Don't Miss!
- News
2023 ఎన్నికల ఫలితాలపై ఉండవల్లి అంచనాలు..!?
- Finance
Adani Cement: మూతపడ్డ అదానీ సిమెంట్ ఫ్యాక్టరీలు..! అయోమయంలో 20 వేల కుటుంబాలు..
- Technology
ప్రపంచ వ్యాప్తంగా సేల్ అయ్యే ఐఫోన్లలో 25%, ఇండియా లోనే తయారీ!
- Lifestyle
చలికాలంలో అల్లం తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలి, ఎందుకో తెలుసా?
- Sports
Team India : టీమిండియా ముందున్న అతి పెద్ద సమస్య.. వరల్డ్ కప్ గెవాలంటే సమస్య తీరాల్సిందే!
- Automobiles
భారత్‌లో Aura ఫేస్‌లిఫ్ట్ విడుదల చేసిన హ్యుందాయ్: ధర & వివరాలు
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
Intinti Gruhalakshmi Today Episode: తులసికి ఘోర అవమానం.. శాశ్వతంగా వెళ్లిపోవాలని సంచలన నిర్ణయం
దేశ
వ్యాప్తంగా
చాలా
భాషలు
ఉన్నా
తెలుగు
బుల్లితెరపై
ప్రసారం
అవుతోన్న
సీరియళ్లకు
మాత్రమే
ప్రేక్షకుల
నుంచి
భారీ
స్థాయిలో
స్పందన
దక్కుతోన్న
విషయం
తెలిసిందే.
మన
టెలివిజన్‌పై
ఇప్పటికే
ఎన్నో
ధారావాహికలు
విజయవంతంగా
ప్రసారం
అవుతూనే
ఉన్నాయి.
అలాంటి
వాటిలో
స్టార్
మాలో
ప్రసారం
అవుతోన్న
'ఇంటింటి
గృహలక్ష్మి'
గురించి
ప్రత్యేకంగా
చెప్పుకోవాలి.
దాదాపు
రెండేళ్లుగా
ప్రసారం
అవుతోన్న
ఈ
సీరియల్
రోజు
రోజుకూ
ఎంతో
ఆసక్తికరంగా
నడుస్తోంది.
దీంతో
ప్రేక్షకుల
నుంచి
దీనికి
ఆదరణ
మరింతగా
పెరిగిపోతోంది.
ఈ
నేపథ్యంలో
'ఇంటింటి
గృహలక్ష్మి'
గురువారం
ప్రసారం
కానున్న
ఎపిసోడ్‌లో
ఏం
జరుగుతుందో
మీరే
లుక్కేయండి
మరి!
Photos
Courtesy:
Star
మా
and
Disney+Hotstar

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఆస్పత్రిలో గొడవ తర్వాత ఇంటికి వచ్చిన నందూను లాస్య రెచ్చగొడుతుంది. దీంతో ఇంట్లోని వాళ్లందరూ వచ్చిన తర్వాత నందూ వాళ్లపై సీరియస్ అవుతాడు. దీంతో అందరూ అతడిపై తిరగబడతారు. ఆ సమయంలో నందూ ఇంటికి తాకట్టు పెట్టి బిజినెస్‌కు పెట్టుబడి పెట్టబోతున్నట్లు చెబుతాడు. ఆ వెంటనే ఈ విషయాన్ని శృతి.. తులసికి ఫోన్ చేసి చెబుతుంది. ఇక, ప్రేమ్ జీతం డబ్బులను లాస్య లాక్కుంటుంది. దీంతో శృతిని ఆస్పత్రిలో చూపించడం కోసం తులసి ప్రేమతో గిఫ్టుగా ఇచ్చిన గిటార్‌ను అతడు తాకట్టు పెట్టేస్తాడు.
Veera Simha Reddy: వీర సింహా రెడ్డిలో ఆ సీన్‌పై ట్రోల్స్.. ఇంత దారుణమా.. పల్నాటి బ్రహ్మనాయుడు అంటూ!

