Intinti Gruhalakshmi September 18th Episode: బ్లాక్‌మెయిల్ చేసిన లాస్య.. వాళ్లకు నిజం చెప్పిన మోహన్

ఇండియాలోని మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి!

Photo Courtesy: Star మా and Disney+Hotstar

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. రెస్టారెంట్‌లో ఏదో ఆలోచించుకుంటూ కూర్చున్న ప్రేమ్‌ను చూసిన అక్షర.. యూట్యూబర్‌గా ప్లాన్ వేసి అతడిని కలుస్తుంది. ఆ తర్వాత ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పడంతో పాటు ప్రేమ్‌ను మరోసారి కలవాలని అంటుంది. దీంతో జీకే నందూకు ఫోన్ చేయగా.. ప్రేమ్ ప్రేమ గురించి అతడు నిజం చెబుతాడు. ఆ తర్వాత ప్రేమ్ పెళ్లి విషయం గురించి తులసిపై నందూ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. దీంతో అతడికి తులసి భారీ షాక్ ఇచ్చేలా మాట్లాడుతుంది. ఇక, తులసి ఫ్యాక్టరీలో అకౌంటెంట్‌గా తన మనిషినే పెడుతుంది లాస్య.

తులసిపై పోలీసులకు జీకే ఫిర్యాదు

తులసిపై పోలీసులకు జీకే ఫిర్యాదు

తులసి ఫ్యాక్టరీ నుంచి అక్షర కంపెనీకి వచ్చిన చెక్ బౌన్స్ అవుతుంది. ఈ విషయాన్ని జీకేకు ఆయన కంపెనీలో పని చేసే ఉద్యోగి వచ్చి చెబుతాడు. అంతేకాదు, 'చెక్ బౌన్స్ అయిన విషయం చెప్పగానే వాళ్ల మేనేజర్ నోటికి వచ్చినట్లు మాట్లాడాడు. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ బెదిరించాడు' అని జీకేకు కంప్లైంట్ చేస్తాడు. దీంతో ఆయన 'ఏంటి అంత పొగరు పట్టిందా? ఏం చేసుకుటారో చేసుకో అన్నారుగా.. మనం ఏం చేస్తామో కూడా చూపిద్దాం. వెంటనే యాక్షన్ తీసుకో. వెళ్లి ఆ ఫ్యాక్టరీ ఓనర్ మీద పోలీస్ కంప్టైంట్ ఇవ్వు' అంటూ మేనేజర్‌ను పంపుతాడు.

లాస్యకు తులసి మేనేజర్ ఫోన్ కాల్

లాస్యకు తులసి మేనేజర్ ఫోన్ కాల్

జీకే.. తులసి మీద పోలీసులకు ఫిర్యాదు చేయమనడంతో పాటు దీన్ని పర్సనల్‌గా తీసుకోమని స్టేషన్‌లో చెప్పమని అంటాడు. ఆ తర్వాత తులసి ఫ్యాక్టరీలో పని చేస్తున్న మేనేజర్.. లాస్యకు ఫోన్ చేస్తాడు. 'మేడం మీరు చెప్పినట్లే చెక్ బౌన్స్ అయ్యేలా చేశాను. వాళ్లు ఫోన్ చేస్తే పొగరుగా మాట్లాడాను. ఈ పాటికే తులసి గారిపై యాక్షన్ తీసుకోడానికి రెడీ అయి ఉంటారు. ఇప్పుడు నన్నేం చేయమంటారు' అని అడుగుతాడు. దీనికి లాస్య 'చాలా బాగా చేశావ్ పురుషోత్తమ్. నువ్వు వెంటనే అక్కడి నుంచి పరారై వెళ్లిపో. లేకుంటే అది నీ మెడకు చుట్టుకోవచ్చు' అని చెబుతుంది.

తులసి అరెస్ట్... ఆనందంలో లాస్య

తులసి అరెస్ట్... ఆనందంలో లాస్య

మేనేజర్‌తో మాట్లాడిన తర్వాత తులసి కోసం పోలీసులు వస్తారని, అక్కడ ఏం జరగబోతుందో లాస్య ముందే ఊహించుకుంటూ ఉంటుంది. అందుకు అనుగుణంగానే ఫ్యాక్టరీలో పని చేసుకుంటోన్న తులసిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు వస్తారు. అప్పుడు అక్షర కంపెనీకి ఇచ్చిన చెక్ బౌన్స్ అయిందని చెబుతారు. అంతేకాదు, గోపాలకృష్ణ మీ మీద కంప్లైంట్ ఇచ్చారని తులసికి చెప్పి ఆమెను ఆరెస్ట్ చేస్తారు. దీంతో లాస్య సంతోషిస్తుంటుంది. 'నువ్వు స్టేషన్‌లో ఉండగానే ప్రేమ్ పెళ్లి చేస్తా. నువ్వు మా కంపెనీ ముందు అడుక్కునే రోజు వస్తుంది' అంటుంది.

