For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: లాస్య మాటలు విని షాకైన సామ్రాట్.. తులసి ఇంటికి వచ్చేసిన నందూ

  |

  చాలా భాషల కంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి మరి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసి గురించి హనీకి అబద్ధం చెప్పి మేనేజ్ చేశావు కానీ తనకు నిజం తెలిస్తే ఏం చేస్తావు అని సామ్రాట్‌ను వాళ్ల బాబాయి అడుగుతాడు. దీంతో అతడు మరోసారి సీరియస్ అవుతూ తులసిని ఎప్పటికీ కలవను అని చెప్తాడు. ఆ తర్వాత హనీ, లక్కీ స్టేషనరీ షాప్ దగ్గర కలుస్తారు. ఆ తర్వాత తులసిని చూసిన వాళ్లిద్దరూ వినాయక చవితి పూజ కోసం ఇంటికి వస్తామని అడుగుతారు. దీనికామె ఓకే అంటుంది. ఆ వెంటనే ఇంటికి వచ్చి తమ తమ ఇళ్లల్లో పర్మీషన్ తీసుకుంటారు. ఇక, ప్రేమ్.. శృతిని కన్విన్స్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.

  టాప్ కిందకి జరిపి షాకిచ్చిన శ్యామల: ఇది అట్టాంటిట్టాంటి షో కాదుగా!

  లక్కీ చెప్పిన మాటకు వాళ్లు షాక్

  లక్కీ చెప్పిన మాటకు వాళ్లు షాక్


  తులసి ఇంట్లో వినాయక పూజ కోసం వెళ్తానన్న లక్కీ 'నా ప్లాన్స్ నేను చేసుకున్నాను. మీరు మాత్రం ఇక్కడే పూజ చేసుకోండి. నేను తులసి ఆంటీ వాళ్ల ఇంట్లో పూజకు వెళ్తాను. అక్కడను హనీ కూడా వస్తుంది' అని బయలుదేరుతాడు. హనీ వస్తుందని తెలిసిన నందూ, లాస్య ఒక్కసారిగా షాక్ అవుతారు. అంతేకాదు, 'అసలు హనీని సామ్రాట్ ఎలా పంపిస్తున్నాడు? హనీని ఒక్కదాన్నే పంపిస్తాడా లేక సామ్రాట్ కూడా వస్తాడా? ఏది ఏమైనా మనం కూడా అక్కడికి వెళ్లాలి' అని లాస్య అంటుంది. దీంతో నందూ పిలవని పేరంటానికి రావడం నాకు ఇష్టం లేదు అంటాడు.

  వినాయకుడికి తులసి కొత్త కోరిక

  వినాయకుడికి తులసి కొత్త కోరిక

  ఉదయాన్నే నిద్ర లేవగానే ఎదురుగా ఉన్న వినాయకుడి బొమ్మను చూసిన తులసి.. 'పుట్టిన రోజు శుభాకాంక్షలు గణేశా. నువ్వే మా దేవుడివి. ఇక నుంచి అయినా నేను తలపెట్టే పనుల్లో ఎలాంటి విఘ్నాలు లేకుండా జరిగేలా దీవించు. అంతా మంచే జరిగేటట్లు చూడు స్వామి. మమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండు తండ్రి' అని మనసులో కోరికను కోరుకుంటుంది. ఆ వెంటనే ఇంట్లోని అందరినీ నిద్ర లేపుతుంది. దీంతో అందరూ లేచి పూజ కోసం రెడీ అవుతూ ఉంటారు. ఆ సమయంలో తులసి, శృతి కలిసి పూజకు కావాల్సిన సామాన్లను సర్దుతూ ఉంటారు.

  Bigg Boss Telugu 6: ఆ అమ్మాయికి బిగ్ బాస్ షాక్.. పిరియడ్స్‌తో ఇబ్బంది.. రిక్వెస్ట్ చేసినా వినకుండా!

  శృతి నడుముపై గిల్లేసిన ప్రేమ్

  శృతి నడుముపై గిల్లేసిన ప్రేమ్

  పూజ కోసం పనులు చేస్తోన్న శృతిని చూసిన ప్రేమ్.. ఆమెను ఎలాగైన బుక్ చేయాలని అనుకుంటాడు. అప్పుడు 'శృతి తలంటు పోసుకున్నా. స్నానం చేసి వస్తే తల తూడుస్తా అన్నావు కదా' అని తులసి ముందే అంటాడు. దీంతో శృతి ఇప్పుడు నా చేతులు ఖాళీ లేవు అంటుంది. అప్పుడు తులసి ఏం కాదు.. నువ్వు వెళ్లు.. నేను ఈ పనులు చూసుకుంటా అంటుంది. దీంతో శృతి ఇక్కడ ఎందుకు గదిలోకి పదా అంటుంది. అలా వెళ్తే తన పని అయిపోతుందని గ్రహించిన ప్రేమ్ 'అమ్మో.. గదిలోకి వెళ్తే ఇంకేమైనా ఉందా. గదిలోకి ఎందుకు.. ఇక్కడ ఎవరూ లేరు కదా.. ఇక్కడే తల తుడువు' అంటాడు. ఇంత పని చేయిస్తావా అని అతడిని శృతి గిచ్చుతుంది. ఆ వెంటనే ప్రేమ్ కూడా ఆమె నడుముపై గిల్లుతాడు.

