For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: ప్రేమ్‌ను పెళ్లి చేసుకుంటానన్న శృతి.. నిజం తెలుసుకున్న తులసి

  |

  మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగులో ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. అక్షర కోరిక మేరకు ప్రేమ్.. తనలోని ప్రేమను శృతికి వివరించి కన్నీటి పర్యంతం అవుతాడు. ఆ తర్వాత జీకే వచ్చి అక్షరను ఇంటికి తీసుకుని వెళ్తానంటాడు. కానీ, లాస్య, తులసి ఇక్కడే ఉంచమని చెబుతారు. ఆ తర్వాత నందూ, లాస్య ప్రేమ్ ప్రవర్తనను చూసి భయపడిపోతుంటారు.

  అంతేకాదు, శృతి మనసు మారకుండా ఉండాలంటే ఆమెను పక్కకు పంపేయాలని అనుకుంటారు. మరోవైపు, తనను కాదని అన్నందుకు ప్రేమ్ ఎంతగానో బాధ పడతాడు. దీంతో తులసి అక్కడకు వెళ్లి అతడికి ధైర్యం చెబుతుంది.

  బీచ్‌లో లవర్‌తో పాయల్ రాజ్‌పుత్ రచ్చ: బికినీలో అందాలన్నీ చూపిస్తూ.. షాకిస్తోన్న సెల్ఫీ వీడియో

  ఇష్టం లేదంటే చెప్పు వదిలేస్తా అంటూ

  ఇష్టం లేదంటే చెప్పు వదిలేస్తా అంటూ

  శృతి గురించి బాధ పడుతోన్న ప్రేమ్‌తో తులసి మాట్లాడుతుండడంతో ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. తనను నందూ వదిలేయడం వల్ల ఎదురైన పరిస్థితులను వివరిస్తూ అతడికి సర్ధి చెప్పాలని అనుకుంటుంది. అంతలో అక్కడకు అక్షర ఎంట్రీ ఇస్తుంది. ఆ సమయంలో ‘ఏంటి ప్రేమ్.. నీ మాజీ లవర్‌ను ఇంకా తలుచుకుంటున్నావా? ఫంక్షన్ హాల్‌కు వెళ్లే లోపు తనంటే నీకు ఇష్టం ఉంటే చెప్పేయ్.. నిన్ను వదిలేస్తా' అంటుంది. దీనికి వాళ్లిద్దరూ కంగారు పడతారు. అప్పుడు ‘లేదులే ప్రేమ్ ఊరికే అన్నాను. నువ్వు ఇప్పటి నుంచే నా వాడివి' అని షాకిస్తుంది.

  శృతితో నందూ మాటలు.. తులసి వచ్చి

  శృతితో నందూ మాటలు.. తులసి వచ్చి


  శృతి దగ్గరకు నందూ వచ్చి సహాయం చేయాలని అడుగుతాడు. అప్పుడామె ‘ఇంకా మీకు చేయడానికి, నేను కోల్పోడానికి ఇంకా నా దగ్గర ఏముంది అంకుల్? మీరు నన్ను నిజంగా అర్థం చేసుకునే వాళ్లైతే నాకింత పెద్ద శిక్ష విధించే వాళ్లు కాదు. అందుకే కదా మీరు చెప్పినట్లే చేస్తున్నాను' అని అంటుంది. అప్పుడు నందూ ‘అవును శృతి నువ్వు నీ ప్రేమను త్యాగం చేయబట్టే ఈ పెళ్లి జరుగుతుంది. నిన్ను ఆదరించిన కుటుంబానికి నువ్వు చాలా పెద్ద సహాయం చేశావు' అని అంటాడు. అప్పడా మాటలను పక్కనే ఉన్న తులసి విని ఆశ్చర్యపోతుంది.

  బట్టలు లేకుండా దిగిన ఫొటో వదిలిన శృతి హాసన్: ఆ ప్లేస్‌లో టాటూ.. ఎవరి పేరు ఉందో తెలిస్తే!

