For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: నిజం చెప్పి షాకిచ్చిన సామ్రాట్.. కాళ్లు పట్టుకోమని అనడంతో!

  |

  సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

  దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి మరి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

  మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. గణపతి పూజ కోసం ఇంటికి వచ్చిన సామ్రాట్‌తో కలిసిపోమని తులసిని ఇంట్లో వాళ్లు అందరూ అడుగుతారు. అదే సమయంలో అతడికి నిజం చెప్పమని అంటారు. దీంతో తులసి అలా చేస్తే నందూను అందరి ముందే అవమానించినట్లు అవుతుందని అంటుంది. ఆ తర్వాత తులసి.. లక్కీ, హనీకి పులిహోర తినిపిస్తుంది. మధ్యలో అభి గొడవ చేయబోగా.. అతడిని అంకిత తీసుకెళ్తుంది. అనంతరం అందరూ సాయంత్రం ఎంజాయ్ చేద్దామని దివ్య.. సామ్రాట్‌ను ఉండమని అడుగుతుంది. ఆ తర్వాత చిటీల గేమ్‌ ప్రారంభిస్తారు.

  హాట్ షోతో షాకిచ్చిన రమ్యకృష్ణ: వామ్మో ఈ వయసులో కూడా ఇలాంటి ఫొటోలా!

  గొడవ పడి.. యాక్టింగ్ అని చెప్పి

  గొడవ పడి.. యాక్టింగ్ అని చెప్పి

  చీటీల గేమ్‌లో భాగంగా ప్రేమ్, శృతి వంతు వస్తుంది. దీంతో వాళ్లిద్దరూ యాక్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో టాస్కును చేస్తూ నిజంగానే వాళ్లిద్దరూ గొడవ పడతారు. నీదే తప్పు నువ్వే సారీ చెప్పాలి అని ఒకరినొకరు అనుకుంటారు. అంతేకాదు, నీ లైఫ్‌లోకి వచ్చానని, ఇలాంటి తప్పు చేసినందకు తగిన శాస్తి జరిగిందని శృతి ప్రేమ్‌తో అంటుంది. దీనికి ప్రేమ్ కూడా ఘాటుగానే సమాధానం చెప్తాడు. దీంతో అక్కడున్న వాళ్లంతా అసలు వీళ్లు యాక్టింగ్ చేస్తున్నారా? నిజంగానే గొడవ పడుతున్నారా? అనుకుంటారు. అప్పుడే ప్రేమ్, శృతి ఇదంతా యాక్టింగ్ అంటారు.

  అదిరిపోయేలా వాళ్లిద్దరి డ్యాన్స్

  అదిరిపోయేలా వాళ్లిద్దరి డ్యాన్స్

  ప్రేమ్, శృతి యాక్టింగ్ అయిపోయిన తర్వాత దివ్య ఇప్పుడు మా తాతయ్య, నానమ్మ వంతు అంటుంది. తర్వాత వాళ్లను ఒక స్లిప్ తీయండి అంటుంది. దీంతో పరందామయ్య ఒక స్లిప్ తీస్తాడు. అందులో వీళ్లిద్దరూ కలిసి ఒక హిట్ సాంగ్‌కు డ్యాన్స్ చేయాలి అని వస్తుంది. అప్పుడు అందరూ యాంకరేజ్ చేయగా పరందామయ్య కమాన్ డార్లింగ్ లెట్ అజ్ డ్యాన్స్ అంటాడు. ఇద్దరూ కలిసి రాను రాను అంటూనే చిన్నదో అనే పాటకు డ్యాన్స్ చేస్తారు. ఎంతో హుషారుగా, బాగా ఎంజాయ్ చేస్తారు. దీంతో అందరూ విజిల్స్ వేసి క్లాప్స్ కొట్టడంతో ఈ ఎపిసోడ్ సరదాగా సాగిపోతోంది.

  బట్టలు విప్పేసి బాలయ్య హీరోయిన్ దారుణం: ఇలా హద్దు దాటేసిందేంటి!

  లాస్యతో కలిసి నందూ డ్యాన్సు

  లాస్యతో కలిసి నందూ డ్యాన్సు

  గేమ్‌లో భాగంగా తర్వాత నందూ, లాస్య వంతు వస్తుంది. వాళ్లిద్దరికీ డ్యాన్స్ చేస్తూ పార్టనర్‌ను చేతుల్లోకి ఎత్తుకొని తిప్పాలి అని అందులో రాసి ఉంటుంది. వెంటనే ఇద్దరూ లేస్తారు. చిట్టి నడుమునే చూస్తున్నా.. చిత్రహింసలో చస్తున్నా అనే పాటకు నందూ, లాస్య ఇద్దరూ కలిసి డ్యాన్స్ వేస్తారు. వాళ్లు డ్యాన్స్ వేస్తుంటే తులసి చాలా ఇబ్బందిగా చూస్తుంటుంది. ప్రేమ్ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. కానీ వాళ్లిద్దరు మాత్రం అవేవీ పట్టించుకోకుండా డ్యాన్స్ చేస్తారు. ఆ తర్వాత లాస్య ఎత్తుకొని నందూ కాసేపు అటూ ఇటూ తిరుగుతాడు. దీంతో చప్పట్లు కొడుతారు.

