Intinti Gruhalakshmi: పనిమనిషిలా మారిన రాజ్యలక్ష్మి.. జాహ్నవి గదిలో దూరిన విక్రమ్.. దివ్యకు షాక్
దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar
బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే : బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. విక్రమ్‌ను యోగా చేయడానికి దివ్య రమ్మని పిలవగా అతడు మాత్రం రానని అంటాడు. కానీ, జాహ్నవి పిలవగానే వెళ్తాడు. అలా వాళ్లిద్దరూ కలిసి యోగాసనాలు చేస్తుండగా చూసి సంతోషించిన రాజ్యలక్ష్మి.. దివ్యను తీసుకొచ్చి చూపిస్తుంది. మరోవైపు, నందూ కెఫేకు కాంట్రాక్టు రావడంతో తులసిని తీసుకుని ప్రజంటేషన్ ఇవ్వడానికి వెళ్తారు. ఆమె కాంట్రాక్టు వివరాలు చెప్తుండగా.. సామ్రాట్ బాబాయి కాల్ చేసి రమ్మంటాడు. దీంతో మధ్యలోనే ఆమె వెళ్లిపోతుంది. దీంతో నందూ కాంట్రాక్టు పోవడంతో కోపం కూడా వస్తుంది.

సీక్రెట్‌గా జాహ్నవి గదిలోకి విక్రమ్ : దివ్యతో కలిసి గదిలో ఉన్న విక్రమ్‌ను జాహ్నవి పిలుస్తూ ఉంటుంది. పదే పదే అరుస్తుండడంతో తనకు ఫోన్ వచ్చినట్లుగా విక్రమ్ యాక్టింగ్ చేస్తాడు. అలా కాల్ మాట్లాడుతున్నట్లు నటిస్తూ జాహ్నవి గదిలోకి వెళ్లిపోతాడు. అది గమనించిన దివ్య అతడి వెనకాలే అక్కడకు వెళ్తుంది. ఇక, విక్రమ్ రావడంతో జాహ్నవి సంతోషిస్తుంది. తర్వాత ఎందుకంత ఆలస్యంగా వచ్చావని ప్రశ్నిస్తుంది. అలా కొద్ది సేపు మాట్లాడుకున్న తర్వాత యూఎస్ నుంచి వచ్చేప్పుడు తెచ్చిన ఒక షర్టును, పెర్‌ఫ్యూమ్ బాటిల్‌ను గిఫ్టుగా ఇస్తుంది.

భర్తను సూటిగా ప్రశ్నించిన దివ్య : జాహ్నవి ఇచ్చిన షర్టును తీసుకుని విక్రమ్ వచ్చేస్తాడు. అంతలోనే తన గదిలోకి వచ్చిన దివ్య భర్త చేసిన పనికి కోపంతో అక్కడున్న వస్తువులను విసిరి కొడుతుంది. అప్పుడే విక్రమ్ వచ్చి అడగ్గా 'ఫోన్ రాకపోయినా వచ్చినట్టు నాటకం ఆడి జాహ్నవి గదిలోకి దూరావు. నేనేమైనా నిన్ను ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగానా? నువ్వు జాహ్నవితో దివ్యతో నాకేం సంబంధం లేదని చెప్పావ్ కదా. పర్ఫ్యూమ్ కొట్టుకుంటూ తనతో ఆడుకోకపోయావా? ఏది పర్ఫ్యూమ్ బాటిల్' అని అడుగుతుంది. దీంతో విక్రమ్ తీసుకోలేదు అని బదులిస్తాడు.

నీ ఇష్టం వచ్చింది చేసుకో అని : విక్రమ్ చెప్పిన మాటలకు దివ్య 'పెర్‌ఫ్యూమ్ బాటిల్ అయితే తీసుకోలేదు. మరి షర్ట్ ఎందుకు తీసుకున్నావు? అయినా నన్ను కనీసం ముద్దు పేరు పెట్టి కూడా పిలవకుండా ఏయ్ అని పిలుస్తావా? పెళ్ళాం అంత చేదు అయిపోయిందా? నేను కొన్న షర్ట్స్ కదా ఇవన్నీ తగలబెట్టేస్తాను. నా మనసు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు' అని భర్తను అడుగుతుంది. దీంతో విక్రమ్ 'నువ్వు బెదిరిస్తే నేను లొంగిపోతాను అనుకోకు నీ ఇష్టం వచ్చింది చేసుకో' అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో దివ్య ఏడుస్తుంది.

