Intinti Gruhalakshmi: జానూకు షాకిచ్చిన విక్రమ్.. రత్నప్రభకు నిజం చెప్పిన మేనేజర్.. ఇది కదా ట్విస్ట్

ఐదు కాదు.. పది కాదు.. ఏకంగా ఇరవై సంవత్సరాలకు పైగానే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే : శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఇంటి నుంచి వెళ్లిపోతున్న జానూను విక్రమ్ ఆపుతాడు. అప్పుడామె అతడికి హగ్ ఇస్తుంది. ఇది చూసి దివ్య కోపం పెరుగుతుంది. అనంతరం సామ్రాట్ బాబాయి తులసిని కలిసేందుకు వస్తాడు. అది చూసిన నందూ.. ఆయనను బయటే ఆపేస్తాడు. అంతేకాదు, ధనుంజయ్ వాళ్లు తులసిని చంపుతానన్న విషయాన్ని చెప్తాడు. దీంతో ఆయన తులసిని ఇంకెప్పుడూ ఇంటికి రావొద్దని అంటాడు. ఇక, విక్రమ్ స్నానం చేస్తుండగా జానూ వెళ్లి వీపు రుద్దుతుంది. అది చూసిన దివ్యకు కోపం వచ్చి ఆమెతో గొడవకు దిగిపోతుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode September 23rd 2023

బావకు ప్రేమను నేను అందిస్తా : విక్రమ్‌కు వీపు రుద్ది వస్తుండగా జానూను ఆపిన దివ్య 'విక్రమ్ విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దు' అని వార్నింగ్ ఇస్తుంది. అంతేకాదు, మొత్తం తప్పు దివ్యదే అన్నట్లుగా మాట్లాడుతుంది. తర్వాత 'నువ్వు అందించలేని ప్రేమని బావకి నేను అందిస్తాను' అని చెప్తుంది. దీనికి దివ్య 'నీ మనసు తప్పు దారిలో ఆలోచిస్తుంది. అది నా కన్నా ఎక్కువగా నీకే నష్టం' అంటుంది. దీంతో జానూ 'బావ నీకు దూరం అవుతాడని అలా మాట్లాడుతున్నావ్' అనగా.. 'నాకు విక్రమ్ ఎప్పుడూ దూరం కాడు. మా మధ్య ఉంది అపార్థాలే' అని దివ్య బదులిస్తుంది.

ఇక బావను వదిలిపెట్టేది లేదు : దివ్య మాటలకు జానూ 'తప్పు నువ్వు చేసి.. దూరం నువ్వు పెంచి.. పరిష్కారాన్ని కాలానికి వదిలిపెడుతున్నావా? ఇక బావని వదిలిపెట్టను' అని చెబుతుంది. దీంతో దివ్య 'ఖచ్చితంగా విక్రమ్ నాకు దగ్గర అవుతాడు. అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో. విక్రమ్ నిన్ను కేవలం మరదలిగా మాత్రమే చూస్తున్నాడు తెలుసుకో' అని అంటుంది. దీంతో ఇద్దరూ కాసేపు గొడవ పడతారు.

Intinti Gruhalakshmi Serial Today Episode September 23rd 2023

ఫైల్స్ లేవంటూ మేనేజర్ షాక్ : ప్లాన్ ప్రకారం సామ్రాట్ కంపెనీని చేతిలోకి తీసుకున్నామన్న సంతోషంలో ధనుంజయ్ వాళ్లు ఉంటారు. అప్పుడు భర్తతో రత్నప్రభ 'నెమ్మదిగా సమయం చూసి పావులు కదపాలి' అంటుంది. దీనికి ధనుంజయ్ 'త్వరపడకపోతే అప్పుల వాళ్ళు వెంట పడతారు. కంపెనీ షేర్స్ కొన్ని అమ్మితే డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో అప్పులు తీరుద్దాము' అని చెప్తాడు. అప్పుడే మేనేజర్ వస్తే సామ్రాట్ కంపెనీ షేర్స్ ఫైల్ తీసుకుని రా అని రత్నప్రభ అంటుంది. దీనికతడు 'అవి నా దగ్గర లేవు మేడమ్. సామ్రాట్ తన లాకర్‌లో పెట్టారు. దాని కోడ్ ఎవరికి తెలియదు' అంటాడు.

