For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi September 11th Episode: శృతికి ప్రపోజ్ చేసిన ప్రేమ్.. లాస్య, నందూ మరో ప్లాన్

  |

  మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నందూ పెట్టిన కండీషన్‌తో తెగ టెన్షన్ పడుతోన్న ప్రేమ్‌కు.. శృతికి ప్రేమను వ్యక్తపరచమని తులసి ఎంకరేజ్ చేసి పంపుతుంది. దీంతో ఆమె గుడి దగ్గర ఉందన్న విషయం తెలుసుకుని అక్కడకు బయలుదేరుతాడతను. అంతకంటే ముందే నందూ అక్కడకు చేరుకుని ప్రేమ్ తాను చూసిన సంబంధం చేసుకోకపోతే కుటుంబం ముక్కలు అవుతుందని, తాను ఆత్మహత్య చేసుకోవాలని శృతిని ఎమోషనల్‌గా బ్లాక్ మెయిల్ చేస్తాడు. దీంతో ఆమె ప్రేమ్‌కు దూరంగా ఉంటానని, పెళ్లి కూడా చేసుకోనని హామీ ఇస్తుంది.

  ఆ పొరపాటు చేయడం వల్లే సాయి ధరమ్ తేజ్‌కు యాక్సిడెంట్.. ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది!

   ప్రేమ్‌ను ఎందుకు వద్దనుకుంటుంది

  ప్రేమ్‌ను ఎందుకు వద్దనుకుంటుంది

  ప్రేమ్.. శృతికి ప్రపోజ్ చేయడానికి గుడికి వెళ్లగా ఇంట్లో ఉన్న తులసి మాత్రం ఏం జరుగుతుందో అని తెగ టెన్షన్ పడుతుంది. అంతలో పరందామయ్య వచ్చి ఏమైందని అడుగుతాడు. దీనికామె ‘ప్రేమ్ తన ప్రేమను వ్యక్త పరచడానికి శృతి దగ్గరకు వెళ్లాడు. అదే ఏమవుతుందో అని ఆలోచిస్తున్నా' అని అంటుంది. అప్పుడు పరందామయ్య ‘ప్రేమ్ బంగారం కదమ్మా. అలాంటి వాడిని ఎందుకు కాదంటుంది' అని అంటాడు. దీంతో తులసి ‘శృతి అప్పటి లాంటి అమ్మాయి కాదు. తను ఎన్నో కష్టాలు అనుభవించిన అమ్మాయి కదా' అంటూ ఆయనకు బదులిస్తుంది.

  ప్రేమ్ ఏమైపోతాడో అని భయం ఉంది

  ప్రేమ్ ఏమైపోతాడో అని భయం ఉంది

  పరందామయ్య ధైర్యం చెబుతున్నప్పటికీ తులసి మాత్రం భయ పడుతూనే ఉంటుంది. ఆ సమయంలోనే ‘శృతి చుట్టూ కారు మబ్బులు కమ్ముకుని ఉన్నాయి. అప్పటిలా ఇప్పుడు తను మామూలు మనిషిలా లేదు. కుటుంబం లేక మన దగ్గర ఉంటుంది. దీంతో ఆమె మనసులో ఎలాంటి అభిప్రాయం ఉంటుందో అర్థం కావట్లేదు. ఒకవేళ తను కాదంటే ప్రేమ్ ఏమైపోతాడా అని భయంగా ఉంది మామయ్య' అని అంటుంది. దీనికి పరందామయ్య ‘అలా ఏమీ కాదులేమ్మా. ధైర్యంగా ఉండు. అంతా మంచే జరుగుతుంది' అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

  Bigg Boss: నాగార్జున పేరును వాడుతూ జస్వంత్ కామెంట్స్.. పాపం ఆ పని చేసి బుక్కైపోయాడుగా!

  ప్రేమ్ విషయంలో ఏం చేయాలంటూ

  ప్రేమ్ విషయంలో ఏం చేయాలంటూ

  నందూ వచ్చి మాట్లాడి వెళ్లిపోయిన తర్వాత శృతి గుడిలోనే ఉండిపోతుంది. ఆ సమయంలో ఏడుస్తూ ‘ఇప్పుడు నేను ప్రేమ్‌కు ముఖం ఎలా చూపించుకోవాలి? అసలు నన్ను తను ప్రేమిస్తున్నందుకు సంతోషించాలా? ఈ పరిస్థితి వచ్చినందుకు బాధ పడలా? ఒకవేళ ఇప్పుడు తను వచ్చి ప్రపోజ్ చేస్తే.. నేనేం సమాధానం చెప్పాలి. దేవుడా.. నాకెందుకు ఇంత బాధ పెట్టావు. నన్ను ఎంతగానో ప్రేమించే ప్రేమ్‌ను బాధ పెట్టమని చెబుతున్నావా? అసలు నీకిది భావ్యవేనా' అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది. అంతలో ప్రేమ్ కూడా అక్కడకు చేరుకుంటాడు.

