For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: లాస్య బుట్టలో పడ్డ అనసూయ.. వాళ్లతో వెళ్లేందుకు ఓకే చెప్పడంతో!

  |

  చాలా భాషలతో పోల్చుకుని చూస్తే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. సామ్రాట్ తప్పు చేశాడని అన్న వాళ్ల బాబాయి వెళ్లి తులసికి సారీ చెప్పమని అంటాడు. దీంతో అతడు వాళ్ల ఇంటికి బయలుదేరి వెళ్తాడు. అప్పుడు అనసూయ మాత్రమే కనిపించి.. తులసిని తన వల్లే ఉద్యోగంలో నుంచి తీసేసిన విషయం చెప్పొద్దని అంటుంది. అలాగే, సామ్రాట్‌ను ఇంటికి కూడా రావొద్దని రిక్వెస్ట్ చేస్తుంది. ఆ తర్వాత తులసి వచ్చి ఫైల్ కోసం రావాల్సిన అవసరం లేదు అని అతడితో అంటుంది. ఇక, కాలనీలోని వాళ్లంతా పండుగను కలిసి చేద్దామని అంటారు. దీంతో తులసి ఫ్యామిలీ రెడీ అవుతుంటుంది.

  లోదుస్తులు కూడా లేకుండా నందినీ ఫోజులు: తెలుగమ్మాయి తెగింపు చూశారా!

  మీ అత్తయ్య నోరు కట్టేసిందంటూ

  మీ అత్తయ్య నోరు కట్టేసిందంటూ


  ఇంటికి వచ్చిన సామ్రాట్‌తో తులసి మీరు నిజంగా ఫైల్స్ కోసమే వచ్చారా అని అడుగుతుంది. దీంతో సామ్రాట్ ఎందుకు అలా అడుగుతున్నారు అని అంటాడు. దీనికామె 'ఎందుకు అంటే.. ఈ ఫైల్స్ అంతగా ముఖ్యమైనవి ఏం కాదు. కావాలంటే ఈ ఫైల్స్ కోసం ఎవరినైనా పంపించి ఉండొచ్చు. కానీ, మీరు ఎందుకు వచ్చారు? నిజం చెప్పండి. మీరు నాకోసం వచ్చారు కదా? నేను బోరున ఏడుస్తుంటే వచ్చి ఓదార్చుదామని అనుకున్నారా' అని అడుగుతుంది. దీంతో సామ్రాట్ 'మీకు సారీ చెబుదామనే అనుకొని వచ్చా కానీ.. మీ అత్తయ్య నా నోరు కట్టేసింది' అనుకుంటాడు.

  సామ్రాట్‌ వాళ్లను ఆహ్వానించింది

  సామ్రాట్‌ వాళ్లను ఆహ్వానించింది


  తులసి మాటలకు సామ్రాట్‌కు ఏం చెప్పాలో అర్థం కాదు. అప్పుడామె 'మీరు నన్ను జనరల్ మేనేజర్ పదవి నుంచి తీసేసి మంచి పని చేశారు. ఎందుకంటే.. కేవలం మన ఫ్రెండ్‌షిప్ వల్ల మీరు నన్ను అందలం ఎక్కించి మీ కంపెనీ కోట్లలో నష్టపోయేలా చేయలేరు కదా. మన మధ్య ఉన్న ఆఫీసు బంధం తెగిపోయింది. కానీ, మన మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్ మాత్రం అలాగే ఉంటుంది.

  రేపు మా కాలనీలో అందరం కలిసి దసరా పండుగను వేడుకగా జరుపుకుంటున్నాం. హనీని తీసుకొని మీరు కూడా రండి' అని అహ్వానిస్తుంది.. దీంతో సామ్రాట్ 'మీ కాలనీ ఫంక్షన్‌కు మేమెందుకు? నాకు అర్జెంట్‌గా ఆఫీసు పని ఉంది. రావడం కుదరదు' అంటాడు. దీంతో హనీని అయినా పంపించండి. లేకపోతే నేనే వచ్చి హనీని తీసుకొస్తా అంటుంది. దీంతో ఓకే అంటాడు.

  విడిపోయినా సమంతతోనే నాగ చైతన్య: పక్కన లేకున్నా ఆ పని మాత్రం ఆపట్లేదట

  అనసూయను పడేయాలని ప్లాన్

  అనసూయను పడేయాలని ప్లాన్

  ఇంట్లో ఒంటరిగా ఉన్న లాస్య.. తులసి, అనసూయ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ సమయంలో 'తులసిని ఆరోజు అందరూ అంతగా అవమానిస్తుంటే ఆ పెద్దావిడ ఎందుకు సైలెంట్‌గా ఉంది? ఎప్పుడూ కోడలిని వెనకేసుకుని వచ్చే ఆవిడ.. ఒక్క మాట కూడా ఎందుకు అనలేదు? అంటే వాళ్లిద్దరి మధ్య దూరం పెరిగింది. దీన్ని నేను క్యాష్ చేసుకోవాలి. వెంటనే నందూతో ఆవిడకు కాల్ చేయించి గ్రిప్‌లో పెట్టుకుంటా. అయినా ఆ పిచ్చిమాలోకం నా మాట వింటాడా? అయినా నేనే రంగంలోకి దిగుతా. ఆ పెద్దావిడను ఎలాగైనా ముగ్గులోకి దింపుతా అని అనుకుంటుంది.

