For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi September 15th Episode: తులసికి సతీష్ గుడ్ న్యూస్.. ప్రేమ్ మనసు మార్చిన తల్లి

  |

  సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది.

  ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే


  మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. అక్షరను పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పిన ప్రేమ్.. తనకు శృతి అంటే ఇష్టం అని అందరి ముందే తేల్చి చెప్పేస్తాడు. అంతేకాదు, ఆమెనే పెళ్లి చేసుకుంటా అంటాడు. కానీ, దీనికి శృతి మాత్రం ఒప్పుకోదు. పైగా.. మీ ఇంట్లో ఉన్నంత మాత్రాన మీరు చెప్పినట్లు చేయాలా? నీతో తాళి కట్టించుకుని పెళ్లాంగ పడి ఉండాలా? మీ కుటుంబ గొడవల్లోకి నన్ను లాగొద్దు అంటూ వెళ్లిపోతుంది. ఆ తర్వాత తన తండ్రి ఫొటో దగ్గర కూర్చుని ఏడుస్తుంది. ఇక, శృతి వల్ల ఇంట్లో జరిగిన దానికి తులసి కూడా చాలా బాధ పడుతుంది.

  తల్లి కాబోతున్న కాజల్ అగర్వాల్: ఆమె ప్రెగ్నెంట్ అనడానికి ఇదే సాక్ష్యం.. అలా కనిపించడంతో!

  మనద్దరికీ ఈ జన్మలో సెట్ అవదంటూ

  మనద్దరికీ ఈ జన్మలో సెట్ అవదంటూ

  తనను కాదన్న శృతితో ప్రేమ్ మాట్లాడుతుండగా ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. ‘ఏ అబ్బాయికైనా అమితంగా ఆనందించే క్షణం ఏంటో తెలుసా? తను ప్రేమించిన అమ్మాయి.. తిరిగి ప్రేమిస్తున్నానని చెప్పడం. కానీ, నువ్వు మాత్రం నన్ను ప్రేమించడం లేదని చెప్పి బాధ పెట్టావు. అసలు నన్ను ఎందుకు వద్దంటున్నావ్. నా కళ్లలో చూసి చెప్పు' అని అడుగుతాడు. దీనికి ‘నీకు కారణం చెప్పాల్సిన అవసరం లేదు. నీ బాధను నా మీద రుద్దాలని చూడకు. ఒక్కటి చెప్తున్నా విను.. మనిద్దరికీ ఈ జన్మలో సెట్ అవదు. ఇకపై నన్ను ఇబ్బంది పెట్టకు' అంటుంది.

   శృతిని సూటిగా ప్రశ్నించిన రాములమ్మ

  శృతిని సూటిగా ప్రశ్నించిన రాములమ్మ

  వంటింట్లో పనులు చేసుకుంటోన్న సమయంలో పని మనిషి రాములమ్మ ‘ఏంటమ్మా ఇలా చేశావ్? నువ్వు ప్రేమ్ బాబును ప్రేమించలేదా? ఒక ఆడదాని మనసు ఆడదానికే తెలుసు. మీ గురించి నాకు తెలుసు. ఒక మగాడిని ప్రేమించినప్పుడు ఆడదాని మనసు ఎలా ఉప్పొంగుతుందో తెలుసు. మీరు ప్రేమ్ బాబుతో చనువుగా ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారో తెలుసు. ఇప్పుడు ఎంత కుమిలిపోతున్నారో కూడా తెలుసమ్మా' అని అంటుంది. అప్పుడు శృతి ‘చూడు రాములమ్మ నేను ప్రేమ్‌ను ప్రేమించలేదు. చనువుగా ఉంటే ఏదేదో ఊహించుకుంటారా' అంటుంది.

  Bigg Boss: షోలో సంచలన సంఘటన.. సిరి టీషర్ట్‌లో చేయి పెట్టిన కంటెస్టెంట్.. అందరి ముందే బలవంతంగా!

  శృతికి తులసి భరోసా.. ఆమె మాత్రం బాధ

  శృతికి తులసి భరోసా.. ఆమె మాత్రం బాధ

  రాములమ్మతో శృతి మాట్లాడుతుండగా తులసి అక్కడకు వస్తుంది. అప్పుడు ‘చూడమ్మ శృతి నువ్వు గతంలో ఎలా ఉన్నావో అలాగే ఉండు. ప్రేమ్‌ను వద్దన్న మాత్రన నేనేమీ అనను. నీ నిర్ణయాన్ని గౌరవిస్తాను. ప్రేమ్‌ను వద్దన్నావని బాధగా ఉంది. కానీ, నీ నిర్ణయాన్ని తప్పుబట్టడం లేదు. నువ్వు ఎప్పటిలాగే మాతో ఉండు. అర్థం అయిందా' అంటూ ఆమెకు భరోసా ఇచ్చింది. దీంతో శృతి ‘మిమ్మల్ని ఇంతలా బాధ పెడుతున్నందుకు సారీ ఆంటీ. ఇప్పుడిలా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అది మీకెలా తెలుస్తుంది' అంటూ తనలో తాను కుమిలిపోతుంది.

