Intinti Gruhalakshmi: రత్నప్రభ వాళ్లకు హనీ షాక్.. తులసి ఇంటికి సామ్రాట్ కూతురు.. దివ్యకు మరో దెబ్బ
భారతదేశంలోని ఎన్నో భాషల కంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar
శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే:శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. దివ్యకు దూరంగా ఉంటున్న కొడుకుకు విక్రమ్ తండ్రి క్లాస్ పీకుతాడు. అయినప్పటికీ అతడిలో మార్పు మాత్రం రాదు. అనంతరం సామ్రాట్ ఇంటికి వచ్చిన ధనుంజయ్, రత్నప్రభ.. హనీ పేరు మీద ఉన్న ఆస్తిని ఎలాగైనా కాజేయాలని ప్లాన్ చేస్తారు. అందుకోసం అవసరమైతే హనీని చంపేసి, తులసి అడ్డు కూడా తొలగించుకోవాలని అనుకుంటారు. ఇక, నందూ మాత్రం తులసి మనసును మార్చేసి తన ప్రేమ విషయం చెప్పాలని అనుకుంటాడు. చివర్లో జాహ్నవి ఎంట్రీ ఇచ్చి దివ్యను, విక్రమ్‌ను దూరం చేయాలని అనుకుంటుంది.

ఓపికగా డీల్ చేయాలని ప్లాన్:సామ్రాట్ బాబాయిని నమ్మించి ఎలాగైనా ఆస్తిని చేజిక్కించుకోవాలని ధనుంజయ్, రత్నప్రభ ప్రయత్నిస్తుంటారు. అప్పుడాయన 'నేనే పరాయి వాడిని. మీరు సామ్రాట్ రక్త సంబంధం. కాబట్టి బాధ్యతలు మీరే చూసుకోండి. ఏం చేయాలనుకుంటున్నారో నాకు చెప్పండి. అయితే అంతకు ముందే మీరు హనీకి దగ్గరవండి. తన మనసులో చోటు సంపాదించండి. ఆ తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడుకుందాం' అని వెళ్లిపోతాడు. దీంతో రత్నప్రభకు కోపం వస్తుంది. దీంతో ధనుంజయ్ 'ఆవేశపడొద్దు. ఓపికగా డీల్ చేయాలి' అని ఆమెకు నచ్చజెపుతాడు.
ఆస్తి కోసమే కదా.. అడుక్కుని:సామ్రాట్ బాబాయి మాటలకు రగిలిపోతున్న తల్లిదండ్రుల దగ్గరకు వచ్చిన స్వీటీ 'నాకు ఇక్కడ నచ్చడం లేదు. మనం యూఎస్ వెళ్లిపోదాం.. హనీ నాతో ఆడుకోవడం లేదు' అని చెప్తుంది. దీంతో ధనుంజయ్ 'హనీకి నువ్వు దగ్గరవ్వాలి.. తనతోనే ఆడుకోవాలి' అంటాడు. అప్పుడు స్వీటీ ఎందుకు ఆస్తి కోసమా అనగానే 'ఈ తింగరి మాటలే వద్దనేది. ఇది ఆ పెద్దాయనకు తెలిసిందంటే.. మన ప్లాన్ మొత్తం నాశనం అవుతుంది. అప్పుడు మనందరం రోడ్డున పడి అడుక్కోవాలి. నీ చేతికి కూడా బొచ్చె ఇచ్చి సిగ్నల్ దగ్గర నిలబెడతా' అని తల్లి తిడుతుంది.

మీరు వద్దు.. ఆంటీనే కావాలి:ఎలాగైనా హనీని ట్రాప్ చేయాలని భావించిన ధనుంజయ్, రత్నప్రభ ఆ చిన్నారి దగ్గరకు వెళ్తారు. అప్పుడే హనీ ఫోన్లో సామ్రాట్ ఫోటో చూసుకుంటూ ఏడుస్తుంటుంది. అప్పుడు రత్నప్రభ పలకరించగా.. తనని తులసి దగ్గరకి తీసుకెళ్లమని లేదంటే తన దగ్గరకి రావొద్దని మాట్లాడొద్దని తేల్చి చెప్తుంది. దీంతో రత్నప్రభ తులసి దగ్గరకి తీసుకెళ్తామని అనేసరికి హనీ వాళ్ళతో వెళ్తుంది. తర్వాత వాళ్లిద్దరూ హనీని తీసుకుని తులసి ఇంటికి వెళ్తారు. అక్కడ హనీ ఆంటీ అని పిలవగానే తులసి వచ్చి.. గుండెలకు హత్తుకుంటుంది. దీంతో ఆ చిన్నారి సంతోషిస్తుంది.
జాహ్నవి చిలిపి పనులతో:జాహ్నవి వచ్చీ రావడమే విక్రమ్‌పై ప్రేమను కురిపిస్తూ ఉంటుంది. డైనింగ్ టేబుల్ దగ్గర కూడా అతడి పక్కనే కూర్చుని చిలిపి పనులు చేస్తుంటుంది. అంతేకాదు, 'చూడక్కా నేను ఇక్కడున్నన్ని రోజులు నువ్వు బావ మీద ఆశలు వదులుకో. నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు బావా హాస్పిటల్‌కు రాడు. నువ్వే మేనేజ్ చేసుకో' అంటుంది. కానీ, దీనికి విక్రమ్ ఒప్పుకోడు. అప్పుడామె 'కుదుర్చుకో ఇక్కడ ఉంది మరదలు' అంటుంది. అప్పుడు విక్రమ్ కావాలంటే ఈవినింగ్ త్వరగా వస్తా అనగా.. నా మాట వినకపోతే నేనే ఆస్పత్రికి వస్తా అని జాహ్నవి చెప్తుంది.

