For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi September 17th Episode: ప్రేమ్‌ను కలిసిన అక్షర.. తులసి ఫ్యాక్టరీలో లాస్య మనిషి

  |

  మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ప్రేమ్ బాధను అర్థం చేసుకున్న తల్లి.. అతడిని డైవర్ట్ చేయడానికి ఎన్నో ప్లాన్లు వేస్తుంది. ఈ క్రమంలోనే క్యారమ్స్ ఆడమని చెబుతుంది. అంతలో నందూ, లాస్య ఎంట్రీ ఇవ్వడంతో ఇంట్లో పెద్ద రచ్చ జరుగుతుంది. దీంతో ప్రేమ్ బాధగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత శృతి బాధను చూసిన ఆమె స్నేహితురాలు.. ప్రేమ్‌తో అసలు విషయం చెబుతానంటూ బయలుదేరుతుంది. కానీ, దీనికి శృతి ఒప్పుకోదు. ఇక, లాస్య.. తులసిని ఇబ్బంది పెట్టేందుకు ప్లాన్ చేశానని చెబుతూ భాగ్యకు మజాను పంచే న్యూస్ చెబుతుంది.

  Bigg Boss: రెండో వారం ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు.. ఆమె మాత్రం పైపైకి!

   తులసి వైపు ఉచ్చు బిగించేసిన లాస్య

  తులసి వైపు ఉచ్చు బిగించేసిన లాస్య

  ఫ్యాక్టరీ అకౌంటెంట్‌తో తులసి మాట్లాడుతుండగా ఈరోజు ఎపిసోడ్ మొదలైంది. ఓ చెక్‌ను డిపాజిట్ చేయడం మర్చిపోయాయని అతడు చెప్పడంతో.. సున్నితంగా మందలించి వదిలేస్తుంది. ఆ తర్వాత అతడు బయటకు వచ్చి లాస్యతో ఫోన్‌లో మాట్లాడతాడు. అప్పుడు ‘నీకు మీ మేడమ్ పది లక్షల చెక్ డిపాజిట్ చేయమని అంటుంది కదా. అది ఎలాగైనా బౌన్స్ అయ్యేలా చేయాలి' అని చెబుతుంది లాస్య. దీనికి అతడు ఓకే చెబుతాడు. ఆ తర్వాత ‘మరి నువ్వు ఈ మాత్రం చేయలేవా? నిన్ను ఆ ఫ్యాక్టరీలో చేరినప్పటి నుంచి మేపుతున్నది అందుకే' అని అంటుంది.

  సరికొత్త ప్లాన్‌తో ప్రేమ్‌ను కలిసిన అక్షర

  సరికొత్త ప్లాన్‌తో ప్రేమ్‌ను కలిసిన అక్షర

  ఓ రెస్టారెంట్‌లో దిగాలుగా కూర్చుని ఉంటాడు ప్రేమ్. ఆ సమయంలో అక్షర అక్కడకు వస్తుంది. అప్పుడు తన స్నేహితురాలితో కలిసి యూట్యూబ్ ఛానెల్ నుంచి వస్తున్నట్లు ప్లాన్ వేసి అతడితో మాట్లాడాలని అనుకుంటుంది. అందుకు అనుగుణంగానే ఓ కెమెరా పట్టుకుని అతడి దగ్గరకు వస్తారు. అప్పుడు అతడి పర్మీషన్ తీసుకుని చిట్ చాట్ మొదలు పెడతారు. ఆ సమయంలో అక్షర ‘ప్రేమ్ గారు.. ప్రేమ గురించి చెప్పండి' అని అడుగుతుంది. దీంతో ప్రేమకు సరైన నిర్వచనాలు ఇస్తూ ఎంతో గొప్పగా చెబుతాడు. దీంతో అక్షర మైమరచిపోయి మరీ అతడిని చూస్తుంటుంది.

  Maestro Twitter Review: మాస్ట్రోకు షాకింగ్ రిజల్ట్.. ప్లస్ మైనస్ అవే.. నితిన్ ఆ తప్పు చేయకపోతే!

