Intinti Gruhalakshmi: సామ్రాట్ కంపెనీకి కొత్త సీఈవో.. నిజం చెప్పేసిన నందూ.. తెలిసిపోయిన లాస్య జాడ

ఇండియా వ్యాప్తంగా చాలా భాషలను పోల్చి చూసుకున్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే:బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. దివ్యను చూసి బాధ పడిన విక్రమ్.. జానూపై కోప్పడతాడు. దీంతో ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని అనుకుంటుంది. అప్పుడు రాజ్యలక్ష్మి, బసవయ్య నాటకం ఆడి దివ్యపై లేనిపోనివి చెప్తారు. దీంతో దివ్య ఇక్కడే ఉండి బావ కళ్లలో ఆనందం చూస్తానని అంటుంది. హనీని తీసుకుని వచ్చిన నందూతో రత్నప్రభ దురుసుగా మాట్లాడుతుంది. అంతేకాదు, తమ వ్యవహారాల్లో తలదూరిస్తే తులసిని చంపేస్తామని బెదిరిస్తుంది. దీంతో నందూ భయపడిపోతూ ఇంటికి వెళ్తాడు. కానీ, తులసికి మాత్రం ఈ నిజాన్ని తెలియనివ్వడు.

Intinti Gruhalakshmi Serial Today Episode September 21st 2023

వాళ్లకు నిజం చెప్పేసిన నందూ:రత్నప్రభ వాళ్లు ఇచ్చిన వార్నింగ్ తలచుకుని నందూ బాధ పడుతుంటాడు. అప్పుడు పరందామయ్య వాళ్లు వచ్చి ఏం జరిగిందని ప్రశ్నిస్తారు. దీంతో నందూ 'నిర్లక్ష్యంగా ఉంటే తులసికి ప్రమాదం జరుగుతుంది. ఆ ఇంట్లో వాళ్ళు తులసి మీద అనుమానపడుతున్నారు. ఆస్తి కోసం హనీకి దగ్గర అవుతుందని డిసైడ్ అయ్యారు. తనను ఆ ఇంటి వైపు రాకుండా చూసుకోమని బెదిరించారు' అని అంటాడు. దీంతో పరందామయ్య ఈ విషయం తులసికి చెప్పాలి కదా అనగా.. నందూ 'చెప్తే గొడవ పడి హనీని ఇంటికి తీసుకొస్తుంది. అప్పుడు గొడవ మరీ పెద్దది అవుతుంది. అందుకే ఏదో ఒక కారణం చెప్పి ముందు తనను ఆ ఇంటికి వెళ్ళకుండా ఆపాలి' అంటాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode September 21st 2023

ముద్దులతో అభిషేకం చేయాలి:ఇంట్లో ఒంటరిగా కూర్చుని ఉన్న దివ్య.. తనకు దెబ్బ తగలగానే జానూపై విక్రమ్ అరిచిన సంఘటనను, అతడు వచ్చి కట్టు కట్టిన దాన్ని గుర్తు చేసుకుని మురిసిపోతూ ఉంటుంది. 'ఇప్పటి వరకూ ఎన్నో జరిగినా విక్రమ్ మనసులో నేనే ఉన్నాను' అనుకుంటూ సంతోషపడుతుంది. అంతలోనే అతడు అక్కడకు వస్తాడు. దీంతో దివ్య 'విక్రమ్‌కు ముద్దులతో అభిషేకం చేసి రుణాన్ని తీర్చేసుకోవాలి' అని అనుకుంటుంది. అప్పుడు విక్రమ్.. దివ్యకు ట్యాబ్లెట్లు ఇచ్చి 'నీలా మనసులో ఒకటి పెట్టుకుని మరొకటి చూపించడం నాకు రాదు' అని దివ్యతో అంటాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode September 21st 2023

