Intinti Gruhalakshmi: చివరి నిమిషంలో లక్కీ ట్విస్ట్.. రాజ్యలక్ష్మి నుంచీ షాక్.. రోడ్డున పడ్డ లాస్య
ఇండియాలో ఎన్నో ఇండస్ట్రీలు ఉన్నా... తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar
గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే: గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. లాస్యను ఇంటికి రమ్మనందుకు పరందామయ్య, అనసూయలు నందూ, తులసిపై కోప్పడుతుంటారు. దీంతో తులసి ఈ విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని వెళ్లిపోతుంది. దీంతో నందూకు వాళ్లు క్లాస్ పీకుతారు. అనంతరం లాస్య ఇంటికి వెళ్లిన తులసి ఆమెకు షాక్ ఇస్తుంది. అంతేకాదు, ఆస్పత్రిలో రాజ్యలక్ష్మి వాళ్లతో కలిసి వేసిన ప్లాన్ తనకు తెలిసిపోయిందని లాస్యకు చెప్తుంది. దీంతో తులసికి లాస్య ఎదురు తిరుగుతుంది. అదే సమయంలో నందూకు మళ్లీ భార్యనై అత్తింట్లో అడుగు పెడతాను అని తేల్చి చెప్పేస్తుంది.

లాస్య గురించి వాళ్లు దిగులుగా: అత్తమామలకు తులసి టీ తీసుకొచ్చి ఇస్తుంది. అప్పుడు పరందామయ్య వాళ్లు 'ఇదేనా అమ్మా మాకు స్వేచ్ఛగా తాగే చివరి కప్పు? ఇక లాస్య వస్తే అన్నింటికి తాళాలు వేస్తుంది కదా. మా స్వేచ్ఛ మొత్తం పోతుంది' అని తులసితో అంటారు. దీనికామె అలా ఏం ఉండదు మావయ్యా.. బయపడకండి అత్తయ్యా అని ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు వాళ్లు 'మాకు రెండు మూడు నెలలు కాశీకి టికెట్స్ తీయండి. మేము లాస్యతో పడలేం' అంటారు. దీంతో నందూ వచ్చి 'అలా ఏం కాదు మీరేం దీని గురించి దిగులు పడొద్దు' అని అతడు కూడా ఓదార్చుతుంటాడు.

అలా ప్లాన్ చేసిన వచ్చిన లాస్య: తులసి వాళ్లు మాట్లాడుకుంటూ ఉండగా లాస్య గుమ్మం దగ్గర ప్రత్యక్షం అవుతుంది. అప్పుడు అత్తయ్యా అని పిలవగా అనసూయ సీరియస్ అవుతుంది. కానీ, ఆమె మాటలు పట్టించుకోని లాస్య 'సరేలే వాతావరణం వేడిగా ఉంది కదా. మీ అబ్బాయిని నా లగేజ్ లోపలికి తెచ్చేయమని చెప్పండి. నేనైతే లోపలికి వచ్చేస్తున్నా' అని వస్తుంది. అయితే, అంతకు ముందే రాజ్యలక్ష్మితో 'అక్కడికి వెళ్లి తులసికి సంతోషం లేకుండా చేస్తా. ఇక్కడ దివ్యకు భయం మొదలై ఆ ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది. ఇక దివ్య సంగతి నువ్వు చూసుకో' అని ప్లాన్ చేసింది చూపిస్తారు.
లాస్య ఓవర్‌గా.. నందూ కోపంగా: లోపలికి వచ్చిన లాస్య 'నువ్వేగా రమ్మన్నావు. అత్తగారికి మామగారికీ ఆ విషయం ఇంకా తెలిసినట్లు లేదు' అని తులసితో అంటుంది. తర్వాత తనకోసం ఇంకో గుప్పెడు బియ్యం వండమని చెప్తుంది. దీనికి తులసి వాళ్లకు కోపం వస్తుంది. అలా కాసేపు సాగిన తర్వాత నందూను లోపలికి వెళ్దాం పదా అని రొమాంటిక్‌గా పిలుస్తుంది. దీంతో అనసూయ 'లాగిపెట్టి కొట్టానంటే చెంప పగిలిపోతుంది. కట్టుకున్న పెళ్లాం లాగా వాడి గదిలోకి ఎలా వెళ్తావు' అంటుంది. దీనికి లాస్య 'కొద్ది రోజుల క్రితం నేను, నందూ అదే గదిలో పక్కనే పడుకున్నాం మరిచిపోయారా' అంటుంది.
తల్లికి లక్కీ కోలుకోలేని షాక్‌తో: అందరూ కింద మాట్లాడుకుంటూ ఉండగా.. లక్కీ బ్యాగ్ పట్టుకుని కిందకు వస్తాడు. అది చూసిన లాస్య 'ఏంటి నాన్నా ఈ అమ్మ కోసం గది ఖాళీ చేసి ఇస్తున్నావా' అంటుంది. దీనికి లక్కీ 'లేదు, మనం ఇల్లే ఖాళీ చేసేస్తున్నాం' అంటూ తల్లికి షాక్ ఇస్తాడు. అంతేకాదు,'నీకు కావాల్సింది. నువ్వు దిగులు పడింది నాకోసమే కదా. నువ్వు చచ్చిపోవాలని అనుకున్నది నేను నీకు దూరం అయ్యాననే కదా. పదా ఇక నుంచి ఇద్దరం కలిసి ఒకే చోట ఉందాం' అంటాడు. దీంతో లాస్య 'ఎక్కడ ఉందాం' అనగా.. 'మని ఇంట్లోనే ' అంటూ లక్కీ కోలుకోలేని షాకిస్తాడు.

