Intinti Gruhalakshmi September 22nd Episode: అక్షర ప్రేమకు తులసి ఫిదా.. ప్రేమ్ విషయంలో కీలక నిర్ణయం

దేశంలోని మిగిలిన బుల్లితెర ఇండస్ట్రీలతో పోలిస్తే తెలుగులో ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ ఓ లుక్కేయండి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసితో జీకే మాట్లాడుతోన్న సమయంలో ఆమె ప్రేమ్ తల్లి అన్న విషయం తెలుస్తుంది. దీంతో ఆమెను జీకే తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఆ సమయంలో ప్రేమ్‌ను ప్రేమించేది తన కూతురే అన్న నిజం చెప్పేస్తాడు. అప్పుడు తులసి అతడిపై మండిపడుతుంది. స్వార్థం కోసం ఇలాంటి పనులు చేస్తారా అంటూ ప్రశ్నిస్తుంది. ఆ తర్వాత అక్షర రూమ్‌లోకి వెళ్లి చూస్తుంది. దీంతో ఆమె ప్రేమ్‌ను ఎంత ప్రేమిస్తుందో అర్థం చేసుకుంటుంది. ఇక, ఎప్పటి లాగే లాస్య, భాగ్య ప్లాన్లు వేస్తూ కాలం గడుపుతూ ఉంటారు.

జీకేకు ప్రేమ్ గురించి చెప్పేసిన తులసి

జీకేకు ప్రేమ్ గురించి చెప్పేసిన తులసి

తులసిని తన ఇంటికి తీసుకెళ్లిన జీకే.. తన కూతురు అక్షర ప్రేమను ఆమెకు అర్థమయ్యేలా చేస్తాడు. అనంతరం వాళ్లిద్దరి మధ్య జరుగుతోన్న చర్చతో ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. అప్పుడు తులసి 'మీ అమ్మాయి ప్రేమ నాకు అర్థం అయింది. కానీ, నా కొడుకు గురించి కూడా ఆలోచించాలి కదా. కలలు ఎన్నో వస్తాయి. మంచివి జరగాలని అనుకుంటాం. చెడ్డవి జరగకూడదు అనుకుంటాం. మనుషులుగా మనం ఎన్నో అనుకుంటాం. కానీ పైవాడి రాత ఎలా ఉంటుందో చూడాలి' అంటుంది. దీంతో జీకే అసంతృప్తిగానే ఆమెకు ధన్యవాదాలు చెప్పి పంపిస్తాడు.

ప్రేమ్‌కు ధైర్యం చెప్పిన పరందామయ్య

ప్రేమ్‌కు ధైర్యం చెప్పిన పరందామయ్య

శృతి మాటలను గుర్తు తెచ్చుకుంటూ బాధ పడుతోన్న ప్రేమ్ దగ్గరకు తాతయ్య పరందామయ్య వస్తాడు. ఆ సమయంలో మనవడికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తాడు. 'మనకు ఎన్నో దెబ్బలు తగులుతుంటాయి. కొన్నాళ్లకు అవి మానిపోతాయి. దీంతో కొద్ది రోజుల్లోనే వాటిని మర్చిపోతాం. అయితే ఇప్పుడు తగిలింది మాత్రం మనసుకు. అందుకే కొంచెం సమయం పడుతుంది. నా అనుభవంతో చెబుతున్నా. నాకెన్నో దెబ్బలు తగిలాయి' అని అంటాడు. అప్పుడు ప్రేమ్ 'నువ్వు ఎవరినైనా ప్రేమించి ఉంటే నా బాధ అర్థమయ్యేది తాత' అని వెళ్లిపోతాడు.

శృతికి దివ్య రిక్వెస్ట్.. పెద్ద తప్పు చేశారు

శృతికి దివ్య రిక్వెస్ట్.. పెద్ద తప్పు చేశారు

ప్రేమ్.. పరందామయ్యతో మాట్లాడిన మాటలను విన్న దివ్య వెంటనే శృతి దగ్గరకు వెళ్తుంది. 'మా అన్నయ్యకు సంతోషాన్ని ఇవ్వండి. మా ఇల్లు చక్కగా చేయండి. మా అన్నయ్య ఎంత కేరింగ్‌గా చూసుకుంటాడో తెలుసా? మీరు తనను వద్దనుకుంటే కచ్చితంగా బాధ పడతారు' అని అంటుంది దివ్య. దీనికి శృతి 'కొన్ని నిర్ణయాలు వెనుక ఎంతో మంది మాటలు ఉంటాయి. ఒక నిర్ణయం వల్ల మంచి కానీ, చెడు కానీ ఎంతో మందిని ప్రభావితం చేస్తుంది. ప్రేమ్ విషయంలో మీకు నచ్చిన నిర్ణయం తీసుకోలేను' అని అంటుంది. దీంతో దివ్య బాధతో వెళ్లిపోతుంది.

