For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: తులసి.. సామ్రాట్ మధ్య ఊహించని సీన్.. లాస్య వల్లే జరిగిందంటూ!

  |

  దేశంలోని చాలా భాషల కంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి మరి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. లాస్య, నందూకు వెళ్తున్నానని చెప్పేసి లక్కీ.. తులసి వాళ్ల ఇంటికి వస్తాడు. ఆ తర్వాత సామ్రాట్ కూడా హనీని తీసుకొచ్చి అక్కడ డ్రాప్ చేస్తాడు. తనకు వేరే పని ఉందని కార్లోనే కూర్చుని ఉండిపోతాడు. అప్పుడు లాస్య, నందూ వచ్చి పిలవకుండా వచ్చినందుకు గింజుకుంటూ ఉంటారు. ఆ సమయంలో లాస్య.. నందూ, తులసితో చేసుకున్న ఒప్పందం గురించి మాట్లాడుతుంది. అదంతా కారులో ఉన్న సామ్రాట్ వినేస్తాడు. దీంతో నిజం తెలుసుకుని బాధ పడతాడు. ఇక, ఇంటికొచ్చిన నందూ, లాస్యను తులసి ఉండమని అంటుంది.

  హాట్ షోతో షాకిచ్చిన రమ్యకృష్ణ: వామ్మో ఈ వయసులో కూడా ఇలాంటి ఫొటోలా!

  సామ్రాట్ గురించి చెప్పిన హనీ

  సామ్రాట్ గురించి చెప్పిన హనీ

  నందూ, లాస్య ఇంటికి వెళ్లిపోవాలని అనుకుంటోన్న సమయంలో తులసి వాళ్లను ఆపుతుంది. అంతేకాదు, 'మీరు ఎలాగూ ఇక్కడికి వచ్చారు కాబట్టి పూజ చేశాకే వెళ్లండి నందగోపాల్ గారు. ఇంటికొచ్చిన వాళ్లను వెళ్లిపోమనే పద్దతి మాది కాదు' అని అంటుంది. దీంతో వాళ్లు ఉండేందుకు ఒప్పుకుంటారు. అప్పుడు లాస్య.. హనీని చూసి 'హాయ్ హనీ ఎప్పుడు వచ్చావు? నిన్ను అస్సలు చూడలేదు. డాడీ ఇక్కడకు రాలేదా' అని అడుగుతుంది. దీంతో హనీ 'నాతో పాటు డాడీ కూడా వచ్చారు. ఆయన బయట కారులోనే ఉన్నారు' అని సమాధానం చెబుతుంది.

  సామ్రాట్ కోసమే వెళ్లిన తులసి

  సామ్రాట్ కోసమే వెళ్లిన తులసి

  హనీ చెప్పిన వెంటనే తులసి 'అయ్యో.. నిజమా.. నాకు చెప్పనేలేదు. అయినా ఇంటి వరకూ వచ్చి బటయ కారులో ఉండటం ఏంటి' అని అంటుంది. ఆ వెంటనే సామ్రాట్ కారు దగ్గరికి వెళ్తుంది. కానీ, ఆ సమయంలో అతడితో ఎలా మాట్లాడాలో తులసికి అర్థం కాదు. సామ్రాట్‌కు కూడా ఏం మాట్లాడాలో అర్థం కాదు. అప్పుడు తులసి 'సామ్రాట్ గారిని ఇబ్బంది పెట్టుడు ఎందుకు.. నేనే ముందు మాట్లాడేస్తా' అని అనుకుంటుంది. సామ్రాట్ కూడా అదే అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ముందు నేనే మాట్లాడేస్తా అనుకుంటాడు. అలా ఇద్దరూ ఒకేసారి మాట్లాడుతారు.

  యాంకర్ శ్రీముఖి ఎద అందాల ఆరబోత: టాప్ విప్పేసి మరీ హద్దు దాటేసిందిగా!

   సామ్రాట్‌తో తప్పైందని చెప్పి

  సామ్రాట్‌తో తప్పైందని చెప్పి

  కారు దగ్గరే నిల్చుని ఉన్న సామ్రాట్‌తో తులసి 'ఇంటి దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా ఇక్కడే ఉండిపోయారేంటి' అని అడుగుతుంది. దీనికి అతడు 'నేను మీ బాస్ ను కాదు కదా.. ఏ హోదాతో రావాలి. నేను మీ బిజినెస్ పార్టనర్‌ను కూడా కాదు. ఎందుకంటే మీరు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు కదా. కనీసం మీ ఫ్రెండ్‌ను కూడా కాదు. కేవలం హనీకి తండ్రిగా వచ్చాను. అందుకే ఇక్కడే ఉండిపోయాను' అంటాడు. అప్పడు తులసి 'సారీ అండీ.. తప్పయిపోయింది. హనీతో పాటు మిమ్మల్ని కూడా వినాయక చవితి పూజకు రమ్మని పిలవాల్సింది' అని అంటుంది.

  దానివల్లే నష్టపోయాను అంటూ

  దానివల్లే నష్టపోయాను అంటూ

  తులసి మాటలకు సామ్రాట్ 'హనీతో పాటు నన్ను పిలవాలని అనుకున్నారా.. నాతో పాటు హనీని పిలవాలని అనుకున్నా. అయినా అతి మంచితనం, హద్దు దాటిన త్యాగం మంచిది కాదంటారు. దానికి మీరేమంటారు' అని అడుగుతాడు. దీనికి తులసి 'అలాంటి వాటివల్లే నేను నష్టపోయినా.. నా నష్టం వేరే వాళ్లకు లాభం చేకూరుతుందని నేను సంతోషపడతాను' అంటుంది. ఆ సమయంలోనే తులసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బయటికి వచ్చి చూస్తారు. ఆ తర్వాత అందరూ వచ్చి సామ్రాట్‌ను పిలుస్తారు. దీంతో అతడు లోపలికి వచ్చేస్తాడు. అప్పుడు అందరూ సంతోషిస్తారు. కానీ, నందూ, లాస్య మాత్రం తెగ ఫీలైపోవడంతో పాటు కోపంతో రగిలిపోతూ ఉంటారు.

