Intinti Gruhalakshmi Today Episode: తులసి ఇంట్లో హ్యాపీ.. అంతలో గాయత్రి ప్లాన్.. కెఫేలో దాడులు

దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా తెలుగు టెలివిజన్‌పై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

గురువారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

గురువారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నందూ కొనుక్కొని వచ్చిన నెక్లెస్‌ను లాస్య తన మెడలో అలంకరించుకుంటుంది. ఆ తర్వాత అందరూ గేమ్ ఆడగా.. తులసి మాత్రమే మిగులుతుంది. దీంతో ఆమెను కూడా ఆడమంటారు. అప్పుడామెకు పార్ట్‌నర్‌కు గులాబీ పువ్వు ఇవ్వాలని వస్తుంది. దీంతో ఇంట్లో వాళ్లు అందరికీ అందిస్తుంది. ఇక, అభి తనకు ఇచ్చిన డబ్బులను గాయత్రికి ఇచ్చేస్తాడు. అంతేకాదు, తన సొంత డబ్బుతోనే అంకితను యూఎస్ తీసుకెళ్తా అంటాడు. దీంతో ఆమెకు కోపం వచ్చి నందూ కెఫేను మూయించాలని కన్నింగ్ ప్లాన్లు రెడీ చేసుకుంటుంటుంది.

ప్లాన్ షురూ చేసిన గాయత్రి

ప్లాన్ షురూ చేసిన గాయత్రి

గాయత్రి చెప్పినట్లుగానే చందు అనే వ్యక్తి కెఫేలో జాయిన్ అవుతాడు. అతడికి తులసి ఎన్నో జాగ్రత్తలు చెబుతూ ఉంటుంది. అంతేకాదు, ప్రతి ఐటెం గురించి చెఫ్‌కు ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని అంటుంది. అంతలోనే గాయత్రి అతడికి ఫోన్ చేస్తూ ఉంటుంది. తులసి ముందు మాట్లాడడం కుదరక కట్ చేస్తుంటాడు. కానీ, గాయత్రి మాత్రం చేస్తూనే ఉంటుంది. దీంతో తులసి నీకు ఫోన్ వస్తున్నట్లుంది మాట్లాడు అంటూ వెళ్లిపోతుంది. అప్పుడు చందు కాల్ లిఫ్ట్ చేస్తాడు. దీంతో గాయత్రి 'ఏంటి నా ఫోన్ కట్ చేస్తున్నావు? మన డీల్ మర్చిపోయావా' అంటూ సీరియస్ అవుతుంది.

కెఫే మూయించాలని ప్లాన్

కెఫే మూయించాలని ప్లాన్

ఆ తర్వాత గాయత్రి 'నీకు డబుల్ శాలరీ ఇచ్చేది అక్కడ నీ ఇష్టం వచ్చినట్లు చేయడానికి కాదు. ఎలా అయినా నువ్వు ఆ కేఫ్ మూయించాలి. అక్కడ అసలేం జరుగుతుందో ఎప్పటికప్పుడు పరిస్థితులు నాకు ఫోన్ చేసి చెప్పాలి. అందుకు నీకు డబ్బులు బోనస్ ఇస్తాను' అని చెబుతుంది. దీంతో చందు 'సరే మేడం.. మొత్తం మీరు చెప్పినట్లే చేస్తాను' అని కాల్ కట్ చేస్తాడు. ఇంతలోనే తులసి అక్కడికి వచ్చి 'ఎవరండి ఫోన్‌లో? అంత టెన్షన్‌గా మాట్లాడుతున్నారు' అని అడుగుతుంది. దీంతో చందు ఆమెకు అబద్ధాలు చెప్తాడు. తర్వాత ఇద్దరూ వెళ్లిపోతారు.

నందూతో లాస్య వాగ్వాదం

నందూతో లాస్య వాగ్వాదం

ఇక, నందూ దగ్గరకు కోపంగా వచ్చిన లాస్య 'నువ్వేమైనా దీక్ష చేసుకొని కూర్చున్నావా? నేను చెప్పిన ప్రతి ఒక్కదానికి నో అని అంటున్నావు. అలా ఏమైనా ఉంటే చెప్పు నోటికి ప్లాస్టర్ వేసుకుని కూర్చుంటాను' అని అరుస్తుంది. దీంతో నందూ ఇది కేఫ్ గట్టిగా అడగకు అంటాడు. దీంతో లాస్య 'అక్కడికేదో ఇంట్లో నన్ను మాట్లాడించినట్టు.. అయినా నేను ఎంతగానో వెతికి ఒక మంచి చెఫ్‌ను రప్పిస్తే వద్దని చెబుతావా? నా ఆలోచనలకు విలువ ఇవ్వవా' అని అంటుంది. అలా ఇద్దరూ కాసేపు వాదించుకుంటూ ఉంటారు. లాస్య ప్రవర్తనతో నందూకు కోపం పెరుగుతుంటుంది.