పనిమనిషిలా మారిన రాజ్యలక్ష్మి : సీన్ కట్ చేస్తే.. బసవయ్య కళ్ల జోడు పెట్టుకుని కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే రాజ్యలక్ష్మి వచ్చి పనిమనిషిలా మారి సేవలు చేస్తుంది. అప్పుడు బసవయ్య కాసేపు రాజ్యలక్ష్మిని ఎన్నో రకాల మాటలు అంటాడు. అంతేకాదు, చేయి నొప్పిగా ఉందని పట్టమంటాడు. డబ్బుల వ్యవహారాలు మొత్తం తనే చూసుకుంటున్న చెప్తాడు. ఆ తర్వాత అది కల అని తేరుకుంటాడు. అప్పుడు అతను 'అప్పుడే ఇంటి యజమాని అయినట్టు ఊహించుకున్నానా? ఎప్పుడు అవుతానో' అని అనుకుంటాడు. అంతలో రాజ్యలక్ష్మి వచ్చి ఏమైందని అడుగుతుంది. దీంతో బసవయ్య ఇంకో రెండు నెలల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి అంటాడు. దీనికి రాజ్యలక్ష్మి 'నీకంటే నాకే ఎక్కువ కంగారుగా ఉంది' అంటుంది.
సారీ చెప్పిన నందూ.. అడిగాడు : తన గదిలో ఉన్న తులసితో మాట్లాడటానికి నందూ వస్తాడు. దీంతో ఆమె మీతో వాదించే ఓపిక లేదని అంటుంది. అప్పుడు నందూ 'వాదించడానికి కాదు.. సారీ చెప్పడానికి వచ్చాను. మన రిలేషన్ ఏంటో నాకు బాగా తెలుసు. ఎంత కాదనుకున్నా పాతికేళ్లు కలిసి ఉన్నాం కదా. తెలియకుండానే చనువు బయటకి వచ్చేసింది. ఏమీ అనుకోవద్దు' అని చెప్తాడు. తర్వాత తులసి కూడా సారీ చెప్తుంది. అనంతరం సామ్రాట్ బాబాయి ఎందుకు రమ్మన్నాడు అని నందూ అడగ్గా.. అక్కడ జరిగిన విషయాలు మొత్తం అతడికి తులసి వివరిస్తుంది.

తులసికి నందూ సూచనలు : తులసి చెప్పిన మాటలకు నందూ వివరంగా అడుగుతాడు. అప్పుడు 'నేను సమాధానం చెప్పేలోపు ధనుంజయ్ బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటానని మాట ఇచ్చారు. కానీ ఎందుకో అంకుల్‌కు ధనుంజయ్ మీద నమ్మకం ఉన్నట్టు అనిపించలేదు. వాళ్ళ పద్ధతి ఎందుకో నచ్చలేదు' అని అంటుంది. దీంతో నందూ 'అలా అని వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోకు ఇది నా అభిప్రాయం మాత్రమే నిర్ణయం నీదే. అడ్డుపడను ఆలోచించుకో' అని చెప్తాడు. దీనికి తులసి కూడా సానుకూలంగానే మాట్లాడుతుంది.
జాహ్నవి అలా.. హనీ ఇలా : ఇక, జాహ్నవి ఇచ్చిన షర్ట్ వేసుకుని విక్రమ్ వచ్చేసరికి ఆమె సంతోషిస్తుంది. హాస్పిటల్‌కు వెళ్దామని దివ్య అంటే అతడు సరే అంటాడు. కానీ జాహ్నవి మాత్రం వెళ్ళడానికి వీల్లేదని షాపింగ్‌కు వెళ్తున్నా తోడు రమ్మని అడుగుతుంది. మొత్తానికి అందరూ పట్టుబట్టడంతో జాహ్నవితోనే వెళ్తాడు. ఆ తర్వాత రాజ్యలక్ష్మి.. దివ్యను మరింతగా రెచ్చగొడుతుంది. ఇక, హనీకి దగ్గరవ్వాలని రత్నప్రభ ప్రయత్నం చేస్తుంది. కృష్ణాష్టమికి వేషం వేస్తానని చెప్తుంది. కానీ, తనకు తులసే కావాలని పట్టుబడుతుంది. దీంతో సామ్రాట్ బాబాయి ఫోన్ చేయగా.. తులసి రానని అంటుంది. దీంతో హనీకి కోపం వస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











