Intinti Gruhalakshmi Today Episode: ప్రేమ్‌ను గట్టిగా హత్తుకుని ప్రపోజ్.. పెళ్లికి గంటల ముందే ఇలా!

సుదీర్ఘ కాలంగా తెలుగులో ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ప్రేమ్‌లో మార్పుపై లాస్యలో భయం మొదలైంది. ఈ విషయాన్ని నందూకు చెప్పగా అతడు మాత్రం దానికి విభేదిస్తాడు. అనంతరం శృతిని తులసి ఏమైందని అడగ్గా.. తన మనసులోని మాటను చెప్పకుండా ఆపేస్తున్నారని అంటుంది. అనంతరం తులసి తన కొడుకు ప్రేమ్‌కు ధైర్యం చెప్పడంతో పాటు సాయంత్రం ఓ ఊహించని సంఘటన జరగబోతుందని చెబుతుంది.

ఇందులో భాగంగానే తులసి హార్ట్ టచింగ్ స్పీచ్‌తో అక్షర ఆమెను అభినందిస్తుంది. తర్వాత అక్షర.. ప్రేమ్ ముందు వింత కోరికను ఉంచుతుంది.

నా ప్రేమను అంగీకరించు శృతి అంటూ

నా ప్రేమను అంగీకరించు శృతి అంటూ

సీన్ రీ క్రియేట్ చేయమని అక్షర అడగ్గానే తన మనసులోని మాటలను నిజంగానే శృతికి చెబుతాడు ప్రేమ్. 'మనసనేది మనకు ఉంటుందని.. దానికి ప్రేమ అనే ఫీలింగ్ కలుగుతుందని తెలిసింది నిన్ను కలిసిన తర్వాతే. నాలో అంతలోనే రకరకాలుగా ఎన్నో భావాలు మొదలైంది నీ పరిచయంతోనే. నీతో కలిసుంటే బాగుంటుంది. విడిపోతానన్న ఆలోచన నన్ను బాధ పెడుతుంది. నీతో కలకాలం కలిసుంటే బాగుంటుంది అనిపిస్తుంది. నా గుండెను ఒక పుస్తకంగా చేసి ప్రతి పేజీలో నీ పేరే రాసుకున్నా. అది నీక్కూడా తెలుసు. ఐ లవ్ యూ శృతి' అంటాడు.

ప్రేమ్‌ను హగ్ చేసుకుని ప్రపోజ్ చేసింది

ప్రేమ్‌ను హగ్ చేసుకుని ప్రపోజ్ చేసింది

శృతికి ప్రపోజ్ చేసే సమయంలో మోకాళ్లపై కూర్చుని మరీ ఏడుస్తుంటాడు ప్రేమ్. దీంతో శృతి కూడా ఏమీ మాట్లాడకుండా కన్నీరు మున్నీరు అవుతుంది. దీంతో అందరూ చప్పట్లు కొట్టి అభినందిస్తారు. ఇక, ఆ సమయంలో అక్షర అయితే మెస్మరైజ్ అయిపోతుంది. ఆ వెంటనే ప్రేమ్‌ను పొగడ్తలతో ముంచేస్తుంది. అంతేకాదు, ఎంత బాగా ప్రపోజ్ చేశావో అంటూ ఆశ్చర్యపోతుంది. అలాగే, అతడిని గట్టిగా హగ్ చేసుకుని ఐ లవ్ యూ అని చెబుతుంది. ఇది జరుగుతుండగానే శృతి ఏడుస్తూ లోపలికి వెళ్లిపోతుంది. దీంతో అక్షర ఏమైందని తులసిని అడుగుతుంది.

ఎంట్రీ ఇచ్చిన జీకే.. అక్షరను ఉండమని

ఎంట్రీ ఇచ్చిన జీకే.. అక్షరను ఉండమని

ప్రేమ్ వ్యవహారం జరుగుతోన్న సమయంలోనే జీకే అక్కడకు ఎంట్రీ ఇస్తాడు. దీంతో అందరూ ఆయనకు స్వాగతం పలుకుతారు. అప్పుడు జీకే 'నందూ గారు.. అక్షరను ఇంటికి తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. పెళ్లికి టైమ్ దగ్గర పడింది కదా.. తనను పెళ్లికూతురిని చేయాలి' అని అడుగుతాడు. అప్పుడు లాస్య 'అదేంటి జీకే గారూ.. అక్షర మా ఇంట్లోనే ఉంటుంది. తనను ఇక్కడే పెళ్లి కూతురు చేస్తాం. ఇప్పుడు జరిగే డెస్టినేషన్ వెడ్డింగ్స్ అన్నీ ఇలాగే జరుగుతున్నాయి' అని అంటుంది. దీనికి తులసి కూడా ఒప్పుకోవడంతో జీకే తెగ సంతోష పడిపోతాడు.

ఇంట్లో నుంచి వెళ్లిపోతానంటూ బెదిరింపు

ఇంట్లో నుంచి వెళ్లిపోతానంటూ బెదిరింపు

ప్రేమ్ ప్రపోజ్ చేయగానే అక్కడి నుంచి వచ్చి ఏడుస్తుంది శృతి. అప్పుడు 'మనసులో అంత బాధను పెట్టుకుని ఎందుకు యాక్టింగ్ చేస్తున్నావు? నీ అర్థం లేని మాటలు.. కళ్లలోంచి వచ్చే కన్నీళ్లు నాకు చెప్తున్నాయి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని' అని అంటాడు ప్రేమ్. దీనికి శృతి 'అద్దంలో మనల్ని మనం చూసుకుంటే ఒకేలా అనిపిస్తాము. కానీ, కుడి ఎడంగా కనిపిస్తుందని గ్రహించం. ఇప్పుడు నీ పరిస్థితి కూడా అలాగే ఉంది. నువ్వు అక్షరను పెళ్లి చేసుకోవాలి. లేదంటే నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతా' అంటుంది. దీంతో ప్రేమ్ అఇష్టంగానే పెళ్లికి ఒప్పుకుంటాడు.

