For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: నందూ, లాస్యకు తులసి ఝలక్.. ప్లాన్ చేసింది ఆమెనే అంటూ!

  |

  దక్షిణాదిలోని చాలా భాషల కంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి మరి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. భూమి పూజ జరుగుతున్న ప్రదేశానికి కోపంగా వచ్చిన అభి నానా గొడవ చేస్తాడు. అస్సలు చదువు, అర్హతలు లేని మా మామ్‌కు ఎందుకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు? దీని వెనుక మీ ఉద్దేశం ఏంటి? అని సామ్రాట్‌ను ప్రశ్నిస్తాడు. దీంతో దీపక్ ఎంట్రీ ఇచ్చి నందూను, అభిని తిడతాడు. అప్పుడు నందూ కోపంతో అతడిపై విరుచుకు పడతాడు. దీంతో నందూ, తులసి మాజీ భార్యభర్తలన్న విషయం సామ్రాట్‌కు తెలుస్తుంది. తర్వాత ఇంట్లో అభి, ప్రేమ్ మధ్య గొడవ జరుగుతుంది. అప్పుడు తులసి వచ్చి అభిని ఏమీ అనొద్దని అంటుంది.

  ఆ సీరియల్ నటితో ప్రేమలో పడ్డ హైపర్ ఆది: ఆ షోలో బయటపెట్టిన కమెడియన్

  తులసిపై లాస్య నిందలు వేస్తూ

  తులసిపై లాస్య నిందలు వేస్తూ

  దీపక్‌తో తులసి మాట్లాడుతుండగా లాస్య, నందూ వస్తారు. వచ్చీ రావడమే లాస్య చప్పట్లు కొడుతూ ఉంటుంది. అంతేకాదు, 'నీ మాజీ భార్య అతి షో చూస్తుంటే నీకు క్లాప్స్ కొట్టాలనిపించడం లేదా నందూ. చేయాల్సిందంతా చేసి.. ఇప్పుడు ఏమీ ఎరగనట్లు మాట్లాడుతుంది చూశావా' అని అంటుంది. అప్పుడు అనసూయ ఏంటి ఈ నాటకాలు అని అడుగుతుంది. దీంతో లాస్య 'నాటకం మాది కాదు అత్తయ్య. ఈ మహానటిది. సామ్రాట్ ముందు నందూ పరువు తీయాలని డిసైడ్ అయింది. దీపక్‌ను పిలిపించి నందూనే తన భర్త అని తెలిసేలా చేసింది' అంటుంది.

  నందూ కూడా నమ్ముతానంటూ

  నందూ కూడా నమ్ముతానంటూ

  లాస్య తనపై నిందలు వేస్తుండగా తులసి ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. ఆ తర్వాత నందూతో నేనే ఇదంతా చేయించానని మీరు నమ్ముతున్నారా అని సూటిగా ప్రశ్నిస్తుంది. దీనికి అతడు నమ్ముతున్నాను అని అంటాడు. దీంతో తులసి షాక్ అవుతుంది. అంతేకాదు, 'నేను అలా చేయాలనుకుంటే భూమి పూజరోజే ఎందుకు అలా చేస్తాను. నాకు అది పండగ రోజు కదా. నా చేచేతులా నేనే నా కార్యక్రమాన్ని చెడగొట్టుకుంటానా'. అని అంటుంది. అప్పుడు పరందామయ్య 'నిజంగా చెప్పాలనుకుంటే ఆరోజే సామ్రాట్‌కు చెప్పేది కదరా. కానీ ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తుంది' అని నందూతో అంటాడు. తర్వాత ప్రేమ్ 'అమ్మ ఆ విషయం సామ్రాట్ గారికి తెలిసేలా చేస్తే తనకు ఏం వస్తుంది. అమ్మకు ఏం లాభం' అంటాడు.

  అషు రెడ్డి అందాల ప్రదర్శన: ఏకంగా షర్ట్ విప్పేసి మరీ చూపిస్తూ!

  ఆమె ప్లాన్ చేసిందన్న నందూ

  ఆమె ప్లాన్ చేసిందన్న నందూ

  ఇంట్లో వాళ్లు మాట్లాడడంతో నందూ స్పందిస్తాడు. 'మమ్మల్ని ఆ కంపెనీ నుంచి తరిమేసేందుకు తులసి చేసిన ప్లాన్ ఇది' అంటాడు. దీనికి లాస్య అంతేకాదు నందూ.. మనం లేకపోతే అక్కడ తను ఆడింతే ఆట.. పాడిందే పాట అంటుంది. దీంతో తులసి సారీ.. వెరీ వెరీ సారీ అంటుంది. దీనికి నందూ 'సారీ ఎందుకు. నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకొని నా మీద నిందలు వేసినందుకా? నీ తమ్ముడితో మాటలు అనిపించినందుకా? సామ్రాట్‌తో నేనే నీ భర్త అని తెలిసేలా చేసినందుకా? ఎందుకు చెబుతున్నావు' అని తులసిని సూటిగా ప్రశ్నిస్తాడు.

