Intinti Gruhalakshmi: జాహ్నవితోనే విక్రమ్.. నందూకు హ్యాండిచ్చిన తులసి.. సామ్రాట్ కంపెనీ అతడి చేతికే!
తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar
మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే:మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. జాహ్నవిని నీకు సవతిగా చేయడానికే ఇక్కడికి పిలిపించాను అని దివ్యతో రాజ్యలక్ష్మి అంటుంది. దీంతో ఆమె మొదట ప్రతిఘటించినా.. ఆ తర్వాత మాత్రం ఆలోచనలో పడిపోతుంది. అనంతరం జాహ్నవి వెళ్లి విక్రమ్‌ను హగ్ చేసుకోగా.. దివ్య అనుకుని సీరియస్ అవుతాడు. దీంతో వాళ్లిద్దరి మధ్య ఏదో జరిగిందని జాహ్నవి అనుకుంటుంది. ఆ వెంటనే వెళ్లి రాజ్యలక్ష్మిని ప్రశ్నించగా.. దివ్యపై లేనిపోనివి అన్నీ చెప్తుంది. అంతేకాదు, విక్రమ్‌ను నీకు పెళ్లి చేయాలనుకున్నా అంటుంది. దీంతో జాహ్నవికి దివ్యపై కోపం పెరిగిపోతుంది.

తులసి లేకపోతే చేయలేవా అని:కెఫేకు సంబంధించి కొత్త కాంట్రాక్ట్ వచ్చిందని.. దానికోసం ప్రజెంటేషన్ రేపు ఉందని తులసికి నందూ చెప్తాడు. దీంతో తులసి 'దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు' అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో నందూ తనలో తాను అదేంటి అలా వెళ్లిపోయింది అని అనుకుంటూ ఉంటాడు. అంతలోనే అక్కడకు పరందామయ్య వస్తాడు. వచ్చీ రావడమే ఆయన 'ఏరా నందూ.. తులసి లేకపోతే ఏం చేయలేవా? రేపు జరిగే మీటింగ్‌లో హాయిగా నిద్రపో. అన్నీ తులసి చూసుకుంటుందిలే' అంటూ వెటకారంగా మాట్లాడతాడు.
దివ్య పిలిస్తే నో.. జాహ్నవికి ఓకే:దివ్య ఉదయాన్నే గార్డెన్ ఏరియాలో కూర్చుని యోగా చేస్తూ ఉంటుంది. అప్పుడే విక్రమ్ మొక్కలకు నీళ్లు పడుతుండగా యోగా నేర్పిస్తాను రా అని అతడిని పిలుస్తుంది. కానీ, దివ్య ఎంత పిలిచినా విక్రమ్ మాత్రం రాడు. ఇదంతా దూరంగా ఉన్న జాహ్నవి గమనిస్తుంది. ఆ తర్వాత దివ్య అక్కడి నుంచి వెళ్లిపోగానే జాహ్నవి ఎంట్రీ ఇచ్చి విక్రమ్‌ను బలవంతంగా యోగా చేయడానికి ఒప్పిస్తుంది. ఆ తర్వాత విక్రమ్‌తో కొన్ని యోగాసనాలు కూడా చేయిస్తుంది. అదంతా చూసిన రాజ్యలక్ష్మి ఇక దివ్య పని అయిపోయినట్లే అని తెగ సంతోష పడుతుంది.

దివ్యను గెంటేస్తుందని హ్యాపీగా:గార్డెన్ ఏరియాలో దివ్య, జాహ్నవి కలిసి యోగా చేస్తుండగా రాజ్యలక్ష్మి వెళ్లి దివ్యను తీసుకొచ్చి చూపిస్తుంది. అంతేకాదు, 'నువ్వు పిలిస్తే రాని వాడు జాహ్నవి పిలిస్తే వచ్చాడు. వాడికి ఇష్టం లేకపోతే తనతో అలా చేస్తాడా' అని అంటుంది. దీంతో దివ్య 'ఇష్టం లేని పని చేస్తున్నాడు. ఇష్టం లేకపోయినా ఏదో ఒక రోజు నా దగ్గరకు వచ్చేస్తాడు' అని వెళ్లిపోతుంది. దీంతో రాజ్యలక్ష్మి 'యోగాకి ఒప్పించిన జానూ.. ఏదో ఒకరోజు పెళ్లికి కూడా ఒప్పించి దివ్యను ఈ ఇంట్లో నుంచి శాశ్వతంగా గెంటేస్తుంది' అనుకుంటూ తనలో తాను తెగ సంబరపడుతుంది.

