Intinti Gruhalakshmi: తులసి కోసం నందూ సాహసం.. అందరి ముందే ఏడుస్తూ.. దివ్యకు షాకిచ్చిన విక్రమ్
కొత్త కొత్త షోలు ప్రారంభం అవుతున్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar
శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే: శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ప్రియ ముందరే రాజ్యలక్ష్మి.. దివ్యను హింసిస్తానని ఫోన్‌లో మాట్లాడుతుంది. అది విన్న ప్రియ ఆమెను ఏమీ చేయొద్దని బ్రతిమాలుతుంది. దీంతో రాజ్యలక్ష్మి 'నువ్వు సంజయ్‌కు విడాకులు ఇస్తే దివ్యను వదిలేస్తా' అంటుంది. తులసి కోసం నందూ ఓ చీరను తీసుకొచ్చి ఆమెకు గిప్టుగా ఇస్తాడు. ఆ తర్వాత దివ్యకు విక్రమ్ ఫోన్ చేసి కలుద్దామని అంటాడు. దీనికామె ఒప్పుకోకపోవడంతో గోడ దూకేసి వస్తాడు. దీంతో ఆమె దొంగోడు అనుకుని అరుస్తుంది. తర్వాత ఇంట్లో వాళ్లు విక్రమ్‌ను పట్టుకుంటారు. ఇక, తులసి ఇంటికి ప్రేమ్ వాళ్లొస్తారు.

దివ్యను ఏడిపించిన అన్నయ్య: తులసి ఇంటికి మాధవి వాళ్లు రావడంతో దివ్య వెళ్లి పలకరిస్తుంది. అప్పుడే తులసి 'మేనకోడలు పెళ్లి దగ్గరుండి చేస్తావనుకున్నాను. కానీ ఇలా చుట్టం చూపులా రెండు రోజుల ముందే వస్తావని అనుకోలేదు' అని సరదాగా అంటుంది. దీనికామె 'నాకు వదిన పిలుపులు అందలేదు. అందుకే నేను అలిగాను' అని అంటుంది. దీంతో తులసి 'అవునా ఏం లోటు వచ్చింది.. ఇంటికి పల్లకి పంపించమంటావా' అనగా అందరూ నవ్వుతారు. అనంతరం ప్రేమ్ 'మొత్తానికి నీ మొగుడిని నువ్వు వెతుకున్నావ్ కదే' అంటాడు. అప్పుడామె 'మరి ఏం చేస్తాం. మా అన్నయ్యలు నన్ను వదిలి వెళ్ళిపోయారు. మా వదినలు మొగుడిని పట్టుకు కూర్చున్నారు' అని అంటుంది.
దివ్య మాటలకు ఎమోషనల్‌గా: దివ్య మాటలకు ప్రేమ్ 'బావ గారి ఫోటో చూశాను. బొట్టు పెట్టుకొని బుద్ధిమంతుల్లా ఉన్నాడు' అంటాడు. దీనికి దివ్య 'బుద్ధిమంతుడిలా కాదు.. బుద్ధిమంతుడే. 24 క్యారెట్ బంగారం.. నీలా కాదు' అని అంటుంది. ఆ తర్వాత దివ్యను ప్రేమ్ సరదాగా ఆట పట్టిస్తూ ఉంటాడు. అప్పుడు దివ్య తులసికి కంప్లైంట్ చేయగా.. ఎందుకురా దాన్ని అంతలా ఏడిపిస్తావు అని అంటుంది. అప్పుడు అనసూయ చెల్లిని కాకపోతే ఇంకెవరిని ఏడిపిస్తాడు అంటుంది. దీంతో దివ్య మరి నేను అత్తారింటికి వెళ్ళాక ఎవరిని ఏడిపిస్తాడు అనగానే అందరూ ఎమోషనల్ అవుతారు.

