Intinti Gruhalakshmi September 24th Episode: తులసికి మరో షాకిచ్చిన శృతి.. నందూకు జీకే కొత్త కండీషన్

సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో ఓ లుక్కేద్దాం పదండి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నందూ ఫ్యామిలీకి చెక్ బౌన్స్ గురించి నిజం చెప్తాడు పురుషోత్తం. దీంతో తులసి జైలుకు వెళ్లడంలో ఆమె తప్పేమీ లేదని అందరూ గ్రహిస్తారు. ఆ తర్వాత ఇదంతా చేసింది లాస్య అన్న విషయాన్ని తెలుసుకున్న తులసి ఆమెతో గొడవకు దిగుతుంది. ఈ క్రమంలోనే సవాల్ కూడా చేస్తుంది. అనంతరం శృతి ఇంట్లో నుంచి వెళ్లిపోడానికి సిద్ధం అవుతుంది. అప్పుడు ఆమెను ఆపిన ప్రేమ్‌కు పెళ్లికి ఒప్పుకోమని చెబుతుంది. దీంతో ప్రేమ్.. అక్షరను పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్పేస్తాడు. ఆ సమయంలో అందరూ షాక్‌కు గురవుతారు.

నీకు ప్రేమ్ అంటే ఇష్టం లేదా అంటూ

నీకు ప్రేమ్ అంటే ఇష్టం లేదా అంటూ

ప్రేమ్ విషయంలో శృతి వ్యవహరిస్తున్న తీరు గురించి తులసి ఆమెతో చర్చించడంతో ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. 'చూడమ్మా.. నీకు ప్రేమ్ అంటే ఇష్టం లేదా? మనసులో ఒకటి ఉంచుకుని.. బయటకు ఒకలా ఎందుకు కనిపిస్తున్నావు? అసలెందుకిలా ప్రవర్తిస్తున్నావో నాకైనా చెప్పు' అని అడుగుతుంది. అప్పుడు శృతి 'మీరు మీ కొడుకు గురించి అడగడంలో తప్పు లేదు. కానీ, నన్ను మాత్రం బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయం మీకు అర్థం అవుతుందా? ఇప్పుడు చెబుతున్నా ప్రేమ్ అంటే నాకు ఇష్టం లేదు' అంటూ తేల్చి చెప్పేసింది.

బలవంతంగా చేస్తే ఎలా ఉంటుంది?

బలవంతంగా చేస్తే ఎలా ఉంటుంది?

తులసి అడుగుతుండగా శృతి కోపంగా 'ప్రేమ్ ప్రేమించినంత మాత్రాన తిరిగి ప్రేమించాలి అంటారా? ఒకవేళ బలవంతంగా పెళ్లి చేసినా మా పరిస్థితి ఎలా ఉంటుందో మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు' అంటూ సమాధానం ఇస్తుంది. అప్పుడు తులసి 'నీ మనసులో ఉన్నది తెలుసుకోవడం తప్పా. చూడమ్మా.. నీ మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకలా సమాధానం చెప్పి మమ్మల్ని మోసం చేయొచ్చు. కానీ, నిన్ను నువ్వు మాత్రం మోసం చేసుకుని ఇబ్బంది పడకు. ఈ విషయం గురించి ఇంకెప్పుడూ నీతో మాట్లాడి ఇబ్బంది పెట్టను' అని వెళ్లిపోతుంది.

నందూ లాస్య హ్యాపీ.. జీకేకు శుభవార్త

నందూ లాస్య హ్యాపీ.. జీకేకు శుభవార్త

అక్షరను పెళ్లి చేసుకోడానికి ప్రేమ్ ఒప్పుకున్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ లాస్య ఎంతగానో సంతోషిస్తుంది. ఆ సమయంలో నందూ కూడా అక్కడకు వస్తాడు. అప్పుడు లాస్య 'నందూ ఎంతో హ్యాపీగా ఉంది. ప్రేమ్ పెళ్లికి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత అక్షరతో పెళ్లి జరిగిపోతుంది. దీంతో జీకే మన కంపెనీకి హెల్ప్ చేస్తాడు. అలా జరిగిన వెంటనే మన కష్టాలన్నీ తీరిపోతాయి' అని అంటుంది. ఆ తర్వాత ఆమె సలహా మేరకు నందూ జీకేకు ఫోన్ చేసి ప్రేమ్ పెళ్లికి ఒప్పుకున్నాడన్న విషయం గురించి చెబుతాడు. దీంతో ఆయన కూడా ఎంతగానో సంతోషిస్తాడు.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
నందూకు మరో కండీషన్ పెట్టిన జీకే

నందూకు మరో కండీషన్ పెట్టిన జీకే

జీకేకు ఫోన్ చేసిన సమయంలో నందూ 'జీకే గారు మీరు చాలా గొప్ప ఫాదర్. మీ కూతురు ఏం కోరుకుందో అదే చేస్తున్నారు. చాలా గ్రేట్' అంటూ పొగడ్తలతో ముంచెత్తుతాడు. అప్పుడు జీకే 'ఎవరైనా పిల్లల కోసం ఏదైనా చేయాలి. నన్ను నా కూతురు అడిగింది ఇదే. అందుకే తనకు తన ప్రేమను ఇచ్చేస్తున్నా. ఇక, మీరిద్దరూ ప్రేమ్ తల్లిదండ్రుల స్థానంలో ఉండి ఈ పెళ్లిని జరిపించండి. ఇప్పటి వరకూ మీరు ఎలాంటి రిలేషన్‌లో ఉన్నారో నాకు తెలీదు. కానీ, పెళ్లి మాత్రం మీ చేతల మీదుగానే జరిపించాలి' అంటూ వాళ్లిద్దరికీ కొత్త కండీషన్ పెడతాడాయన.

