For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: అక్షరకు నిజం చెప్పేసిన ప్రేమ్.. శృతిని అతడి చెంతకు చేర్చడంతో!

  |

  చాలా కాలంగా తెలుగులో ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఎలాగైనా శృతి ప్రేమ్‌ను కలపాలని భావిస్తోన్న తులసి.. అక్షరతో కలివిడిగా ఉండడానికి ఇబ్బంది పడుతోన్న కొడుకుతో ఒక ప్లాన్ చెబుతుంది. ఆ తర్వాత పని మనిషి రాములమ్మతో కలిసి అదిరిపోయే వ్యూహాలు రెడీ చేస్తుంది. అందుకు అనుగుణంగానే ప్రేమ్ ఉదయాన్నే అక్షరకు ఒక గిఫ్ట్ ఇస్తాడు. అంతేకాదు, సినిమాకు వెళ్దాం అని కూడా అంటాడు. దీంతో అటు అక్షర.. ఇటు శృతి ఆశ్చర్యపోతారు. వాళ్లిద్దరూ సంతోషంగా ఉండడం చూసి శృతి ఎంతగానో బాధ పడుతుంది. అది చూసి తులసి కూడా ఎమోషనల్ అవుతుంది.

  అరాచకమైన డ్రెస్‌తో రెచ్చిపోయిన దిశా పటానీ: వామ్మో అందాలు మొత్తం కనిపించేంత దారుణంగా!

  ప్రేమ్‌లో మార్పు.. లాస్యలో భయం మొదలు

  ప్రేమ్‌లో మార్పు.. లాస్యలో భయం మొదలు

  ప్రేమ్.. అక్షరకు డ్రెస్ తెచ్చి ఇవ్వడంపై శృతి బాధగా ఉంటుంది. అది చూసిన తులసి ఎంతగానో ఎమోషనల్ అవుతుంది. మరోవైపు, ప్రేమ్‌లో వచ్చిన మార్పును చూసిన లాస్య తెగ భయపడిపోతుంది. ఈ క్రమంలోనే నందూ దగ్గరకు వెళ్లి.. ‘నాకేదో తేడా కొడుతుంది నందూ. ప్రేమ్ ఒక్కసారిగా ఇలా ఎందుకు మారిపోయాడో అర్థం కావడం లేదు. దీని వెనుక ఏదో జరుగుతుందని అనిపిస్తుంది' అని అంటుంది. దీనికి నందూ ‘నువ్వు ప్రతీది అలాగే ఆలోచిస్తావ్. ప్రేమ్ ఇంక మారక తప్పని పరిస్థితి అందుకే మారాడనుకుంటా' అని చెబుతాడు.

  నా ప్రేమ త్యాగం చేయమని ఒత్తిడి చేశారని

  నా ప్రేమ త్యాగం చేయమని ఒత్తిడి చేశారని

  తులసి తరచూ శృతిని ఏదో రకంగా అడుగుతుండడం.. ప్రేమ్‌లో మార్పులు రావడం చూసిన శృతి తనలో తానే కుమిలిపోతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఒంటరిగా కూర్చుని ‘నన్ను క్షమించండి ఆంటీ. నా మనసులో వేరేగా ఉన్నా.. పైకి ఇంకోటి చేయాల్సి వస్తుంది. నా ప్రేమను త్యాగం చేయమని నన్ను ఒత్తిడి చేస్తున్నారు. అందుకే నేను ఇలా ప్రవర్తించాల్సి వస్తుంది. వేరే వాళ్ల కోసం నా ప్రేమను త్యాగం చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. దయచేసి నన్ను క్షమించండి ఆంటీ' అంటూ కన్నీరు మున్నీరు అవుతుందామె.

