For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: చనిపోతానంటూ తులసి ఎమోషనల్.. వాళ్లందరి మాటలు విని షాక్

  |

  సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. సామ్రాట్ భార్య గురించి ప్రస్తావన రావడంతో అతడు ఎంతగానో కృంగిపోతాడు. దీంతో సామ్రాట్ బాబాయి హనీ అసలు సొంత కూతురు కాదన్న నిజాన్ని బయటపెడతాడు. అంతేకాదు, సామ్రాట్ చెల్లి ప్రేమ వివాహం చేసుకుందని, అతడు డబ్బుల కోసం ఆమెకు వేధించేవాడని, దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుందన్న విషయాన్ని ఆయన అందరికీ చెప్తాడు. అప్పుడు సామ్రాట్ ఈ విషయాన్ని హనీకి చెప్పొద్దని వాళ్ల నుంచి ప్రామిస్ తీసుకుంటాడు. చివర్లో సామ్రాట్, తులసి గురించి ఓ న్యూస్ వస్తుంది. దీంతో అభి గొడవ చేస్తాడు.

  పైన ఏమీ లేకుండానే పూజా హెగ్డే: ఫ్రంట్, బ్యాక్ కనిపించేలా హాట్ షో

  తులసి ముందర అభి ఎమోషనల్

  తులసి ముందర అభి ఎమోషనల్


  తులసిని తరచూ అనుమానిస్తూ గొడవలు పెట్టుకుంటోన్న అభి.. తన మనసును విప్పి మాట్లాడతాడు. ఆ సమయంలో ఏడుస్తూ 'నిన్ను ఎవరైనా ఏదైనా అంటే నేను చూస్తూ ఉండలేను మామ్. నువ్వు ఎక్కడ అమయాకత్వంలో ఇరుక్కుంటావో, ఇబ్బందులు పడతావో అని ఆలోచిస్తుంటాను. అందుకే ఇలా చేస్తున్నాను. ఐలవ్యూ మామ్' అంటూ తులసి కాళ్ల మీద పడతాడు. దీంతో తులసి తట్టుకోలేదు. ఆమె కూడా ఏడుస్తుంది. అంతేకాదు, ఏం చేయాలో కూడా అర్థం కాదు. అలా ఇద్దరూ ఏడుస్తుంటారు. అప్పుడు అభి అబద్ధం చెప్పడం లేదు మామ్ ఒట్టు అంటాడు.

  లైఫ్ విలువ నాకు తెలుసంటూనే

  లైఫ్ విలువ నాకు తెలుసంటూనే

  అభిని అలా చూసిన తులసి అతడిని ఓదార్చుతుంది. అంతేకాదు, దగ్గరకు తీసుకుని మాట్లాడుతుంది. ఆ తర్వాత ప్రేమ్ కూడా అతడి దగ్గరకు వచ్చి ఒరేయ్ ఏడవకురా అంటూ సముదాయిస్తాడు. అప్పుడు తులసి 'నీ ఆరాటం అర్థం అయింది. నీ బాధ తెలిసింది. నువ్వు నా గురించి ఎంతలా ఆలోచిస్తున్నావో.. నా గురించి నేను అంతకంటే ఎక్కువ ఆలోచిస్తుంటాను. ఈ ఇంటి పరువు పోకూడదని నేను అంతకంటే ఎక్కువ కంగారు పడుతుంటాను. జీవితాన్ని అంత ఈజీగా తీసుకోను కానీ.. జీవితం విలువ నాకు తెలుసు' అంటూ అభికి సమాధానం చెబుతుంది.

  టూ పీస్ బికినీలో చరణ్ హీరోయిన్: ముఖం తప్ప ఆ పార్టులన్నీ కనిపించేలా!

  అదే నా జీవితంలో ఆఖరు రోజు

  అదే నా జీవితంలో ఆఖరు రోజు


  ఆ తర్వాత తులసి మరింత క్లారిటీగా మాట్లాడుతుంది. 'నా విషయంలో ఏదైనా తప్పు జరుగుతుంది అనిపిస్తే.. తప్పు చేస్తున్నాను అనిపిస్తే అడిగే హక్కు, నిలదీసే హక్కు మీకు ఎప్పుడూ ఉంటుంది. నువ్వే కాదు.. ఈ ఇంట్లో ఉన్న ఎవరైనా న తప్పులను ఎత్తి చూపించే అధికారం ఉన్నవాళ్లే. నన్ను ప్రశ్నించేవాళ్లే. మీకు, ఈ కుటుంబానికి తలవంపులు తెచ్చే పని నేను ఏనాడూ చేయను. ఒకవేళ అలా చేయాల్సిన రోజే వస్తే అదే నా జీవితంలో ఆఖరి రోజు అవుతుంది. ఆ తర్వాత మీ అమ్మ మీకు ఎప్పటికీ కనబడదు' అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

