Intinti Gruhalakshmi: జాహ్నవి మా కోడలు.. నిజం చెప్పిన బసవయ్య.. పండుగ రోజే తులసి వాళ్లకు షాక్
ప్రేక్షకుల అభిరుచిలో మార్పులు వస్తున్నప్పటికీ.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే: శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. గాయాలతోనే హనీ తులసి ఇంటికి వస్తుంది. దీంతో ఆ చిన్నారిని చూసి అందరూ షాక్ అవగా.. కృష్ణుడి వేషం వేయనన్నావని వచ్చాను అని హనీ చెప్తుంది. దీంతో తులసి హనీకి సర్ధి చెప్పి గాయానికి ప్రథమ చికిత్స చేసి ఇంటికి తీసుకు వెళ్తుంది. అప్పటికే అక్కడ అందరూ హనీ గురించి కంగారు పడుతుంటారు. అప్పుడే తులసి వాళ్లు వెళ్లగా రత్నప్రభ సీరియస్ అవుతుంది. దీంతో హనీ ఆమెను ఆపుతుంది. ఇక, దివ్య, జాహ్నవి తన కోసం పోటీ పడుతుండగా.. విక్రమ్ మాత్రం భార్యను కాదని మరదలికే సపోర్టు చేసేస్తాడు.
దివ్య తెచ్చినవి వద్దన్న విక్రమ్: తనకు అడ్డుపడడంతో పాటు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న జాహ్నవితో దివ్య దురుసుగానే మాట్లాడుతుంది. అంతేకాదు, తన జీవితంలోకి రావొద్దని హెచ్చరిస్తుంది. అలా చాలా సేపు ఇద్దరూ విక్రమ్ గురించి గొడవ పెట్టుకుంటూ ఉంటారు. అప్పుడు విక్రమ్ కోసం దివ్య బట్టలు తీసుకెళ్తుండగా.. వాటిని బావ వేసుకోడు అని అంటుంది. అందుకు అనుగుణంగానే విక్రమ్ స్నానం చేసి వచ్చిన తర్వాత దివ్య ఇచ్చిన బట్టలను వేసుకోడానికి ఇష్టపడడు. అంతేకాదు, తన బట్టలు తానే సెలెక్ట్ చేసుకుంటానని చెప్తాడు. దీంతో దివ్య నిరాశ చెందుతుంది.

వచ్చే పండుగకు నువ్వే వేసుకో: హనీ కోరిక మేరకు ఆ చిన్నారికి తులసి కృష్ణుడి వేషం వేస్తుంది. అందంగా రెడీ చేసి తీసుకుని వస్తుంది. అది చూసి నందూ ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడు తులసి ఈ కృష్ణాష్టమి పండుగకు దివ్య వాళ్లను కూడా పిలిచి.. వాళ్లతో దాండియా ఆటలు, ఉట్టి కొట్టించడం వంటివి ఆడించాలని అనుకుంటున్నట్లు చెప్తుంది. దీనికి అందరూ ఓకే అంటారు. ఆ తర్వాత నందూ 'వచ్చే సంవత్సరం వచ్చే పండగకి నువ్వే కృష్ణుడి గెటప్ వేసుకోవాలి. తులసి ఆంటీ నీతో ఉండదు' అని హనీతో అంటాడు. దీనికా చిన్నారి 'తులసి ఆంటీ ఎక్కడికి వెళ్లదు' అని బదులిస్తుంది.
ఇద్దరి మధ్యన నలిగిన విక్రమ్: విక్రమ్ కోసం జాహ్నవి కూడా బట్టలు తీసుకుని వస్తుంది. దీంతో దివ్య ఆమెను కోపంగా చూస్తుంది. ఆ తర్వాత జాహ్నవి తాను తెచ్చిన బట్టలను వేసుకోవాలని విక్రమ్‌ను ఇబ్బంది పెడుతుంది. దీంతో దివ్య ఆమెతో వాదనకు దిగుతుంది. విక్రమ్ మాత్రం ఎటువైపు చెప్పాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటాడు. అది అలా సాగుతూ ఉండగానే రాజ్యలక్ష్మి వచ్చి ఇంకా అవలేదా అని అడుగుతుంది. అప్పుడు పరిస్థితి వివరించిన విక్రమ్ ఏం చేయమంటావో చెప్పు అని అడుగుతాడు. దీంతో రాజ్యలక్ష్మి నీ మనసులో ఏముందో చెప్పమని కావాలని కొడుకును ఇరికిస్తుంది.