  బీచ్‌లో లవర్‌తో పాయల్ రాజ్‌పుత్ రచ్చ: బికినీలో అందాలన్నీ చూపిస్తూ.. షాకిస్తోన్న సెల్ఫీ వీడియో

  ఫ్రెండ్‌కు అసలు విషయం చెప్పేసిన శృతి

  ఫ్రెండ్‌కు అసలు విషయం చెప్పేసిన శృతి

  రూమ్‌లో కూర్చుని ఏడుస్తున్న శృతి దగ్గరకు స్నేహితురాలు వందన వస్తుంది. అప్పుడామె ‘చుట్టూ అందరూ ఉన్నా ఏకాకివి అయిపోయావు. అసలు ఏమైందే.. ఎందుకిలా ఉన్నావు. నీ ఫ్రెండ్‌ను కాబట్టి నాకైనా ఈ విషయం చెప్పు' అని అడగ్గా.. శృతి అసలు విషయం చెప్పేస్తుంది. అప్పుడామె తప్పు చేస్తున్నావని చెబుతుంది. దీంతో ‘నేను ఇలా చేయడం వల్ల ప్రేమ్ పెళ్లి అవుతుంది. అది జరిగితే అంకుల్ అప్పులన్నీ తీరిపోతాయి. ఈ కుటుంబం ముక్కలు అవకుండా ఉంటుంది' అని చెప్తుంది శృతి. దీంతో వందన ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నాలు చేస్తుంది.

  శృతిని చూస్తే ఆ నమ్మకం కలగడం లేదమ్మా

  శృతిని చూస్తే ఆ నమ్మకం కలగడం లేదమ్మా

  తులసి దగ్గరకు వచ్చిన ప్రేమ్ నిరాశగా కనిపిస్తాడు. దీంతో ఆమె ‘ఏంటి నాన్నా.. పెళ్లికి సమయం దగ్గర పడుతుందని బాధ పడుతున్నావా?' అని ప్రశ్నిస్తుంది. దీనికి ప్రేమ్ ‘అవునమ్మా.. పెళ్లికి ఇంకెంతో సమయం లేదు. ఈ పరిస్థితుల్లో శృతి తన మనసులో భావాలనే తనే దాచుకుంటుంది కానీ.. పైకి మాత్రం చెప్పడం లేదు' అని అంటుంది. దీనికి తులసి ‘అమ్మాయి కదా నాన్న తనకు కొంత సమయం పడుతుందిలే. అయినా కంగారు పడకు.. ఈరోజు రాత్రి ఓ ఊహించని సంఘటన జరుగుతుంది. అప్పుడు తనే ఓపెన్ అవుతుంది' అని ప్రేమ్‌కు ధైర్యం చెబుతుంది.

  ChaySam Divorce: పెళ్లికి ముందే సమంత చైతూ మధ్య ఒప్పందం.. విడిపోయిన తర్వాత అలా చేయకూడదంటూ!

  శృతిని ప్రేమ్ పక్కన కూర్చోబెట్టేసిన అక్షర

  శృతిని ప్రేమ్ పక్కన కూర్చోబెట్టేసిన అక్షర

  పెళ్లికి సమయం దగ్గర పడుతుండగా ఇంట్లో ఓ స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేస్తారు. దీనికి అందరూ వస్తారు కానీ శృతి మాత్రం ఇంట్లోనే ఉంటుంది. ఆ విషయాన్ని దివ్య చెప్పడంతో తులసి ఆమెను తీసుకొచ్చేందుకు వెళ్తానని అంటుంది. అప్పుడు నందూ, లాస్య.. శృతి మన ఇంట్లో అమ్మాయి కాదు కదా అని అడ్డు పడతారు. ఆ సమయంలో అక్షర ముందుకు వచ్చి ‘తను అనాథే అయినా నాకు బెస్ట్ ఫ్రెండ్. తను నా పక్కన లేకపోతే పెళ్లి కూడా చేసుకోను. కాబట్టి తనను నేను తీసుకొస్తా' అంటూ శృతిని తీసుకొస్తుంది. అప్పుడు ఆమెను నేరుగా ప్రేమ్ పక్కనే కూర్చబెడుతుంది.

