For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi September 13th Episode: తులసికి షాకిచ్చిన శృతి.. సిగ్గులేదా చంపుతానంటూ ఘాటుగా!

  |

  ఎన్నో ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నందూ వచ్చి చెప్పి వెళ్లిన తర్వాత గుడిలో ఒంటరిగా ఉండి బాధ పడుతూ ఉంటుంది శృతి. అంతలో అక్కడకు వెళ్లిన ప్రేమ్ తన ప్రేమను వ్యక్తపరుస్తాడు. కానీ, ఆమె మాత్రం తనకు సమయం కావాలని చెబుతుంది. దీంతో అతడు నిరాశగా ఉంటాడు. ఆ తర్వాత లాస్య వాళ్లిద్దరూ శాశ్వతంగా విడిపోయేలా నందూకు మరికొన్ని సలహాలు ఇస్తుంది. దీంతో అతడు కూడా ఈ విషయంలో పట్టుదలగా ఉంటాడు. అనంతరం ప్రేమ్ తల్లి దగ్గర బాధ పడుతుంటాడు. దీంతో ఆమె అతడికి అన్నీ మర్చిపోయేలా ధైర్యం చెబుతూ మాట్లాడుతుంది.

  Bigg Boss: లేడీ కంటెస్టెంట్‌లకు దెబ్బ మీద దెబ్బలు.. ఐదుగురిలో నలుగురు ఎలిమినేట్

  శృతి బాధను అర్థం చేసుకున్న తులసి

  శృతి బాధను అర్థం చేసుకున్న తులసి

  నందూ తనతో అన్న మాటలను గుర్తు చేసుకుని శృతి ఏడుస్తుంటుంది. అలాగే, ప్రేమ్ తనకు ప్రపోజ్ చేసిన విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటుంది. ఆ సమయంలో ఆమె ఒంటరిగా బాధ పడుతుంది. దీంతో తులసి అప్పుడు అక్కడకు వచ్చి ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది. అంతేకాదు, ‘తల్లిలా అడుగుతున్నా. ఎందుకు బాధ పడుతున్నావు చెప్పు' అని అడుగుతుంది. దీంతో శృతి ‘నా గుండెళ్లో ఉన్న బాధను అలాగే ఉండనివ్వండి ఆంటీ. నా కష్టాలను నేను అనుభవిస్తా. ఇది వేరే వాళ్ల మీద రుద్దను' అంటూ సమాధానం చెబుతుంది.

   తులసికి ఊహించని జవాబిచ్చిన శృతి

  తులసికి ఊహించని జవాబిచ్చిన శృతి

  ఎంత అడిగినా శృతి మాత్రం తులసికి తన బాధకు కారణం మాత్రం చెప్పదు. ఆ సమయంలో ‘నువ్వు ప్రేమ్ లాంటి వాడిని భర్తగా కావాలని కోరుకున్నావు కదా. ప్రేమ్‌ను పెళ్లి చేసుకోవచ్చు కదా. నువ్వు నా కోడలు అయితే నేనెంతో సంతోషిస్తాను' అని అంటుంది తులసి. అప్పుడు శృతి ‘మీరు ప్రేమ్ వైపే ఆలోచిస్తారు ఎందుకు? నాకు ప్రేమ్‌ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఎప్పుడూ లేదు. దయచేసి నన్ను అర్థం చేసుకుని ఇంకెప్పుడూ దీని గురించి అడగకండి' అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆమె అన్న మాటలను అక్కడే ఉన్న ప్రేమ్ కూడా విని బాధ పడతాడు.

  ప్యాంట్‌ లేకుండా హీరోయిన్ ఘాటు ఫోజు: ప్రైవేట్ ఫొటో షేర్ చేసిన వర్మ.. మామూలోడు కాదుగా!

  ఫలించిన నందూ, లాస్య కన్నింగ్ ప్లాన్

  ఫలించిన నందూ, లాస్య కన్నింగ్ ప్లాన్

  క్లయింట్స్‌తో నందూ ఫోన్ మాట్లాడుతుండగా లాస్య తెగ సంతోష పడుతూ అక్కడకు వస్తుంది. వచ్చి రావడమే గుడ్ న్యూస్ అంటూ మురిసిపోతుంది. అప్పుడు నందూకు ఏమీ అర్థం కాక అడుగుతాడు. దీంతో లాస్య ‘మన ప్లాన్ సక్సెస్ అయింది నందూ. తులసి శృతితో మాట్లాడింది. అప్పుడు తను ప్రేమ్‌ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తేల్చి చెప్పేసింది' అని అంటుంది. దీంతో నందూ కూడా సంతోషపడతాడు. అప్పుడు లాస్య ‘ఇప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ్‌ ఎమోషన్స్‌కు తగ్గట్లుగా వ్యవహరించాలి. అప్పుడే అంతా సక్సెస్ అవుతుంది' అని చెప్తుంది.

