For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: తులసికి బిగ్ షాక్.. అనసూయ వార్నింగ్.. సామ్రాట్ సంచలన నిర్ణయం

  |

  ఇండియాలోని చాలా భాషల కంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

  మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తన దగ్గరకు ఫేక్ ఫైల్ తీసుకు వచ్చిన ఝాన్సీని తులసి ప్రశ్నిస్తుంది. కానీ, ఆమె మాత్రం సమాధానం చెప్పకుండానే వెళ్లిపోతుంది. ఆ తర్వాత సామ్రాట్ బాబాయి వచ్చి తులసిని ఓదార్చుతాడు. అనంతరం ఝాన్సీ రాజీనామా చేయబోగా.. సామ్రాట్ ఆమెను ఆపడంతో పాటు ఆ ఫైల్ ఇచ్చింది తనేనన్న నిజాన్ని బయటపెట్టేస్తాడు. అనంతరం హనీ పుట్టినరోజు వేడుకలకు తులసి ఫ్యామిలీ మొత్తం వస్తుంది. అప్పుడు హనీకి తులసి ఇచ్చిన డ్రెస్‌ను సామ్రాట్ వద్దని అంటాడు. అనంతరం అనసూయ, సామ్రాట్ మధ్య చర్చ జరుగుతుంది.

  The Ghost Twitter Review: విక్రమ్ తర్వాత ది ఘోస్ట్.. ఆ ట్విస్ట్‌కు మెంటలే.. ఓవరాల్ టాక్ ఏంటంటే!

  సామ్రాట్‌కు అనసూయ వార్నింగ్

  సామ్రాట్‌కు అనసూయ వార్నింగ్

  సామ్రాట్‌తో అనసూయ మాట్లాడుతుండగా ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అవుతుంది. ఆ సమయంలో అనసూయ ‘నాకు చాలా భయంగా ఉంది సామ్రాట్ బాబు. అయినా మీకు గతంలోనే చెప్పాను. కానీ, అసలు మీరు ఆ దిశగా ఆలోచించడం లేదని అనిపిస్తుంది. దయచేసి నా మాట వినండి. బయట అవమానాలు నేను భరించలేము. ఒక్క మాట చెబుతున్నా వినండి సామ్రాట్ బాబు. ఈరోజు బర్త్‌డే పార్టీ ముగిసే సమయానికి మీ నిర్ణయం ప్రకటించాలి. లేదంటే నేను నా నిర్ణయాన్ని తీసుకుంటాను' అంటూ వార్నింగ్ ఇస్తుంది. ఇదంతా అభి గమనిస్తూ ఉంటాడు.

  పార్టీలో నందూకు అవమానంతో

  పార్టీలో నందూకు అవమానంతో

  బర్త్‌డే పార్టీలో లాస్యతో కలిసి తిరుగుతున్న నందూను ఓ వ్యక్తి పలకరిస్తాడు. అప్పుడు ఆయన ‘ఏం నందూ ఎలా ఉన్నావు? అయినా ఏం బాగుంటావులే. నీ బతుకు ఎలా అయిపోయిందో. ఎవరైనా భార్య కింద పని చేయాలని అనుకుంటారా? అది కూడా మాజీ భార్య కింద వర్క్ చేస్తారా? పాపం నీ కష్టం చూస్తుంటే జాలేస్తుంది' అంటూ అవమానించేలా మాట్లాడతాడు. దీంతో నందూకు కోపం వచ్చి వెళ్లిపోవాలనుకుంటాడు. అంతలో లాస్య, అభి ఆపుతారు. అంతేకాదు, ‘నానమ్మ ఏదో చేస్తుంది. మనకు మంచిరోజులు వచ్చాయి' అని అభి చెప్పినా.. నందూ కోపంగా వెళ్లిపోతాడు.

  GodFather Twitter Review మెగాస్టార్ కమ్ బ్యాక్.. గాడ్‌ఫాదర్ బ్లాక్‌బస్టర్ అంటూ

  హనీ డ్రెస్... తులసితో సామ్రాట్

  హనీ డ్రెస్... తులసితో సామ్రాట్

  బర్త్‌డే పార్టీలో తులసి తెచ్చిన డ్రెస్‌ను వద్దని అనడంతో.. సామ్రాట్ తీసుకొచ్చిన దానినే హనీ వేసుకుంటుంది. ఆ చిన్నారిని రెడీ చేసి తులసే తీసుకు వస్తుంది. అప్పుడు సామ్రాట్ ఎమోషనల్ అవుతాడు. ఆ సమయంలో తులసి అతడితో తన డ్రెస్‌ను ఎందుకు వద్దన్నారని అడుగుతుంది. దీంతో సామ్రాట్ ‘హనీ నా కూతురు కాకపోయినా నా సొంతం అనుకుంటున్నాను. ఎవరైనా తనకు దగ్గరైతే నాకు దూరం అవుతుందేమో అని స్వార్థం. అందుకే నా కూతురు దృష్టిలో నేనే గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇందులో తప్పు ఉందా తులసి గారు' అని అడుగుతాడు.