  నందూ.. చాలా పెద్ద తప్పు చేశాడంటూ

  నందూ.. చాలా పెద్ద తప్పు చేశాడంటూ


  శృతితో మాట్లాడుతోన్న సమయంలో నందూ ‘నువ్వు నీ ప్రేమను దాచుకుని.. ప్రేమ్‌కు అబద్ధం చెప్పబట్టే వాడు ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. లేకపోతే అసలు ఇలా జరిగేదే కాదు' అని అంటాడు. అదంతా వినేసిన తులసి ‘మీ పంతం కోసం శృతి మనసును విరిచేశారా? ప్రేమ్‌కు తన ప్రేమను దూరం చేసి మనసును ముక్కలు చేశారా? చాలా పెద్ద తప్పు చేశారండీ. పాపం శృతి ఒకవైపు నేను అడిగే ప్రశ్నలకు, మరోవైపు ప్రేమ్ అడిగే వాటికి సమాధానం చెప్పలేక ఎంతగా కుమిలిపోయిందో' అని మనసులో అనుకుంటూ శృతి బాధను అర్థం చేసుకుంటుంది.

  ప్రేమ్ కంట పడకుండా ఉండాలని ప్లాన్

  ప్రేమ్ కంట పడకుండా ఉండాలని ప్లాన్

  శృతితో మాట్లాడుతూ ‘ప్రేమ్ ఇప్పటికీ నీతోనే ఉండాలని చూస్తున్నాడు. నువ్వు కాదని దూరంగా ఉంటున్నా నీకోసమే పరితపిస్తున్నాడు. నువ్వు వాడికి దూరంగా ఉన్నా.. వాడు మాత్రం నిన్ను కావాలని కలుస్తున్నాడు. కాబట్టి నువ్వు వాడికి కనిపించకుండా ఉంటే మంచిది. దీని కోసం పెళ్లి అయ్యేంత వరకూ నువ్వు ఎక్కడికైనా వెళ్లిపో' అంటాడు. అప్పుడు శృతి ‘మీ అవసరం కోసం ఎదుటి వాళ్లను ఇబ్బంది పెడతారు. బాగా వెలిగిన నా దీపాన్ని ఆర్పేశారు. ఇప్పుడేమో మళ్లీ ఇలా చేయమంటున్నారు. చేస్తాను ఈ కుటుంబం కోసం ఏ పనైనా చేస్తాను' అని ఒప్పుకుంటుంది.

  షర్ట్ విప్పేసి షాకిచ్చిన బిగ్ బాస్ సరయు: బ్రాతో ఘాటు ఫోజులిస్తూ.. వామ్మో చూస్తే తట్టుకోలేరు

  ఇప్పుడు నేనేం చేయాలి.. పారిపోవాలని

  ఇప్పుడు నేనేం చేయాలి.. పారిపోవాలని

  శృతితో నందూ మాట్లాడిన మాటలను విన్న తర్వాత తులసి ‘పాపం శృతి తన ప్రేమను త్యాగం చేసింది. ఇన్ని రోజులు తనకు ప్రేమ్ అంటే ఇష్టం లేదనుకున్నా. కానీ, ఇప్పుడు ఇష్టమని తెలిసింది. కాబట్టి.. వీళ్లిద్దరూ ఓడిపోకుండా చేయాలి. దాని కోసం ఏం చేయాలి' అని తనలో తానే అనుకుంటూ ఉంటుంది. మరోవైపు, మంగళ స్నానానికి రెడీ అయిన ప్రేమ్‌ ‘అవకాశం ఇస్తే ఇక్కడి నుంచి ఎవరికీ కనిపించనంత దూరం పారిపోవాలని ఉంది. కానీ, ఇప్పుడు చేసేదేం లేదు' అని మాధవితో అంటాడు. అప్పుడామె స్నానం సమయంలో ఏడ్చేయమని అంటుంది.

