For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: తులసికి సామ్రాట్ ప్రపోజ్.. అంతలోనే ప్రమాదం.. చివర్లో ట్విస్ట్

  |

  టీవీ షోల సంఖ్య భారీగా పెరుగుతోన్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

  దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి మరి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. సామ్రాట్‌తో మాట్లాడడానికి వచ్చిన లాస్యకు తులసి వార్నింగ్ ఇచ్చి పంపిస్తుంది. ఇక, ఇంటికి వెళ్లిన తర్వాత ఆమె మాత్రం నందూకు తులసి సహాయాన్ని చెప్పకుండా అబద్ధాలు చెబుతుంది. ఆ తర్వాత సామ్రాట్‌తో కలిసి తులసి బయటకు వెళ్దామని అంటుంది.

  ఇక, తులసి కోసం కడుతున్న మ్యూజిక్ స్కూల్ దగ్గరకు నందూ, లాస్య వస్తారు. ఆ తర్వాత సామ్రాట్, తులసి ఒకే కారులో వస్తారు. వాళ్లను చూసి నందూకు కోపం పెరుగుతుంది. అనంతరం ఖర్చు గురించి మాట్లాడిన లాస్యకు తులసి ఓ రేంజ్‌లో క్లాస్ తీసుకుంటుంది.

  దిశా పటానీ ఎద అందాల ప్రదర్శన: వామ్మో ఆమెనిలా చూస్తే నిద్ర పట్టదు!

  తులసి గురించి నందూకు క్లాస్

  తులసి గురించి నందూకు క్లాస్

  నందూతో సామ్రాట్ మాట్లాడుతూ.. 'మీ ఇంట్లో ఒక్కరోజు ఉంటే ఎంతో సంతోషం అనిపించింది. అలాంటిది నువ్వు ఎలా మారిపోయావు. మీరిద్దరూ మాజీ భార్యభర్తలన్న విషయాన్ని తులసి గారు నాకు చెప్పకపోవడమే మంచింది. అలా చెప్పకపోబట్టే ఆమె వ్యక్తిత్వం ఏంటో నాకు తెలిసింది. అలాంటి నిజాయితీ పర్సన్‌ను నేనెప్పుడూ చూలేదు. తులసి గారిని నువ్వు మిస్ చేసుకున్నావు. విలువైన వస్తువులను చేజారిపోకుండా కాపాడుకోకపోతే అది వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్తుంది. నువ్వు నష్టపోయావు. నీ వల్ల ఇంకొకరు లాభపడతారు. ఆ లాభపడే వ్యక్తి ఎవరో' అని అంటాడు.

  తులసిని తీసుకెళ్లిన సామ్రాట్

  తులసిని తీసుకెళ్లిన సామ్రాట్

  తులసి గురించి సామ్రాట్ మాట్లాడుతుంటే నందూకు పట్టలేని కోపం వస్తుంది. అప్పుడతను 'ఇప్పుడు ఇవన్నీ నాకెందుకు చెబుతున్నారు సార్? నాకు ఇవన్నీ వినే ఉద్దేశం, మూడ్ లేవు' అని అంటాడు. దీంతో సామ్రాట్ అవును నీకు నేను ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను అంటాడు. ఇంతలో తులసి, లాస్య అక్కడకు వస్తారు. అప్పుడు సామ్రాట్ ఇక మనం బయలుదేరుదామా అని తులసిని అడుగుతాడు. దీనికామె సరే అంటుంది. తర్వాత సామ్రాట్ 'రేపు నేను మీ ఇంటికి వచ్చి పికప్ చేసుకుంటా.

  మనం ఓ ఫైల్ వెరిఫికేషన్ కోసం వెళ్లాలి' అని చెబుతాడు. దీనికీ ఓకే అంటుంది. అప్పుడు లాస్య మేము కూడా రావాలా సార్ అని అడుగుతుంది. సామ్రాట్ మాత్రం మీరు ఆఫీసుకు వెళ్లి వర్క్ చేసుకోండి అంటాడు.

  బెడ్‌పై ఈషా రెబ్బా అందాల ఆరబోత: నెట్ డ్రెస్‌లో మొత్తం కనిపించేలా!

  మందు తాగేసి నందూ హల్చల్

  మందు తాగేసి నందూ హల్చల్

  ఆ తర్వాత నందూ ఫుల్లుగా మందు తాగి కారు నడుపకుంటూ వస్తుంటాడు. మధ్యలో కారు ఆపి మళ్లీ మద్యం సేవిస్తాడు. అప్పుడు అతడికి తులసి గురించి సామ్రాట్ మాట్లాడిన మాటలే గుర్తు వస్తాయి. దీంతో నందూ 'వాడి బతుకేంటి.. నా జీవితం మీద కామెంట్ చేస్తాడా? నాకు బాస్ అయిపోయాడు. లేకపోతే అక్కడే వాడి కాళ్లు చేతులు విరిచేవాడిని. ఆవిడ గారు సాధ్వి మరి. ఆవిడను దూరం చేసుకున్న దురదృష్ణవంతుడిని అట. సిగ్గుండాలి అలా మాట్లాడటానికి. నేను ఇప్పుడు లాస్యతో చాలా సంతోషంగానే, సుఖంగానే ఉన్నాను' అని సామ్రాట్‌పై విరుచుకుపడతాడు.

