Intinti Gruhalakshmi September 10th Episode: ప్రేమ్‌ను పెళ్లికి ఒప్పిస్తానన్న శృతి.. కథలో మలుపు

సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ ఓ లుక్కేయండి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. శృతికి వేరే వ్యక్తితో పెళ్లి చేయాలని ప్లాన్ చేసిన నందూ.. అందుకు అనుగుణంగానే ఓ సంబంధాన్ని తీసుకుని వస్తాడు. వాళ్లు ఆమెను చూసుకోడానికి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్లకు ఈ విషయం చెబుతాడు. దీంతో ప్రేమ్, తులసి అతడిపై ఫైర్ అవుతారు. అప్పుడు నందూ.. తాను చెప్పిన సంబంధానికి ప్రేమ్ ఒప్పుకుంటే.. శృతి పెళ్లి చేయనని కండీషన్ పెడతాడు. ఆ తర్వాత ప్రేమ్, తులసి ప్రేమించుకుంటున్నారన్న విషయాన్ని నందూకు గుర్తు చేస్తుంది తులసి. అప్పుడు వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోడానికి తాను ఒప్పుకోనని తేల్చి చెబుతాడు.

అలా రావొద్దని నందూకు తులసి వార్నింగ్

అలా రావొద్దని నందూకు తులసి వార్నింగ్

డబ్బు వల్లే అంతా జరుగుతుందని నందూ అంటుండగా ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. ఆ సమయంలో తులసిని నువ్వెందుకు ఫ్యాక్టరీ నడుపుతున్నావని ప్రశ్నిస్తాడు. దీంతో ఆమె 'నేను డబ్బుల కోసం ఫ్యాక్టరీ నడపడం లేదు. నన్ను నేను నిరూపించుకోడానికి చేస్తున్నా' అని బదులిస్తుంది. అంతేకాదు, 'ప్రేమ్, శృతి ప్రేమించుకుంటున్నారు. వాళ్ల మధ్యలోకి అస్సలు రావొద్దు' అంటూ మాజీ భర్తకు వార్నింగ్ కూడా ఇస్తుంది. అప్పుడు నందూ 'వస్తాను.. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదు. ప్రేమ్‌కు ఎలాగైనా ఆ పెళ్లి చేస్తా' అంటూ సమాధానం ఇస్తాడతను.

 తల్లి సహాయం కోరిన ప్రేమ్.. అంకిత అలా

తల్లి సహాయం కోరిన ప్రేమ్.. అంకిత అలా

శృతికి తన ప్రేమ గురించి ఎలా చెప్పాలో తెలియక ఇబ్బంది పడుతోన్న ప్రేమ్.. తల్లి దగ్గరకు వచ్చి సలహా ఇవ్వమని కోరతాడు. అంతేకాదు, 'నువ్వే వెళ్లి ప్రేమ్‌కు నీకు పెళ్లి చేయాలని అనుకుంటున్నా అని చెప్పమ్మా' అని అడుగుతాడు. అంతలో అంకిత అక్కడకు వచ్చి 'అదేంటి ప్రేమ్? ఆంటీ ఎలా అడుగుతారు? ఒకవేళ శృతి కనుక పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని అంటే ఆంటీ పరువు పోదా. అప్పుడామె ముఖం ఎక్కడ పెట్టుకుంటారు' అని అంటుంది. అప్పుడు ప్రేమ్ 'అసలు తను వద్దంటుంది అని ఎలా అంటావ్' అని ఆమెను ప్రశ్నిస్తాడు.

ప్రేమ్‌కు విలువైన సలహా ఇచ్చిన తులసి

ప్రేమ్‌కు విలువైన సలహా ఇచ్చిన తులసి

ప్రేమ్ పరిస్థితిని చూసిన తులసి అతడికి విలువైన సలహాలు ఇస్తుంది. 'చూడు ప్రేమ్.. నువ్వు ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి. అలా చేస్తేనే శృతిని నీ మీద నమ్మకం ఉంటుంది. లేకపోతే ఈ పరిస్థితులను తట్టుకోలేని వాడు నన్ను ఎలా పోషిస్తాడు అని అనుకుంటుంది. కాబట్టి నువ్వు ఏమనుకుంటున్నావో.. వెళ్లి ధైర్యంగా చెప్పు. అలా చేస్తే తనకు కూడా నీ మీద నమ్మకం ఏర్పడి తన మనసులో ఉన్నది కూడా ధైర్యంగా చెబుతుంది' అని అంటుంది. దీంతో ప్రేమ్ 'సరే అమ్మా ఈరోజు ఎలాగైనా నా మనసులో ఉన్నది తనకు చెప్పేస్తా' అంటూ వెళ్తాడు.