  అక్షర బదులు శృతి గురించి.. అమ్మ అని

  అక్షర బదులు శృతి గురించి.. అమ్మ అని

  అందరూ అక్కడకు వచ్చి కూర్చోగానే అభి ‘ఏంటి మామ్.. అసలు విషయం ఏమిటి? అందరినీ ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టావు' అని అడుగుతాడు. అప్పుడు తులసి ‘రేపు అక్షరకు ప్రేమ్‌కు వెళ్లి కాబోతుంది. కాబట్టి తన గురించి మనకు.. మన గురించి తనకు తెలియాలని' అంటూ చెబుతుంది. అప్పుడు తులసి ముందుగా తనకు కాబోయే కోడలి గురించి అంటూ శృతి లక్షణాలను పరోక్షంగా చెబుతుంది. దీంతో మురిసిపోయిన అక్షర ‘నాలో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయని నాకే తెలీదు. తులసి ఆంటీ కాదు.. అమ్మలాంటిది' అంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తుంది.

  అరాచకమైన ఫొటోలతో షాకిచ్చిన అమలా పాల్: బీచ్‌లో బికినీతో అందాలు మొత్తం కనిపించేంత ఘాటుగా!

  ప్రేమ్‌పై అక్షర అనుమానం... నిజం చెప్పి

  ప్రేమ్‌పై అక్షర అనుమానం... నిజం చెప్పి

  తర్వాత అక్షర మాట్లాడుతూ.. ‘ప్రేమ్ మీద నాకు ఒక అనుమానం ఉంది. ఇంత అందంగా ఉన్న ప్రేమ్‌ను చాలా మంది అమ్మాయిలు ప్రేమించే ఉంటారు. మరి ప్రేమ్ ఎవరినీ ప్రేమించలేదా? ఇప్పుడీ విషయం నాకు తెలియాలి' అని అడుగుతుంది. దీనికి ప్రేమ్ ‘ప్రేమించాను.. నేను ప్రేమించిన అమ్మాయి శృతి. అంటే... నేను ప్రపోజ్ చేసిన అమ్మాయి అచ్చం శృతి లానే ఉంటుంది' అంటాడు. అప్పుడు అక్షర ‘ఇంతకీ తనకు నువ్వు ఎలా ప్రపోజ్ చేశావు ప్రేమ్. దీన్ని మామూలుగా చెబితే కుదరదు. ఆ సీన్ రీ క్రియేట్ చేసి చూపించాలి' అని అడుగుతుంది.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  శృతికి ప్రపోజ్ చేయమన్న అక్షర.. భయం

  శృతికి ప్రపోజ్ చేయమన్న అక్షర.. భయం

  ప్రేమ్ ప్రపోజ్ చేసిన సీన్‌ను రీ క్రియేట్ చేయమన్న అక్షర.. అక్కడున్న వారిలో ఒకరితో అలా చేయాలి అని చెబుతుంది. అప్పుడు కాసేపు అందరి ముఖాలనూ చూసిన తర్వాత.. శృతికి ప్రపోజ్ చేయమని ప్రేమ్‌ను అడుగుతుంది. దీంతో అతడు తెగ కంగారు పడిపోతాడు. అప్పుడు అక్షర ‘ప్లీజ్ ప్రేమ్.. పెళ్లికి ముందూ తర్వాత నేను కోరే కోరిక ఇదొక్కటే' అని అడుగుతుంది. కానీ, శృతి మాత్రం దీనికి ఒప్పుకోదు. ఆ సమయంలో ఆమెను ఎంతో బ్రతిమాలుతుంది. దీంతో శృతి భయంతో అక్కడి నుంచి లేచి వెళ్లిపోతుంది. అప్పుడు ఈ ఎపిసోడ్ పూర్తైపోయింది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 443: Akshara Appreciated to Tulasi with Her Touching Speech. After That Akshara Strange Request to Prem.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X