అభి ఎమోషనల్ అవుతూ

అభి ఎమోషనల్ అవుతూ

ఇంట్లో ఒంటరిగా ఉన్న అభి బాధపడుతూ కూర్చుంటాడు. ఇంతలో అంకిత తన నగలను తీసుకొని వచ్చి అతడికి ఇస్తుంది. దీంతో ఇవి ఎందుకిచ్చావు అని ప్రశ్నిస్తాడు. అప్పుడామె 'నగలు కేవలం అలంకరణ కోసమే మాత్రమే కాదు.. అవసరాలకు కూడా పనికొస్తాయి. వీసా కోసం, అమెరికాకు వెళ్లడానికి డబ్బులు కావాలి కదా. అందుకే ఇచ్చాను' అని అంటుంది. అప్పుడు అభి ఎమోషనల్ అవుతూ 'ఇన్ని రోజులు నిన్ను అర్థం చేసుకోకుండా బాధపెట్టాను. నన్ను చెంప మీద లాగి ఒకటి కొట్టినా కూడా నేను బాధపడను అంకిత' అంటూ కన్నీరు పెట్టుకుంటాడు.

సొంత డబ్బుతో తీసుకెళ్తా

సొంత డబ్బుతో తీసుకెళ్తా


అనంతరం అభి 'ఈ నగలు నాకొద్దు అంకిత. ఇవి నీ నగలు నీ దగ్గర దాచుకో' అంటాడు. దీంతో అంకిత భార్యాభర్తల మధ్య నీ, నా అని ఉండదు అంటుంది. దీంతో అభి 'నువ్వు ఎన్నైనా చెప్పు అంకిత. ఈ నగలను తీసుకోవడం అంటే నా చేతకానితనాన్ని ఒప్పుకోవడమే అవుతుంది. నిన్ను అమెరికాకు తీసుకెళ్తానని మాట ఇచ్చాను. నా సొంత డబ్బులతో తీసుకెళ్తాను. దయచేసి నన్ను కష్టపడనివ్వు. నా జాగ్రత్తలో నేను ఉన్నాను. ఎడ్యుకేషన్ లోన్‌కు కూడా అప్లై చేశాను. ఒకవైపు చదువుకుంటూనే జాబ్ చేస్తూ డబ్బులు తిరిగి కట్టేద్దాము' అని ఆమెకు వివరిస్తాడు.

ఎమోషన్.. హగ్ చేసుకుని

ఎమోషన్.. హగ్ చేసుకుని

అభి మాటలు విన్న తర్వాత అంకిత 'చూసావా అభి.. నేను ఇన్ని రోజులు దేని కోసమైతే ఎదురు చూశానో.. అది ఇప్పుడు నాకు దగ్గర అయింది. నా అభి మారిపోయాడు. నేను అనుకున్నట్టుగా నా అభి నన్ను ప్రేమిస్తున్నాడు. ఇష్టపడుతున్నాడు. నా కోసం ఏం చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నాడు. నేను నీతో పాటు ఎక్కడికి అని అడగను ఎంత దూరమైనా వస్తాను' అంటూ ఎమోషనల్ అవుతుంది. అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరినొకరు హత్తుకుని సంతోషంగా ఉంటారు.

ఇంట్లో సందడి.. కెఫేలోకి

ఇంట్లో సందడి.. కెఫేలోకి


ఇంట్లో పూజ కోసం తులసి వాళ్లు ఏర్పాట్లు చేస్తుంటారు. ప్రేమ్, నందూ ఇద్దరు కలిసి పూలు అలంకరిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇంట్లో అందరూ పూజ హడావిడిలో ఉండగా ఇంతలో అభి అక్కడికి వచ్చి సెటైర్లు వేస్తాడు. అప్పుడు అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ప్రేమ్, తులసి నవ్వుతూ మాట్లాడుకుంటుంటారు. అప్పుడు తులసి 'అభి పూజకి ఉమ్మెత్త పూలు తీసుకుని రమ్మని చెప్పాను తెచ్చావా' అని అడుగుతుంది. దీంతో అంకిత 'మీ అబ్బాయికి పెళ్ళానికి పూలు తీసుకొని రావడమే తెలియదు.. ఇంకా దేవుడికి పూలు తీసుకొస్తాడా' అంటుంది. దీంతో అంతా నువ్వుకుంటారు. మరోవైపు, చందుకు గాయత్రి ఫోన్ చేసి కెఫేకు ఫుడ్ ఇన్‌స్పెక్టర్ వస్తున్నాడని చెప్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X