  లాస్య, నందూ వార్నింగ్... శృతి తెగింపు

  లాస్య, నందూ వార్నింగ్... శృతి తెగింపు

  ప్రేమ్ మంగళ స్నానాలు జరుగుతుండగా బాల్కనీ నుంచి చూస్తూ ఏడుస్తుంది శృతి. అది గమనించిన లాస్య వెంటనే నందూను తీసుకుని అక్కడకు వస్తుంది. అప్పుడు ఇద్దరూ ‘నిన్న రాత్రే వెళ్లిపోతానని మాట ఇచ్చావు కదా. మరి ఎందుకు వెళ్లలేదు. మనసులో ఏదో ఆలోచన చేస్తున్నావు.. అందుకే ఇలా చేస్తున్నావు. మేము బెదిరించం.. తెగించం అనుకుంటున్నావా' అని ఫైర్ అవుతారు. అప్పుడు శృతి ‘నేనూ తెగించగలను.. బెదిరించగలను.. ప్రేమ్‌కు ఒక్క ఫోన్ చేసి ప్రేమిస్తున్నాను అని చెప్తే.. మా పెళ్లి ఆపడం ఎవరి వల్లా కాదు. అది గుర్తు పెట్టుకోండి' అంటుంది.

  అరాచకమైన ఫొటోలతో షాకిచ్చిన అమలా పాల్: బీచ్‌లో బికినీతో అందాలు మొత్తం కనిపించేంత ఘాటుగా!

   శృతి అదిరిపోయే ప్లాన్... కనిపించనని

  శృతి అదిరిపోయే ప్లాన్... కనిపించనని

  శృతి కూడా ఫైర్ అయ్యే సరికి లాస్య, నందూ తెగ కంగారు పడిపోతారు. ఆ సమయంలో ‘నువ్వు నైట్ వెళ్లిపోతానన్నావు కదా. మళ్లీ ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? మనసులో ఏదో ప్లాన్ చేస్తున్నావు కదా' అని అంటారు. దీనికి శృతి ‘నేను నైటే కనిపించకుండా వెళ్లిపోతే ఇప్పుడు మంగళ స్నానాలు జరిగేవి కాదు. ప్రేమ్ నాకోసమే వెతుకుతూ ఉండేవాడు. దీంతో పెళ్లి కూడా ఆగిపోయేది. అందుకే నేనెక్కడికీ వెళ్లలేదు. మీరు కల్యాణ మండపానికి వెళ్లే సమయంలో నేను వెళ్లిపోతా. ప్రేమ్ తన భార్యతో వచ్చే సరికి నేను కనిపించను' అంటూ ప్లాన్ చెబుతుంది శృతి.

  ఈ జీవితమే అబద్దం.. ప్రేమ ఎందుకు?

  ఈ జీవితమే అబద్దం.. ప్రేమ ఎందుకు?

  నందూ, లాస్యతో మాట్లాడి వెళ్లిన తర్వాత శృతి దగ్గరకు తులసి వస్తుంది. ‘ఎందుకు శృతి మనసులో ఉన్న ప్రేమను చంపుకుని ఉంటున్నావ్' అని ప్రశ్నిస్తుంది. దీనికి ఆమె నసుగుతూ ‘నా జీవితమే అబద్ధం.. దానికి మళ్లీ ప్రేమ్ ఎందుకు చెప్పండి' అంటూ ఏదేదో చెప్పడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు తులసి ‘నువ్వు ప్రేమ్‌ను ప్రేమించేది నిజం.. ఎవరి కోసమో దాన్ని త్యాగం చేయకు.. ఎవరి బెదిరింపులకో భయపడిపోకు.. నాకు అన్నీ తెలుసు.. నువ్వు ఎవరి వల్ల నీ ప్రేమను చంపుకున్నావో నాకు తెలుసు' అంటూ చెబుతుంది. దీంతో ఈ ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 445: Tulasi Knows about The Shocking Truth about Nandhu. Then Nandhu and Lasya Force Shruthi to Leave The Home.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X