Intinti Gruhalakshmi: నందూకు రత్నప్రభ వార్నింగ్.. విక్రమ్ కోసం మారిన జానూ.. ఇద్దరు శత్రువులతో ఫైట్

చాలా భాషల కంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే:మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. జాహ్నవికి దివ్య వార్నింగ్ ఇస్తుండగా తులసి వచ్చి ఏమైందని అడుగుతుంది. దీంతో దివ్య బెదిరిస్తుందని జానూ చెప్తుంది. అప్పుడు తులసి కూతురిని మందలిస్తుంది. పూజ అయిపోయిన తర్వాత అందరూ కలిసి ఉట్టి కొట్టే ఆట ఆడతారు. అందులో దివ్య ఒక టీమ్, జానూ ఒక టీమ్ ఉండగా.. చివరికి ఇద్దరూ విజేతలుగా నిలుస్తారు. ఆ తర్వాత అందరూ దాండియా ఆడుతుండగా దివ్యకు దెబ్బ తగులుతుంది. దీంతో విక్రమ్‌కు కోపం వచ్చి జానూపై అరుస్తాడు. చివర్లో హనీని తీసుకువెళ్లిన నందూకు రత్నప్రభ వార్నింగ్ ఇస్తుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode September 20th 2023

దివ్యను చూసి విక్రమ్ బాధగా:జానూ వల్ల దివ్య తలకు గాయం అవడంతో ఆమెపై అరిచిన విక్రమ్.. తన భార్య పరిస్థితిని చూసి విలవిలలాడిపోతాడు. అప్పుడు నందూ కూడా జానూపై సీరియస్ అవుతాడు. దీంతో తులసి 'పొరపాటున జరిగిన దాన్ని ఎందుకు పెద్దది చేయడం? బావతో ఆట ఆడాలని సరదా పడింది? ఇలా జరుగుతుందని ఊహంచదు కదా' అంటుంది. అయినా విక్రమ్ కూడా జానూ మీద అరుస్తాడు. తర్వాత తులసి.. దివ్య గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంటే విక్రమ్ సహాయం చేస్తాడు. భార్య తలకి కట్టు కడతాడు. అప్పుడు తులసి పెద్ద ప్రమాదం తప్పింది అంటుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode September 20th 2023

ఇది కూడా శత్రువు అయింది:తులసి కావాలనే హనీని తీసుకెళ్లిందని రత్నప్రభ రగిలిపోతుంది. దీంతో స్వీటీ 'తులసి ఆంటీని అనవసరంగా తిడుతున్నారు. తను చాలా మంచిది వచ్చినప్పుడల్లా నాకు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తుంది' అంటుంది. దీనికి రత్నప్రభ 'నీకు నేను తప్ప అందరూ మంచివాళ్లే. వెంటనే తులసికి ఫోన్ చేసి హనీని తీసుకురమ్మని చెప్పండి' అని భర్తతో అంటుంది. దీంతో స్వీటీ 'తను చచ్చినా రాదు' అనడంతో 'ఆ తులసి కంటే నువ్వే నాకు పెద్ద శత్రువు అయ్యావు. నిన్న కాక మొన్న పరిచయం అయిన తులసి పార్టీలో ఇది కూడా చేరింది' అని కోప్పడుతుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode September 20th 2023

తులసికి హనీ దూరం కావాలి:రత్నప్రభ చెప్పడంతో ధనుంజయ్ 'ఎందుకో తులసి మాట్లాడుతుంటే వినాలని అనిపిస్తుంది. అందుకే ఎవరైనా ఆమె పార్టీలో చేరినట్లుగా ఉంటుంది. అయినా ఈ ఆస్తి దక్కాలంటే తులసిని హనీకి దూరం చేయాలి. అందుకోసం ప్లాన్ చేయాలి' అంటాడు. అప్పుడు రత్నప్రభ ఆల్రెడీ అందుకోసం ప్లాన్ రెడీ చేశానని భర్తకు చెప్తుంది. అంతేకాదు, అతడికి అది మొత్తం వివరిస్తుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode September 20th 2023