  తులసి గురించి సామ్రాట్ బాధ

  తులసి గురించి సామ్రాట్ బాధ

  ఇక, ఇంట్లో తన బాబాయితో మీడియా వాళ్లు చేస్తున్న అతి గురించి సామ్రాట్ మాట్లాడతాడు. అప్పుడు మా గురించి ఇంత హంగామా ఎందుకు చేస్తున్నారంటావ్ బాబాయ్ అని సామ్రాట్ అడుగుతాడు. అప్పుడాయన 'దాన్ని కంట్రోల్ చేయడం మన చేతుల్లో ఉండదు. నువ్వు సెలబ్రిటీవి. సెలబ్రిటీల జీవితాల్లోకి తొంగి చూడాలని అందరూ అనుకుంటారు' అని అంటాడు. అప్పుడు సామ్రాట్ 'నా గురించి కాదు బాబాయి తులసి గురించి' అంటాడు. దీనికాయన 'తులసి ఉన్న పరిస్థితి వేరు. జీవితంలో ఎదురు దెబ్బలతో చాలా దూరం ప్రయాణం చేసింది. ఇంట్లో వాళ్లకు తులసి మీద చాలా గౌరవం ఉంది. అందుకే తనను అడ్డుకోరు' అని చెబుతాడు.

  Indira Devi: మహేశ్ తల్లి గురించి సంచలన నిజాలు.. కృష్ణ రెండో పెళ్లి తర్వాత ఆమె ఏం చేశారో తెలిస్తే!

  అభి ఆవేదన.. అంకిత ఓదార్పు

  అభి ఆవేదన.. అంకిత ఓదార్పు

  ఇంట్లో అంత సంఘటన జరిగిన తర్వాత అభి బయటకు వెళ్లి ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. అప్పటి వరకూ చేసిన వాటిని అన్నింటినీ గుర్తు చేసుకుని బాధ పడుతుంటాడు. అప్పుడు అంకిత అతడి కోసం భోజనం తీసుకుని వస్తుంది. అంతేకాదు, 'కడుపు మాడ్చుకోకు.. అన్నం తిను. అప్పుడైనా ఇప్పుడైనా నీ మాటలను ఎవ్వరూ తప్పు పట్టడం లేదు. కానీ, మాట్లాడే పద్ధతిని తప్పుపడుతున్నారు' అంటుంది. దీంతో అభి 'నేను కొన్ని సార్లు హార్ష్‌గా మాట్లాడి ఉండొచ్చు. కానీ, ఆ పరిస్థితిని క్రియేట్ చేసిందే మీరే' అని ఆమెకు చెప్పి ఆ తర్వాత అన్నం తింటాడు.

  తులసిపై నిందలు.. అత్త కోపం

  తులసిపై నిందలు.. అత్త కోపం

  ఇక, అనసూయ కూరగాయల కోసం బయటికి వెళ్తుంది. అక్కడ కొందరు పక్కింటి వాళ్లు 'మీ మాజీ కోడలు వల్ల మీ ఫ్యామిలీకి బాగా పబ్లిసిటీ దొరుకుతోంది కదా. అక్కడి మహిళలు. మొగుడిని వదిలేసిన నీ మాజీ కోడలు పద్ధతిగా ఉంటుందని అనుకున్నాం. కానీ, ఏంటి ఆ బాగోతం. అచ్చోసిన ఆంబోతులా ఊరిమీద వదిలేశారా. మీ ఉత్తుత్తి కొడుకు సామ్రాట్ ఉన్నాడుగా. ఎవరికి నచ్చినా.. నచ్చకపోయినా ఆ సామ్రాట్‌ను వదలను అని ఎలా చెప్పింది' అంటూ నిందలు వేస్తారు. దీంతో అనసూయకు పట్టలేనంత కోపం వస్తుంది. ఇంటికొచ్చి ఈ విషయం తులసికి చెప్పాలని అనుకుంటుంది. కానీ, పరందామయ్య సహా ఇంట్లో వాళ్లంతా ఆపుతారు. దీంతో ఆమె కోపాన్ని దిగమింగుకుని ఉంటుంది. తర్వాత తులసి ఆఫీస్‌కు వెళ్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 750: Abhi Gets Emotional While Expressing his Opinion. Then She Feels Sad. After That Anasuya Gets Furious About Neighbours Comments.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X