  అనసూయకు లాస్య ఫోన్ కాల్‌తో

  అనసూయకు లాస్య ఫోన్ కాల్‌తో

  లాస్య వెంటనే అనసూయకు కాల్ చేస్తుంది. అది చూసి ఆ పెద్దావిడ కట్ చేస్తుంది. అయినా మళ్లీ చేస్తుంది. దీంతో ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి అని అడుగుతుంది. అప్పుడు లాస్య 'అవునన్నా కాదన్నా మీరే మా ఇంటి ఇలవేల్పు అత్తయ్య' అంటుంది. దీనికామె ఎప్పటి నుంచి అలా అనిపిస్తోంది అని ప్రశ్నిస్తుంది. అప్పుడు లాస్య 'సామ్రాట్ గారి ఆఫీసులో నందూకు జనరల్ మేనేజర్ స్థానం లభించింది అంటే దానికి కారణం మా అమ్మ ఆశీస్సులే అని ఇప్పటిదాకా అన్నాడు. ఈ పండుగకు మీ పేరు మీద నందూ పూజ చేయించాలనుకుంటున్నాడు. కాదనకండి' అంటుంది.

  కాజల్ అగర్వాల్ ఎద అందాల ప్రదర్శన: తల్లైన తర్వాత ఫస్ట్ టైం ఇంత ఘాటుగా!

  లాస్య ఆహ్వానం.. అనసూయ ఓకే

  లాస్య ఆహ్వానం.. అనసూయ ఓకే


  లాస్య మాటలకు ఆశ్చర్యపోయిన అనసూయ.. ఆమె ఇంత కమ్మగా మాట్లాడుతోంది ఏంటి అని అనుకుంటుంది. అప్పుడు లాస్య 'మీరు ఒక్కసారి ఊ అనండి.. మేమే ఇక్కడికి వచ్చి మిమ్మల్ని తీసుకొస్తాం. నందూకు కావాల్సింది మీ దీవెనలు అత్తయ్య. దీంతో మీరు రండి' అంటుంది. దీంతో అనసూయ 'నాకు రావడం కుదరదు కానీ.. మేము రేపు ఉదయం గుడికి వెళ్తున్నాం. మీరు కూడా అక్కడికి రండి. అక్కడే చేయిద్దాం' అంటుంది. దీంతో సరే అని ఫోన్ పెట్టేసి వెంటనే నందూకు ఈ విషయం చెబుతుంది. దీంతో అతడు ఆశ్చర్యంగా నిజమేనా అని అడుగుతాడు.

  పండుగ విశిష్టత చెప్పిన తులసి

  పండుగ విశిష్టత చెప్పిన తులసి


  కాలనీలో పండుగను చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత తులసి ఇంట్లో వాళ్లందరూ బతుకమ్మ పండుగ కోసం రెడీ అవుతూ ఉంటారు. అంతలో అక్కడికి ప్రేమ్, అభి పువ్వులు తీసుకు వస్తారు. ఆ తర్వాత శృతి వచ్చి 'మాకు బతుకమ్మ పేర్చడం ఎలా తెలియదు కదా.. మాకు ఆంటి నేర్పిస్తుంది' అని అంటుంది. దీంతో తులసి పువ్వులతో బతుకమ్మను తయారు చేసి.. ఆ దేవత, పండుగ విశిష్టతను అంకిత, శృతికి చెబుతుంది. అంతేకాదు, ఆ తర్వాత బతుకమ్మను ఎలా పేర్చాలో వాళ్లకు చూపిస్తుంది.

  ఒంటిపై నూలుపోగు లేకుండా హీరోయిన్: సీక్రెట్ పార్ట్ కనిపించేలా ఘోరంగా!

  హనీ ఇబ్బంది.. నందూ ఫ్యామిలీ

  హనీ ఇబ్బంది.. నందూ ఫ్యామిలీ


  తులసి వాళ్ల ఇంటికి రావడం కోసం హనీ రెడీ అవుతూ ఉంటుంది. అంతలో సామ్రాట్ వాళ్ల బాబాయిని పిలిచి జడ వేయమని అడుగుతుంది. కానీ, ఆయన నాకు రాదు అని అంటాడు. దీంతో అమ్మాయిలు రెడీ అవ్వాలంటే ఎంత సమయం పడుతుందో ఆయనకు చెబుతుంది. అప్పుడు సామ్రాట్ దగ్గరకు వెళ్లి హనీ ఇంకా రెడీ అవుతుంది అని చెప్తాడు. అనంతరం నందూ, లాస్య, లక్కీలు కలిసి తులసి వాళ్ల ఇంటికి వస్తారు. దీంతో అనసూయ వాళ్లను చూసి సంతోషంతో చేయి ఊపుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 758: Lasya Hatches a Plan and Lures Anasuya to Disrupt her Relationship with Tulasi. After that Tulasi Explains about Festival to her Family.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X