  అక్షరకు తన ఇష్టాన్ని చెప్పేసిన ప్రేమ్

  అక్షరకు తన ఇష్టాన్ని చెప్పేసిన ప్రేమ్

  ఇంటర్వ్యూ జరుగుతోన్న సమయంలో ప్రేమ్ చక్కగా మాట్లాడడంతో అక్షర మురిసిపోతూ ఉంటుంది. ఆ సమయంలోనే ‘మీరు ఎవరినైనా ప్రేమించారా? ప్రేమ గురించి ఇంత చక్కగా చెప్పారు' అని ప్రశ్నిస్తుంది. దీనికి అతడు ‘ప్రేమ గురించి చెప్పడానికి ప్రేమించాల్సిన అవసరమే లేదండి. తల్లి చూపించే ప్రేమ చాలదా ప్రేమ గురించి చెప్పడానికి. మా అమ్మ నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. అందుకే తనంటే నాకు చాలా ఇష్టం. తనలా నన్ను ఇంకెవరూ ప్రేమించరేమో. అందుకే ఎవరైనా తన తర్వాతే' అని బదులిచ్చి.. అక్కడి నుంచి వెళ్లిపోతాడు ప్రేమ్.

  జీకేకు అక్షర కోరిక.. నందూకు కాల్ చేసి

  జీకేకు అక్షర కోరిక.. నందూకు కాల్ చేసి

  ప్రేమ్‌తో మాట్లాడిన ఆనందలో ఉన్న అక్షర దగ్గరకు జీకే వస్తాడు. అప్పుడు తన సంతోషానికి కారణం ఏంటో చెప్పమని తండ్రిని అడుగుతుంది. దీనికాయన ప్రేమ్‌ను కలిశావా అని అడుగుతాడు. ఆ సమయంలో ‘ప్రేమ్‌ను దొంగతనంగా కలవాల్సి వచ్చింది. తనను ప్రేమించే అమ్మాయిగా కలవాలని ఉంది డాడ్' అని అక్షర కోరుకుంటుంది. దీంతో జీకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా నందూకు ఫోన్ చేస్తాడు. అంతేకాదు, ప్రేమ్, అక్షర కలవడానికి ఓ మీటింగ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు చెబుతాడు. దీనికి నందూ కొంత సమయం కావాలని జీకేను అడుగుతాడు.

  బాత్రూంలో బ్రాతో సమంత రచ్చ: అందాలన్నీ చూపిస్తూ మరీ ఘాటుగా.. ఫస్ట్ టైమ్ ఈ రేంజ్‌లో!

  ప్రేమ్ ప్రేమను జీకేకు చెప్పిన నందూ

  ప్రేమ్ ప్రేమను జీకేకు చెప్పిన నందూ

  ప్రేమ్, అక్షర కలవడానికి నందూ సమయం కావాలని అడగడంతో జీకే ‘నందూ గారు.. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా. మీ ప్రేమ్ ఎవరినైనా ప్రేమించాడా' అని నేరుగా అడిగేస్తాడు. దీనికి నందూ ‘అవును జీకే గారు. ప్రేమ్ ఓ అమ్మాయిని ప్రేమించాడు. కానీ, ఆమె వాడిని కాదని చెప్పేసింది. ఇప్పుడా బాధలోనే ఉన్నాడు. ఎంతైనా చిన్నవాడు కదా కోలుకోడానికి కొంత సమయం పడుతుంది. అందుకే కొన్ని రోజులు ఆగుదాం అని అంటున్నాను' అని అసలు విషయం చెబుతాడు. దీనికి జీకే ‘నా కూతురి కోసం ఎంతకైనా వెళ్తాను. ఇప్పుడు వెయిట్ చేద్దాం' అని అంటాడు.

  Nithiin Vinayaka Chavithi Special Interview | Maestro Movie
  నందూకు షాకిచ్చిన తులసి.. అలా చెప్పి

  నందూకు షాకిచ్చిన తులసి.. అలా చెప్పి

  ప్రేమ్ పెళ్లికి ఒప్పకోకపోవడంపై నందూ, తులసి మధ్య సంభాషణ జరుగుతుంది. అప్పుడు నందూ ‘ప్రేమ్‌ను శృతి కాదన్నది కదా. ఇంకా ఎందుకు ఆలస్యం చేయడం' అంటాడు. దీనికి తులసి ‘వాడిని తను ఎందుకు వద్దని అనుకుందో తెలుసుకోవాలి. అప్పుడే వాడి పెళ్లి గురించి ఆలోచిస్తాను. అసలు తన మాటలు పెదాల నుంచి వస్తున్నాయా? ఎవరైనా పలికిస్తే వస్తున్నాయా అన్నది త్వరలోనే తెలుసుకుంటాను' అంటూ అతడికి షాకిస్తుంది. దీనికి నందూ కూడా గట్టిగానే సమాధానం చెబుతాడు. దీంతో కొంత వాదన తర్వాత ఈరోజు ఎపిసోడ్ పూర్తైపోయింది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 427: Akshara Met Prem with Plan. Nandhu Angred on Tulasi Behaviour. After That She Gave Shock to Her Ex Husband.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X