Intinti Gruhalakshmi: దొరికిపోయిన డాక్యూమెంట్ల దొంగ.. తులసిని కలిసిన హనీ.. అంతలోనే ట్విస్ట్
గతంలో కంటే ఇప్పుడు అభిరుచి మారుతున్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar
మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే:మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసి ఇంటికి వచ్చిన రత్నప్రభ.. ఆమెను కాకా పట్టే విధంగా మాట్లాడుతుంది. దీంతో తులసి ఆమెను ఫ్రెండ్ అని చెప్తుంది. అనంతరం రత్నప్రభ.. సామ్రాట్ లాకర్ కీ గురించి అడగ్గా.. తులసి అన్ని తీసుకొచ్చి ఇచ్చేస్తుంది. మరోవైపు, డాక్యూమెంట్ల గురించి దివ్య ఆలోచిస్తుండగా.. నేను తీయలేదని రాజ్యలక్ష్మి చెప్తుంది. అలాగే, విక్రమే కావాలని తీసి ఉంటాడని అనుమానాలు రేకెత్తిస్తుంది. ఇక, తులసి దగ్గర కీ తీసుకున్న తర్వాత రత్నప్రభ.. ఆమెపై కేసు పెడదామని అనుకుంటుంది. కానీ, దీనికి ధనుంజయ్ ఒప్పుకోడు.

తులసి ఫోన్ చేసిన పెట్టరు:ఇంటికి వెళ్లిన రత్నప్రభ వాళ్లతో హనీకి తులసి భోజనం పంపుతుంది. ఆ విషయాన్ని హనీకి ఫోన్ చేసి చెబుతుంది. వాళ్లు ఇంటికి వచ్చిన తర్వాత తులసి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలోనే అక్కడకు హనీ వెళ్లి 'తులసి ఆంటీ భోజనం పంపించిందని ఫోన్ చేసి చెప్పారు. ఈరోజు అయినా తిననివ్వండి' అని వాళ్లను అడుగుతుంది. దీంతో ధనుంజయ్ సరే అంటూ ఒక స్పూన్ తెచ్చుకోమని తులసి పంపించిన దానిలో నుంచి కొంచెం పెట్టేసి పంపించేస్తాడు. వాళ్ళు చేసిన పనికి హనీ చాలా బాధపడుతుంది. సామ్రాట్ ఫోటో దగ్గరకి వెళ్ళి ఏడుస్తుంది.

తులసిపై కోప్పడిన నందూ:రత్నప్రభ, ధనుంజయ్ వాళ్లు వెళ్లిపోయిన తర్వాత తులసి అన్నీ తెలివి తక్కువ పనులు చేస్తుందని నందూ తిడతాడు. దీంతో తులసి హనీ ఫోన్ ఏమైనా చేసిందా అని అడుగుతుంది. అప్పుడు నందూ అసలు వాళ్ళు క్యారేజ్ హనీకి ఇచ్చారో లేదోనని సందేహిస్తారు. దీనికి తులసి 'వాళ్ళు హనీని కళ్ళలో పెట్టుకుని చూసుకుంటున్నారు. ఎందుకు అనుమానం' అంటుంది. దీనికి నందూ 'లాకర్ కోడ్ ఎందుకు ఇచ్చావ్' అని ప్రశ్నించగా.. 'వాళ్ళు అన్నీ వదులుకుని వచ్చి హనీ కోసం ఉంటున్నారు. ఆ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే అంకుల్ చెప్పేవాళ్ళు కదా' అంటుంది.

