Intinti Gruhalakshmi: హనీ విషయంలో తులసి కీలక నిర్ణయం.. దివ్య, విక్రమ్ కోసం మరో కొత్త ప్లాన్

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త కొత్త షోలు వస్తున్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే:గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. జాహ్నవి పిలవడంతో విక్రమ్ దొంగతనంగా ఆమె గదిలోకి వెళ్తాడు. ఆ వెంటనే దివ్య కూడా అతడి వెనకాలే వెళ్తుంది. అప్పుడు జాహ్నవి.. విక్రమ్‌కు గిఫ్టులు ఇస్తుంది. అది చూసిన దివ్య అతడు గదిలోకి రాగానే పెద్ద గొడవ చేస్తుంది. ఇక, హనీ విషయంలో తులసి జాగ్రత్తగా ఉండాలని నందూ ఆమెకు సూచిస్తాడు. దీంతో తులసి సానుకూలంగా స్పందిస్తుంది. అనంతరం హనీ తనకు తులసి వచ్చి కృష్ణుడి వేషం వేయాలని పట్టుబడుతుంది. దీనికా చిన్నారి వినకపోయే సరికి ఇంట్లో నుంచి ఎవరికీ చెప్పకుండానే వెళ్లిపోతుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode September 15th 2023

గాయాలతోనే వచ్చేసిన హనీ:తులసి వచ్చి కృష్ణుడి వేషం వేసేందుకు రాలేదన్న కోపంతో ఎవరికీ చెప్పకుండా హనీ ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. అలా నడుచుకుంటూ వెళ్తుండగా రోడ్డు మీద కింద పడిపోతుంది. దీంతో ఆమె చేతికి దెబ్బలు తగులుతాయి. అప్పుడు హనీ అలా అలా నడుచుకుంటూ తులసి ఇంటికి వెళ్తుంది. ఆ చిన్నారి అలా గాయాలతో రావడం చూసి పరందామయ్య వాళ్లు కంగారు పడిపోతారు. అప్పుడు నందూ 'తులసి వెళ్లకపోయేసరికి ఇంట్లో చెప్పకుండా వచ్చేసింది. నాకు ముందే తెలుసు ఇలా అవుతుందని అంతలా తులసి హనీకి అలవాటు అయిపోయింది' అంటాడు.

కృష్ణుడు వేషం వేయాల్సిందే:గాయాలతో వచ్చిన హనీని తులసి దగ్గరకు తీసుకుంటుంది. అప్పుడు ఆ చిన్నారి నాకు కృష్ణుడు వేషం వేయడానికి ఎందుకు రాలేదు అని తులసిని అడగ్గా.. పని ఉందని చెప్పాను కదా అర్థం చేసుకో అంటుంది. దీంతో హనీ 'అదంతా నాకు తెలియదు.. మీరు నాకు కృష్ణుడు వేషం వేయాలి లేకపోతే లేదు' అని అంటుంది. దీనికి తులసి 'ఏదో ఒకటి చేసి తనకి సర్ది చెప్పి ఇంటికి పంపించాలి. లేకపోతే పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది' అని అనుకుంటుంది. అప్పుడు హనీ 'రేపు వస్తానని చెప్తేనే ఇంటికి వెళ్తాను.. లేదంటే లేదు' అని పట్టుబడుతుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode September 15th 2023

రత్నప్రభ గరం.. తులసితో:హనీకి సర్ధి చెబుతూ చేతికి అయిన గాయానికి బ్యాండేజ్ వేస్తుంది. అప్పుడు హనీ 'ఇప్పుడు ఇంటికి వెళ్లాలంటే రేపు రావాలి' అని కండిషన్ పెట్టేసరికి వస్తానని మాట ఇస్తుంది. హనీ కనిపించకపోయే సరికి అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు రత్నప్రభ వచ్చి 'మేము వచ్చినప్పటి నుంచి హనీ గదిలో నుంచి బయటకి రావడం లేదు. అలాంటిది బయటకి ఎలా వెళ్తుంది' అని గరం అవుతూ ఉంటుంది. అప్పుడే తులసి హనీని తీసుకుని ఇంటికి వస్తుంది. హనీ ఎక్కడ కలిసిందని బాబాయి అడగ్గా.. తనే ఇంటికి వచ్చిందని తులసి చెప్తుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode September 15th 2023

