Intinti Gruhalakshmi: రాజ్యలక్ష్మికి షాకిచ్చిన అమ్మాయి.. లాస్యకు ఘోర అవమానం.. విక్రమ్‌కు దివ్య ఆఫర్

తెలుగు టెలివిజన్‌పై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. శిరీషను మోసం చేసింది విక్రమ్ అనుకుని అతడిపై కేసు పెట్టేందుకు దివ్య సిద్ధం అవుతుంది. అప్పుడు శిరీష.. విక్రమ్ మంచోడని, అతడికి అమ్మాయిలంటే గౌరవం అని గొప్పదనం గురించి చెబుతుంది. దీంతో దివ్య పశ్చాత్తపపడడంతో పాటు అతడి గురించి సంతోషిస్తుంది. మరోవైపు, నందూకు భార్యగా నటించేందుకు తులసి అంగీకరిస్తుంది. కానీ, త్వరగా నిజం చెప్పమని అంటుంది. దీంతో అతడు వాసుదేవ్ ముందర టెన్షన్ పడుతుంటాడు. ఇక, విక్రమ్‌ను చూడడానికి వచ్చిన అమ్మాయి తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని అతడితో అంటుంది.

లాస్యకు షాకిచ్చిన వాసుదేవ్

లాస్యకు షాకిచ్చిన వాసుదేవ్


వాసుదేవ్‌తో అందరూ మాట్లాడుతోన్న సమయంలోనే లాస్య అక్కడకు వచ్చి అతడిని పలకరిస్తుంది. అప్పుడు వాసుదేవ్ కోపంగా 'నందూ.. తను.. పేరు లాస్యానో ఏదో.. ఉంది కదా? నీకు అసిస్టెంట్‌గా పని చేసింది కదా.. తనకు ఇక్కడ పనేంటీ' అని ప్రశ్నిస్తాడు. అప్పుడు లాస్య 'నా పేరు బాగానే గుర్తుందే' అంటుంది. దీంతో వాసుదేవ్ 'అవును.. బాగానే ఉంది.. కొందరిని గుర్తుపెట్టుకోవాలి లేమ్మా' అంటూ షాకిస్తాడు. అప్పుడు నందూ 'అది వాసు.. తనకు విడాకులు అయ్యాయి. డిప్రెషన్‌తో బాధపడుతుంటే.. తులసే జాలిపడి ఇంటికి తీసుకొచ్చింది' అంటాడు.

గుడ్డిగా నమ్మకూడదు అంటూ

గుడ్డిగా నమ్మకూడదు అంటూ

నందూ ఆ మాటలు చెప్పగానే వాసుదేవ్ 'అమ్మా తులసి.. నీకు తెలివితేటలు పెరిగాయి. ధైర్యం పెరిగింది అనుకున్నాను. కానీ, ఇంకా అమాయకత్వం పోలేదు. ఎవరిని పడితే వాళ్లను గుడ్డిగా నమ్మకుడదమ్మా. ఈరోజుల్లో అది చాలా పెద్ద తప్పు' అంటూ లాస్య వైపు చూస్తూ మాట్లాడతాడు. ఆ సమయంలో లాస్య 'అయినా నందూ చెప్పిన కథ అసహ్యంగా ఉంది. ఇప్పుడు కూడా తులసిని గొప్పదాన్ని చేసి స్టోరీనే చెప్పాలా? వేరే ఏదైనా చెప్పొచ్చుగా' అని మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత తులసికి లాస్య థ్యాంక్స్ చెప్తుంది. దీనికామె 'ఇలా నటించడానికి నీ కోసం నేను ఒప్పుకోలేదు. నాకే జాలి అనిపించి నటిస్తున్నా.. ఇది కేవలం నాకు ఇబ్బంది కలగనంత వరకే.. నువ్వు అనుకున్నది సాధించే వరకూ మాత్రం కాదు' అని వెళ్లిపోతుంది.

రాజ్యలక్ష్మికి షాకిచ్చిన సరోజ

రాజ్యలక్ష్మికి షాకిచ్చిన సరోజ

తనను చూడడానికి వచ్చిన అమ్మాయికి ధైర్యం చెప్పిన విక్రమ్.. పెళ్లి ఇష్టం లేదని చెప్పేలా మోటివేట్ చేస్తాడు. దీంతో ఆ అమ్మాయి 'ఈ చదువు లేని వాడితో నాకు పెళ్లి వద్దు' అని అందరి ముందే చెప్పేస్తుంది. దీంతో పెళ్లి సంబంధం చెడిపోతుంది. ఆ తర్వాత వెళ్లిపోతూ వెనక్కి వచ్చిన ఈ అమ్మాయి 'విక్రమ్ గారు.. సరైన సమయంలో సరైన సలహా ఇచ్చి.. నన్ను నా జీవితాన్ని కాపాడారు. మీరే కనుక నాతో అలా మాట్లాడపోయి ఉంటే చాలా బాధపడేదాన్ని. మీరిచ్చిన ధైర్యానికి రుణపడి ఉంటానండి' అంటూ వెళ్తుంది. దాంతో రాజ్యలక్ష్మి ఒక్కసారిగా షాక్ గురవుతుంది.