అక్షరకు ఫ్లాటైన తులసి.. ఆ నిర్ణయంతో

అక్షరకు ఫ్లాటైన తులసి.. ఆ నిర్ణయంతో

అక్షర ఇంటి నుంచి కారులో వస్తున్న తులసి మనసులో మాట్లాడుకుంటూ ఉంటుంది. 'అక్షర ప్రేమ్‌ను ఎంతలా ప్రేమిస్తుందో. గది నిండా వాడి ఫొటోలనే నింపుకుంది. జీకే గారు కూడా కూతురి ప్రేమ కోసం ఎంత తాపత్రయపడుతున్నారో. అంతలా ప్రేమించే తండ్రి ఉంటే ఎంత బాగుంటుంది. ప్రేమ్‌కు కూడా అలాంటి అమ్మాయి వస్తే బాగుంటుంది. కానీ, వాడి మనసులో శృతి ఉంది కదా. అసలు శృతి వాడిని ఎందుకు వద్దని అనుకుంటుంది. ముందు ఆ విషయం తెలుసుకోవాలి. ఆ తర్వాత ప్రేమ్, శృతిని కలపడమే మంచి నిర్ణయం' అని అనుకుంటుందామె.

నా వల్ల ఎలాంటి కీడు జరగకూడదంటూ

నా వల్ల ఎలాంటి కీడు జరగకూడదంటూ

దివ్య మాట్లాడి వెళ్లిపోయిన తర్వాత శృతి ఎంతగానో ఏడుస్తుంది. 'దివ్య నువ్వు అన్నది కరెక్టే. ప్రేమ్‌ను వద్దనుకోవడం తప్పే. కానీ, నా పరిస్థితి మీకు అర్థం కావడం లేదు. నా మూలంగా మీ కుటుంబం ముక్కలు కాకూడదు. ఆ లాస్య ఎంతకైనా దిగజారుతుంది. కాబట్టి నేనేం చేయలేను. అలాగే, అంకుల్ కూడా ఏదైనా అనుకోనిది చేసే ప్రమాదం కూడా ఉంది. నన్ను అక్కున చేర్చుకుని ఆదరించిన కుటుంబం బాగుండాలనే కోరుకుంటా. ఇందుకోసం నా ప్రేమను త్యాగం చేస్తాను. ఇదే సరైనా నిర్ణయం' అంటూ తనతో తానే మాట్లాడుకుంటూ బాధ పడుతుంది.

తులసికి దొరికిన పురుషోత్తం.. వార్నింగ్

తులసికి దొరికిన పురుషోత్తం.. వార్నింగ్

కొద్ది రోజులుగా కనిపించకుండా పోయిన పురుషోత్తం.. లాస్యతో ఫోన్ చేసి మాట్లాడతాడు. అప్పుడు సహాయం చేశాను కదా అని చెబుతూ ఆమె నుంచి డబ్బును ఆశిస్తాడు. అప్పుడు లాస్య 'నువ్వు తులసి అకౌంట్ నుంచి మూడు లక్షలు డ్రా చేసుకున్నావు. దానికి మరో రెండు లక్షలు పడేస్తాను. అంతేకానీ, తరచూ నాకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకు' అంటూ అతడికి వార్నింగ్ ఇస్తుంది. అంతలో అటుగా వెళ్తున్న తులసి అతడిని చూసి దగ్గరకు వస్తుంది. అప్పుడు పురుషోత్తం మాటలను బట్టి తాను జైలుకు వెళ్లడానికి కారణం లాస్యే అన్న నిజం తెలుసుకుంటుంది.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
పురుషోత్తంను ఇంటికి తీసుకొచ్చి మరీ

పురుషోత్తంను ఇంటికి తీసుకొచ్చి మరీ

పురుషోత్తంను చెంపపై కొట్టిన తులసి నిజం చెప్పించడానికి ఇంటికి తీసుకెళ్తుంది. అప్పుడు నందూ 'చేసిన తప్పును సరిదిద్దుకోడానికి ఇలా మాట్లాడకు తులసి. ఎవడినో తీసుకొచ్చి అబద్దాలు చెబితే నమ్మాలా? అసలు నీ చేతకాని తనం వల్లే ఇలా జరిగింది' అంటాడు. దీనికి ప్రేమ్, పరందామయ్య ఫైర్ అవుతారు. ఆ తర్వాత తులసి కూడా 'మీ పక్కన ఉన్నవాళ్లు మిమ్మల్ని మోసం చేయట్లేదు అనుకుంటున్నారా? అసలు నా చెక్ బౌన్స్ అవడానికి కారణం ఎవరో మీకే తెలుస్తుంది. చెప్పు పురుషోత్తం నీతో ఈ పని చేయించింది ఎవరో' అని అంటుంది. దీంతో ఈ ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X