  బాత్రూంలో ప్రణిత హాట్ సెల్ఫీ: తల్లైన కొద్ది రోజులకే జాకెట్ విప్పేసి మరీ!

   సారీ చెప్పమని అభి డిమాండ్

  సారీ చెప్పమని అభి డిమాండ్

  తులసి ఇంట్లోకి సామ్రాట్ వచ్చిన తర్వాత హనీ 'నాన్నా.. మన ఇంట్లో ఎప్పుడైనా ఇంత ఘనంగా వినాయకుడి పూజ చేశామా? చూశావా.. ఇక్కడికి వస్తే చూసి నేర్చుకుంటావని పిలిచాను. నాన్న నువ్వు కూడా ఈ వినాయకుడి పూజలో కూర్చోవాలి' అంటుంది. దీంతో సామ్రాట్ సరే అంటాడు. ఇంతలో అభి 'మా అమ్మను అవమానించినందుకు సారీ చెప్పి లోపలికి రండి' అని సామ్రాట్‌ను డిమాండ్ చేస్తాడు. దీంతో తులసి అవసరం లేదు అంటుంది. ఇంతలో సామ్రాట్‌కు కోపం వచ్చి 'నేను ఇంట్లోకి రాను లేండి.. నేను కారులోనే కూర్చొంటే బెటర్' అంటాడు. అప్పుడు తులసి 'అయ్యో అదేం కాదు. పూజకు లేట్ అవుతోంది. వెంటనే వెళ్దాం పదండి' అంటుంది.

  సామ్రాట్ చేతికి కంకణం కట్టి

  సామ్రాట్ చేతికి కంకణం కట్టి

  ఆ తర్వాత అందరూ కంకణాలు కట్టుకుంటారు. అక్కడ ఉన్న భార్యాభర్తలు ఒకరికి మరొకరు కంకణాలు కట్టుకుంటారు. ఇంతలో సామ్రాట్‌కు కంకణం కట్టడానికి తులసి వెళ్తుంది. ఆమె సామ్రాట్ గారికి కంకణం కట్టడం ఏంటి అని అందరూ మనసులో అనుకుంటూ ఉంటారు. అప్పుడు తులసి 'హనీ ఇలారా అమ్మా.. నాన్న గారికి కంకణం కట్టమ్మా' అంటుంది. కానీ, హనీ నాకు కట్టడం రాదు అంటుంది. దీంతో నేను కట్టిస్తాను కదా అంటూ ఎలా కట్టాలో చెబుతుంది. ఆ తర్వాత హనీ ఆంటి.. మీ చేతికి కూడా కడతాను అంటుంది. దీంతో సరే అంటుంది. అంతేకాదు, నాకు నాన్న హెల్ప్ చేస్తారు అంటే సామ్రాట్ కూడా సరే అంటాడు. పంతులు గారు వచ్చి వినాయక పూజ చేస్తారు.

  Krishnam Raju Net Worth: కృష్ణంరాజుకు అన్ని కోట్ల ఆస్తులు.. అప్పట్లోనే అంత రెమ్యూనరేషన్‌తో రికార్డు

  నందూ ఆశీర్వాదం తీసుకోరు

  నందూ ఆశీర్వాదం తీసుకోరు

  పూజ ముగిసిన తర్వాత పంతులు తులసికి అక్షింతలు ఇచ్చి పెద్ద వారి ఆశీర్వాదం తీసుకోండి అంటారు. దీంతో అత్తమామ వాళ్ల ఆశీర్వాదం తీసుకుంటుంది. తర్వాత అభి, అంకిత జంట, ప్రేమ్, శృతి జంట తులసితో పాటు నానమ్మ తాతయ్య ఆశీర్వాదం కూడా తీసుకుంటారు. ఆ తర్వాత డాడ్ దీవనలు కూడా తీసుకుందాం రా అని అభి.. అంకితను అడుగుతాడు. కానీ, అంకిత సంకోచిస్తుంది. ఇంతలో తులసి వెళ్లి తీసుకోండి అంటుంది. దీంతో వెళ్లి అభి, అంకిత దీవెనలు తీసుకుంటారు. కానీ, ప్రేమ్, శృతి మాత్రం దీవెనలు తీసుకోరు. అంతేకాదు, ప్రేమ్ 'నాకు మొక్కుబడి దండాలు చేసే అలవాటు లేదు' అంటాడు. దీంతో సామ్రాట్ ' ప్రేమ్.. మీ అమ్మ గారే ఆయన మాట విని గౌరవిస్తున్నప్పుడు నువ్వు ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే తప్పేంటి. సారీ మీ ఫ్యామిలీ విషయంలో ఇన్వాల్వ్ అయ్యాను' అంటాడు. దీంతో ప్రేమ్ 'పర్లేదు సార్.. మా ఫ్యామిలీ పబ్లిక్ అయింది' అంటాడు. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 735: Tulasi Reunites with Samrat. Then Her Family Feels Happy. After That Nandhu Irritated about Lasya Comments on Tulasi and Samrat.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X