For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: పెళ్లికి ముందు నందూకు తులసి ఝలక్.. జీకేకు అలా ప్రామిస్ చేయడంతో!

  |

  ఎన్నో ఏళ్లుగా తెలుగులో ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే బుల్లితెరపై ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

   శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ప్రేమ్ పెళ్లి అయ్యేంత వరకూ కనిపించకుండా వెళ్లిపోమని నందూ.. శృతిని అడుగుతాడు. అప్పుడదంతా వినేసిన తులసి అసలు విషయాన్ని తెలుసుకుంటుంది. అంతేకాదు, తన మాజీ భర్త ఎంత పెద్ద తప్పు చేశాడని అనుకుంటుంది. ఆ తర్వాత నందూ, లాస్య.. శృతిని ఇంట్లో నుంచి వెళ్లిపోమని బలవంతం చేస్తుంటారు. దీనికి ఆమె కూడా ఘాటుగానే సమాధానం చెబుతుంది. ఎక్కువ మాట్లాడితే ప్రేమ్‌కు ఫోన్ చేసి అసలు విషయం చెబుతానని అంటుంది. చివరకు పెళ్లి సమయంలో ఉండకుండా వెళ్లిపోతానని అంటుంది.

  బట్టలు లేకుండా దిగిన ఫొటో వదిలిన శృతి హాసన్: ఆ ప్లేస్‌లో టాటూ.. ఎవరి పేరు ఉందో తెలిస్తే!

  నీ గొంతును నువ్వు నొక్కేసుకోకు అంటూ

  నీ గొంతును నువ్వు నొక్కేసుకోకు అంటూ

  శృతి ప్రవర్తన చూసిన తర్వాత తులసి ఆమెతో మాట్లాడుతుండగా ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. ‘నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు తెలుసు శృతి. మా ఆయన నిన్ను బెదిరించిన విషయం నాకు తెలుసు. మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకలా ఎందుకు ఉంటున్నావు? నీ గొంతును నువ్వే ఎందుకు నొక్కుకుంటున్నావు? ప్రేమ్ అంటే ఇష్టం అని ఒక్క మాట.. ఒకే ఒక్క మాట చెప్పు. వెంటనే ఈ పెళ్లి ఆపేస్తాను. అక్షర స్థానంలో నిన్ను తీసుకెళ్లి కూర్చోబెడతాను. చెప్పు శృతి చెప్పు.. నువ్వు ప్రేమ్‌ను ప్రేమిస్తున్నానని చెప్పు' అంటూ అడుగుతుంది.

  తులసికి చేతులెత్తి మొక్కుకున్న శృతి

  తులసికి చేతులెత్తి మొక్కుకున్న శృతి

  తులసి తనను బలవంతం చేసే సరికి శృతి ఒక్కసారిగా ఫైర్ అవుతుంది. ‘ఆపండి ఆంటీ.. ఎంత వరకూ మీ కొడుకు ప్రేమ గెలవాలనే చూస్తారా? అందుకోసం ఎదుటి వాళ్ల బాధను అర్థం చేసుకోరా? ఎందుకిలా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ప్రేమ్ అంటే నాకు ఇష్టం లేదు' అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడు తులసి ‘శృతి నువ్వు నాకు దూరంగా పారిపోతున్నా.. నేను మాత్రం నిన్ను వదలను. నీ ప్రేమను ఓడిపోనివ్వను. అందరి ముందు నీ ప్రేమను ఒప్పుకునేలా చేస్తాను. మీ ఇద్దరి పెళ్లి దగ్గరుండి చేస్తాను' అంటూ తనలో తానే అనుకుంటుంది.

  బీచ్‌లో లవర్‌తో పాయల్ రాజ్‌పుత్ రచ్చ: బికినీలో అందాలన్నీ చూపిస్తూ.. షాకిస్తోన్న సెల్ఫీ వీడియో

  తులసిని ఆ ప్రామిస్ చేయమన్న జీకే

  తులసిని ఆ ప్రామిస్ చేయమన్న జీకే

  గౌరీ పూజ జరుగుతోన్న సమయంలో జీకే వచ్చి తులసికి దండం పెడతాడు. దీంతో ఆమె కంగారు పడిపోతుంది. అప్పుడాయన ‘చూడమ్మా తులసి.. నువ్వు నా కంటే వయసులో చిన్న దానివే కావొచ్చు. కానీ, నా కూతురి విషయంలో నువ్వు చేస్తున్న దానికి చాలా సంతోషంగా ఉంది. అమ్మలేని నా కూతురిని నువ్వు అన్నీ తానై చూసుకుంటున్నావు. అందుకే గౌరీ పూజ దగ్గర నుంచి పెళ్లి అయ్యేంత వరకూ అక్షర పక్కనే ఉంటానని మాటివ్వు' అని అడుగుతాడు. అప్పుడు మధ్యలో మాట్లాడిన లాస్యకు షాకిస్తాడు. అయితే, తులసి మాత్రం మాటివ్వకుండానే దాటవేస్తుంది.