  నందూకు క్లయింట్ వార్నింగ్.. ఫినీష్ చేస్తా

  నందూకు క్లయింట్ వార్నింగ్.. ఫినీష్ చేస్తా

  ప్రాజెక్ట్ ఇచ్చిన కాంట్రాక్టర్ ఫోన్ చేస్తాడన్న భయంతో నందూ భయపడుతుంటాడు. అంతలో ఆయన ఫోన్ చేసి ‘మిమ్మల్ని నమ్మి ప్రాజెక్ట్ ఇచ్చిన కంపెనీని మోసం చేయాలని చూస్తున్నారా? ఇన్‌టైమ్‌లో పూర్తి చేస్తానని చెప్పి ఇలా చేస్తారా? ఆఫీస్‌లో స్టాఫ్ లేకుండా వర్క్ ఎలా పూర్తి చేస్తారు? ఏంటి ఇవన్నీ మాకు తెలియదు అనుకుంటున్నావా? ఈ ప్రాజెక్టు కనుక ఇన్‌టైమ్‌లో చేయకపోతే రూ. 2 కోట్లు పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. మీరు కరెక్ట్ టైమ్‌లో ఫినీష్ చేయకపోతే.. మీరే ఫినీష్ అయిపోతారు జాగ్రత్త' అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి ఫోన్ కట్ చేసేస్తాడు.

  ప్యాంట్‌ లేకుండా హీరోయిన్ ఘాటు ఫోజు: ప్రైవేట్ ఫొటో షేర్ చేసిన వర్మ.. మామూలోడు కాదుగా!

  ప్రేమ్ పెళ్లి జరిగితే కష్టాలన్నీ తీరుతాయి

  ప్రేమ్ పెళ్లి జరిగితే కష్టాలన్నీ తీరుతాయి

  కాంట్రాక్టర్ ఫోన్ చేయగానే నందూ చాలా బాధ పడుతుంటాడు. అప్పుడు లాస్య ‘ఎందుకు నందూ అంత బాధ పడుతున్నావు? ఇంత దానికే అంత టెన్షన్ పడుతున్నావేంటి' అని అంటుంది. అప్పుడు నందూ ‘రెండు కోట్లు కట్టాలి అంటే నువ్వు ఇంత లైట్ తీసుకుంటావే' అని అంటాడు. దీంతో ‘ఇప్పుడు మనం ప్రేమ్‌కు అక్షరకు పెళ్లి చేసేస్తే ఈ కష్టాలన్నీ పోతాయి. ప్రేమ్ ఒప్పుకోకపోయినా ఎలాగైనా త్వరగా చేసేయాలి. లేకపోతే మళ్లీ శృతి మనసు మారిపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే మనం అనుకున్నది చేయలేం' అంటూ అతడికి సలహా ఇస్తుంది.

  తులసికి శుభవార్త.. డబ్బులన్నీ డిపాజిట్

  తులసికి శుభవార్త.. డబ్బులన్నీ డిపాజిట్

  ప్రేమ్ పరిస్థితిని చూసి బాధ పడుతోన్న తులసికి గార్మెంట్ కంపెనీ నుంచి ఫోన్ వస్తుంది. అప్పుడు సతీష్ ‘తులసి గారు మీరు పంపిన గార్మెంట్స్ అన్నీ మాకు బాగా నచ్చాయి. మీకు ఎంత రావాలో అంత మీ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసేశాం' అని చెబుతాడు. దీంతో తులసి ఎంతగానో సంతోషిస్తుంది. ఆ సమయంలో ప్రేమ్ బాధగా ఉండడం చూసి.. అతడిని ఎలాగైనా డైవర్ట్ చేయాలని అనుకుంటుంది. అందుకు అనుగుణంగానే వెళ్లి గార్మెంట్ కంపెనీ వాళ్లు చెప్పిన విషయాన్ని అతడితో పంచుకుంటుంది. దీంతో ప్రేమ్ కూడా చాలా సంతోషిస్తాడు.

  పవన్ కల్యాణ్ సెన్సేషనల్ రికార్డ్: ఒకే సినిమాతో రెండు ఘనతలు సొంతం.. ఇండియాలోనే ఏకైక హీరో

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  ప్రేమ్ మనసు మార్చే ప్రయత్నంలో తల్లి

  ప్రేమ్ మనసు మార్చే ప్రయత్నంలో తల్లి

  శృతి విషయంలో బాధ పడుతోన్న ప్రేమ్‌ మనసును మార్చాలని అనుకున్న తులసి.. అతడితో ‘నా అకౌంట్‌కు డబ్బులు వేశారంట. అవి ఎలా చెక్ చేయాలో చెప్పరా' అని అడుగుతుంది. దీంతో ప్రేమ్ ‘ఇలా అయితే ఎలాగమ్మా.. డబ్బుల వ్యవహారంలో ఎవరి సహాయం తీసుకోకూడదు. ఇలా చేస్తే మోసపోయే ప్రమాదం ఉంది' అంటూ జాగ్రత్త చెప్పి తల్లికి అన్నీ నేర్పుతాడు. దీంతో ప్రేమ్‌లో మార్పు గమనిస్తుంది తులసి. అలాగే, చెక్ బ్యాంకులో వేయమని అతడిని పంపుతుంది. ఆ తర్వాత ‘అసలు శృతి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవాలి' అని మనసులో అనుకుంటుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 425: Shruthi Unhappy about Prem and Tulasi Upset. Then Tulasi Received Huge Money From Clients.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X