Intinti Gruhalakshmi Today Episode: తులసి రీఎంట్రీతో ట్విస్ట్.. లాస్య మోసం బట్టబయలు కావడంతో!
ఇండియాలోని చాలా భాషలతో పోలిస్తే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. పరందామయ్య, అనసూయకు అన్నానికి బదులుగా పచ్చి కూరగాయలు కోసుకొచ్చి లాస్య తినమంటుంది. దీంతో వాళ్లు అవి తినలేమని చెబుతారు. మరోవైపు, తులసికి ప్రశాంతతను అందించడం కోసం సామ్రాట్ ఓ పార్టీకి తీసుకెళ్తాడు. అక్కడకు పరందామయ్య, అనసూయ వచ్చి దొంగతనంగా భోజనం చేయబోతారు. దీంతో సెక్యూరిటీ గార్డు చూసి గొడవ చేస్తాడు. తర్వాత తులసి ఫ్యామిలీ మెంబర్స్ అని తెలిసి ఆమెపైనా గొడవ చేస్తారు. ఇక, వాళ్ల పరిస్థితిని తెలుసుకున్న తులసి శాశ్వతంగా ఆ ఇంటికి వెళ్లిపోవాలని అనుకుంటుంది.

తులసిని సపోర్ట్ చేసిన సామ్రాట్
తన ఇంటికి తిరిగి వెళ్లాలనుకుంటున్నట్లు సామ్రాట్‌తో తులసి చెబుతుంది. దీంతో అతడు కొన్ని ప్రశ్నలు వేస్తాడు. అప్పుడు తులసి 'నేను దూరంగా ఉండి చేయగలిగింది ఏం లేదు. బాధపడటం తప్ప. నేను ఇక్కడ నా స్వార్థం కోసం ఉంటే.. అక్కడ నా వాళ్లు మరిన్ని కష్టాలు పడడం ఖాయం. అందుకే నేను వాళ్లు అండగా ఉండాలని అనుకుంటున్నా' అంటుంది. దీంతో సామ్రాట్ డైరెక్ట్‌గా యుద్ధం చేయాలనుకుంటున్నారు అంతే కదా అంటాడు. దీంతో తులసి మీరు నా నిర్ణయాన్ని సమర్థిస్తున్నారా అని అడుగుతుంది. దీంతో కచ్చితంగా సమర్ధిస్తాను అంటాడు.

లాస్య ఆగడాలకు చెక్ పెట్టాలని
తులసి అడిగిన దానికి సామ్రాట్.. 'మీరు మీ నిర్ణయం విషయంలో ఎంత కట్టుదిట్టంగా ఉన్నారో తెలుసుకోవడం కోసమే ఈ ప్రశ్న వేశాను. అంతేకానీ, మీరు తప్పుడు నిర్ణయం తీసుకున్నారని అనలేదు. అయినా మీరు ఆ ఇంట్లో లేకపోవడమే లాస్యకు అడ్వాంటేజ్. లాస్య ఆగడాలకు చెక్ చెప్పాలంటే మీరు ఆ ఇంట్లో ఉండాల్సిందే. కానీ, మీ మంచితనం మీ కాళ్లకు అడ్డుపడుతోంది. దాన్ని పక్కన పెడితేనే అనుకున్నది సాధించగలుగుతారు. పైగా నందగోపాల్ కూడా లాస్య వైపే ఉన్నాడు' అంటాడు. దీంతో తులసి 'దాని వల్ల నష్టం నందగోపాల్ గారికే కదా. అయినా ఆ ఇల్లు మాది. అక్కడ ఉండాల్సిన హక్కు మాది. దాన్ని ఎప్పటికీ వదులుకోను' అంటుంది. దీంతో సామ్రాట్ ఆల్ ది బెస్ట్ అంటాడు.

సేట్‌కు ఇల్లు మొత్తం చూపించి
ఇంటిని తాకట్టు పెట్టడం కోసం నందూ, లాస్య కలిసి ఒక సేట్‌ను అక్కడకు తీసుకు వస్తారు. ఆయనకు మొత్తం ఇల్లంతా చూపిస్తారు. దీంతో అతడు నాకు ఇల్లు నచ్చింది అంటాడు. అప్పుడు పరందామయ్య ఆయన ఎవరు అని ప్రశ్నిస్తాడు. దీంతో లాస్య 'ఆయన మన శ్రెయోభిలాషి. మనకు ఏదైనా అవసరం ఉంటే ఎప్పుడైనా అప్పు ఇస్తుంటారు' అని చెబుతుంది. దీంతో అనసూయ సరే కానీ.. ఆయన ఇప్పుడు ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. అప్పుడు లాస్య ఈ ఇంటిని తాకట్టు పెట్టడానికి అని చెబుతుంది. ఆ తర్వాత ఇంటి డాక్యుమెంట్స్‌ను తీసుకొచ్చి ఇస్తుంది.