అత్తమామలకు లాస్య ఝలక్
పరందామయ్య, అనసూయకు ఆకలి వేస్తుండడంతో లాస్య వాళ్ల కోసం భోజం తీసుకొస్తానని వెళ్తుంది. అప్పుడు అనసూయ.. లాస్యకు ఎప్పుడూ లేనిది ఈరోజు ఎందుకంత ప్రేమను ఒలకబోస్తుంది అంటుంది. దీంతో పరందామయ్య మారితే మంచిదే కదా అంటాడు. అంతేకాదు, 'నువ్వేమో స్పెషల్స్ చేస్తుంది అంటున్నావు. మరి ఘుమఘుమలు మాత్రం రావడం లేదు కదా' అంటాడు. దీనికి అనసూయ 'మీ వయసు పైబడింది కదా. వాసనలు తెలియవు. అది వస్తుంది నవ్వినట్టు నటించండి' అంటుంది. అప్పుడు లాస్య వాళ్ల కోసం పచ్చి కూరగాయలు తెస్తుంది.

వాడిపోతున్న మొక్కలా అని
పచ్చి కూరగాయలను కోసుకొచ్చిన లాస్య వాటిని తినాల్సిందే అంటుంది. అంతేకాదు, 'వాడిపోయిన మొక్క మళ్లీ చిగురించాలంటే ఎలా చేస్తామో.. వయసు పైబడిన మీరు కూడా ఇవి తిని మళ్లీ యంగ్‌గా తయారవ్వాలి' అంటుంది. కానీ, పరందామయ్య మాత్రం 'నాకు భోజనం ఇవ్వు. ఆ తర్వాత కావాలంటే వీటిని తింటాను' అంటాడు. అనసూయ కూడా 'మాకు ఈ వయసులో డైటింగులు అవసరం లేదు. బతికినంత కాలం చక్కగా తింటూ ఉంటాం' అంటుంది. అయినా లాస్య మాత్రం వినదు. పైగా మీరు తులసికి కంప్లైంట్ చేసినా నేను మాత్రం వినను అంటుంది.
షర్ట్ విప్పేసి రెచ్చిపోయిన నిధి అగర్వాల్: ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిందా ఏంటీ!

డల్‌గా ఉంటే నాకు నచ్చదు
ఇక, తులసి కోసం సామ్రాట్ వేచి చూస్తుంటాడు. అప్పుడే ఆమె అక్కడకు వస్తుంది. ఆ సమయంలో సామ్రాట్ పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్లిపోతుంది. దీంతో ఏమండోయ్ తులసి గారు అని అరుస్తాడు. దీంతో వెనక్కి తిరిగి చూస్తుంది. అప్పుడను 'మనిషి ఇక్కడ మనసెక్కడో.. ఏంటి సంగతి. పిలిచినా వినిపించుకోకుండా వెళ్లిపోతున్నారు' అని అడుగుతాడు. దీంతో తులసి సారీ అండి. బాగానే ఉన్నాను అంటుంది. దీనికి సామ్రాట్ 'మనసు ఆనందంగా ఉంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. నా ఫ్రెండ్ ఇలా డల్‌గా ఉండటం నాకు ఇష్టం ఉండదు' అంటాడు.

తులసిని పార్టీకి తీసుకెళ్లాడు
తులసిని ఉత్సాహపరచడం కోసం బర్త్‌డే పార్టీకి తీసుకెళ్తా అంటాడు. కానీ, తులసి మాత్రం వద్దు అని అంటుంది. అయినా సామ్రాట్ వినకుండానే ఆమెను పార్టీకి తీసుకెళ్తాడు. కారులో వెళ్తోన్న సమయంలోనే తులసి పార్టీ ఎవరిది అని అడుగుతుంది. దీంతో సామ్రాట్ 'మా ఫ్రెండ్ వాళ్ల బాబుది. నిజానికి నాకు కూడా వర్క్ ఉంది. కానీ, మీతో పాటు సరదాగా బయటికి వద్దామని ఈ పార్టీకి తీసుకొచ్చా' అంటాడు. తర్వాత తులసిని తన ఫ్రెండ్‌కు పరిచయం చేస్తాడు. అప్పుడాయన 'ఈవిడ తులసి గారు.. ఈమె గురించి నాకు బాగా తెలుసు. డైనమిక్ పర్సనాలిటీ కదా' అంటాడు.
ఉల్లిపొర లాంటి డ్రెస్ మంచు లక్ష్మి షో: ఓ రేంజ్లో ఎద అందాలు ఆరబోత