బావ కళ్లల్లో ఆనందం కోసం:విక్రమ్ తిట్టాడని జానూ వెక్కి వెక్కి ఏడుస్తుంది. అప్పుడు బసవయ్య 'నా కూతురికి పెద్ద అవమానం జరిగిపోయింది' అని యాక్టింగ్ చేస్తూ ఏడుస్తాడు. అప్పుడు జానూ 'నాకు ఎందుకు అబద్దం చెప్పావు అత్తయ్యా? బావ, దివ్య ఉప్పు నిప్పూ.. వాళ్ళకు పడటం లేదని ఎందుకు చెప్పావు? కానీ వాళ్ళు ఇడ్లీ సాంబార్ లాగా కలిసిపోయి ఉన్నారు కదా' అంటుంది. దీంతో రాజ్యలక్ష్మి 'ఎక్కడో ఏదో తేడా జరిగింది. విక్రమ్‌కు నిజంగానే దివ్య అంటే పడదు' అంటుంది. అప్పుడు బసవయ్య 'మీ బావ కళ్లలో ఆనందం చూడటం కోసం నిన్ను పిలిపించింది' అని చెబుతాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode September 20th 2023

విముక్తి కలిగితేనే సంతోషం:ఆ తర్వాత బసవయ్య 'దివ్యకు దూరం జరిగి విక్రమ్ నీకు దగ్గర అవుతున్నాడు. కానీ, తనకు దెబ్బ తగిలేసరికి మొగుడు ప్రేమ బయటకి వచ్చింది' అంటాడు. అప్పుడు రాజ్యలక్ష్మి 'దివ్య విషయంలో మీ బావ నరకం అనుభవిస్తున్నాడు. వాడిని ఈ బాధ నుంచి బయటకి తీసుకొస్తావని ఆశ పడ్డాను. అరిచాడని వదిలేస్తే ఎలా? దివ్య నుంచి విముక్తి కలిగితేనే వాడి జీవితం బాగుపడుతుంది. ఇప్పుడు నువ్వు మధ్యలోనే వెళ్లిపోతే వాడి బతుకు నాశనం అయిపోతుంది' అంటూ యాక్టింగ్ చేస్తుంది. దీంతో జానూలో దివ్యపై కోపం ఇంకా పెరుగుతుంది.

నందూతో రత్నప్రభ కోపంగా:హనీని తీసుకొచ్చి సామ్రాట్ ఇంటి దగ్గర దింపేసిన నందూను ధనుంజయ్ వాళ్లు ఆపుతారు. అంతేకాదు, తులసి గురించి మాట్లాడుతూ దెప్పిపొడుస్తూ ఉంటారు. ఆ తర్వాత రత్నప్రభ 'హనీ మీద ఈ ఇంటి మీద సర్వ హక్కులు మావే.. కేవలం మావే' అని అంటుంది. దీంతో ధనుంజయ్ 'ముసలాయన కేవలం సామ్రాట్‌కు మాత్రమే పెద్దాయన మాకు కాదు' అంటాడు. దీంతో నందూ 'సామ్రాట్‌కు ఎంత గౌరవం ఇచ్చామో.. ఆయనకి అంతే గౌరవం ఇచ్చాం' అనగా.. రత్నప్రభ 'సామ్రాట్‌కు ఎంత గౌరవం ఇచ్చారో ఇప్పుడు మాకు అలాగే అంత గౌరవం ఇవ్వాలి. ఈ ఇంటితో మీకు ఎలాంటి సంబంధం ఉండకూడదు. ఈ మాటను మా మాటగా తులసికి చెప్పండి' అంటుంది. ధనుంజయ్ కూడా తులసిపై నిందలు వేస్తాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode September 20th 2023

నందూ ఫోన్ లాక్కున్నాడు:వాళ్ల మాటలకు నందూ 'అసలు మీ సమస్య ఏంటి? తులసికి సహాయం చేయడం తప్ప అన్యాయం చేయడం తెలియదు. మీరు ఎందుకు తనను చూసి భయపడుతున్నారు? తులసి హనీకి దగ్గర అయ్యేది ఆస్తి కోసమని అనుకుంటున్నారు. తనకి అలాంటి పిచ్చి ఆశలు లేవు. ఇంకొక మాట నా దగ్గర మాట్లాడినట్టు తులసితో మాట్లాడితే హనీని తన దగ్గరే ఉంచుకుంటుంది' అంటాడు. తర్వాత ఇంటికి వస్తాడు కానీ తులసికి నిజం చెప్పడు. దీంతో ఆమె హనీకి ఫోన్ చేయబోతుండగా.. అది నందూ లాక్కుంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X