twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Intinti Gruhalakshmi Today Episode: సామ్రాట్ కారుకు యాక్సిడెంట్.. హనీ ఆరోగ్య పరిస్థితి తెలిసి షాక్

    |

    మారుతోన్న పరిస్థితుల కారణంగా కొత్త ట్రెండ్ వస్తున్నప్పటికీ తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

    దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి మరి!

    Photos Courtesy: Star మా and Disney+Hotstar

    శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఆఫీసులో తులసి గురించి నందూకు సామ్రాట్ క్లాస్ పీకుతాడు. ఆమెను వదులుకొని చాలా తప్పు చేశావని అంటాడు. ఆ తర్వాత నందూ ఫుల్లుగా మందు తాగి కోపంగా వస్తూ ఉంటాడు. అప్పుడే అతడి కారు ఆగిపోతుంది. ఆ తర్వాత మెకానిక్ రాగానే సామ్రాట్ కారుకు బ్రేకులు తీసేయమని అడుగుతాడు.

    కానీ, అతడు ఒప్పుకోడు. దీంతో నందూనే వెళ్లి సామ్రాట్ కారుకు బ్రేకులు తీసేస్తాడు. ఆ తర్వాతి రోజు ఉదయాన్నే సామ్రాట్, తులసి ఆ కారులో వెళ్తుండగా యాక్సిడెంట్ అవుతుంది. కానీ, అది నందూ కన్న కల కావడంతో గట్టిగా అరుస్తాడు.

    తెలుగు పిల్ల ఎద అందాల జాతర: చీర ఉన్నా పరువాలు దాగట్లేదుగా!తెలుగు పిల్ల ఎద అందాల జాతర: చీర ఉన్నా పరువాలు దాగట్లేదుగా!

    లాస్యకు అబద్ధాన్ని చెప్పిన నందూ

    లాస్యకు అబద్ధాన్ని చెప్పిన నందూ

    తులసి అని అరిచిన తర్వాత లాస్యకు నందూ అబద్ధం చెప్తాడు. అంతేకాదు, 'మొగుళ్లు అందరూ పెళ్లాలకు చాలా ఈజీగా అబద్ధాలు చెప్పి పెళ్లాలను నమ్మించేస్తుంటారు. అది నాకు ఎప్పుడు చేతనవుతుందో.. దొరికిపోయేలా ఉన్నాను' అని అనుకుంటాడు. అప్పుడే లాస్య తులసి కానీ కలలోకి వచ్చిందా అని అడుగుతుంది. దీంతో తను ఎందుకు వస్తుంది అని అడుగుతాడు. దీంతో లాస్య 'ఎందుకా.

    పండక్కి చీర కొనిపెడతావేమో అని అడగానికి వచ్చి ఉంటుంది. లేకపోతే ఏంటి.. మీ మాజీ భార్య నీ కలలోకి ఎందుకు వస్తుంది. నువ్వు తలుచుకుంటేనే కదా వచ్చేది' అని అంటుంది. ఆ తర్వాత త్వరగా రెడీ అవ్వు ఆఫీసుకు వెళ్లాలి అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

