For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi September 23rd Episode: నిజం చెప్పేసిన పురుషోత్తం.. అంతలోనే తులసికి మరో షాక్

  |

  మిగిలిన బుల్లితెర ఇండస్ట్రీలతో పోలిస్తే తెలుగులో ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో ఓ లుక్కేద్దాం పదండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. జీకేతో కలిసి అక్షర ఇంటికి వెళ్లిన తులసి.. తన కొడుకుకి సరైన అమ్మాయి తనేనని అనుకుంటుంది. కానీ, శృతిని ప్రేమ్‌ను కలపాలని నిర్ణయం తీసుకుంటుంది. అంతకంటే ముందు అసలు శృతి ఎందుకలా ప్రవర్తిస్తుందో కనుక్కోవాలని అనుకుంటుంది. ఇక, దివ్య తన అన్న బాధను చూసి శృతితో మాట్లాడుతుంది. కానీ, ఆమె మాత్రం పెళ్లికి ఒప్పుకోదు. పురుషోత్తంను పట్టుకుని ఇంటికి తీసుకొస్తుంది తులసి. ఆ సమయంలో తనను హేళన చేస్తూ మాట్లాడిన నందూ, అనసూయ, లాస్యతో ఆమె గొడవకు దిగుతుంది.

  Bigg Boss: బయటపడిన రవి బండారం.. లహరి విషయంలో ప్రియ అన్నది నిజమే.. షాకిస్తోన్న వీడియో

  అందరికీ నిజం చెప్పేసిన పురుషోత్తం

  అందరికీ నిజం చెప్పేసిన పురుషోత్తం

  పురుషోత్తంను ఇంటికి తీసుకొచ్చిన తులసి అతడితో నిజం చెప్పించే ప్రయత్నంతో ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. తనపై నిందలు వేసిన వాళ్లకు నిజం తెలియాలని అనుకున్న తులసి అతడిని ఈ పని ఎందుకు చేశావ్ అని అడుగుతుంది. అప్పుడు పురుషోత్తం ‘తులసి గారు ఆఫీస్ అవసరాల కోసం కొన్ని చెక్‌లు సంతకాలు చేసి ఇచ్చారు. వాటిలో ఒక దాని నుంచి మూడు లక్షలు డ్రా చేశాను. అందుకే అక్షర కంపెనీ వాళ్లకు పంపించిన చెక్ బౌన్స్ అయింది. ఇదంతా నా వల్లే జరిగింది' అని నిజం చెప్తాడు. దీంతో నందూ, అనసూయ, లాస్యలు షాక్ అవుతారు.

  పురుషోత్తంను అలా బెదిరించిన లాస్య

  పురుషోత్తంను అలా బెదిరించిన లాస్య

  పురుషోత్తం నిజం చెప్పినా తులసి సంతృప్తి చెందదు. ‘అసలు వీడితో ఈ పని ఎవరు చేయించారో కూడా కక్కిస్తాను' అంటూ అతడిని ప్రశ్నిస్తుంది. అప్పుడు పురుషోత్తం లాస్య వైపు చూడగా.. ఆమె మాత్రం ‘నా పేరు చెప్పకు. ఒకవేళ చెప్తే చంపేస్తాను' అంటూ సైగల ద్వారా బెదిరిస్తుంది. ఇదంతా తులసి గమనిస్తూనే ఉంటుంది. ఇక, పురుషోత్తం ‘ఎవరూ చెప్పలేదమ్మా.. అప్పులపాలయ్యాను. అందుకే ఆ మూడు లక్షలు వాడుకున్నాను' అని చెబుతాడు. దీంతో లాస్య ఊపిరి పీల్చుకుంటుంది. ఆ తర్వాత అతడిని అక్కడి నుంచి పంపించేస్తుంది తులసి.

  Bigg Boss: షోలో చెండాలమైన పని చేసిన హమీదా.. పర్సనల్ ఫొటోలను లీక్ చేసి ఝలక్ ఇచ్చిన ఫ్యాన్స్

  నేనే తలుచుకుంటే దొరికిపోయేదానివి

  నేనే తలుచుకుంటే దొరికిపోయేదానివి

  పురుషోత్తం తన పేరు చెప్పకపోవడంతో లాస్య సంతోషంగా ఉంటుంది. ఆ సమయంలో తులసి ఆమె దగ్గరకు వస్తుంది. ‘ఏంటి లాస్య వాడు నీ పేరు చెప్పలేదని సంతోషిస్తున్నావా? ఇప్పుడు తనను ఇక్కడకు తీసుకొచ్చింది నా సత్తాను మీకు నిరూపించడానికే. ఇప్పుడు నీ ఫోన్‌లో వాడితే మాట్లాడిన లిస్టును చూపిస్తే నువ్వు అడ్డంగా దొరికిపోయేదానివి. కానీ, నాకు అది అవసరం లేదు' అని అంటుంది తులసి. అప్పుడు లాస్య ‘దీనికే అంత సంతోషించకు' అంటుంది. అప్పుడామె ‘మరోసారి నా ఫ్యాక్టరీ జోలికి వస్తే దీని కంటే పెద్ద షాక్ ఇస్తాను' అంటూ వార్నింగ్ ఇస్తుంది.