  నందూ, లాస్యకు తులసి దెబ్బ

  నందూ, లాస్యకు తులసి దెబ్బ

  నందూ తనపై నిందలు వేస్తుండగా తులసి కిచెన్‌లోకి వెళ్లి ఒక పీట తీసుకొచ్చి నందూ ముందు పెడుతుంది. తర్వాత దాని మీదకు ఎక్కి నిలబడుతుంది. అంతేకాదు, 'నేను సారీ చెప్పింది మీరు అనుకున్న దేనికీ కాదు. మిమ్మల్ని భయపెట్టినందుకు' అంటుంది. దీంతో నందూ భయమా.. నాకా అంటాడు. అప్పుడు తులసి 'నన్ను చూసినందుకు కాదు.. మీ భయం దీన్ని చూసి. నేను మీ ఆయనతో సమానంగా ఎదిగిపోతాననే భయం. అంతే కదా లాస్య. ఏరోజైతే నేను ఫ్యాక్టరీని సొంతంగా నడపడం మొదలుపెట్టానో అప్పుడే మీలో భయం మొదలైంది' అంటుంది.

  శృతి మించిన సీరియల్ నటి హాట్ షో: ఇలాంటి ఫొటోలు ఎప్పుడూ చూసుండరు!

  నందూ, లాస్యకు తులసి క్లాస్

  నందూ, లాస్యకు తులసి క్లాస్


  తర్వాత తులసి 'రేస్‌లో ఉండే మగాళ్ల చేతుల్లో కేవలం డిగ్రీ మాత్రమే ఉంటుంది. కానీ ఆడదాని చేతుల్లో గిన్నెలు, గరిటెలు, చీపుళ్లు.. ఉతకాల్సిన బట్టలు.. మొగుడి బాధ్యత.. అత్తామామల బాధ్యత, సంప్రదాయపు కట్టుబాట్ల సంకెళ్లు ఇవన్నీ ఉంటాయి. వీటన్నింటినీ మోస్తూ భరిస్తూ ఆడది మొగుడితో సమానంగా పరిగెత్తాలి. ఆడది ఎందుకు వెనుకబడిందో అర్థం అయిందా? అగ్నిహోత్రం చుట్టూ అడుగులు వేసినప్పుడు భార్య వెనుక నడిచింది కాబట్టి జీవితాంతం మొగుడి వెనుకే నడవాలని అనుకుంటాడు మగాళ్లు. ఆ భ్రమలో నుంచి బయటికి రండి నంద గోపాల్ గారు. నా గొంతు తగ్గదు. వింటున్నావా లాస్య. ఇది కేవలం మీ ఆయనకు మాత్రమే కాదు.. నీకు కూడా చెబుతున్నాను. ఇంతకు పదింతలు గొడవలు లేపినా.. మీరు ఏం చేయలేరు' అంటుంది.

  ఎప్పుడూ తలెత్తే ఉంటానంటూ

  ఎప్పుడూ తలెత్తే ఉంటానంటూ


  తులసి 'నన్ను ఎదగకుండా ఆపలేరు. ఇన్ని రోజులు అందరి గురించి ఆలోచించాను. ఇప్పుడు నా గురించి ఆలోచించుకుంటున్నాను. మీరు భయపడుతున్నారు అని నాకు తెలుసు. మీ మనసుకు ప్రశాంతత ఇవ్వమని నేను ఆ దేవుడిని వేడుకుంటాను' అంటుంది. దీనికి నందూ 'చూడు తులసి.. ఎదగడానికి నువ్వు ఎంత ప్రయత్నించినా నేను నీకంటే ఎత్తులోనే ఉంటాను' అంటాడు. దీంతో తులసి 'మీరు నా ముందు తల దించుకునే ఉంటారు. నేను మీ ముందు తల ఎత్తుకునే ఉంటాను' అని బదులిస్తుంది. దీంతో ఇంట్లో వాళ్లంతా తులసికి చప్పట్లు కొడతారు.

  Sara Ali Khan: స్టార్ క్రికెటర్‌తో హీరోయిన్ డేటింగ్.. నైట్ ఇద్దరూ కలిసి అలా కనిపించడంతో!

  అభి మాటలకు ఫీలైన సామ్రాట్

  అభి మాటలకు ఫీలైన సామ్రాట్

  అభి వేసిన నిందల గురించి సామ్రాట్ ఆలోచిస్తూ పేపర్లు చించబోతాడు. ఇంతలో అక్కడికి వచ్చిన వాళ్ల బాబాయి 'ఆగు సామ్రాట్.. ఎవరి మీద కోపంతో ఆ పేపర్‌ను చింపేద్దాం అనుకుంటున్నావు. నందూ.. తులసి మాజీ భర్త అని నీకు చెప్పలేదని కోపమా.. లేక అభి నీ మీద వేసిన నిందల కోపమా' అని ప్రశ్నిస్తాడు. దీంతో సామ్రాట్ 'నా మీద నాకే కోపం. తులసి గారికి నేను చేసిన సాయం వల్లే ఇప్పుడు తులసి గారు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోంది' అని ఫీల్ అవుతాడు. అప్పుడాయన 'ఎవరో ఏదో అన్నారని నువ్వెందుకురా టెన్షన్ పడుతున్నావు' అంటాడు. దీంతో సామ్రాట్ 'నేను మగాడిని. దులుపేసుకుంటా కానీ.. తులసి గారు అలా కాదు.. కొడుకు చేసిన అవమానాన్ని ఎలా తట్టుకుంటుంది' అంటాడు. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 726: Nandhu and Lasya Misinterpret Tulasi Relationship with Samrat. After That Samrat Feels Guilty about Tulasi Situation.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X