For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: నందూకు ఝలక్ ఇచ్చిన సామ్రాట్.. అందరి ముందే చెంప పగలగొట్టిన తులసి

  |

  చాలా కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  గురువారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

  గురువారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

  గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. అంత గొడవ జరిగిన తర్వాత తులసి బాధ పడుతూ ఉంటుంది. అప్పుడు పరందామయ్య కూడా బయట కూర్చుని ఏడుస్తుంటారు. దీంతో ప్రేమ్ వెళ్లి ఆయనను ఓదార్చుతాడు. అప్పుడు తులసి కోసం ఓ పని చేస్తానని పరందామయ్య అంటాడు. ఉదయాన్నే తులసి టాబ్లెట్స్ ఇవ్వగా.. అనసూయ వేసుకోనంటుంది. అనంతరం తులసి ఆఫీస్‌కు వెళ్తానని చెప్తే ఆమెకు కోపం వస్తుంది. తర్వాత పరందామయ్య.. సామ్రాట్ ఇంటికి వెళ్తాడు. అప్పుడు ఓ ప్రాపర్టీ గురించి సామ్రాట్‌కు చెప్పి దానికి సంబంధించిన డాక్యూమెంట్లు అందిస్తాడు.

  జబర్ధస్త్ రీతూ చౌదరి ఎద అందాల ఆరబోత: హాట్ షోలో గీత దాటేసిందిగా!

  నందూకు కౌంటరిచ్చిన తులసి

  నందూకు కౌంటరిచ్చిన తులసి

  మ్యూజిక్ స్కూల్ ఫైలును లాస్య తీసుకుని తులసిని ఇష్టం వచ్చినట్లు అంటుంది. అంతేకాదు, నందూ జనరల్ మేనేజర్ అని, అతడికి గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. అప్పుడు నందూ 'మ్యూజిక్ స్కూల్ ఫైల్‌ను మేమే తీసుకున్నాం. మేమే దాని మీద అన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ప్రాజెక్ట్ పూర్తి అవడానికి లేట్ అవుతుంది. దీనివల్ల కంపెనీకి కాస్త నష్టం వచ్చే అవకాశం ఉంది' అంటాడు. దీంతో తులసి 'మ్యూజిక్ స్కూల్ అనేది నా మానస పుత్రిక. దానికి సంబంధించిన ప్లాన్స్ నాకున్నాయి. దానికి ఎవరి సలహాలు, సూచనలు అవసరం లేదు' అని కౌంటర్ ఇస్తుంది.

  తులసికి సామ్రాట్ సపోర్టు చేస్తూ

  తులసికి సామ్రాట్ సపోర్టు చేస్తూ

  వాళ్ల మధ్య చర్చ జరుగున్నప్పుడే సామ్రాట్ అక్కడకు వస్తాడు. అప్పుడాయన 'ప్రాజెక్టులో నేను ఇన్వాల్వ్ కానని అన్నాను. కానీ, తులసి గారిని ఇన్వాల్వ్ చేయొద్దని అనలేదు. ఈ ప్రాజెక్ట్ అనేది తులసి గారి కల. ఈ ప్రాజెక్ట్ విషయంలో తను నా బిజినెస్ పార్టనర్. అంటే నీకు బాస్. నువ్వు నీ బాస్‌కు గౌరవం ఇచ్చి తీరాల్సిందే. మనం గౌరవించినప్పుడే మనకు ఆ గౌరవం తిరిగి వస్తుంది' అంటూ తులసిని సపోర్ట్ చేస్తూ మాట్లాడి వెళ్లిపోతాడు. దీంతో నందూ, లాస్యకు కోపం వస్తుంది. అప్పుడు తులసి 'మ్యూజిక్ స్కూల్ ఫైల్స్ తిరిగి ఇవ్వమని లాస్యకు చెప్పండి జనరల్ మేనేజర్ గారు' అని ఆమె కూడా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

  బాత్‌టబ్‌లో నగ్నంగా హీరోయిన్: స్నానం చేస్తోన్న వీడియో వైరల్

  ఎన్నాళ్లు నటిస్తావు అని అడిగి

  ఎన్నాళ్లు నటిస్తావు అని అడిగి


  ఇంట్లో ప్రేమ్ గిటార్ వాయిస్తూ ఉండగా ఇంతలో శృతి వస్తుంది. ఆ సమయంలో ప్రేమ్ ఎంత చెప్పినా శృతి వినదు. అంతేకాదు, నాకు అవసరం లేని విషయాలను నేను మాట్లాడను అని అంటుంది. అప్పుడు ప్రేమ్.. శృతి అని మాట్లాడబోయినా పట్టించుకోదు. చేయి పట్టుకోబోతే లాక్కుంటుంది. దీంతో నా మీద అంత అసహ్యం పెంచుకున్నావా అంటాడు. అప్పుడు శృతి నేను పెంచుకోలేదు. నువ్వే పెంచుకునేలా చేశావు అంటుంది. దీంతో ప్రేమ్ 'ఇంకా ఎన్నాళ్లు ఇలా అమ్మ ముందు మంచిగా ఉన్నట్టు నటిస్తాం. జరిగిన దాని గురించి మరిచిపోదాం. నేను చేసిన తప్పును నువ్వు క్షమించు.. నువ్వు చేసిన తప్పులను నేను క్షమిస్తా' అంటాడు.