   శృతి కీలక నిర్ణయం.. హక్కు నీకెక్కడిది

  శృతి కీలక నిర్ణయం.. హక్కు నీకెక్కడిది

  తన విషయంలో జరుగుతోన్న పరిస్థితులతో విసిగిపోయిన శృతి ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని అనుకుంటుంది. అంతలో ప్రేమ్ అక్కడకు వస్తాడు. వచ్చీ రావడమే ‘ఏంటి శృతి.. ఎక్కడికి వెళ్తున్నావ్' అని ప్రశ్నిస్తాడు. దీంతో ఆమె ‘తీరం తెలియని ప్రయాణం నాది. ఈ ఇంట్లో పరిస్థితులు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. అయినా నీకు నచ్చినట్లు నువ్వుంటే నాకు నచ్చినట్లు నేను చేయడంలో తప్పేముంది' అని అంటుంది. అప్పుడు ప్రేమ్ ‘నీకు నచ్చినట్లు ఉండు కానీ.. నన్ను పెళ్లి చేసుకోమని చెప్పే హక్కు నీకెక్కడిది' అని ఆమెను ప్రశ్నిస్తాడు.

  Bigg Boss: షోలో మరో దారుణ సంఘటన.. ప్రియాంకతో అతడు అసభ్య ప్రవర్తన.. టీషర్ట్ లోపల చేయి పెట్టి!

  నా గురించి నన్ను బ్రతకమని చెప్పవే

  నా గురించి నన్ను బ్రతకమని చెప్పవే

  ప్రేమ్ అన్న మాటకు శృతి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీంతో ఇంట్లో వాళ్లంతా అక్కడి వస్తారు. అప్పుడామె ‘హక్కుల గురించి మాట్లాడితే చాలా ఉంటుంది ప్రేమ్. అయినా నా వల్ల ఈ కుటుంబంలో ఇబ్బంది ఉండకూడదు. నీ కోసం అంకుల్ ఆలోచిస్తే నువ్వు మాత్రం వాళ్లను బాధ పెడుతున్నావ్. పైగా నా గురించి అంటూ పరువు తీస్తున్నావు. అంటే అందరి దృష్టిలో నా వల్లే నువ్వు పెళ్లి చేసుకోవట్లేదని అనుకుంటారు కదా' అని బాధ పడుతుంది. అప్పుడు ప్రేమ్ ‘నా గురించి నన్ను బతకమని ఎందుకు చెప్పవు శృతి' అంటూ ఎమోషనల్ అవుతాడు.

   అక్షరను పెళ్లి చేసుకుంటానన్న ప్రేమ్

  అక్షరను పెళ్లి చేసుకుంటానన్న ప్రేమ్

  శృతి అన్న మాటలకు ప్రేమ్ బాగా బాధ పడుతుంటాడు. ఆ సమయంలో తన తండ్రితో ‘నాన్న మీరు తెచ్చిన సంబంధానికి ఓకే. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే' అంటూ పెళ్లికి ఒప్పుకుంటాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. కానీ, నందూ, లాస్య మాత్రం తెగ సంతోషిస్తుంటారు. అనంతరం శృతితో ‘నువ్వు చెప్పినట్లే నేను పెళ్లికి ఒప్పుకున్నాను. ఇంక ఇంట్లోకి వెళ్లు' అని అంటాడు ప్రేమ్. అయినా ఆమె వినకపోవడంతో చేతులెత్తి మొక్కుతూ ప్రార్థిస్తాడు. దీంతో ఆమె ఇంట్లోకి వెళ్తుంది. ఆ తర్వాత ప్రేమ్ అక్కడ కుప్పకూలిపోయి మరీ ఏడుస్తుంటాడు.

  ‘జానకి కలగనలేదు' హీరో చనిపోయాడంటూ వార్త: అసలు మేటర్ రివీల్ చేస్తూ.. ఆరియానా సంచలన వ్యాఖ్యలు

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  తప్పు చేస్తేనే అలా చేస్తారు నిజం చెప్పు

  తప్పు చేస్తేనే అలా చేస్తారు నిజం చెప్పు

  ప్రేమ్‌ను ఓదార్చిన తర్వాత తులసి నేరుగా శృతి దగ్గరకు వెళ్తుంది. అంతలో ఆమె ఒంటరిగా ఉండి ఏడుస్తూ ఉంటుంది. తులసిని చూసిన వెంటనే కన్నీళ్లను తుడుచుకుంటుంది కానీ ముఖంలో ముఖం పెట్టి చూడలేకపోతుంది. ఆ సమయంలో తులసి ‘ఏంటి శృతి అలా ఉన్నావ్? తప్పు చేశామన్న ఫీలింగ్ ఉంటేనే నేరుగా చూడలేము. నీకు అలానే అనిపిస్తుందా' అని అడుగుతుంది. అప్పుడు శృతి ‘ఒక్కోసారి తప్పు చేసినా దాని వెనుక ఉన్న కారణాలు చెప్పలేము ఆంటీ' అని అంటుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తైపోయింది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 432: Purushotham Told about Cheque Bounce Case to Nandu Family. After That Prem Ready to Marriage Akshara on Shruthi Demand.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X