తులసి దగ్గర సామ్రాట్ లాకర్ : మేనేజర్ చెప్పగానే మరి లాకర్ గురించి ఎవరికి తెలుసు అని రత్నప్రభ ప్రశ్నిస్తుంది. దీంతో అతడు 'జీఎంకు తెలుసు' అంటాడు. ఎవరా జీఏం అని ఆమె అడగ్గా.. తులసి మేడం అని చెప్తాడు. దీంతో సరే మాట్లాడతానులే అని ఫోన్ తీసి కాల్ చేయకుండా ఆపేస్తుంది. దీంతో ధనుంజయ్ అడగ్గా 'ఆఫీసులో జరిగే ఈ విషయాలు తులసికి తెలియడానికి వీల్లేదు' అంటుంది. అప్పుడే సామ్రాట్ బాబాయి వస్తాడు. ఆయన కూడా లాక్ తెలియదంటాడు. అప్పుడు రత్నప్రభ 'మీరు చెప్పకపోతే తెలుసుకోలేమా? ఏదో ఒకరోజు తులసి సీఈఓ సీట్లో కూర్చుంటుందని మీరు ఆశపడుతున్నారేమో. అది జరగని పని. బుద్ధిగా మాతో చేతులు కలిపి ప్రశాంతంగా బతకండి' అని బెదిరిస్తుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode September 23rd 2023

తులసి సాయంతో సక్సెస్‌గా : ఆ తర్వాత తులసి, నందూ కలిసి కెఫే కాంట్రాక్టు విషయంలో ఓ కంపెనీకి వెళ్తారు. అక్కడ నందూ తన ప్రజెంటేషన్‌తో వాళ్లను మెప్పిస్తాడు. దీంతో డీల్‌కు ఆ కంపెనీ వాళ్లు ఒప్పుకుంటారు. ఆ తర్వాత తులసి 'ఇప్పుడు మాట్లాడినట్టే ఆరోజు కూడా మాట్లాడితే డీల్ ఒకే అయ్యేది కదా' అని నందూతో అనగా.. 'అప్పుడు నువ్వు పక్కన లేవు' అంటాడు. దీంతో తులసి 'నేను ఎప్పుడు మీ పక్కన ఉండటం కుదరదు' అనగా.. 'నువ్వు పక్కన ఉన్నప్పటి నందూకు.. లేనప్పుడు ఎలా ఉంటుందో చూశావ్ కదా' అంటూ తులసిని తన పక్కనే ఉండేలా చేయాలని అనుకుంటాడు.

తులసిని మాట ఇవ్వమని : నందూ మాటలకు తులసి 'పాతికేళ్లు పక్కన ఉన్నప్పుడు ఇలా అనిపించలేదు.. ఇప్పుడు ఎందుకు అలా అనిపిస్తుంది' అని అడుగుతుంది. దీనికతడు 'నువ్వు ఎప్పుడు నా పక్కనే ఉంటానని మాట ఇస్తావా? కెఫేకు కొత్త డీల్ నీ చేతుల మీదుగానే మొదలవాలి' అంటాడు. అప్పుడు తులసి 'మాట ఇచ్చి ఒకలా.. ఇవ్వకుండా ఒకలా నడుచుకునే అలవాటు నాకు లేదు. నేను లేకుండా మీ పనులు చేసుకోవడానికి అలవాటు పడితే మంచిది' అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode September 23rd 2023

జానూపై విక్రమ్ సీరియస్ : ఇక, విక్రమ్ ఏదో ఆలోచిస్తూ కోపంగా ఉండగా జానూ వచ్చి దోశ చేశానని ఇస్తుంది. అప్పుడు అతడికి తినిపించడానికి ట్రై చేస్తుంటే ఆపుతాడు. తర్వాత ఆమెపై సీరియస్ అవుతాడు. ఆ వెంటనే దివ్య తెస్తే తినేశా అంటాడు. దీంతో జానూ బిక్కముఖం పెట్టుకుని వెళ్తుంది. అప్పుడు దివ్య కలిసి జానూను రెచ్చగొడతుంది. దీంతో ఈ సారి కాఫీ పట్టుకుని వస్తుంది. దీంతో మళ్లీ కోప్పడుతూ ఆల్రెడీ కాఫీ తాగాను దివ్య ఇచ్చింది అని చెప్తాడు. దీంతో ఆమె ఫీల్ అవుతుంది. మరోవైపు, తులసి కోసం నందూ స్వయంగా వంట వండుతాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X