అన్నం తినిపించుకుంది:జాహ్నవి ఓవర్ యాక్షన్ చేస్తుండడంతో విక్రమ్ 'ఎందుకమ్మా ఈ మొండిదాన్ని పిలిచావ్' అని అడుగుతాడు. అప్పుడు జాహ్నవి 'ఇంకా నయం నీ పెళ్ళాన్ని కాలేదు' అంటుంది. దీంతో దివ్యతో పాటు అక్కడున్న వాళ్లంతా షాక్ అవుతారు. అనంతరం చిన్న వయసు నుంచి విక్రమ్‌తో చేసిన చిలిపి పనుల గురించి మొత్తం చెబుతుంది. దీంతో విక్రమ్ ఇబ్బంది పడుతూ ఉంటాడు. అప్పుడే బసవయ్య 'బావ నువ్వు ఒకే మంచం మీద పడుకుని కబుర్లు కూడా చెప్పేదానివి కదా ఆ విషయాలు కూడ దివ్యకి చెప్పు' అంటాడు. తర్వాత విక్రమ్‌తో అన్నం తినిపించుకుంటుంది.

తులసి హనీ అలా.. వీళ్లేమో:ఇంటికి వచ్చిన హనీ.. తులసితో పాటు వాళ్లందరినీ తమ ఇంటికి వచ్చేయమని అడుగుతుంది. కానీ, తులసి దానికి కుదరదు అంటుంది. అయినా సరే హనీ ఎంతగానో పట్టుపడుతుంది. దీంతో తులసి హనీతో ఆడుకుంటుంది. మరోవైపు ధనుంజయ్, రత్నప్రభలు నందూతో 'ఏంటి మీరు కెఫే నడుపుతారా? ఇంతకీ ఈ ఇల్లు మీ సొంత ఇల్లేనా. మనిషి మనసు ఎప్పుడూ డబ్బు సంపాదించడం కోసం రకరకాలుగా వెతుకుతూ ఉంటుంది. కలిసిరాకపోతుందా' అంటుంది. దీంతో నందూ 'మాకు అలాంటి ఆలోచనలు లేవు.. మేం దొరికిన దాంతోనే సంతోషంగా ఉంటాం' అని అంటాడు. దీనికి ధనంజయ్ 'పైకి అలాగే అంటారు లెండి' అనగా.. 'మీ మనసులో ఏముందో చెప్పండి' అని అంటాడు. అప్పుడు రత్నప్రభ వాళ్లపై సెటైర్లు వేస్తుంది.

వాళ్లతో జాగ్రత్తగా ఉండు:చివరకు హనీకి నచ్చజెప్పడంతో రత్నప్రభ వాళ్లు వెళ్లిపోతారు. ఆ తర్వాత అందరూ కూర్చుని తింటూ ఉండగా తులసి 'హనీ వాళ్ల ఇంటికి వచ్చేయమంటుంది వెళ్లిపోదామా' అని అడుగుతుంది. దీంతో అందరూ షాక్ అవగా తులసి 'నేను ఊరికే అన్నాను. నాకు సామ్రాట్ గారి అన్న, వదినలు బాగా నచ్చారు. హనీ నాపై దిగులు పెట్టుకుందని తెలియగానే.. మొహమాట పడకుండా వెంటనే ఇక్కడికి తీసుకుని వచ్చాను.. వేరే వాళ్లైతే హనీపై కోప్పడి నాలుగు తగిలించేవారు' అంటుంది. దీంతో వాళ్లు తమను అవమానించి మాట్లాడినట్లు తులసికి చెప్తారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