పార్టీలో వాళ్లిద్దరికి అవమానం
లాస్య అన్నం పెట్టకపోవడంతో పరందామయ్య, అనసూయ ఇద్దరూ బయటికి వెళ్తారు. ఇంతలో పక్కనే బర్త్ డే పార్టీ జరుగుతుంటే ఘుమఘుమ వాసన వస్తుంటుంది. దీంతో పరందామయ్య ఆకలి అవుతోంది వెళ్లి తిందాం పదా అంటాడు. అప్పుడు అనసూయ ముక్కు ముఖం తెలియని వాళ్ల పార్టీకి వెళ్లి తినడం ఎందుకు అంటుంది. అయినా వినకుండా పరందామయ్య బలవంతంగా అనసూయను తీసుకొని లోపలికి వెళ్లి ఇద్దరూ కలిసి ప్లేట్స్ తీసుకొని ఫుడ్ పెట్టుకుంటారు. ఇంతలో సెక్యూరిటీ గార్డ్ వచ్చి వాళ్లను పట్టుకుంటాడు. అంతేకాదు, ఎవరు మీరు అని అడుగుతాడు. దీంతో పరందామయ్య గెస్టులం అంటాడు. అప్పుడతను మరి గెస్టులు అయితే డైరెక్ట్‌గా ఇక్కడికి రారు. అక్కడికి వెళ్లి అక్షింతలు వేసి వెళ్తారు అంటాడు.

తులసిని నిందిస్తూ ఘోరంగా
సెక్యూరిటీ గార్డు పట్టుకోవడంతో మేము తినలేదు కదా. ప్లేట్ అక్కడ పెట్టి వెళ్తాం అంటారు. కానీ, అతడు మాత్రం రచ్చ రచ్చ చేస్తాడు. దీంతో పార్టీ చేసే వ్యక్తి వస్తాడు. వాళ్లను చూసి పెద్దోళ్లు కదా.. ఏం కాదు తిని వెళ్లండి అంటాడు. అప్పుడే తులసి చూసి అక్కడికి వచ్చి ఏంటి ఇదంతా అంటుంది. దీంతో అతడు 'ఏంటి మేడమ్ వీళ్లు మీ పేరెంట్సా. సమాజంలో ఆడవాళ్లకు మీరు రోల్ మోడల్ అనుకున్నాను. కానీ, ఇప్పుడు ఆ మాటలను వెనక్కి తీసుకుంటున్నాను. మీ సొంత వాళ్లకు తిండి పెట్టకుండా ఇలా రోడ్డు మీద వదిలేస్తారా? వాళ్లు మిమ్మల్ని ఎంత కష్టపడి పెంచి ఉంటారు. రోడ్డు మీద ఇలాగేనా వదిలేయడం' అంటాడు. దీంతో పరందామయ్య అతడిని ఆపుతాడు. అంతేకాదు, తులసికి క్షమాపణ చెప్పి ఏడుస్తాడు.
బ్రాలో టెంపరేచర్ పెంచేసిన దివి: అందాల ఆరబోతకు హద్దే లేదుగా!

మళ్లీ ఆ ఇంటికి వెళ్లాని డిసైడ్
పరందామయ్య వాళ్ల పరిస్థితిని చూసి బాధ పడిన తులసి వాళ్ల కోసం ఏదైనా చేయాలని అనుకుంటుంది. ఆ వెంటనే సామ్రాట్ దగ్గరకు వెళ్లి అలిసిపోయాను అంటుంది. అంతేకాదు, 'ఒక్క విషయంలో నిర్ణయం తీసుకున్నాను. కానీ, అది తప్పో ఒప్పో తెలియడం లేదు. అందుకే మీ సలహా కోసం వచ్చాను' అంటుంది. దీనికతడు 'మీరు తీసుకున్న నిర్ణయానికి తిరుగు ఉండదు తులసి గారు. అయినా ఏం చెప్పండి' అంటాడు. అప్పుడామె 'నేను తిరిగి మా ఇంటికి వెళ్లిపోదామని అనుకుంటున్నాను' అని చెబుతుంది. దీనికి సామ్రాట్ 'మీరు ఎందుకోసం అయితే మీరు ఇల్లు వదిలి వచ్చారో ఆ లక్ష్యం నెరవేరిందా' అని ప్రశ్నిస్తాడు. దీంతో నా కోసం వాళ్ల సంతోషాన్ని బలిపెట్టలేను అంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.