  నందూ దగ్గరకు ఇద్దరూ వచ్చి

  నందూ దగ్గరకు ఇద్దరూ వచ్చి

  నందూ 'నేను హ్యాపీగానే ఉన్నా. బాధపడాల్సింది నేను కాదు. తులసి. ఆ రోజు వైజాగ్‌లో మందు తాగినప్పుడు తులసి గురించి ఆ సామ్రాట్ ఏదో కూశాడు. ఏదో అన్నాడు కానీ.. అస్సలు గుర్తుకు రావడం లేదు' అని అనుకుంటాడు. ఇంతలో అతడి దగ్గరికి సామ్రాట్, తులసి ఇద్దరూ వస్తారు. అప్పుడు సామ్రాట్ 'నా గురించి ఆలోచిస్తూ బుర్ర బద్దలు కొట్టుకుంటున్నావా? ఆరోజు తులసి గురించి నేను ఏం మాట్లాడానో గుర్తుకురావడం లేదా? నీ కళ్ల ముందే తులసికి నా మనసులో మాట చెబుతాను. విని తట్టుకోవడానికి చాలా ధైర్యం కావాలి. ముందు బీరు తాగు' అంటాడు.

  బీచ్‌లో బికినీలో రెచ్చిపోయిన శ్రీయ: ఆ పార్టులన్నీ చూపిస్తూ దారుణంగా!

  తులసికి సామ్రాట్ లవ్ ప్రపోజ్

  తులసికి సామ్రాట్ లవ్ ప్రపోజ్

  ఆ తర్వాత సామ్రాట్ 'తులసి గారు మీరంటే ఏంటో తెలుసుకున్న మరుక్షణం.. మీరంటే అభిమానం పెంచుకున్నాను. మీవాళ్ల మీద మీరు చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతను చూసి వాళ్లలో నేను కూడా ఒకడిని అవ్వాలని అనుకుంటున్నా. మనిషిగా మీ స్థాయి అందుకోవడానికి నా స్థాయి సరిపోదు. అందుకే మీ నీడలో మనిషిగా అవ్వాలనుకుంటున్నా.

  మీ జీవితంలో సగ భాగం అవ్వాలనుకుంటున్నా. మీకు ఇష్టమేనా' అని అడుగుతాడు. దీంతో తులసి ఓకే అంటుంది. అప్పుడు సామ్రాట్ 'చాలా.. నీ డౌట్ క్లారిఫై అయిందా. ఇక మమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు' అని అంటాడు. దీంతో నందూ కోపంతో తన చేతుల్లో ఉన్న బీరు బాటిల్‌ను సామ్రాట్ మీద విసిరి కొడతాడు. కానీ, అక్కడ అతడు ఉండడు. ఎందుకంటే అది నందూ కన్న కల కాబట్టి.

  నందూ కారు బ్రేకులు తీసేసి

  నందూ కారు బ్రేకులు తీసేసి

  అనంతరం నందూ కోపంతో కారులో వెళ్తుండగా అది ఆగిపోతుంది. ఆ వెంటనే మెకానిక్ సురేష్‌కు అతడు కాల్ చేస్తాడు. దీంతో అతడు వచ్చి కారును రిపేర్ చేస్తాడు. అంతేకాదు, 'సార్.. తాగి ఉన్నారు కదా.. కారు ఎలా నడుపుతారు. యాక్సిడెంట్ అయితే కాళ్లు చేతులు విరుగుతాయి' అంటాడు. ఇంతలో నందూకు ఓ ఆలోచన వస్తుంది. వెంటనే సురేష్‌ను పిలిచి నువ్వు సామ్రాట్ గారి కారుకు బ్రేకులు తీసేయాలి అంటాడు.

  దీంతో అతడు వామ్మో సామ్రాట్ గారి కారా.. నేను చేయను బాబోయ్ అంటూ అక్కడి నుంచి పరిగెత్తుకు వెళ్తాడు. దీంతో నందూనే నేరుగా సామ్రాట్ ఇంటికి వెళ్లి అతడి కారుకు బ్రేకులు తీసేస్తాడు. అప్పుడు 'రేపు నువ్వు తులసితో వెళ్లేది షికారుకు కాదురా.. డైరెక్ట్‌గా హాస్పిటల్‌కు' అని వచ్చేస్తాడు.

  డెలివరీ తర్వాత తొలిసారి బికినీలో ప్రణిత: మరీ ఇంత దారుణంగా చూపిస్తారా!

  కార్ యాక్సిడెంట్.. తులసి అని

  కార్ యాక్సిడెంట్.. తులసి అని

  ఉదయాన్నే సామ్రాట్ రెడీ అయి కారు దగ్గరికి వెళ్తాడు. అప్పుడే తులసి కూడా ఆటోలో అక్కడకు వస్తుంది. అప్పుడు సామ్రాట్ ఇంటికి వస్తా అని చెప్పా కదా.. మీరెందుకు వచ్చారు అని అంటాడు. దీంతో తులసి 'మనం వెళ్లేది ఇటువైపే కదా.. మళ్లీ మీరు నన్ను పికప్ చేసుకోవడానికి అటువైపు రావడం ఎందుకు' అని అంటుంది.

  తర్వాత కారులో వెళ్తుండగా బ్రేకులు పడవు. దీంతో కంగారు పడిన సామ్రాట్ కారును కరెంట్ స్తంభానికి ఢీకొడతాడు. దీంతో నందూ 'తులసి' అంటూ గట్టిగా అరుస్తూ నిద్ర లేస్తాడు. అప్పుడు లాస్య వచ్చి తులసి అని అరిచావేంటి అంటుంది. దీంతో నందూకు అది కల అని అర్థం అవుతుంది. కానీ, లాస్య ముందు బుక్ అవకూడదని అనుకుంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 740: Nandhu Has a Bad Dream About Tulasi and Samrat Being in Trouble. After That Nandhu Gets Shocked as Lasya Questions Him.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X