  తులసి పాట.. సామ్రాట్ ఆటలు

  తులసి పాట.. సామ్రాట్ ఆటలు

  ఆ తర్వాత ఇద్దరే మిగిలారని చెప్పిన దివ్య.. తులసి దగ్గరకు వెళ్లి చీటీ తీయమంటుంది. ఆమె ఒక చీటీ తీయగా అందులో పాట పాడాలని ఉంటుంది. అప్పుడు దివ్య పాట తియ్యగా పాడాలి మామ్ అంటుంది. దీంతో తులసి అంటే చెక్కర వేసుకోవాలా అంటుంది. అప్పుడు సామ్రాట్ మీ మనసు తియ్యగా ఉంటే చాలు తులసి గారు అంటాడు. ఆ తర్వాత ఆమె ఒక పాత తెలుగు సాంగ్‌ను పాడుతుంది. అది వింటూ అందరూ మైమరచిపోతారు. ఇక, తులసి తన భర్తతో ఉన్న సంఘటనలను గుర్తు చేసుకుంటుంది. ఆ తర్వాత సామ్రాట్, లక్కీ, హనీలు డ్యాన్స్ చేస్తారు.

  బిందు మాధవి ఎద అందాల అరాచకం: పైన ఏమీ లేకపోవడంతో!

  తులసి కథ చెప్పేసిన సామ్రాట్

  తులసి కథ చెప్పేసిన సామ్రాట్

  చివర్లో సామ్రాట్ వంతు రావడంతో అతడు చీటీ తీస్తాడు. అందులో మీకు నచ్చిన కథ చెప్పాలి అని రాసి ఉంటుంది. దీంతో సామ్రాట్ ‘నేను చెప్పబోయేది కథ కాదు. కథ లాంటి నిజం. నిజం లాంటి కథ. ఈ రోజు నా జీవితంలో మరుపురాని రోజు. విఘ్నేశ్వరుడి మహిమలను తెలుసుకున్న రోజు. అహంకారంతో కళ్లు మూసుకుపోయిన ఒక బాస్ కథ ఇది. బాస్ అంటే కేవలం బాసిజం చేసేవాడే కాదు. తనతో ఉండేవాళ్ల కష్టసుఖాలను, మంచి చెడ్డలను తెలుసుకొని సపోర్ట్‌గా ఉండాలి. తను చేసిందే నిజం అనుకోవద్దు. నా కథలో బాస్ గుడ్డివాడు.. చెవిటివాడు. ఎదుటివాళ్లు చెప్పిందే నమ్మాడు కానీ.. నిజానిజాలు ఏంటో మాత్రం తెలుసుకోలేకపోయాడు. తన బిజినెస్ పార్టనర్‌ను అర్థం చేసుకోకుండా ఇంటి మీదికి వెళ్లి రచ్చ చేశాడు' అంటాడు.

  ఆ నిజాన్ని చెప్పేసిన సామ్రాట్

  ఆ నిజాన్ని చెప్పేసిన సామ్రాట్

  ఆ తర్వాత సామ్రాట్ ‘తన బిజినెస్ పార్టనర్‌ను తన మాజీ భర్త బతిమిలాడుకున్నాడు. తనే మాజీ భర్త అని ఆఫీసులో తెలియనీయొద్దని చెప్పాడు. ఆ మాజీ భర్త మీద జాలితో తన మాటకు కట్టుబడి ఉంది. నిందను భరించింది. బాస్ ఆగడాలను సహించింది. కానీ మాజీ భర్తను మాత్రం ఎక్స్‌పోజ్ చేయలేదు. నూటికో, కోటికో ఉంటారు.. ఇలాంటి మంచివాళ్లు. చేసిన తప్పుకు ఆ మాజీ భర్త ఆమె కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పినా తక్కువే. ఆ బిజినెస్‌మ్యాన్ తప్పుకు ఆ మహాతల్లికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను' అని తనకు తెలిసిన నిజాన్ని చెప్పుకుంటాడు.

  యాంకర్ శ్రీముఖి ఎద అందాల ఆరబోత: టాప్ విప్పేసి మరీ హద్దు దాటేసిందిగా!

  అందరూ వెళ్లిపోయాక దేవుడితో

  అందరూ వెళ్లిపోయాక దేవుడితో

  సామ్రాట్ మాట్లాడిన తర్వాత కోపంతో లేచి లక్కీని తీసుకొని నందూ, లాస్య అక్కడి నుంచి వెళ్లిపోతారు. తర్వాత సామ్రాట్ కూడా తులసి గారు.. ఈ బాస్ చేసిన తప్పులను క్షమిస్తూ రేపు ఆఫీసుకు రండి అంటాడు. అంతేకాదు, నేను వెయిట్ చేస్తూ ఉంటాను బై అని హనీని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో తులసికి ఏం చేయాలో అర్థం కాదు. అనంతరం దేవుడి దగ్గర కూర్చొని తనలో తానే మాట్లాడుకుంటుంది. ‘ఇప్పుడు నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది' అని వినాయకుడికి నమస్కారం చేసుకుంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 737: Samrat Reveals The Truth. Then Lasya and Nandhu Gets Upseted. After That Samrat Asks Tulasi to Rejoin With His Company.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X