తులసి ఎంట్రీ... షాకిచ్చే న్యూస్
డాక్యూమెంట్లు ఇస్తున్న సమయంలో సేట్ ఈ ఇల్లు మీ పేరు మీదనే ఉంది కదా అని లాస్యను అడుగుతాడు. దీంతో నందూ అవును అంటాడు. అప్పుడే అక్కడకు ఎంట్రీ ఇచ్చిన తులసి.. కాదు అని అరుస్తుంది. అంతేకాదు, 'ఈ ఇల్లు నా పేరు మీద ఉంది. ఆమె మాటలు నమ్మకండి' అని అంటుంది. దీంతో లాస్య 'తులసే నా పేరు మీద ఈ ఇంటిని రాసింది. కావాలంటే చూసుకోండి' అంటుంది. దీంతో తులసి 'ఇల్లు ఆమె పేరు మీద రాసిన మాట వాస్తవమే. కానీ, ఆ ఇల్లు ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు' అని బాంబ్ పేల్చుతుంది. దీంతో వాటిని చెక్ చేసిన సేట్.. 'అవును.. రిజిస్ట్రేషన్ కాలేదు. ఎందుకు ఈ ఇంటిని మాకు తాకట్టు పెట్టాలని చూశారు. ఇంత మోసమా? ఇంకోసారి మీ ముఖాన్ని నాకు చూపించకండి' అని తులసికి థ్యాంక్స్ చెప్పి వెళ్లిపోతాడు.

నందూపై ఫైర్ అయిన తులసి
సేట్ అలా వెళ్లిపోగానే నందూ.. 'ఇదంతా మీకు ముందే తెలుసుకదా.. ఇదంతా ముందే ప్లాన్ చేశారు కదా నాన్న' అని ప్రశ్నిస్తాడు. దీంతో తులసికి చిర్రెత్తుకొచ్చి 'మిస్టర్ నంద గోపాల్.. ఆరోజు ఇల్లు తన పేరు మీదికి రాయమన్నది అత్తయ్య. డాక్యుమెంట్‌లో అత్తయ్య పేరు ఉందనుకున్నా. కానీ, అందులో తన పేరు రాసుకొని మోసం చేసింది లాస్య. మీరు కూడా అప్పుడు లాస్య మీద చిందులు వేశారు కదా. ఆ విషయం ఇప్పుడు గుర్తుకు రావడం లేదా' అని ఫైర్ అవుతుంది. దీంతో పరందామయ్య 'వాడు పొద్దుతిరుగుడు పువ్వు అమ్మా' అంటూ కౌంటర్ వేస్తాడు.

నన్ను పీక నొక్కి చంపేస్తారని
తర్వాత తులసి 'నేను మీలా మాటలు మార్చే టైప్ కాదు. ఇంటిని ఇప్పటికైనా అత్తయ్య పేరు మీదికి రాసేందుకు రెడీగా ఉన్నాను' అంటుంది. దీంతో అనసూయ 'వద్దమ్మా.. నా పేరు మీదికి వద్దు. ఆ ఇల్లును చూసి ఎప్పుడైనా నా గొంతు పిసికినా పిసికేస్తారు' అంటుంది. అప్పుడు లాస్య 'అలా మాట్లాడకండి. ఎప్పటికైనా మిమ్మల్ని చూసుకోవాల్సింది మేమే' అంటుంది. దీంతో తులసి 'హలో అంత అవసరం లేదు. నేను వచ్చేశాను. శాశ్వతంగా ఇక్కడే ఉండేందుకు వచ్చాను' అంటుంది. దీనికి లాస్య 'ఏ మొహం పెట్టుకొని వచ్చావు. ఎప్పటికప్పుడు మనుషులను మార్చేది తులసి మామయ్యా అంటుంది. దీంతో తులసి ఆరోజు అత్తయ్య అవమానించారనే వెళ్లాను అంటుంది. దీనికి అనసూయ తప్పైందని అంటుంది.

వెళ్లిపోవాలని నందూ నిర్ణయం
అనంతరం నందూ 'ఒకప్పుడు నువ్వు కూడా ఈ ఇంటిని తాకట్టు పెట్టావు కదా' అంటాడు. దీంతో తులసి 'అప్పుడు నువ్వు మామయ్యను పట్టించుకోలేదు. మామయ్య గుండె ఆపరేషన్ కోసం ఆ పని చేయాల్సి వచ్చింది' అంటుంది. అప్పుడు లాస్య 'సిగ్గు లేకుండా అసలు ఈ ఇంట్లో ఎలా అడుగుపెడతావు. మేము రానివ్వం' అంటుంది. దీంతో తులసి 'రానివ్వకపోవడానికి మీరెవరు అసలు. ఈ ఇల్లు నాది. మీకు ఇష్టం లేకపోతే హ్యాపీగా ఈ ఇల్లు వదిలి వెళ్లిపోవచ్చు' అంటుంది. దీంతో నందూ పైకి వెళ్లి బట్టలు సర్ధుకుంటూ ఉంటాడు. అప్పుడు లాస్య వెళ్లి అతడికి సర్ధి చెప్పే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు, సామ్రాట్ దిగాలుగా ఉండడం చూసిన బాబాయి.. తులసి కోసమే ఇలా ఉన్నావా అని ప్రశ్నిస్తాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