   తెలిసే ఇలా చేస్తున్నావు కదా అంటూ

  తెలిసే ఇలా చేస్తున్నావు కదా అంటూ

  శృతిని వెతుక్కుంటూ గుడికి వచ్చిన ప్రేమ్.. నేరుగా యాక్షన్‌లోకి దిగిపోతాడు. ‘నీకు ఒక విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను' అంటాడు. దీంతో శృతి ‘ప్లీజ్ ప్రేమ్.. నన్ను ప్రేమిస్తున్నానని మాత్రం చెప్పకు' అంటూ మనసులో అనుకుంటుంది. ప్రేమ్ మాత్రం ‘శృతి ఆనందానికి కారణం నువ్వే.. నా గమ్యం నువ్వే.. నా భావం నువ్వే.. ఐ లవ్ యూ. నువ్వంటే నాకు చెప్పలేనంత ఇష్టం శృతి. నిన్ను తప్ప మరొకరిని నా జీవితంలోకి రానంత గొప్పగా నిన్ను ప్రేమిస్తున్నా. నా ప్రేమను నువ్వు అర్థం చేసుకుంటావు కదా' అని ఎంతో సంతోషంగా ఆమెకు ప్రపోజ్ చేస్తాడు.

  Bigg Boss: వెక్కి వెక్కి ఏడ్చిన యాంకర్ రవి.. లైఫ్‌లో తొలిసారి ఇలా జరిగిందంటూ బాధగా!

  ప్రేమ్‌కు షాకిచ్చిన శృతి.. టైం ఇచ్చి

  ప్రేమ్‌కు షాకిచ్చిన శృతి.. టైం ఇచ్చి

  ప్రేమ్ తన మనసులో ఎంతగా ప్రేమిస్తున్నాడో శృతికి చెబుతూ ప్రపోజ్ చేసేశాడు. కానీ, ఆమె మాత్రం నందూకు ఇచ్చిన మాటను గౌరవించి ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉండిపోతుంది. అప్పుడు ప్రేమ్ ‘ఏంటి శృతి.. ఏమీ చెప్పవేంటి. నీ సమాధానం కోసం ఎంతో కాలంగా వేచి చూస్తున్నా' అని అంటాడు. దీనికి శృతి ‘ఇప్పుడు నేనేమీ చెప్పలేను ప్రేమ్. నాకు సమయం కావాలి' అని అంటుంది. అప్పుడతను ‘అవును నీకు టైమ్ కావాలిలే. నాకే ప్రపోజ్ చేయడానికి ఇంత సమయం పట్టింది. నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చెప్పు' అనడంతో ఇద్దరూ వచ్చేస్తారు.

  'Father Knows Who The Father Is' - TMC MP Nusrat Jahan || Filmibeat Telugu
  నందూకు లాస్య సలహా.. ఛాన్స్ ఉంది

  నందూకు లాస్య సలహా.. ఛాన్స్ ఉంది

  శృతితో మాట్లాడేందుకు వెళ్లిన నందూ ఏం చేశాడా అని లాస్య తెగ ఆలోచిస్తుంది. అప్పుడతనికి ఫోన్ చేస్తుండగా అంతలో అతడు అక్కడకు వచ్చి ఆమెకు గుడ్ న్యూస్ చెబుతాడు. అప్పుడు లాస్య ‘అప్పుడే ఏమీ అయిపోలేదు నందూ. శృతిని ప్రేమ్ గుచ్చి గుచ్చి అడుగుతాడు. తులసి కూడా కారణం చెప్పమంటుంది. దీంతో ఆమె మనసు మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి శృతి మనసు మారకముందే ప్రేమ్‌ను పెళ్లికి ఒప్పించాలి' అని అంటుంది. దీనికి నందూ కూడా ఒప్పుకుంటాడు. అలా ఇద్దరూ కలిసి ప్రేమ్, శృతిని శాశ్వతంగా విడగొట్టాలని ప్లాన్ చేసుకుంటారు.

  హాట్ ఫోజులతో రెచ్చిపోయిన సమంత: వామ్మో అలాంటి బట్టల్లో అందాలు మొత్తం కనిపించేంత ఘాటుగా!

  ప్రేమ్ అయోమయం.. తులసి ధైర్యం

  ప్రేమ్ అయోమయం.. తులసి ధైర్యం

  ఇంటికి వచ్చిన ప్రేమ్, శృతిని చూసిన తులసి ఏం జరిగిందా అన్న ఆసక్తితోనే లోపలికి రమ్మని ఆహ్వానిస్తుంది. కానీ, అప్పుడు శృతి బాధగా ఉండడం చూసి ‘ఏంట్రా ఏం జరిగింది? తనకు నీ ప్రేమను చెప్పేశావా' అని ప్రశ్నిస్తుంది. దీనికి ప్రేమ్ ‘నేనైతే నా ప్రేమను చెప్పానమ్మా. తను మాత్రం మౌనంగా ఉండిపోయింది. నేనే టైమ్ తీసుకో అని చెప్పాను. కానీ ఎందుకో భయంగా ఉంది' అని అంటాడు. అప్పుడు తులసి ‘ఆలోచించమని నువ్వు మంచి పని చేశావు. నీ పని నువ్వు చేశావు. ఇకపై నేను శృతిని అడుగుతాను' అని కొడుకుకు ధైర్యం చెబుతుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 422: Prem Told his Love to Shruthi. But She Asked Some Time to Prem. Then Lasya Gave Suggestions To Nandhu.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X