గెలిచిన జాహ్నవి.. ఆమె డ్రెస్సే: రాజ్యలక్ష్మి ఎలా చెప్తే అలా చేస్తానని విక్రమ్ అంటాడు. దీంతో కాయిన్ వేసి ఎవరు గెలిస్తే వాళ్లు తెచ్చిన బట్టలు వేసుకోమని ఆమె సలహా ఇస్తుంది. దీంతో కాయిన్ వేయగా జాహ్నవి గెలుస్తుంది. దీంతో ఆమె తెచ్చిన డ్రెస్‌నే విక్రమ్ ధరిస్తాడు. అప్పుడు దివ్య 'నిజంగానే ఇది సవతిలాగా తయారయ్యేలా ఉంది. ఈ విషయం అమ్మ వాళ్లకు తెలియకుండా చూసుకోవాలి' అని మనసులో అనుకుంటుంది. తర్వాత అందరూ కలిసి తులసి వాళ్ల ఇంటికి వస్తారు. తులసి బయటకి వచ్చి అందరికీ ఆహ్వానం పలుకుతుంది. అప్పుడు కృష్ణుడి వేషంలో ఉన్న హనీని దివ్య చూపిస్తుంది.
తులసికి దండం పెట్టేసిందిగా: అక్కడ పూజ సెటప్ మొత్తం చూసిన జాహ్నవి 'ఇది ఎవరు చేశారో కానీ.. వాళ్లకు దండం పెట్టాలి. కృష్ణుడి విగ్రహాన్ని అంత చక్కగా రెడీ చేశారు' అంటుంది. దీంతో అందరూ తులసి వైపు చూడడంతో జానూ ఆమెకు దండం పెడుతుంది. దీంతో రాజ్యలక్ష్మి కుళ్లుకుంటూ ఉంటుంది. తర్వాత జానూను ఎవరు అని అడగ్గా.. మా కోడలు అని రాజ్యలక్ష్మి చెప్తుంది. దీంతో అంతా షాక్ అవుతారు. అప్పుడు దివ్య 'మేనకోడలు అమ్మా. బసవ బాబాయి వాళ్ల అమ్మాయి. ఢిల్లీ నుంచి వచ్చింది' అని చెప్తుంది. తర్వాత జాహ్నవి దేవుడికి మనసులోని కోరికలను చెప్పుకుంటుంది.

రుక్మిణి అవ్వాల్సింది కానీ అని: హనీని చూసి అందరూ మురిసిపోతుండగా జాహ్నవి 'మేకప్ వేసుకుంటే ఎవరైనా కృష్ణుడిలాగే కనిపిస్తారు. కానీ మా బావ గెటప్ వేయకపోయినా కృష్ణుడే' అంటుంది. దీంతో బసవయ్య 'ఏం చెప్పావు. అంతా మేము అనుకున్నట్టు జరిగి ఉంటే రుక్మిణీ స్థానంలో నువ్వు ఉండేదానివి' అంటాడు. దీంతో తులసి ప్రశ్నించగా.. బసవయ్య 'మేము దివ్యకు ముందు జాహ్నవిని అనుకున్నాం. కానీ, వాడు మేము అనుకున్నది కాకుండా వేరేగా అనుకున్నాడు' అని నిజం చెప్తుంది. దీంతో తులసి 'మనం ఎన్ని అనుకున్నా చివరికి దేవుడు అనుకున్నది జరుగుతుంది' అంటుంది.
జాహ్నవికి వార్నింగ్ ఇచ్చేసి: తులసి మాటలకు జాహ్నవి 'దేవుడు అనుకోవాలే కానీ ఏదైనా జరగవచ్చు. దగ్గర వాళ్ళు దూరం అవ్వొచ్చు.. దూరం వాళ్ళు దగ్గర అవ్వొచ్చు' అంటుంది. అప్పుడు దివ్య ఆమెను పక్కకు తీసుకు వెళ్తుంది. అంతేకాదు, 'నోరు అదుపులో పెట్టుకో. నీ ఇష్టం వచ్చిన ప్రవర్తించడానికి ఇదేమీ నీ ఇల్లు కాదు. ఇక్కడ కొంచెం డీసెంట్‌గా ఉండు. విక్రమ్‌కు కూడా దూరంగా ఉండు' అని వార్నింగ్ ఇస్తుంది. కానీ జానూ మాత్రం దానికి రివర్స్‌లో ఉంటానని అంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