అలాంటి చెడ్డ పేరు వద్దమ్మా: లక్కీ మాటలకు షాకైన లాస్య 'అదేంటి డాడీ కావాలని ఏడ్చావుగా.. వదిలేసి వస్తావా. నేను వచ్చి నిన్ను డాడీని దూరం చేశానని అందరూ నన్ను తిట్టుకుంటారు. డాడీ మీద బెంగ పెట్టుకుని నీకు జ్వరం వస్తే అందరూ నన్ను అసహించుకుంటారు. అలాంటి చెడ్డ పేరు నాకొద్దు. నువ్వు ఇక్కడే ఉండు. నేను కూడా నీతోనే ఉంటాను సరేనా' అని అడుగుతుంది. దీంతో 'మమ్మీని వదిలేసి డాడీ దగ్గర ఉండిపోయాడు అని అందరూ నన్ను తిట్టుకుంటారు. అలాంటి చెడ్డ పేరు నాకు కూడా వద్దు మమ్మీ. ఇప్పటికే ఇక్కడున్న వాళ్లందరినీ చాలా ఇబ్బంది పెట్టాం. ఇంక చాలు బయలుదేరదాం. నేను ఇక్కడికి రావడం వల్లే అందరికీ ఈ సమస్య లొస్తున్నాయని నాకు తెలుసు' అంటాడు. దీంతో నందూ ఎందుకిలా చేశావ్ అనగా.. ఈ డాడీ కోసమే అని ఏడుస్తాడు.
లక్కీకి ప్రామిస్ చేసిన నందూ: ఆ తర్వాత లక్కీ 'అందరికీ ఉన్నట్లే నాకు డాడీ కావాలని ఉంది. డాడీ చేయి పట్టుకుని పరగెత్తాలని ఉంది. డాడీ గుండెలపై తలపెట్టుకుని పడుకోవాలని ఉంది. మమ్మీ నన్ను పట్టించుకోదు. పట్టించుకోవడానికి నాకు డాడీ లేదు. ఆలోచిస్తుంటేనే నాకు ఏడిపొస్తుంది. ఆ దేవుడు నాకెందుకు డాడీని ఇవ్వలేదు. ఎవ్వరి అడిగినా ఈ ప్రశ్నకు సమాధానం లేదు. మమ్మీ అని ఎవరినైనా పిలవచ్చు. డాడీ అని ఎవరిని పడితే వాళ్లని పిలవలేం. ఆ డాడీ పది లక్షల బాండ్ నా ముఖాన్ని కొట్టి వెళ్లిపోయాడు. ఎంత ఏడ్చినా నా ముఖం చూడలేదు. డాడీ అని పిలవడానికి నాకు ఎవరైనా ఉన్నారు అంటే అది మీరే డాడీ' అని ఏడుస్తాడు. దీంతో నందూ ఇకపై తండ్రిగా అండగా ఉంటానని, బాగోగులు చూసుకుంటానని లక్కీకి ప్రామిస్ చేస్తాడు.

లాస్యకు షాకిచ్చిన రాజ్యలక్ష్మి: లాస్య మళ్లీ తులసి ఇంటికి వెళ్లడంతో రాజ్యలక్ష్మి ఫుల్ హ్యాపీగా ఉంటుంది. అదే సమయంలో లాస్యను పొగుడుతుంటుంది. అప్పుడు బసవయ్య మాత్రం లాస్యను అంతగా నమ్మొద్దని చెబుతాడు. అంతలోనే ఆమె లక్కీని తీసుకుని అక్కడకు వస్తుంది. దీంతో బసవయ్య వెటకారం ఆడుతూ ఉంటాడు. అప్పుడు లాస్య.. రాజ్యలక్ష్మికి కంప్లైట్ చేయగా.. 'వాడు అన్న దాంట్లో తప్పేముంది' అని ప్రశ్నిస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