ప్రేమ్ గురించి శృతి సాయం కోరిన నందూ

ప్రేమ్ గురించి శృతి సాయం కోరిన నందూ

శృతికి ప్రపోజ్ చేయడానికి ప్రేమ్ ఆమె గదిలోకి వెళ్లగా ఆమె మాత్రం అక్కడ ఉండదు. తర్వాత ఇంట్లో వాళ్లను అడగ్గా ఆమె గుడికి వెళ్లిందని చెబుతారు. దీంతో అక్కడికి బయలుదేరుతాడు. అప్పుడు శృతి.. ప్రేమ్‌కు పెళ్లి సంబంధం చూసిన విషయాన్ని గురించి ఆలోచిస్తూ బాధ పడుతూ ఉంటుంది. అంతలో ప్రేమ్ కంటే ముందే నందూ అక్కడకు చేరుకుంటాడు. దీంతో అతడిని చూసిన శృతి షాక్ అవుతుంది. అప్పుడు నందూ 'నన్ను ఇక్కడ చూసి షాక్ అయ్యావు కదా. నువ్వు నాకో సహాయం చేయాలి' అంటూ ఆమెను అడుగుతాడు.

శృతికి ప్రేమ్ లవ్ గురించి చెప్పిన నందూ

శృతికి ప్రేమ్ లవ్ గురించి చెప్పిన నందూ

తన సహాయం అడగ్గానే శృతి ఆశ్చర్యపోతుంది. అంతేకాదు, 'నేనే ఏ దిక్కు లేక మీ ఇంట్లో ఉంటున్నా. నేనేం సహాయం చేయగలను' అని అడుగుతుంది. అప్పుడు నందూ 'ప్రేమ్ నిన్ను ప్రేమిస్తున్నాడు. కానీ, వాడు అక్షరను పెళ్లి చేసుకుంటేనే బాగుపడతాడు. ఇలాంటి టైమ్‌లో నువ్వు ఇంటి నుంచి వెళ్లడం కాదు. ప్రేమ్‌కు అర్థం అయ్యేలా చెప్పు. నేను కంపెనీ దివాళా తీసి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అదే జరిగితే చావడానికే ఇష్టపడతాను. తులసి ఫ్యాక్టరీ కూడా సమస్యలతో ఉంది' అంటూ ఆమెను ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేస్తుంటాడు.

నేను చస్తే.. తులసి ఒక్కటే అవి చేయగలదా

నేను చస్తే.. తులసి ఒక్కటే అవి చేయగలదా

శృతితో మాట్లాడుతోన్న సమయంలోనే 'నేను పరువుపోతే బ్రతకలేను. అందుకే ఎలాంటి నిర్ణయం అయినా తీసుకుంటాను. అదే జరిగితే.. అభి వాళ్లు ఇంకా సెటిల్ అవ్వలేదు. దివ్యకు పెళ్లి కూడా కాలేదు. నా తల్లిదండ్రులు నేను లేకపోతే తట్టుకోగలరా? అసలు నేను లేకుండా తులసి ఒక్కటే ఇవన్నీ చూసుకోగలదా? అక్షరను చేసుకుంటూ నా కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది. ఇదంతా జరగాలంటే నీ ప్రేమను ఒక్కటి త్యాగం చేస్తే చాలు. నీకు ఎంతో మంచి చేసిన ఈ ఫ్యామిలీ కోసం ఆమాత్రం చేయలేవా' అంటూ ఆమె మనసు మార్చే ప్రయత్నం చేస్తాడు.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
నేను మీ నాశనం కోరుకోవడం లేదు అంకుల్

నేను మీ నాశనం కోరుకోవడం లేదు అంకుల్

నందూ మాట్లాడుతుండగానే 'ఇంక ఆపేయండి అంకుల్. నా వల్ల మీ కుటుంబం రోడ్డున పడడం నాకిష్టం లేదు. నా వల్ల మీ కుటుంబం ముక్కలు అవకూడదు. మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలి. నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది. ఇది నాకు పెద్ద లెక్కకాదు. నేనేం చేయాలి? ప్రేమ్‌ను ప్రేమ్ ప్రేమకు దూరంగా ఉండాలి అంతేనా? సరే ఉంటాను. మీరు తీసుకొచ్చిన సంబంధం ప్రేమ్ చేసుకునేలా నేను చూసుకుంటాను' అని అంటుంది. అప్పుడు నందూ 'నాకు అప్పులు లేకపోతే నేనే మీ పెళ్లి దగ్గరుండి చేసేవాడిని' అంటూ బదులిస్తాడు. దీంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X