  శృతి దగ్గరకు వచ్చిన ప్రేమ్.. నవ్వమని

  శృతి దగ్గరకు వచ్చిన ప్రేమ్.. నవ్వమని

  తన తండ్రి ఫొటోను చూస్తూ ఏడుస్తూ ఉంటుంది శృతి. ఆ సమయంలో ప్రేమ్ ఆమె దగ్గరకు వస్తాడు. ‘ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు కోరుకుంది ఇదే కదా. మరో అమ్మాయితో పెళ్లి జరగాలనే కదా నువ్వు కోరుకున్నది. నిజమైన ప్రేమ.. ప్రేమించిన మనిషి సంతోషాన్ని కోరుకుంటుంది. నీ మీద ప్రేమ నా మనసు చంపుకుని పెళ్లి చేసుకునేలా చేసింది. ఇప్పుడు చెప్పు నేను బాగున్నానా? అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది కదా.. ఇప్పటికైనా నవ్వు. మరి నాకోసం నువ్వు నవ్వు. నువ్వు నా ప్రేమను త్యాగం చేయమంటే నేను నీ నవ్వు కోరుతున్నా' అని మాట్లాడతాడు.

  Bigg Boss: ఐదో వారం ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్.. తక్కువ ఓట్లు ఆమెకు.. బయటకు వెళ్లేది మాత్రం అతడే!

  ప్రేమ్ ఆవేదన.. జీకేకు తులసి ప్రామిస్

  ప్రేమ్ ఆవేదన.. జీకేకు తులసి ప్రామిస్

  శృతితో మాట్లాడుతూ.. ‘నీ మాటలను కంట్రోల్ చేసుకుంటున్నావు కానీ, నీ కళ్లలోని బాధను మాత్రం బయటపెట్టలేకపోతున్నాయి. నవ్వుతూ మాట్లాడుతున్నా.. నన్ను అందరూ అనుమానిస్తున్నారు. ప్రేమ ఉన్న వాళ్లను బాధ పెడితే కన్నీళ్లే వస్తాయి శృతి' అని అంటాడు ప్రేమ్. మరోవైపు, దేవుడి మీదే భారం వేసిన తులసి.. జీకే అడిగిన దాని ప్రకారం ఆయనకు ప్రామిస్ చేస్తుంది. అప్పుడు ‘మీ అమ్మాయికి అంతా మంచే జరుగుతుంది అన్నయ్య గారూ' అని అంటుంది. అలాగే, నందూను నిలదీసి అడుగుతానని ఆమె మనసులో మాట్లాడుకుంటుంది.

  అక్షర కూర్చున్న స్థానం శృతిది అంటూ

  అక్షర కూర్చున్న స్థానం శృతిది అంటూ

  నందూను నిలదీస్తానని అనుకుంటున్న తులసి.. వెంటనే నందూను మాట్లాడాలని తీసుకెళ్తుంది. అప్పుడు ‘నాకెందుకు ఇంత బాధ్యతను ఇచ్చారు.. నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నారు. అక్షర కూర్చున్న స్థానం శృతిది కాదా. ఇప్పుడు ప్రేమ్ ఈ పెళ్లి చేసుకుంటే తర్వాత అక్షరకు అసలు నిజం తెలిసిపోతే అప్పుడామె పడే బాధకు ఎవరు బాధ్యత వహిస్తారు. దయచేసి ఇదంతా ఆపేయండి. ఇప్పటికైనా మనసులు తెలుసుకుని మెలగండీ' అంటూ నందూను రిక్వెస్ట్ చేస్తుంది. దీనికి అతడు శృతి ప్రేమ్‌ను ప్రేమించడం లేదంటూ ఆమెపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతాడు.

  స్విమ్‌సూట్‌లో కనిపించి షాకిచ్చిన ఈషా రెబ్బా: తడిచిన బట్టల్లో అందాలన్నీ చూపించిన తెలుగమ్మాయి

  నందూకు తులసి ఝలక్.. ఆయుష్షు లేదు

  నందూకు తులసి ఝలక్.. ఆయుష్షు లేదు

  నందూ మాట్లాడుతుండగా ‘నాకంతా తెలుసండీ.. ప్రేమ్‌ను ప్రేమించడం లేదని శృతి ఎందుకు చెప్పిందో నాకు తెలుసు' అని ఝలక్ ఇస్తుంది. అప్పుడతను ‘నేను ఏం చేసినా ఈ ఇంటి బాగుకోసమే చేశాను. అయినా ఎప్పుడు ఏం చేయాలి? ఎలా చేయాలి అంతా నాకు తెలుసు. నువ్వు కూడా నోరు మూసుకుని దగ్గరుండి పెళ్లి చెయ్' అంటాడు. మరోవైపు, శృతిని తన మాటలతో ఇబ్బంది పెడుతుంటాడు ప్రేమ్. అప్పుడామె ‘అక్షర ఎంతో మంది అమ్మాయి. ఆమెను పెళ్లి చేసుకో. ఈ మనసు లేని దాన్ని ఇప్పటికైనా వదిలేయ్' అంటూ ఏడుస్తుంది. దీంతో ఈ ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 446: GK Asked Promise to Tulasi. That Time She Feeling Nervous. After That Tulasi Demand to Nandhu.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X