ఎవరికీ మంచిది కాదు అని:హనీ వచ్చిన తర్వాత రత్నప్రభ 'ఇంటి బాధ్యతలు చూసుకోవడానికి వచ్చిన మమ్మల్ని రేపు అంటారు. పరాయి వాళ్ళని నిన్ను ఏమి అనరు' అంటుంది. దీనికి హనీ 'తులసి ఆంటీని ఏమి అనొద్దు. రేపు కృష్ణుడి గెటప్ వేయమని అడగటం కోసం నేనే వెళ్ళాను' అని చెప్తుంది. దీంతో రత్నప్రభ 'హనీకి ఇదే అలవాటు అయితే మంచిది కాదు. ఒంటరిగా ట్రాఫిక్ ఏమైనా జరగవచ్చు' అంటుంది. దీంతో తులసి ఇకపై ఇలా జరగకుండా చూసుకుంటాను అని చెబుతుంది. ఆ వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోతుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode September 15th 2023

జాహ్నవికి సపోర్టు చేయగా:విక్రమ్ దివ్య చేసిన గొడవ గురించి ఆలోచిస్తూ ఉండగా.. జాహ్నవి అన్నం తీసుకుని వస్తుంది. అప్పుడామె 'దిగులుగా ఉన్నావంట కదా.. అత్తయ్య చెప్తే తీసుకుని వచ్చాను' అని చెప్తుంది. అంతలోనే దివ్య కూడా బతిమలాడి అయినా తినిపించాలని తీసుకెళ్తుంది. అప్పటికే అక్కడ జాహ్నవి విక్రమ్‌కు భోజనం తినిపించడం చూసి దివ్య రగిలిపోతుంది. అప్పుడు మాట్లాడుతుండగా విక్రమ్ మరదలికి సపోర్ట్ చేసేసరికి దివ్యకు కాలుతుంది. దీంతో జాహ్నవి కూర్చున్న కుర్చీ లాగడంతో ఆమె కింద పడుతుంది. దీంతో దివ్యను విక్రమ్ సారీ చెప్పమనగా ఆమె కోపం వెళ్లిపోతుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode September 15th 2023

ఇంట్లో పండుగ చేయాలని:హనీ విషయంలో తులసి మనసు మార్చుకోవడంతో నందూ ఎందుకలా చేశావని ప్రశ్నిస్తాడు. దీంతో వేరే దారి కనిపించకపోయేసరికి ఒప్పుకున్నానని అంటుంది. దీంతో నందూ 'హనీ గురించే కాదు.. తన వల్ల వచ్చే సమస్యల గురించి కూడా ఆలోచించు' అని చెప్తాడు. తర్వాత తులసి 'నిదానంగా హనీకి నచ్చజెప్పడానికి చూస్తాను. అలాగే, విక్రమ్, దివ్యను పిలిచి కృష్ణాష్టమి ఘనంగా చేయాలని అనుకుంటున్నా' అని చెప్తుంది. దీంతో పరందామయ్య 'చాలా మంచి పని. ఇలా అయినా విక్రమ్ మనసు మారి దివ్యకు దగ్గర అవుతాడు' అని సంతోషిస్తాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode September 15th 2023

నువ్వు ఎక్కువా? నేనా?:దివ్యను జాహ్నవి అక్కా అని పిలుస్తుంది. అప్పుడు ఆమె నన్ను అలా పిలవొద్దు అని చెప్తుంది. దీంతో జాహ్నవి 'ఎందుకు ఉడుక్కుంటున్నావు? నేనేం బావ మీద మనసు పడటం లేదు. విక్రమ్ బావతో ఈ మధ్య కలిసి నడుస్తున్నావు. కానీ నేను చిన్నప్పటి నుంచి కలిసి తిరుగుతున్నా. మరి నువ్వు ఎక్కువ నేను ఎక్కువా' అని అడుగుతుంది. దీంతో దివ్య తాళి చూపించి ఇది ఎక్కువ అంటుంది. అప్పుడు జాహ్నవి 'ఇల్లు వదిలి వెళ్ళినప్పుడు అది గుర్తుకురాలేదా' అనగా.. దివ్య కోప్పడుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X