For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: తులసి ఇంటికెళ్లిన సామ్రాట్.. అనసూయ అలా రిక్వెస్ట్ చేయడంతో!

  |

  ఈ మధ్య కాలంలో ఎన్నో రకాల షోలు వస్తున్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. సామ్రాట్ తనను జనరల్ మేనేజర్ పోస్టు నుంచి తీసేయడంతో తులసి బాధ పడుతుంది. అయినప్పటికీ ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఆ తర్వాత తులసి ఇంట్లో అందరూ బాధగా ఉండగా.. అభి, అనసూయ మాత్రమే సంతోషంగా ఉంటారు. ఇక, సామ్రాట్‌ను వాళ్ల బాబాయి ప్రశ్నిస్తాడు. దీంతో అనసూయ తన ముందు చేసిన డిమాండ్, ప్రేమ్ అరెస్ట్ గురించి ఆయనకు నిజం చెప్పేస్తాడు. తర్వాత తులసిని ఇంట్లో వాళ్లు ఓదార్చే ప్రయత్నం చేయగా.. ఆమె వాళ్లకే ధైర్యం చెప్పేలా మాట్లాడుతుంది.

  కాజల్ అగర్వాల్ ఎద అందాల ప్రదర్శన: తల్లైన తర్వాత ఫస్ట్ టైం ఇంత ఘాటుగా!

  నందూ అలా.. సామ్రాట్ మరోలా

  నందూ అలా.. సామ్రాట్ మరోలా

  తులసి గురించి లాస్య మాట్లాడుతుండగా నందూ కల్పించుకుని 'ఇకనైనా తన గురించి పట్టించుకోవడం మానేద్దాం. మన పని మనం చేసుకుందాం' అని అంటాడు. మరోవైపు, తులసితో సామ్రాట్ ప్రవర్తించిన తీరుపై వాళ్ల బాబాయి కోప్పడతాడు. అప్పుడు నీకు ఇది కొంచెం కూడా తప్పు అనిపించడం లేదా అని ప్రశ్నిస్తాడు. దీంతో సామ్రాట్ 'తప్పుగా అనిపించింది కానీ.. తన ముందు ముఖం చెల్లడం లేదు. ఫోన్ చేసి తులసికి సారీ చెబుతా' అంటాడు. దీనికాయన అందరి ముందు అవమానించి ఇప్పుడు ఫోన్‌లో సారీ చెబుతావా అనగా.. ఇంటికెళ్తా అని బదులిస్తాడు.

  కాలనీలో పండుగ చేద్దామంటూ

  కాలనీలో పండుగ చేద్దామంటూ

  తులసి వాళ్ల ఫ్యామిలీ నివాసం ఉంటోన్న కాలనీలోని వాళ్లందరూ దసరా పండుగ చేయాలని అనుకుంటారు. ఆ వెంటనే తులసి వాళ్ల ఇంటికి వచ్చి ఈ విషయాన్ని అందరికీ చెప్తారు. దీంతో అందరూ చేద్దామని అంటారు. అంతేకాదు, తులసి తన చేతనైనా సహాయాన్ని చేస్తానని అంటుంది. అప్పుడు సొసైటీ సభ్యుల్లో ఒకరు 'ఈ కాలనీ మొత్తానికి అనసూయ అమ్మగారే పెద్ద దిక్కు. కాబట్టి మీరే దగ్గరుండి పూజాకు సంబంధించినవి అన్నీ చెప్పాలి. మీరే మాకు అండగా ఉండాలి' అని అంటుంది. దీంతో అనసూయ తప్పకుండా దగ్గరుండి చూసుకుంటా అంటుంది. ఆ తర్వాత అంకిత, శృతి, దివ్యలు కొత్త డ్రెస్‌లు కావాలని అడుగుతారు.

  Mrunal Thakur: వ్యభిచార గృహంలో సీతా రామం హీరోయిన్.. రెండు నెలలు నరకం.. ఆ డైరెక్టర్ వల్లేనంటూ!