తులసి గురించి ఇంట్లో పెద్ద గొడవ

తులసి గురించి ఇంట్లో పెద్ద గొడవ

తులసి అరెస్ట్ అయిన విషయాన్ని అభికి ఫోన్ చేసి చెబుతారు. ఈ విషయాన్ని అతడు కంగారుగా అందరికీ చెబుతాడు. అప్పుడు అనసూయ, అంకిత, లాస్య, నందూలు తులసిపై నిందలు వేస్తూ నోటికి వచ్చినట్లు మాట్లాడతారు. అప్పుడు నందూ 'ఏమీ చేతకాని వాళ్లకు బిజినెస్‌లు ఎందుకు. అయినా డబ్బులు కాజేయడం అవసరమా' అని అంటాడు. దీనికి ప్రేమ్ 'ఏంటి నాన్న మీరు అప్పులు పాలైనప్పుడు వాళ్లు ఇంటికి మీదకు వచ్చి గొడవ చేసింది మర్చిపోయారా? ఇప్పుడు కంపెనీ దివాళా తీసింది మర్చిపోయారా' అంటూ ప్రశ్నించడంతో పెద్ద గొడవ అవుతుంది.

తులసికి బెయిల్ ఇచ్చిన మోహన్

తులసికి బెయిల్ ఇచ్చిన మోహన్

ఇంట్లో పెద్ద గొడవ తర్వాత నందూ 'పదండి స్టేషన్‌కు వెళ్దాం. మీ అమ్మ పిచ్చి పిచ్చి పనులు చేసినా నాకు తప్పదు కదా' అంటూ ప్రేమ్‌, అభిని తీసుకుని వెళ్తాడు. అంతలో అక్కడకు చేరుకున్న మోహన్.. తులసి తప్పు చేయలేదని పోలీసులకు చెబుతాడు. అప్పుడు స్టేషన్ ఆఫీసర్ 'తులసి గారు పెద్ద తప్పు చేయకపోవచ్చు. కానీ, ఆమె మేనేజర్ మాత్రం నోటికొచ్చినట్లు మాట్లాడాడు. చంపుతానని కూడా బెదిరించాడు. ఇది పెద్ద కేసు కాదా' అని చెబుతాడు. ఆ తర్వాత మోహన్ బెయిల్ పేపర్స్ ఇవ్వడంతో ఆమెను పోలీసులు విడుదల చేస్తారు.

ప్రేమ్ గొడవ.. తులసి చెప్పడంతో

ప్రేమ్ గొడవ.. తులసి చెప్పడంతో

స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రేమ్.. మోహన్‌కు థ్యాంక్స్ చెప్పగా.. ఆయన మాత్రం మనమంతా ఒక ఫ్యామిలీ అని చెబుతాడు. అప్పుడు ప్రేమ్ 'కొందరు ఉంటారు. ఫ్యామిలీ అంటారు కానీ, ఏమీ చేయరు. పైగా తప్పు ఎవరిదో తెలుసుకోకుండా నిందలు వేస్తుంటారు' అంటూ తండ్రిని దెప్పిపొడుస్తారు. దీంతో వాళ్లిద్దరికీ స్టేషన్ దగ్గరే డిస్కర్షన్ జరుగుతుంది. అప్పుడు తులసి కలుగజేసుకుని 'ఎవరో చేసిన తప్పులకు అప్పడప్పుడు ఇలానే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన తప్పు ఉంది కాబట్టి సైలెంట్‌గా ఉండాలి' అంటూ ప్రేమ్‌ను ఆపుతుంది.

శృతికి నిజం చెప్పి షాకిచ్చిన లాస్య

శృతికి నిజం చెప్పి షాకిచ్చిన లాస్య

శృతి ఇంట్లో ఒంటరిగా ఉన్న విషయాన్ని గ్రహించిన లాస్య.. ఆమెతో మాట్లాడాలని వెళ్తుంది. అప్పుడు 'ఏంటి శృతి బాధ పడుతున్నావా? అసలు తులసి ఎవరి వల్ల అరెస్ట్ అయిందో తెలుసా? లేకపోతే ప్రేమ్‌కు పెళ్లి చేస్తానంటే అడ్డు పడుతుందా?' అని అంటుంది. అప్పుడు శృతి ఎందుకిలా చేశారంటూ ప్రశ్నిస్తూనే బాధ పడుతుంది. దీంతో లాస్య 'నువ్వు కాదన్న ప్రేమ్ నీ వెంట పడుతూనే ఉన్నాడు. కాబట్టి అతడిని మరింత దూరం చేయాలి. అసలు లైఫ్‌లో నీ జోలికి రాకుండా చూడాలి. అలా చేస్తే నా ప్లాన్లు ఆపుతాను' అని బ్లాక్‌మెయిల్ చేస్తుంది. దీంతో ఈ ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X