  జంటగా రావడంతో సెటైర్లు వేసి

  జంటగా రావడంతో సెటైర్లు వేసి

  హనీని రెడీ చేసిన తర్వాత సామ్రాట్, తులసి కలిసి ఆ చిన్నారిని కిందికి తీసుకు వస్తారు. ఆ సమయంలో వాళ్లు జంటగా రావడం చూసిన లాస్య సెటైర్లు వేస్తుంది. ‘ఏంటి నందూ వీళ్లు.. చుట్టూ ఇంత మంది ఉన్నారన్న బుద్ధి కూడా లేకుండా చేస్తున్నారు. భూమి పూజలో జంటగానే, ప్రెస్‌మీట్‌లో జంటగానే, ఇప్పుడు కూడా జంటగానే వస్తున్నారు. అసలు వీళ్లు నిజమైన జంట అనుకుంటున్నారా ఏంటి' అని నందూను రెచ్చగొడుతుంది. మరోవైపు, వాళ్లను చూసిన అనసూయ, అభి కూడా కోపంతో రగిలిపోతూ ఉంటారు. కానీ, మిగతా వాళ్లు మాత్రం పట్టించుకోరు.

  టాలీవుడ్ స్టార్ హీరోతో భయానక అనుభవం.. నాలుగో నెల కడుపుతోనే: రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు

  అమ్మ పాట.. అనసూయ సైగలు

  అమ్మ పాట.. అనసూయ సైగలు

  ఇక, సమయం రావడంతో హనీతో కేక్ కట్ చేయించాలని అనుకుంటారు. ఆ సమయంలో తులసి ఒకవైపు, సామ్రాట్ మరోవైపు ఉండి కేక్ కట్ చేయిస్తారు. అప్పుడు హనీ కేక్‌ను తులసికే మొదటిగా తినిపించాలని అనుకుంటుంది. కానీ, ఆమె మాత్రం సామ్రాట్‌కు పెట్టమంటుంది. అయితే, హనీ మాత్రం తులసికే పెడుతుంది. ఆ తర్వాత ఆమె కోసం ‘అమ్మ' పాటను కూడా పాడుతుంది. దీంతో అంతా సంతోషంగా కనిపిస్తారు. కానీ, అప్పుడే అనసూయ సామ్రాట్‌ను కోపంగా చూస్తూ సైగలు చేస్తుంది. దీంతో అతడికి ఆమె వార్నింగ్ ఇచ్చిన విషయం గుర్తుకు వచ్చి భయపడతాడు.

  నందూపై సామ్రాట్ ప్రశంసలు

  నందూపై సామ్రాట్ ప్రశంసలు

  ఆ తర్వాత సామ్రాట్ ‘కొన్ని అనుకోని సంగతులు మనుషుల ఇమేజ్‌ను పెంచుతాయి. కొందరి ఇమేజ్‌ను తగ్గిస్తాయి. ప్రతీది జీవితంలో భాగమే. మిస్టర్ నందగోపాల్ ఒకసారి ఇలా వస్తారా ప్లీజ్. ఆఫీస్‌లో కొంత మంది పని చేస్తున్నామని హడావిడి చేస్తూ అందరికీ కనిపించాలని పబ్లిసిటీ చేసుకుంటారు. కొంతమంది మాత్రమే నిజాయితీగా చేస్తూ తెర వెనకే ఉండిపోతారు. మన నందూ అలాంటి ఉద్యోగే. ఒక పొరపాటు వల్ల మా కంపెనీ పది కోట్లు నష్టపోయేది. తన సిన్సియారిటీతో నందూ ఆ నష్టాన్ని జరగకుండా ఆపాడు' అంటూ అతడిపై ప్రశంసలు వర్షం కురిపిస్తాడు.

  బట్టలు లేకుండా షాకిచ్చిన కేతిక శర్మ: ఈ ఫొటోలో ఆమెను చూస్తే పిచ్చెక్కిపోద్ది!

  తులసి ప్లేస్‌లో నందూను పెట్టి

  తులసి ప్లేస్‌లో నందూను పెట్టి

  అంతేకాదు, ‘కంపెనీ కోసం నిస్వార్థంగా పని చేస్తున్న నందూకు ఓ గిఫ్ట్ ఇస్తున్నాను. తులసి గారి స్థానంలో అతడిని కంపెనీకి జనరల్ మేనేజర్‌గా నియమిస్తున్నాను' అని ప్రకటిస్తాడు. దీంతో లాస్య, అభి, అనసూయలు తెగ సంతోషిస్తారు. కానీ, తులసితో పాటు ఆమె కుటుంబ సభ్యులు షాక్ అవుతారు. ఆ సమయంలో శృతి.. సామ్రాట్‌ను ప్రశ్నిద్దామని అంటుంది. కానీ, ప్రేమ్ ఏమీ మాట్లాడొద్దని చెప్తాడు. అనంతరం తులసి.. నందూకు శుభాకాంక్షలు తెలుపుతుంది. అంతేకాదు, నిస్వార్థంగా పని చేయాలని చెప్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 755: Honey Dedicates a Song to Tulasi in Birthday Party. After That Samrat Appointed Nandhu as General Manager in Place of Tulasi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X