  పూజ సరిగా జరగాలని మొక్కు

  పూజ సరిగా జరగాలని మొక్కు

  దసరా పండుగ జరుపుకోవడం కోసం తులసి వాళ్లు షాపింగ్‌కు వెళ్తారు. అప్పుడామె సామాన్లు తీసుకొని ముందే వస్తుంది. అప్పుడు అనసూయ 'పండగకు ఏం వండుతున్నావు.. ఏం వంటలు చేస్తున్నావు అని అడగాల్సినవి అడగకుండా ఏవేవో అడుగుతున్నారు మీ మామయ్య గారు' అని అంటుంది. దీంతో పరందామయ్య, అనసూయ దండం పెట్టుకుంటారు. అందులో పరందామయ్య 'ఈ దసరా పండుగ ప్రశాంతంగా జరిగేలా చూడు తండ్రి' అని అనుకుంటాడు. అప్పుడు అనసూయ 'మొదటి సారి కాలనీ వాళ్లంతా కలిసి పండుగ చేసుకుంటున్నారు కదా. అందుకే అంతా బాగా జరగాలి' అనుకుంటుంది.

  తులసి ఇంటికొచ్చిన సామ్రాట్

  తులసి ఇంటికొచ్చిన సామ్రాట్

  తులసికి సారీ చెప్పాలనుకున్న సామ్రాట్ ఆమె ఇంటికి వస్తాడు. అతడిని చూసి అనసూయ షాక్ అవుతుంది. మనసులో 'ఈయన మళ్లీ ఎందుకు వచ్చాడు. నాకోసం వచ్చాడా.. తులసి కోసం వచ్చాడా. నాకోసమే అయి ఉంటుంది' అని అనసూయ ఆయన దగ్గరికి వస్తుంది. అప్పుడు సామ్రాట్ 'ఎదురు పడకూడదు అని అనుకున్న మనిషే ఎదురుపడింది. ఎలాగైనా ఈవిడను తప్పించుకొని తులసి దగ్గరికి వెళ్లాలి' అనుకుంటాడు. అప్పుడు అనసూయ నేనే మీ ఇంటికి వద్దామని అనుకున్నా అంటుంది. తులసి మాత్రం ఏం జరగనట్టుగా ఉంటుంది అంటుంది.

  ఒంటిపై నూలుపోగు లేకుండా హీరోయిన్: సీక్రెట్ పార్ట్ కనిపించేలా ఘోరంగా!

  ఇంటికి రావొద్దన్న అనసూయ

  ఇంటికి రావొద్దన్న అనసూయ


  ఆ తర్వాత అనసూయ 'ఇప్పటికే పెద్ద సహాయం చేశారు. అయినా కూడా ఇంకో చిన్న సాయం చేయండి. ఏం లేదు బాబు. తులసి ఉద్యోగం తీసేసిన విషయంలో జరిగినదంతా మన ఇద్దరి మధ్యలో ఉండాలి. ఎందుకంటే తులసి బాధపడకూడదు. తులసి బాధ చూసి మనం బాధపడకూడదు. ఎలాగూ తులసి ఆఫీసుకు రాదు. నువ్వు కూడా ఇక నుంచి మా ఇంటికి రాకు' అంటుంది. అప్పుడు సామ్రాట్.. తులసితో మాట్లాడతానని అంటాడు. కానీ, అనసూయ మాత్రం దీనికి ఒప్పుకోదు. అప్పుడు సామ్రాట్.. తులసి గారి దగ్గర ఒక ఫైల్ ఉండిపోయింది అని అంటాడు.

  సామ్రాట్‌కు షాకిచ్చిన తులసి

  సామ్రాట్‌కు షాకిచ్చిన తులసి

  సామ్రాట్ ఫైల్ గురించి చెప్పగానే నేను పంపిస్తా అని అనసూయ అంటుంది. ఆ వెంటనే ఇంట్లోకి వెళ్లిన అనసూయ డౌట్ డౌట్‌గానే తులసికి సామ్రాట్ వచ్చాడని చెబుతుంది. ఏదో ఫైల్ మరిచిపోయాడట అని కూడా అంటుంది. దీంతో తులసి తన దగ్గర ఉన్న ఓ ఫైల్ పట్టుకొని సామ్రాట్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడామె 'నిజంగా మీరు ఫైల్స్ కోసమే వచ్చారా? కానీ.. ఈ ఫైల్స్‌లో అంత ముఖ్యమైనవి ఏం లేవు కదా. అసలు ఈ ఫైల్స్ కోసం మీరు ఇంత దూరం రావాల్సిన అవసరమే లేదు' అని అంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 757: Samrat is Confused by Anasuya Request about Tulasi. After That Tulasi and Residents Plan to Celebrate The Festival.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X