బాబాయి ఫోన్‌తో తులసి టెన్షన్:కెఫే కాంట్రాక్ట్ కోసం నందూ, తులసి కలిసి ఓ కంపెనీలో మీటింగ్‌కు వెళ్తారు. అక్కడ తులసి ప్రజంటేషన్ ఇస్తుంటుంది. అప్పుడే ఆమె ఫోన్‌కు సామ్రాట్ వాళ్ల బాబాయి పదే పదే కాల్ చేస్తుంటాడు. దీంతో నందూ తీసుకుని 'తులసి ఇంపార్టెంట్ మీటింగ్‌లో ఉంది. అది అయిపోగానే కాల్ చేయిస్తాను' అని చెప్తాడు. కానీ ఆయన మాత్రం వినకుండా అర్జెంట్‌గా మాట్లాడాలి అంటాడు. దీంతో తులసి ఫోన్ తీసుకుంటుంది. అప్పుడాయన 'అర్జెంట్‌గా ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. ఏ నిమిషంలోనైనా నాకు ఏమైనా అవ్వచ్చు .వెంటనే వచ్చేయ్' అని కాల్ కట్ చేస్తాడు.

నందూకు షాక్.. కంపెనీ డౌన్:కాల్ కట్ చేసిన వెంటనే తులసి మీటింగ్ మధ్యలోనే అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో నందూ వాళ్లను ఇంప్రెస్ చేయలేకపోతాడు. ఫలితంగా కాంట్రాక్టు చేజారిపోతుంది. ఇక, సామ్రాట్ ఇంటికి వెళ్లిన తులసి ఏమైందని అడగ్గా.. 'సామ్రాట్ రుణం తీర్చుకోవాలని అనుకున్నావు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. సామ్రాట్ మూడు విషయాలకు ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఒకటి హనీ, తులసి, మరొకటి ఆఫీసు. బిజినెస్ గురించి నేను రాజీ పడదలచుకోలేదు. కంపెనీ మూసేస్తే వెయ్యి కుటుంబాలు రోడ్డున పడతాయి. సామ్రాట్ లేడని కంపెనీ షేర్లు పడిపోయాయి. బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన లోన్ తిరిగి ఇవ్వమని ఒత్తిడి తీసుకొస్తున్నారు' అని చెప్తాడు.

నువ్వే తీసుకో.. ఆల్రెడీ చేశాం:ఆ తర్వాత ఆయన 'సామ్రాట్ లేకపోవడం వల్ల అలా జరుగుతుంది. ఆ కంపెనీ బాధ్యతలు నువ్వే తీసుకోవాలి. నువ్వు ఏంటో నీకు తెలుసు నాకు తెలుసు. ఈరోజే నువ్వు కంపెనీ బాధ్యతలు తీసుకోవాలి' అని చెప్తాడు. అంతలోనే రత్నప్రభ వచ్చి 'అంకుల్ నీతో డిస్కస్ చేస్తున్నారు కానీ.. మా ఆయన ఆఫీసు మేనేజర్స్‌తో మాట్లాడి ఎలా చేయాలి ఏం చేయాలి యాక్షన్ ప్లాన్ కూడా చెప్పేశారు' అంటుంది. తర్వాత కంపెనీని తాను చూసుకుంటానని ధనుంజయ్ చెప్తాడు. దీంతో తులసి పెద్ద భారం దించేశారు సంతోషం అనేసి తులసి వెళ్ళగా.. వాళ్లు సంతోషిస్తారు.

ఏ హక్కుతో అడుగుతున్నారు:ఇక, ఇంటికి తిరిగి వచ్చిన తులసిపై నందూ సీరియస్ అవుతాడు. దీంతో మన కెఫే కాంట్రాక్టు పోయిందని అంటాడు. అప్పుడామె మనది కాదు.. మీది అంటుంది. దీంతో నందూ మరి కెఫే కోసం ఎందుకు తపించావు అని అడగ్గా.. తులసి 'ఒక ఫ్రెండ్ కోసం తిరిగాను. అసలు ఏ హక్కుతో మీరు నామీద అరుస్తున్నారు. మొత్తం నా మీద వదిలేస్తే ఎలా అయినా డీల్ మాత్రమే మీ చేతిలో వదిలి పెట్టి వెళ్ళాను. కెఫే గురించి మొత్తం నేనే ఎక్స్‌ప్లేన్ చేశాను కదా. అది కూడా చేతకపోతే ఎలా? మీకు చేతనయింది నామీద వేలెత్తి చూపించడమే' అంటూ సీరియస్ అవుతుంది. తర్వాత ఆమె అక్కడి నుంచి వెళ్లిపోవడంతో పరందామయ్య వచ్చి నందూను తిడతాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూరైంది.


Click it and Unblock the Notifications