నేనేమైనా తప్పుగా మాట్లాడానా: అందరూ ఎమోషనల్ అవుతోన్న సమయంలోనే ప్రేమ్‌ను హత్తుకుని దివ్య ఏడుస్తుంది. అప్పుడు మాధవి 'నేను కూడా అత్తారింటికి వెళ్లేటప్పుడు అన్నయ్య ఇలాగే వెక్కి వెక్కి ఏడ్చాడు. అలా అని నన్ను అత్తారింటికి పంపించకుండా ఆపలేదు కదా. బంధాలు సంతోష పెట్టడమే కాదు.. అప్పుడప్పుడు ఇలా ఏడిపిస్తుంటాయి' అని అంటుంది. దీంతో అందరూ మరింత బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత తులసి కిచెన్‌లోకి వెళ్లడంతో మాధవి కూడా వెళుతుంది. అప్పుడామె 'నేనేమైనా తప్పుగా మాట్లాడానా వదినా' అని అడగ్గా.. అదేం లేదులే మాధవి అని చెబుతుంది.
తులసి బాధ.. నందూ వింటూ:మాధవి అడగ్గానే తులసి 'నువ్వు ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడావు. పెళ్లయిన ఆడది అమ్మగారింట్లో అతిథి లాంటిది. అత్తారింట్లో ఒకప్పుడు ఉన్న ప్రేమ అనురాగాలు ఎప్పటికీ అలాగే ఉండాలి అనుకోవడం అత్యాశే అవుతుంది. వదిన నువ్వు ఏదో విషయం గురించి లోలోపల బాధ పడుతున్నావు బయటకు చెప్పడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావు. కారణమేంటో తెలుసుకోవచ్చా' అని అడుగుతుంది. అప్పుడే నందూ అక్కడకు వచ్చి వాళ్ల మాటలు వింటాడు. అప్పుడు తులసి 'ఇంత వయసు వచ్చాక ఈ వయసులో నేను బాధపడడం కరెక్ట్ కాదేమో. అది నాకు కూడా తెలుసు. కానీ నా మనసు ఊరుకోవడం లేదు. నా చేతకానితనాన్ని ఎత్తి చూపిస్తోంది' అని అంటుంది.

కోరికను బయటపెట్టిన తులసి: ఆ తర్వాత తులసి 'నా పుట్టింటి విషయంలో అదే జరుగుతుంది. నా ఇంట్లో శుభకార్యం జరుగుతున్నప్పుడు పుట్టింటి వాళ్ళు పక్కన ఉండాలి అనుకోవడం తప్పా మాధవి? ఇది అత్యాశ అవుతుందా' అని అడగ్గా కాదు అని చెబుతుంది. అప్పుడు మాధవి మరి మీ వాళ్లను పిలిచావా వదిన అని అడగ్గా.. పిలిచాను పెళ్లికి వస్తామని చెప్పారు. అక్కడ కలుసుకుందాం అన్నారు అని చెబుతుంది. దీనికి మాధవి ఇక్కడికి ఎందుకు రావట్లేదు వదినా అని అడగ్గా.. 'ఏ ముఖం పెట్టుకొని రావాలి మాధవి? ఈ ఇంట్లో వాళ్లకు ఎన్నో అవమానాలు జరిగాయి. ఆస్తులు లేకపోయినా ఆత్మ అభిమానం ఉంటుంది కదా. మీ అన్నతో నాకు ఎటువంటి సంబంధం లేకపోయినా ఒకే ఇంట్లో కలిసి ఉన్నాం కాబట్టి వాటిని నేను భరిస్తాను కానీ వాళ్ళు భరించలేరు కదా' అంటుంది.

తులసి కోరిక తీర్చాలని డిసైడ్: అనంతరం తులసి 'అల్లుడుగా ఉన్నంత వరకు మీ అన్నయ్యను వాళ్లు భరించారు. బాధగా ఉన్న తప్పదు కాబట్టి గౌరవించారు. అల్లుడుగా సంబంధం తెగిపోయాక ఈ ఇంటితో మా అమ్మ వాళ్లకు ఎటువంటి సంబంధం ఉంటుంది చెప్పు' అని అంటుంది. అదంతా విన్న నందూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. తర్వాత 'ఈ సమస్యకు పరిష్కారం లేదు మాధవి. దీన్ని నేను ఎవరికి చెప్పుకోలేను కూడా' అంటుంది. ఆ మాటలు విన్న తర్వాత నందూ తనపై తానే కోపగించుకుంటూ.. 'ఎలా అయినా తులసి వాళ్ళ అమ్మ వాళ్ళని పిలుచుకు రావాలి' అనుకుంటాడు.

క్షమించమని అడిగిన నందూ:తులసి కోసం వాళ్ల అమ్మగారింటికి వెళ్లిన నందూ లోపలికి రావొచ్చా అని అడుగుతాడు. ఆ సమయంలో నందూను ఆమె అవమానించేలా మాట్లాడుతుంది. కానీ, అతడు మౌనంగా ఉంటాడు. అప్పుడు దీపక్ 'అమ్మా.. నీకోపం నాకు అర్థం అయింది. కానీ, బావను ఇలా నిలబెట్టామని తెలిస్తే అక్క బాధ పడుతుంది' అంటాడు. తర్వాత నందూను లోపలికి రమ్మనగా.. 'నేను తప్పులు చేశాను. క్షమించమని అడగడానికి వచ్చాను అత్తయ్య గారు' అంటాడు. కానీ, ఆమెకు కోపం వస్తుంది. అయినా మొత్తం వివరించి చెప్తాడు. తర్వాత దివ్యకు ప్రేమ్ ఫోన్ చేస్తాడు. అంతేకాదు, ఆమెకు ఓ గిఫ్ట్ కూడా పంపించానని చెప్తాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











