ్చావేంటి? నీకు ఇలాంటివి తెలియదు కదా' అంటాడు. అప్పుడు అక్షర ‘ఫ్యూచర్‌లో నీకు కాఫీ ఇచ్చేది నేనే కదా. అందుకే ఇప్పటి నుంచే అలవాటు చేసుకుంటున్నా. కాఫీ బాగుందా? ఒకవేళ బాగుంటే శృతి దగ్గర ఎలా చేయాలో నేర్చుకుంటా' అని అంటుంది. దీనికి ప్రేమ్ చాలా బాగుందని చెప్పడంతో ఆమె వెళ్లిపోతుంది.

  శృతి బాధ చూసిన తులసి.. సూటి ప్రశ్నతో

  శృతి బాధ చూసిన తులసి.. సూటి ప్రశ్నతో

  అక్షర అడిగిన ప్రశ్నలు.. కాఫీ తీసుకుని వెళ్లడం వంటి వాటి వల్ల శృతి చాలా బాధగా ఉంటుంది. దీంతో తులసి వచ్చి ‘ఏంటి శృతి కాఫీ అక్షర తీసుకెళ్లిందని బాధ పడుతున్నావా. ఒకటి మాత్రం చెబుతాను.. నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు' అని సూటిగా అనేస్తుంది. అప్పుడు శృతి ‘కొన్ని కొన్ని సెట్ కావు. వాటిని విడిగానే వదిలేయాలి. కలిపే ప్రయత్నం చేసినా ఒకటిగా ఉండలేవు. కొన్ని కొన్ని మన చేతుల్లో ఉన్నట్లు కనిపించినా అవి ఉండవు' అంటుంది. దీనికి తులసి ‘అందుకేనా నీ జీవితాన్ని అక్షర చేతుల్లో పెట్టావు. సంతోషించు మరి' అంటుంది.

  ChaySam Divorce: పెళ్లికి ముందే సమంత చైతూ మధ్య ఒప్పందం.. విడిపోయిన తర్వాత అలా చేయకూడదంటూ!

  తులసికి నందూ వార్నింగ్... చనిపోతానని

  తులసికి నందూ వార్నింగ్... చనిపోతానని

  శృతి మాట్లాడిన తర్వాత ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్న తులసి దగ్గరకు నందూ వస్తాడు. ‘తులసి నీతో మాట్లాడాలి. రేపటి నుంచే ప్రేమ్ పెళ్లి పనులు మొదలు పెట్టాలి' అంటాడు. దీనికి తులసి కొంత కఠువుగా మాట్లాడుతుంది. అప్పుడు నందూ ‘చూడు తులసి నువ్వు ప్రేమ్‌, తులసిని కలిపే ప్రయత్నాలను మానుకో. ఎట్టి పరిస్థితుల్లో ప్రేమ్ అక్షరనే పెళ్లి చేసుకోవాలి. అలా కాదని వేరే ప్రయత్నాలు చేస్తే ప్రేమ్‌కు తండ్రి ఉండడు.. పరందామయ్యకు కొడుకు ఉండడు' అంటూ ఎమోషనల్‌గా వార్నింగ్ ఇస్తాడు. దీంతో తులసి ఎంతగానో భయపడిపోతుంది.

  నందూకు జీకే ఫోన్.. మళ్లీ వార్నింగ్ ఇచ్చి

  నందూకు జీకే ఫోన్.. మళ్లీ వార్నింగ్ ఇచ్చి

  తులసితో మాట్లాడి వస్తున్న సమయంలో నందూకు జీకే ఫోన్ చేస్తాడు. ‘నందూ గారూ పెళ్లి పనులు ఎంత వరకూ వచ్చాయి. అవును మనం ఇంకా పేర్లు పెట్టి పిలుచుకోవడం దేనికి బావగారు అనుకుంటే సరిపోతుంది కదా. అన్నట్లు మా అక్షర మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టడం లేదు కదా' అని అడుగుతాడు. దీనికి నందూ ‘అయ్యే అదేం లేదు బావగారూ.. అక్షర అందరిలో ఎనర్జీని నింపుతూ చక్కగా కలిసిపోయింది' అంటూ తులసికి ఫోన్ ఇస్తాడు. అప్పుడామె కూడా జీకేతో మాట్లాడుతుంది. ఆ తర్వాత ఆయన చెప్పినట్లే పనులు చెయ్ అంటూ నందూ వార్నింగ్ ఇస్తాడు.

  హాట్ హాట్‌గా రెచ్చిపోయిన మంచు లక్ష్మి: తొలిసారి అందాలన్నీ కనిపించేలా ఘాటు ఫోజులు

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  శృతి గురించి నిజం తెలుసుకున్న తులసి

  శృతి గురించి నిజం తెలుసుకున్న తులసి

  శృతి తన రూమ్‌లో ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. దీన్ని తులసి చూస్తుంది. అప్పుడామె చేతిలో ఓ ఫొటో కూడా ఉంటుంది. ‘ప్రేమ్ నీ మీద ప్రేమ ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితులో ఉన్నాను. నన్ను క్షమించు' అంటూ తనలో తానే మాట్లాడుకుంటుంది. అంతలో పరందామయ్య ఆమెను పిలవడంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడు లోపలికి వచ్చిన తులసి.. శృతి పట్టుకుని చూసిన ఫొటో ప్రేమ్‌ది అని తెలుసుకుంటుంది. అంతేకాదు, శృతి కచ్చితంగా ప్రేమ్‌ను ప్రేమిస్తుంది అని డిసైడ్ అయిపోతుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తైపోయింది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 441: Prem Feel Uncomfortable for Akshara Behaviour. Then Nandhu Warns Tulasi for She Tries to Reunite Prem and Shruthi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X