  తులసి ఇంటికొచ్చిన లక్కీ, హనీ

  తులసి ఇంటికొచ్చిన లక్కీ, హనీ

  వినాయక చవితి పూజ కోసం లక్కీ తులసి ఇంటికి వస్తాడు. అప్పుడు ఇంట్లోని వాళ్లు 'ఒక్కడే వచ్చాడు. నువ్వు ఒక్కడివే వచ్చావా? మీ అమ్మకు చెప్పి వచ్చావా' అని ప్రశ్నిస్తారు. దీంతో లక్కీ నేను ఒక్కడినే వచ్చాను. వాళ్లను రావద్దని కూడా చెప్పాను అంటాడు. మరోవైపు పూజ మొదలవుతుంది. ఆ సమయంలోనే సామ్రాట్ హనీని తులసి ఇంటికి తీసుకొస్తాడు. అతడి బాబాయి కూడా అదే కారులో వస్తాడు. అప్పుడు హనీ నన్ను తులసి ఆంటీ ఇంటికి తీసుకొచ్చినందుకు చాలా థాంక్స్ డాడీ అంటుంది. అనంతరం సామ్రాట్ ఆ కారులోనే ఉండి వాళ్లను లోపలికి పంపిస్తాడు.

  స్విమ్మింగ్ పూల్‌లో బిగ్ బాస్ భామ రచ్చ: తడిచిన బట్టల్లో అందాల ప్రదర్శన

  నందూ, లాస్య కూడా వచ్చేస్తారు

  నందూ, లాస్య కూడా వచ్చేస్తారు

  సామ్రాట్ వస్తున్నాడేమో అన్న అనుమానంతో నందూ, లాస్య కూడా తులసి ఇంటికి వస్తారు. వాళ్లు రాగానే అక్కడ సామ్రాట్ కారును చూస్తారు. అప్పుడు లాస్య 'నందూ అది సామ్రాట్ కారే కదా. ఏమాత్రం ఆగలేదా? అప్పుడే వచ్చేశాడా. పిలవగానే ఎగరేసుకుంటూ వచ్చాడా' అని అంటుంది. దీంతో నందూ 'ఇక ఆపుతావా.. నాకు రావడం ఇష్టం లేదు మొర్రో అంటే తీసుకొచ్చావు. నాకు సామ్రాట్ గారి మొహం చూడాలన్నా చిరాకు వేస్తోంది' అంటాడు. దీంతో లాస్య 'సరే ఈ ఒక్కసారికి ఎలాగోలా వెళ్లి వచ్చేద్దాం. పదా వెళ్దాం' అంటూ అతడిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది.

  నిజం తెలుసుకున్న సామ్రాట్

  నిజం తెలుసుకున్న సామ్రాట్

  ఆ తర్వాత నందూ పిలవని పేరంటానికి వచ్చినట్టుంది అంటాడు. దీంతో లాస్య.. నందూ చేతుల్లో పటిక బెల్లం పెట్టి 'దివ్య బాగా చదవాలని గుడిలో పూజ చేయించి తీసుకొచ్చాను అని తన చేతుల్లో ఇది పెట్టు. ఇది ఇవ్వడానికే వచ్చాను అని చెప్పు. లోపల ఎవ్వరు రెచ్చగొట్టినా కూల్‌గా ఉండు. తులసి మాజీ భర్త అనే నిజం సామ్రాట్ గారికి తెలియకుండా నువ్వే దాచావని, తనను నువ్వే రిక్వెస్ట్ చేశావనే నిజం పొరపాటున కూడా బయటపెట్టకు' అని నందూతో చెబుతుంది. ఇదంతా కారులో ఉన్న సామ్రాట్ వినేస్తాడు. వాళ్లు వెళ్లగానే కారు దిగిన సామ్రాట్ 'అంటే నందు రిక్వెస్ట్ చేయబట్టే తన మాజీ భర్త అనే విషయం తులసి గారు చెప్పలేదా.. నేను తులసి గారిని తప్పుగా అర్థం చేసుకున్నానా' అని మనసులో బాధపడతాడు.

  ఒంటిపై నూలుపోగు లేకుండా హీరోయిన్: ప్రైవేటు పార్టులను చూపిస్తూ దారుణంగా!

  నందూ, లాస్యను ఉండమంటూ

  నందూ, లాస్యను ఉండమంటూ

  ఆ తర్వాత లాస్య, నందు ఇద్దరూ తులసి ఇంటికి వస్తారు. అందరూ వాళ్లను ఆశ్చర్యంగా చూస్తారు. దీంతో లాస్య 'మేము పిలవని పేరంటానికి వచ్చామని టెన్షన్ పడుతున్నారా? నందూ.. దివ్య కోసం ప్రత్యేకంగా పూజ చేయించాడు. ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావాలని పూజ చేయించాడు. ప్రసాదం ఇచ్చి వెళ్దామని వచ్చాం' అంటుంది. అలా దివ్యకు ప్రసాదం ఇచ్చాక ఇక వెళ్దామా అంటుంది. దీంతో అభి 'వెళ్లిపోవడం ఏంటి డాడ్.. పూజ అయ్యేదాకా ఉండండి. ఏం తాతయ్య పెద్దరాయుడిలా తీర్పులు చెప్పడం కాదు. కొడుకు ఇంటికొస్తే ఉండమని అనాలని తెలియదా' అంటాడు. దీంతో తులసి కూడా వాళ్లను అక్కడే ఉండి పూజ చేసుకోమని అంటుంది. అంతలో లక్కీ తుమ్ముతాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 734: Nandhu and Lasya Went to Tulasi Home for Pooja. After That Samrat Learns The Truth after overhearing Lasya and Nandhu Conversation
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X