బసవయ్య అసలు దొంగ:చవితి రోజున బసవయ్య తాగిన మైకంలో విక్రమ్ గదికి వెళ్ళి చంద్రుడి వల్ల నిందలు పడకూడదంటే ల్యాండ్ డాక్యుమెంట్స్ మాయం చేయాలని అనుకుని వాటిని కొట్టేస్తాడు. ఆ విషయం గుర్తు చేసుకుంటాడు. అనంతరం వాటిని తీసుకెళ్లి రాజ్యలక్ష్మి చేతిలో పెడతాడు. అవి చూసిన వెంటనే భయపడుతూ ఇవి ఎందుకు నీ దగ్గర ఉన్నాయని ప్రశ్నిస్తుంది. దీంతో బసవయ్య జరిగింది మొత్తం చెప్తాడు. అప్పుడు అతడిని రాజ్యలక్ష్మి మంచి పని చేశావని మెచ్చుకుంటుంది. ఇప్పుడు వీటిని ఏం చేయాలో చెప్పమని అంటాడు.
అక్క ప్లాన్.. బసవ బుక్:ఆ తర్వాత బసవయ్యతో రాజ్యలక్ష్మి 'డాక్యూమెంట్లను ఎక్కడ నుంచి తీశావో అక్కడే పెట్టు. ల్యాండ్ డాక్యుమెంట్స్ ఎక్కడికి పోలేదు సంతోషం లేకుండా చేయడం కోసం వాటిని దివ్య దాచి పెట్టిందని విక్రమ్‌ను నమ్మించవచ్చు' అని ప్లాన్ చేస్తుంది. తర్వాత దివ్య విక్రమ్‌కు కాఫీ తీసుకొస్తే అవసరం లేదని అంటాడు. అప్పుడే జానూ ఇస్తే మాత్రం తాగుతాడు. దీంతో దివ్య బాధపడుతుంది. బసవయ్య మెల్లగా విక్రమ్ గదిలోకి వెళతాడు. అంతలోనే విక్రమ్ తన ఫోన్ కనిపించకపోయే సరికి తన నెంబర్‌కు కాల్ చేసి.. అది బసవయ్య ఎత్తి బుక్కైపోతాడు.

అడ్డంగా దొరికిన బసవ:తన ఫోన్ బసవయ్య ఎత్తడంతో విక్రమ్‌కు డౌట్ వచ్చి గదిలోకి వెళ్తాడు. అప్పుడే ఆయన చేతిలో ఉన్న డాక్యూమెంట్లు జారిపోతాయి. దీంతో విక్రమ్ ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. అప్పుడు బసవయ్య 'నేను తీసిన మాట నిజమే కానీ.. కావాలని తీయలేదు. నిన్న తాగిన మత్తులో చవితి చంద్రుడిని చూశాను. నిందలు తప్పవని ఎందుకైనా మంచిది జాగ్రత్త చేద్దామని డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాను. తర్వాత వాటి సంగతి మర్చిపోయాను. ఇందాక గదిలోకి వెళ్తే ఇవి కనిపించాయి. ఎవరికైనా చెప్తే నిందలు వేస్తారని మళ్ళీ తెచ్చి గదిలో పెట్టబోయాను' అని వివరిస్తాడు. దీంతో అనవసరంగా దివ్యను నిందించానని విక్రమ్ బాధపడతాడు. అప్పుడు దివ్య వాటిని దేవుడి దగ్గర పెడదాం అంటుంది.
డాడీతో తీసుకెళ్లిపోవాలి:హనీకి జ్వరం వచ్చిందని కృష్ణవేణి చెప్పడంతో రత్నప్రభ డ్రైవర్‌ను పిలిచి పెద్దాయన్ని, హనీని హాస్పిటల్‌కు తీసుకెళ్లమని చెప్తుంది. అలాగే వాళ్ళు తులసిని కలవకుండా చూడమని హెచ్చరిస్తుంది. దీంతో హనీ భయపడుతుంది. అప్పుడా చిన్నారి 'వేరే ఇంటికి వెళ్లిపోదాం. ఆ ఇంట్లో ఉండొద్దు' అంటుంది. దీంతో తాతయ్య అది జరిగే పని కాదని సర్ది చెప్తాడు. అప్పుడు హనీ డాడీ తనతో పాటు నన్ను తీసుకుని వెళ్ళి ఉంటే బాగుండేదని బాధపడుతుంది.

తులసిని కలిసిన హనీ:ఆకలితో ఉన్న హనీకి ప్రసాదం పెట్టిద్దాం అని తాతయ్య గుడికి తీసుకొస్తాడు. కానీ, హనీ మాత్రం ఆంటీ తిడుతుందని బాధపడుతుంది. అంతలోనే నందూ, తులసి కూడా అదే గుడికి వస్తారు. వాళ్లను చూసి సామ్రాట్ డ్రైవర్ భయపడుతుంటాడు. అంతేకాదు, 'పెద్దాయన పెద్ద ప్లాన్ వేశాడు. తులసిని గుడికి పిలిపించారు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో' అని టెన్షన్ పడతాడు. తులసిని చూసి హనీ వాళ్ళు కావాలని గబగబా వెళ్లిపోతుంటారు. వాళ్లను తులసి ఆపుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