    తులసి కోసం నందూ ఎంక్వైరీ చేసి

    తులసి కోసం నందూ ఎంక్వైరీ చేసి

    లాస్య అలా వెళ్లిపోగానే తులసి గురించి నందూ ఆలోచిస్తూ సామ్రాట్ కారుతో తను వెళ్తే ప్రమాదం అనుకుంటాడు. అంతేకాదు, 'ఈ పాటికి సామ్రాట్, తులసి కారులో వెళ్లి ఉంటారు. నిజంగానే యాక్సిడెంట్ జరిగి ఉంటుందా. అభికి ఫోన్ చేస్తే తులసి వెళ్లిందో లేదో తెలుస్తుంది' అని అనుకుంటాడు. వెంటనే అభికి ఫోన్ చేస్తాడు. అప్పుడు అతడిని మీ అమ్మ ఏం చేస్తుందిరా అని అడుగుతాడు. దీంతో అభి మీరు నాతో మాట్లాడటానికి ఫోన్ చేశారా.. లేక అమ్మతోనా అంటాడు. అప్పుడు నందూ 'అలా కాదు.. సామ్రాట్ గారు ఏదో మీటింగ్ ఉందన్నారు. ఆఫీసుకు వెళ్లాలి. సామ్రాట్ గారు వచ్చి తులసిని పికప్ చేసుకుంటా అన్నారు' అంటాడు. దీంతో అభి మామ్.. సామ్రాట్ కోసం వెయిట్ చేస్తుంది అని చెప్తాడు. అప్పుడు నందూ తులసి సేఫ్ అనుకుంటాడు.

    యాంకర్ స్రవంతి అందాల ఆరబోత: శృతి మించిన హాట్ షోతో రచ్చయాంకర్ స్రవంతి అందాల ఆరబోత: శృతి మించిన హాట్ షోతో రచ్చ

    హనీని దింపేసి రమ్మని చెప్పడంతో

    హనీని దింపేసి రమ్మని చెప్పడంతో

    ఆ తర్వాత సామ్రాట్.. తులసికి ఫోన్ చేస్తాడు. అప్పుడామెతో కాస్త లేట్ అయింది అంటాడు. ఇంతలో హనీ వచ్చి 'రోజూ తాతయ్యతో వెళ్లి బోర్ కొడుతోంది. ఈరోజు నువ్వే నన్ను స్కూల్‌లో దించు' అని అడుగుతుంది. ఇవన్నీ తులసి వింటుంది. అప్పుడు సామ్రాట్ ఈరోజు నువ్వు తాతయ్యతో వెళ్లు.. రేపు నేను దింపుతాను అంటాడు. దీంతో సామ్రాట్ దగ్గర హనీ ఫోన్ తీసుకుని.. 'తులసి ఆంటీ... పిల్లలను ఎలా పెంచాలో మా నాన్నకు చెప్పొచ్చు కదా' అని అంటుంది. దీంతో తులసి సామ్రాట్‌తో 'హనీని స్కూల్ దగ్గర దించేసి రండి' అని చెబుతుంది.

    కార్లో సామ్రాట్, హనీ.. నందూ టెన్షన్

    కార్లో సామ్రాట్, హనీ.. నందూ టెన్షన్

    అనంత ముందు నువ్వు స్పీడ్రం హనీని కారులో ఎక్కించి సామ్రాట్ కారు స్టార్ట్ చేస్తాడు. కారులో ఇద్దరూ జోక్స్ వేసుకుంటూ నవ్వుతుంటారు. అప్పుడు హనీ 'వద్దు నాన్న ఇక చాలు. ఎక్కువగా నవ్వొద్దట.. ఎంత ఎక్కువగా నవ్వితే.. అంతగా ఏడవాలట. పెంచు' అని అంటుంది. దీంతో అలాగే అని సామ్రాట్ స్పీడ్ పెంచుతాడు. మరోవైపు నందూ 'సామ్రాట్ ఇప్పటికే కారులో బయలుదేరి ఉంటాడు. బ్రేకులు పనిచేయవు. ఎక్కడో ఒక చోట యాక్సిడెంట్ జరిగి ఉంటుంది' అని టెన్షన్ పడుతుంటాడు. ఇంతలో సామ్రాట్.. బ్రేకులు వేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ.. బ్రేక్ పడదు. అది ఫెయిల్ అయిందేమో అని అనుకుని భయపడుతూ ఉంటాడు. అదే సమయంలో నందూ 'సామ్రాట్‌కు ఏమీ కాకుండా చూడు దేవుడా' అని కోరుకుంటూ ఉంటాడు.

    తడిచిన బట్టల్లో సీరియల్ నటి పరువాల విందు: ఆమెనిలా చూస్తే మెంటలెక్కిపోద్ది!తడిచిన బట్టల్లో సీరియల్ నటి పరువాల విందు: ఆమెనిలా చూస్తే మెంటలెక్కిపోద్ది!