  శృతితో గొడవ పెట్టుకున్న ప్రేమ్

  శృతితో గొడవ పెట్టుకున్న ప్రేమ్

  ఆ తర్వాత ప్రేమ్ అన్న మాటలకు శృతి తప్పు చేసింది నువ్వు.. నేను కాదు అంటుంది. దీంతో ప్రేమ్ మనిషి అన్నాక పొరపాట్లు జరుగుతాయి అంటాడు. అప్పుడామె 'నాకర్మకు నన్ను వదిలేసి నా చావు నన్ను చావమని హాయిగా మీ అమ్మ దగ్గరికి వచ్చి సెటిల్ అయ్యావు' అంటుంది. దీనికతడు కోపంతో 'నువ్వు కూడా భార్యగా ఒక డిజాస్టర్. నాకు భార్యగా ఉండే అర్హత లేదు. నీ మొహం కనిపించకపోతే ప్రశాంతంగా బతుకుతాను. మళ్లీ చెబుతున్నాను. మళ్లీ మళ్లీ చెబుతున్నాను' అంటూ కిందకు వెళ్లిపోతాడు. దీంతో శృతి అక్కడే ఉండిపోయి వెక్కి వెక్కి ఏడుస్తుంది.

  షర్ట్ విప్పేసిన యాంకర్ మంజూష: హాట్ షోలో అస్సలు తగ్గట్లేదుగా!

  బాహుబలిలా ఫీల్ అవుతుంది

  బాహుబలిలా ఫీల్ అవుతుంది

  సామ్రాట్ ఝలక్ ఇవ్వడంతో నందూ ఫుల్లుగా తాగి వస్తాడు. అప్పుడతను 'నేను ఆత్మాభిమానం ఉన్న మనిషిని. నన్ను ఒంటరిగా వదిలేయ్. తులసి ముందే నన్ను ఇన్సల్ట్ చేస్తాడా? ఇక నాకు రెస్పెక్ట్ ఏం ఇస్తుంది. ఇప్పటికే ఆ తులసి బాహుబలిలా ఫీల్ అవుతోంది. వాళ్ల చావు వాళ్లను చావనీయ్. నన్నెందుకు అవమానించడం. నేను ఇక సామ్రాట్ గాడి కంపెనీలో అడుగు పెట్టను. వాడు నాకు బద్ధశత్రువు. నువ్వు కూడా ఏదో ఒక రోజు వాడి కంపెనీ నుంచి బయటికి వస్తావు' అని అంటాడు. అప్పుడు లాస్య కూడా నందూను మరింతగా రెచ్చగొట్టేలా మాట్లాడి కోపం పెంచుతుంది.

  ఇంట్లో నుంచి వెళ్లాలని శృతి

  ఇంట్లో నుంచి వెళ్లాలని శృతి

  ప్రేమ్‌తో గొడవ జరిగిన తర్వాత శృతి ఎంతగానో ఏడుస్తుంది. ఆ తర్వాత అందరూ నిద్రపోతోన్న సమయంలో బ్యాగు తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని అనుకుంటుంది. కానీ, ఆమెను తులసి చూసేస్తుంది. అంతేకాదు, వెంటనే శృతిని పిలిచి లోపలికి రా అని అంటుంది. దీంతో దీంతో శృతి వెనక్కి తిరుగుతుంది. అప్పుడు తులసి ఎక్కడికి బయలుదేరావు అని అడుగుతుంది. దీనికామె మా అత్తయ్య వాళ్ల ఇంటికి అంటుంది. అప్పుడు తులసి 'ఇంత రాత్రి పూట బయలుదేరడం ఏంటి. కనీసం చెప్పి అయినా వెళ్లాలి కదా' అంటుంది. దీంతో శృతి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని అంటుంది.

  బ్రాతో యాంకర్ శ్రీముఖి తెగింపు: ఇది హాట్ షో కాదు.. అంతకు మించి!

  ప్రేమ్ చెంపపై కొట్టిన తులసి

  ప్రేమ్ చెంపపై కొట్టిన తులసి


  ఆ తర్వాత అసలు ఏమైందని శృతిని తులసి ప్రశ్నిస్తుంది. దీంతో ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ జరిగింది మొత్తం చెప్పేస్తుంది. అప్పుడు తులసి ప్రేమ్‌ను పిలుస్తుంది. దీంతో అతడు వచ్చిన వెంటనే చెంపపై కొడుతుంది. అంతేకాదు, 'శృతిని ఇంట్లో నుంచి వెళ్లిపోమంటావా? తనను ఏడిపిస్తావా' అంటూ భార్యభర్తల బంధం గురించి చెబుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 763: Samrat Supported Tulasi in Office. Then Nandhu Feels Insulted. After That Tulasi Slaps Prem for Hurting Tulasi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X