నువ్వు చూపిన ప్రేమ నిజమేగా:విక్రమ్ మాటలకు దివ్య 'నాకు దెబ్బ తగిలినప్పుడు చూపించిన ప్రేమ నిజమే కదా' అని అడుగుతుంది. దీనికతడు 'అనుమానమే లేదు. కానీ, గతాన్ని తలుచుకుని పాఠాలు నేర్చుకున్నా' అంటాడు. దీంతో దివ్య 'నా మీద నీకు ప్రేమ ఉంది. నీకు తెలియకుండానే అది బయటకి వచ్చింది ఒప్పుకో' అంటుంది. దీంతో విక్రమ్ 'విలువ లేని చోట ప్రేమ ఉండి ఏం లాభం మర్చిపో' అంటాడు. అలా ఇద్దరూ ప్రేమ ఉందని, లేదని వాదించుకుంటూ ఉంటారు. మొత్తానికి దివ్య మీద తనకు నమ్మకం ఎప్పుడో పోయిందని చెప్పి విక్రమ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode September 21st 2023

సామ్రాట్ కంపెనీ సీఈవో ఫిక్స్:సామ్రాట్ ఇంటికి అతడి కంపెనీలో పని చేసే మేనేజర్ వస్తాడు. వాళ్ల బాబాయి వచ్చి ఏంటి పని అని అడుగుతాడు. అప్పుడు అక్కడే ఉన్న రత్నప్రభ పిలిపించింది తనేనని అంటుంది. అంతేకాదు, 'ఈరోజు నుంచి ధనుంజయ్ కంపెనీ సీఈఓ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆర్డర్ రెడీ చేసి ప్రెస్ నోట్ రిలీజ్ చేయండి' అంటుంది. దీంతో బాబాయి 'అందుకు తొందర ఏముంది' అని అడగ్గా.. ధనుంజయ్ 'మీ మనసులో ఏముందో చెప్పండి' అంటాడు. అప్పుడు రత్నప్రభ 'ఒక కంపెనీ సీఈఓ లేకుండా ఎన్ని రోజులు ఉంటుంది' అని ప్రశ్నిస్తుంది.

హనీ ప్రాణాలకే ప్రమాదమని:ఆ తర్వాత రత్నప్రభ 'సామ్రాట్ ఏమైనా బతికి వస్తాడా? వెంటనే ఆర్డర్ రెడీ చేయండి. మీరు ఏ హక్కుతో ధనుంజయ్ సీఈఓ కాకుండా అడ్డుపడాలని అనుకుంటున్నారు? బుద్ధిగా మేం చెప్పినట్టు నడుచుకుంటే మీకు మాకు మంచిది. కాదు కూడదు అంటే కోర్టుకి వెళ్ళి లీగల్‌గా ఆస్తి దక్కించుకుంటాం. హనీ అడ్డం లేకపోతే ఈ ఆస్తి మొత్తం మాకు వస్తుంది. ఇప్పుడు హనీ ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయి' అని బెదిరిస్తుంది. మరోవైపు తులసి.. హనీకి ఫోన్ చేయాలని అనుకుంటుండగా ఇంట్లో వాళ్లు అడ్డుకుంటారు. దీంతో తులసికి నిజం చెప్పాలని మామ అనుకుంటాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode September 21st 2023

భాగ్య ఇంట్లో ఉంటోన్న లాస్య:తన ఇంట్లో తలదాచుకుంటోన్న లాస్య దగ్గరకు భాగ్య వస్తుంది. అంతేకాదు, 'నిన్ను మోసం చేసింది నీ చుట్టు ఉన్న పరిస్థితులు. దొరికిన దానితో సంతోషపడకుండా అతి ఆశకి పోయావు. ఇప్పుడు మా ఇంట్లో తలదాచుకుంటున్నావు' అంటుంది. దీంతో లాస్య 'వెళ్లిపొమ్మని అంటావా? త్వరలోనే తులసిని దెబ్బ కొడతాను' అంటుంది. దీంతో భాగ్య ఆమెపై సెటైర్లు వేస్తుంది. ఇదిలా ఉండగా.. జానూ ఇంట్లో నుంచి వెళ్లిపోబోతుంది. దీంతో విక్రమ్ ఆమెను ఆపుతాడు. అంతేకాదు, సారీ కూడా చెప్తాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X