ప్రేమ్‌ను తక్కువ అంచనా వేశాను అంటూ

ప్రేమ్‌ను తక్కువ అంచనా వేశాను అంటూ

ప్రేమ్ ప్రవర్తన చూసిన తర్వాత నందూ లాస్య మధ్య చర్చ జరుగుతుంది. ఆ సమయంలో 'ప్రేమ్ ప్రవర్తన చూసి తన భవిష్యత్ కోసం మారిపోయాడని అనుకున్నాను. కానీ, వాడు యాక్టింగ్ చేస్తున్నాడని ఇప్పుడే అర్థం అయింది. శృతి దగ్గరవకుండా ఉంటుంది కాబట్టి సరిపోయింది. లేకపోతే ప్రేమ్‌కు లొంగిపోతుంది' అని అంటాడు. దీనికి లాస్య 'నందూ.. అక్కడున్నది ప్రేమ్. తను అస్సలు మారడు. ఒకవేళ ప్రేమ్ ప్రేమకు శృతి లొంగిపోయి ఉంటే ప్రమాదం జరుగుతుంది. ప్రేమించిన అమ్మాయి కళ్ల ముందు ఉంటే వేరే వాళ్లను పెళ్లి చేసుకోలేరు' అని అంటుంది.

ప్రేమ్ పెళ్లికి శృతిని లేకుండా చేయాలని

ప్రేమ్ పెళ్లికి శృతిని లేకుండా చేయాలని

శృతి ప్రేమ్ ఒకే దగ్గర ఉంటే పెళ్లి ఆగిపోయే ప్రమాదం ఉందని నందూ, లాస్య మాట్లాడుకుంటారు. ఆ సమయంలో 'అవును నువ్వు చెప్పింది కరెక్టే లాస్య. పెళ్లి అయ్యే లోపు శృతి మనసు మారినా ఆశ్చర్యపోనవరం లేదు. కాబట్టి ఆమెను పెళ్లి అయ్యేంత వరకూ ఇక్కడ లేకుండా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా' అని అంటాడు. అప్పుడు లాస్య 'వావ్ నందూ.. ఎంత మంచి ఐడియా ఇచ్చావు. పెళ్లి అయ్యేంత వరకూ శృతిని ఇక్కడ లేకుండా చేయడమే మంచిది. అలా అయితే ప్రేమ్ చక్కగా కూర్చుని పెళ్లికి ఒప్పుకుంటాడు' అంటూ సంతోష పడుతుంది.

శృతి కోసమే అక్షరతో పెళ్లికి ఒప్పుకున్నాను

శృతి కోసమే అక్షరతో పెళ్లికి ఒప్పుకున్నాను


శృతి మాటలకు బాధ పడిన ప్రేమ్.. ఒంటరిగా కూర్చుని బాధ పడుతూ ఉంటాడు. ఆ సమయంలో తులసి అక్కడకు వెళ్లి ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. అప్పుడతను 'అక్షరను పెళ్లి చేసుకోవడం కంటే.. శృతి ఇంటి నుంచి వెళ్లిపోవడమే నాకు పెద్ద బాధ. అందుకే పెళ్లికి ఒప్పుకున్నా. మన ప్రయత్నాలన్నీ అయిపోయాయి కదమ్మా' అని అంటాడు. దీనికి తులసి 'నువ్వు మనసు విప్పి మాట్లాడితే శృతి కంట్లో వచ్చిన నీళ్లే ఆమె నిన్ను ప్రేమిస్తుందని చెబుతుంది. కానీ, తను ఎందుకో ప్రేమను వ్యక్త పరచలేకుండా ఉండిపోతుంది' అంటూ చెప్పుకొస్తుంది.

నిర్ణయాలు మారడానికి నిమిషాలు చాలు

నిర్ణయాలు మారడానికి నిమిషాలు చాలు


ప్రేమ్‌తో మాట్లాడుతోన్న సమయంలోనే 'శృతిని బలవంత పెట్టకూడదు. అసలు తను ఇలా ఉండడానికి కారణం ఏంటో తెలుసుకోవాలి. కానీ, నువ్వు ఇప్పుడు ఆమెతో మాట్లాడితే బాగోదు. నిజానికి నువ్వు అంతలా ప్రపోజ్ చేసినప్పుడే అక్షరకు సందేహం రావాలి. కానీ, నీ మీద ఉన్న ప్రేమ వల్ల తనకు అనుమానం రాలేదు. కాబట్టి మళ్లీ ఆమెకు సందేహం కలిగేలా వ్యవహరించకూడదు. ఇప్పుడంతా ఆచితూచి వ్యవహరించాలి. శృతిని భార్య అనుకుంటే సరిపోదు' అంటూ వివరిస్తుండగా.. అక్షర అక్కడకు వస్తుంది. దీంతో ఈ ఎపిసోడ్ పూర్తైపోయింది.

ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్ విషయానికి వస్తే.. ప్రస్తుత వారం మెరుగైన రేటింగ్‌ను సాధించింది. అర్బన్ ప్రాంతంలో 38వ వారం 11.25 రేటింగ్ సాధిస్తే.. 39వ వారంలో 11.87 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. ఇక రూరల్ ప్రాంతంలో 38వ వారంలో 11.54 రేటింగ్ సొంతం చేసుకొంటే.. 39వ వారం12.53 రేటింగ్‌ను నమోదు చేయడం విశేషంగా పేర్కొనవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X