నా జీవితాన్నే ఇచ్చేశాను అన్న శృతి

నా జీవితాన్నే ఇచ్చేశాను అన్న శృతి

ప్రేమ్‌తో గొడవ పెట్టుకుని ఒంటరిగా ఉన్న శృతి దగ్గరకు నందూ వస్తాడు. రావడం రావడమే ఆమెకు థ్యాంక్స్ చెబుతాడు. 'నువ్వు చేసిన ఈ సహాయం వల్లే ప్రేమ్ పెళ్లికి ఒప్పుకున్నాడమ్మా' అంటాడు. అప్పుడు శృతి 'నేను చేసింది త్యాగమో, బాధ్యతో అర్థం కావడం లేదు అంకుల్' అంటుంది. దీనికి 'నిన్ను ఇంత కాలం ఆదరించిన కుటుంబానికి నువ్వు ఏదైనా చేయాలనుకోవడం బాధ్యతే. ఇప్పుడు నువ్వు చేసింది బాధ్యతగానే భావించాలి' అంటాడు. అప్పుడామె 'ఈ కుటుంబం కోసం నా జీవితాన్నే ఇచ్చేశాను అంకుల్' అని సమాధానం చెబుతుంది.

 ఎడారిలో మొక్కలు పెంచుతారా అని

ఎడారిలో మొక్కలు పెంచుతారా అని

శృతి మాటలకు సమాధానాలు చెప్పలేక తడబడుతోన్న నందూ 'చూడమ్మా శృతి ఇంత దానికే నువ్వు బాధ పడాల్సిన అవసరం లేదు. నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను' అంటుంది. అప్పుడు శృతి 'పచ్చగా ఉన్న అడవిని ఎడారిని చేసి.. మళ్లీ మొక్కలు నాటుతా అంటున్నారు. ఎడారిలో ఎప్పటికీ మొక్కలు మొలవవు అంకుల్. నా జీవితం కూడా అంతే' అంటూ బదులిస్తుంది. ఆ సమయంలో నందూ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తూనే ప్రేమ్ మనసు మారకుండా చూడమంటాడు. అంతలో పక్కనే తులసి ఉన్నది గ్రహించి ఇద్దరూ వెళ్లిపోతారు.

సునామీ వచ్చేసింది అంటున్న లాస్య

సునామీ వచ్చేసింది అంటున్న లాస్య

ప్రేమ్ పెళ్లికి ఒప్పుకోవడంతో ఫుల్ ఖుషీగా ఉన్న లాస్య.. ఈ విషయాన్ని చెప్పడానికి భాగ్యకు ఫోన్ చేస్తుంది. అప్పుడామె 'ఏంటి లాస్య ఎంతో సంతోషంగా మాట్లాడుతున్నావు' అని అంటుంది. దీనికి లాస్య 'సునామీ అంత సంతోషంగా ఉన్నాను. ఎందుకో తెలుసా' అని అంటుంది. అప్పుడు భాగ్య 'కొంపదీసి ఆ ప్రేమ్ గాడు పెళ్లికి ఒప్పుకున్నాడా ఏంటి' అని అడుగుతుంది. దీనికి ఆమె సంతోష పడుతూ అవునంటూ సమాధానం చెబుతుంది. అంతేకాదు, 'రేపు జీకే గారు సంబంధం మాట్లడానికి వస్తున్నారు. నువ్వు కూడా వచ్చేయ్' అంటూ ఆమెను ఆహ్వానిస్తుంది లాస్య.

చేసిందంతా చేసి బాధ పడుతున్నావా

చేసిందంతా చేసి బాధ పడుతున్నావా

ఒంటరిగా కూర్చుని బాధ పడుతోన్న ప్రేమ్ దగ్గరకు వచ్చిన దివ్య 'చేసిందంతా నువ్వే చేసుకుని ఇప్పుడిలా కూర్చుని బాధ పడుతున్నావు' అంటుంది. అప్పుడతను 'ఇష్టం లేకపోయినా చేయాల్సి వచ్చింది' అని బదులిస్తాడు. అప్పుడు దివ్య 'నువ్వు పెళ్లికి ఒప్పుకోబట్టే కదా డాడ్ వాళ్లు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు' అని అంటుంది. దీనికి ప్రేమ్ 'నా వరకూ నేను ఎంతో ప్రయత్నించా. కానీ కుదరలేదు' అని చెబుతాడు. అంతలో నందూ వచ్చి పెళ్లి వాళ్లు వస్తున్నారు ఇంకా ఇలా ఉన్నారేంటి అంటాడు. దీంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తైపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X