  జీకేకు ఫోన్‌లో శుభవార్త చెప్పిన నందూ

  జీకేకు ఫోన్‌లో శుభవార్త చెప్పిన నందూ

  నందూ, లాస్య మాట్లాడుకుంటుండగానే జీకే ఫోన్ చేస్తాడు. అప్పుడు నందూ ‘జీకే గారు మీకు రెండు మూడు రోజుల్లోనే ఓ శుభవార్త చెబుతాను. అంతా అనుకున్నట్లుగానే జరుగుతుంది' అని ఆయనకు చెబుతాడు. దీంతో జీకే ‘హమ్మయ్యా.. అంతా మంచి జరిగితే ఇంకేముంది.. అయితే, ఈ విషయాన్ని నేను మా అమ్మాయి అక్షరకు చెప్పుకోవచ్చు కదా' అని అడుగుతాడు. దీనికి నందూ ‘ధైర్యంగా చెప్పండి. నేనున్నా కదా అంతా చూసుకుంటా' అంటాడు. ఆ సమయంలో లాస్య ఈ పెళ్లి జరిగితే కంపెనీ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది అని నందూతో చెబుతుంది.

  పవన్ కల్యాణ్ సెన్సేషనల్ రికార్డ్: ఒకే సినిమాతో రెండు ఘనతలు సొంతం.. ఇండియాలోనే ఏకైక హీరో

  ప్రయాణం అపొద్దని వివరించిన తులసి

  ప్రయాణం అపొద్దని వివరించిన తులసి

  శృతి అన్న మాటలను గుర్తు చేసుకుంటూ తనలో తానే కుమిలిపోతూ ఉంటాడు ప్రేమ్. అంతలో అక్కడకు వెళ్లిన తులసి ‘ఏంటి నాన్నా.. బాధ పడుతున్నావా' అని అడుగుతుంది. ఆ సమయంలో అతడు కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు తులసి ‘నేను నీ తల్లిని రా. నువ్వు బాధ పడినా.. సంతోషంలో ఉన్నా నాకు తెలిసిపోతుంది. కొందరు మనతో బంధాలను కలుపుకుంటారు. మరికొందరు బాధను సృష్టించి వదిలేసి వెళ్లిపోతారు. ఇవన్నీ మన జీవితంలో సహజం నాన్న. బాధ కలిగిన చోటే ప్రయాణం ఆపేయకూడదు' అంటూ ఓదార్చుతుంది.

  కారణం తెలుసుకో... ఇబ్బంది పెట్టొద్దు

  కారణం తెలుసుకో... ఇబ్బంది పెట్టొద్దు

  తులసి అన్న మాటలతో ప్రేమ్ తన బాధను మర్చిపోయే ప్రయత్నం చేస్తానని చెప్తాడు. ఆ సమయంలో ‘నేను ఈ బాధను మర్చిపోడానికి ట్రై చేస్తాను. కానీ, అసలు శృతి నన్ను ఎందుకు వద్దని అన్నదో తెలుసుకుంటాను' అని అంటాడు. అప్పుడు తులసి ‘నువ్వు ముందు ఇదంతా మర్చిపోడానికి ప్రయత్నించు నాన్న. ఆ తర్వాత శృతిని అడుగు. కానీ, ఈ ప్రాసెస్‌లో తనను మాత్రం ఎలాంటి ఇబ్బందులు పెట్టకు' అని సలహా ఇస్తుంది. దానికి ప్రేమ్ అంగీకరించడంతో పాటు అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

  ఆ పొరపాటు చేయడం వల్లే సాయి ధరమ్ తేజ్‌కు యాక్సిడెంట్.. ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది!

  Bigg Boss Telugu 5 Episode 6 Analysis: Priyanka Singh - Uma Devi's Fight || Filmibeat Telugu
  అక్షరపై ప్రేమ్ ఆగ్రహం.. సిగ్గులేదా అని

  అక్షరపై ప్రేమ్ ఆగ్రహం.. సిగ్గులేదా అని

  శృతి కాదన్న చిరాకులో ఉన్న ప్రేమ్‌కు అక్షర ఫోన్ చేసి ఆటపట్టిస్తుంది. ఆ సమయంలో అతడు ‘నువ్వెవరో కానీ దగ్గర ఉంటే చంపేస్తాను. అసలు నీకు సిగ్గుందా.? పరిచయం లేని అబ్బాయితో ఫోన్ చేసి ఇలా మాట్లాడతారా? అవతలి వాళ్లు ఏ పరిస్థితిలో ఉన్నారో తెలుసుకోవాలి. ఆట పట్టించడానికి సమయం సందర్భం లేవా? చూడు.. నీకు అబ్బాయిలతో టైంపాస్ చేసే అలవాటు ఉందేమో.. అమ్మాయిలతో టైంపాస్ చేసే అలవాటు నాకు లేదు' అని కాల్ కట్ చేస్తాడు. తర్వాత ఏడుస్తూ ఈ విషయాన్ని ఆమె తన తండ్రి జీకేకు చెప్తుంది. దీంతో ఈ ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 423: Lasya and Nandhu Evil Plan on Shruthi Was Success. Then Prem Fired When Akshara Irritated Him.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X