పోయింది అమ్మ పరువు అని

పోయింది అమ్మ పరువు అని

ఆ అమ్మాయి థ్యాంక్స్ చెప్పి వెళ్లిపోగానే రాజ్యలక్ష్మి 'అసలు ఏం జరుగుతోంది? సరోజా విక్రమ్‌కు థాంక్స్ చెప్పి వెళ్లడం ఏంటీ' అని మనసులో అనుకుంటూ రగిలిపోతుంది. అప్పుడు సంజయ్ 'అన్నయ్యా.. అమ్మ పరువు పోయేలా చేశావు కదా.. చూడు అమ్మ ఎలా బాధపడుతుందో' అంటూ విక్రమ్‌ను నిందిస్తుంటాడు. అప్పుడు రాజ్యలక్ష్మి అతడిని ఆగమంటుంది. అంతేకాదు, 'నేను బాధపడుతుంది నా పరువు గురించి కాదురా.. మీ అన్న పరువు గురించి. నువ్వు చదువుకోలేదు కాబట్టి ఆ అమ్మాయి ఛీ కొట్టి పోయిందని బయట తెలిస్తే అది ఎంత అవమానం' అంటుంది.

నేను తప్పు చేశానా అమ్మా?

నేను తప్పు చేశానా అమ్మా?


ఆ తర్వాత విక్రమ్ 'అమ్మా.. చదువు కోలేదు కాబట్టి నువ్వు వద్దు అని ఆ అమ్మాయి నా ముఖం మీదే చెప్పిందమ్మా. కావాలంటే నా మనసు చంపుకుంటాను తాళి కట్టుకో అంది. అలాంటి అమ్మాయితో జీవితాంతం ఎలా కలిసి ఉండమంటావు? అది జరిగే పనేనా? నేను మా అమ్మకు నో చెప్పలేను. కావాలంటే నువ్వే నో చెప్పుకో అన్నాను. అందుకే అలా చెప్పింది. నేను చేసింది తప్పా అమ్మా' అంటూ ఎమోషనల్ అవుతాడు. దీనికి రాజ్యలక్ష్మి 'నిన్ను తప్పుపడితే నా పెంపకం తప్పు అవుతుంది నాన్నా' అంటూ యాక్టింగ్ చేస్తుంది. దీంతో విక్రమ్ 'చూడమ్మా.. నాలాంటి చదువు లేని వాడితో పెళ్లి అంటే ఏ అమ్మాయి ఒప్పుకోదు. ముందు తమ్ముడి పెళ్లి గురించి ఆలోచించు. తమ్ముడికి పెళ్లి చేయండి' అంటూ వెళ్లిపోతాడు.

నీ భార్య కదా కూర్చోవాలని

నీ భార్య కదా కూర్చోవాలని

మాట్లాడుకోవడం అయిపోయిన తర్వాత వాసుదేవ్, అతడి భార్యతో కలిసి అందరూ తింటూ ఉంటారు. అప్పుడు నందూ పక్క కూర్చుని తినబోతుంది. అప్పుడు వాసుదేవ్ 'రేయ్ నందూ.. నా పక్కన నా భార్య కూర్చుంది. మీ నాన్నగారి పక్కన మీ అమ్మగారు కూర్చున్నారు. మరీ నీ పక్కన నీ భార్య కదా కూర్చోవాలి' అంటాడు. దీంతో తినడం మొదలుపెట్టిన లాస్య వెంటనే ఆపేసి 'ఛా.. అలవాటులో పొరబాటుగా కూర్చున్నాను. దీన్ని కూడా విషయం చెయ్యాలా ఈ మనిషి' అనుకుంటూ పైకి లేస్తుంది. తర్వాత 'ఏదో అనుకోకుండా వచ్చాను. సీట్ ఖాళీగా ఉందని కూర్చన్నాను.. నువ్వైనా చెప్పాలి కదా నందూ' అంటుంది. దాంతో నందూ 'రా తులసీ కూర్చో..' అంటూ లాస్య కళ్లముందే చేయి పట్టుకుని లాగుతాడు. దీంతో లాస్య షాక్ అవుతుంది.

తులసి మా ఆడపడుచులా

తులసి మా ఆడపడుచులా

తులసి చేయిని నందూ పట్టుకోవడంతో అందరూ ఆశ్చర్యపోతారు. దీంతో తేరుకున్న అతడు వదిలేస్తాడు. అప్పుడు వాసుదేవ్ 'ఎందుకురా నందూ.. భర్య చేయి పట్టుకోవడానికి కూడా భయపడతావు. వీడికి ఎప్పుడూ ఇంతే సిగ్గు. మా పెళ్లి ప్రేమ పెళ్లి పెద్దలు ఒప్పుకోలేదు. మా పెళ్లి చెయ్యారా అని నందూను మేము అడిగినప్పుడు ఇలానే భయపడ్డాడు. అప్పుడు తులసే మా పెళ్లి చేసింది. ఓ రకంగా చెప్పాలంటే తులసి మా ఆడపడుచులా' అంటాడు. తర్వాత దివ్య.. విక్రమ్‌కి కాల్ చేస్తుంది. మొదటసారి చేసినప్పుడు.. లిఫ్ట్ చేయడానికి భయపడతాడు. చివరకు కాల్ లిఫ్ట్ చేయగా ఒకసారి మనం కలవాలి అని ఆమె అడుగుతుంది. దీంతో అతడు ఖుషీ అవుతాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X