    కారుకు యాక్సిడెంట్.. తులసి వెళ్లి

    కారుకు యాక్సిడెంట్.. తులసి వెళ్లి

    బ్రేకులు ఫెయిల్ అయిన కారులో వెళ్తుండగా ఎదురుగా మరో కారు వస్తుంది. దీంతో సామ్రాట్ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కారును చెట్టుకు ఢీకొడతాడు. దీంతో సామ్రాట్, హనీ ఇద్దరికీ తీవ్రగాయాలు అవుతాయి. ఈ విషయాన్ని వెంటనే తులసికి చెబుతారు. నందూకు కూడా విషయం తెలుస్తుంది. వెంటనే తులసి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. పాపకేం ప్రమాదం లేదు కదా డాక్టర్ అని సామ్రాట్ బాబాయి అడుగుతాడు. దీంతో ప్రాణాపాయం ఏం లేదు అని డాక్టర్ అంటాడు. సామ్రాట్‌కు కూడా ఏం కాలేదు అని చెప్పడంతో ఆయన ఊపిరి పీల్చుకుంటాడు.

    హనీ గురించి తెలిసి సామ్రాట్ షాక్

    హనీ గురించి తెలిసి సామ్రాట్ షాక్

    ఆస్పత్రికి వచ్చిన తులసి.. సామ్రాట్‌ను చూసి బాధ పడుతుంది. ఇంతలో సామ్రాట్ స్పృహలోకి వస్తాడు. దీంతో బాబాయి అతడిని ఇప్పుడు ఎలా ఉందిరా అని అడుగుతాడు. దీంతో సామ్రాట్ నాకేమైంది బాబాయి అని అడుగుతాడు. అప్పుడాయన ఏమైందో నీకు గుర్తు లేదా అని అడుగుతాడు. దీంతో సామ్రాట్‌కు జరిగిన యాక్సిడెంట్ గురించి గుర్తొస్తుంది. వెంటనే లేచి కూర్చొంటాడు. అంతేకాదు హనీ.. అని అరుస్తాడు. నా హనీ ఎక్కడ అని అడుగుతాడు. దీంతో అక్కడే ఉన్న తులసి తనకు కూడా దెబ్బలు తగిలాయి. ఐసీయూలో ఉంది. ట్రీట్‌మెంట్ చేస్తున్నారు అంటుంది.

    బీచ్‌లో దారుణంగా అమలా పాల్: ఆ డ్రెస్ ఏంటి? ఆ ఫోజులేంటి బాబోయ్!బీచ్‌లో దారుణంగా అమలా పాల్: ఆ డ్రెస్ ఏంటి? ఆ ఫోజులేంటి బాబోయ్!

    సామ్రాట్‌ను ఓదార్చిన తులసి

    సామ్రాట్‌ను ఓదార్చిన తులసి

    విషయం తెలియగానే సామ్రాట్ నేను వెంటనే హనీని చూడాలి అని లేచి ఐసీయూ దగ్గరికి వెళ్తాడు. తర్వాత ఐసీయూ డోర్ దగ్గర్నుంచి తనను చూస్తాడు. వెక్కి వెక్కి ఏడ్చాడు. ఇంతలో డాక్టర్ వచ్చి మీ పాపకు ఏం పర్వాలేదు అని అంటుంది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ఆ తర్వాత హనీ దగ్గరికి వెళ్తారు. అప్పుడు సామ్రాట్ 'మీ నాన్న మంచోడు కాదు.. నిన్ను సరిగ్గా చూసుకోవడం తెలియదు. నన్ను క్షమించమ్మా' అని హనీతో మాట్లాడుతాడు. అప్పుడు తులసి అతడికి ధైర్యం చెబుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

    English summary
    Intinti Gruhalakshmi Episode 741: Nandhu Evil Deeds Place Honey and Samrat in Danger. After That Samrat Gets Heartbroken about Honey Health Condition.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X