For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi September 25th Episode: అక్షరకు లాస్య అదిరిపోయే గిఫ్ట్.. తులసిని తప్పించాలని!

  |

  ఎన్నో ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో ఓ లుక్కేద్దాం పదండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

   శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ప్రేమ్ గురించి శృతిని తులసి సూటిగా ప్రశ్నించింది. అప్పుడామె ‘మీ కొడుకు కోసం ఆరటపడడం ఓకే కానీ, నన్ను ఇబ్బంది పెట్టకండి' అంటూ ఘాటుగా సమాధానం చెబుతుంది. ఆ తర్వాత నందూ, లాస్య పెళ్లి విషయంలో ప్రేమ్ తీసుకున్న నిర్ణయం గురించి జీకేకు ఫోన్ చేసి వెల్లడిస్తారు. దీంతో అతడితో పాటు అక్షర ఎంతో సంతోషిస్తుంది. అనంతరం ప్రేమ్‌ను పెళ్లికి ఒప్పించినందుకు నందూ వచ్చి శృతికి ధన్యవాదాలు తెలుపుతాడు. దీంతో ఆమె అతడిపై వ్యంగ్యంపై విమర్శలు చేస్తుంది. తులసి రావడంతో వాళ్లు వెళ్లిపోతారు.

  Bigg Boss: షొలో అర్ధరాత్రి వాళ్లిద్దరి రొమాన్స్.. పెదాలను తాకుతూ కొంటెగా.. అక్కడ కూడా కిస్ చేయమంటూ!

  ఇంట్లో వాళ్లకు విలువ లేదన్న తులసి

  ఇంట్లో వాళ్లకు విలువ లేదన్న తులసి

  పెళ్లి వాళ్లు వస్తున్నారని అందరినీ రెడీ అవమంటూ నందూ కంగారు చేస్తుండడంతో ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. ప్రేమ్, దివ్యలను రెడీ అవమని చెప్పిన నందూ.. ఆ తర్వాత తులసి దగ్గరకు వచ్చి కంగారు చేస్తుంటాడు. అప్పుడామె ‘మీరు మీ ఇంట్లో వాళ్ల మనసులు తెలుసుకోలేరు కానీ.. వేరే విషయాల్లో మాత్రం కంగారు పడుతుంటారు. ముందు నీ కొడుకు మనసు ఏంటో అర్థం చేసుకోండి. అంతేకానీ, మీ ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఇతరులను బాధ పెట్టకండి' అంటుంది. దీనికి ‘నేను వాడి మంచి కోసమే చేస్తున్నా' అని సమాధానం చెబుతాడు నందూ.

  అంకిత, లాస్య సంబరం.. నువ్వే ధైర్యం

  అంకిత, లాస్య సంబరం.. నువ్వే ధైర్యం

  అంకిత ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుండగా లాస్య అక్కడకు వస్తుంది. రావడం రావడమే ‘ఏంటి అంకిత పెళ్లి వాళ్లు వచ్చే సమయం అయిపోయింది. నువ్వేంటి ఇంకా ఇలాగే ఉన్నావు' అంటుంది. అప్పుడామె ‘ఇంట్లో పెళ్లి చూపులకు నేను రెడీ అవడం దేనికి' అంటూ ప్రశ్నిస్తుంది. అప్పుడు లాస్య ‘ఊర్లో పండగ జరిగితే మనం కొత్త బట్టలు వేసుకోమా. వెళ్లు త్వరగా రెడీ అవ్వు' అంటుంది. అప్పుడే అక్కడకు వచ్చిన నందూ ‘లాస్య అన్ని పనులు దగ్గరుండి చూసుకో. నువ్వు ఉన్నావనే ధైర్యంతోనే ఏర్పాట్లు నీకు అప్పగించాను' అని చెప్పడంతో ఆమె సంతోషిస్తుంది.

  Love Story Day 1 Collections: చరిత్ర సృష్టించిన నాగ చైతన్య.. ఇండియాలోనే ఫస్ట్ మూవీగా సంచలన రికార్డు

  శృతిని దూరంగా పెడుతున్న తులసి

  శృతిని దూరంగా పెడుతున్న తులసి

  తులసి కూరగాయలు కోస్తూ ఉండగా శృతి అక్కడకు వచ్చి పనులు చేస్తానని అంటుంది. అప్పుడు తులసి ‘చూడమ్మా తులసి ఇప్పుడు నీ పరిస్థితి బాలేదు. నువ్వు సరైన నిర్ణయాలు తీసుకునేలా లేవు. ఒత్తిడికి గురవుతున్నావు. ఇప్పుడేమీ చేయొద్దు' అని దూరం పెట్టే ప్రయత్నం చేస్తుంది. దీంతో శృతి ‘ఏంటి ఆంటీ నన్ను దూరం పెడుతున్నారా? ఒక్కోసారి సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అనాథగా ఉన్న నన్ను ఇనాళ్లు దగ్గరకు తీసుకుని చేరదీశారు. ఇప్పుడు దూరం పెట్టకండి. పెట్టి నన్ను బాధ పెట్టకండి' అంటూ సమాధానం చెబుతుంది.

  నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు అంటూ

  నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు అంటూ

  శృతి మాటలను అర్థం చేసుకోలేకపోయిన తులసి ‘నువ్వు ఇప్పుడు సరిగా ఉన్నావని నేను అనుకోవడం లేదు. నిన్ను ఏదో ఒత్తిడికి గురి చేస్తుంది. అందుకే పనులు వద్దని చెప్పాను. అంతేకానీ, నిన్ను దూరం పెట్టాలని కాదు. ఏదైనా నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దని చెబుతున్నా అంతే. ఇక, నీ పనులు నువ్వు చేసుకో' అని చెబుతుంది. దీనికి శృతి ‘చూడండి ఆంటీ.. నేను ఏం చేసినా తెలివితోనే చేస్తున్నా. నా గురించి మీరేమీ బాధ పడకండి. నా జీవితానికి ఏమీ కాదు' అంటూ సమాధానం చెబుతుంది. దీంతో తులసి పని ఆమెకు అప్పగించి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

  Samantha Naga Chaitanya Divorce: పెళ్లికి ముందే చెప్పిన వేణు స్వామి.. సమంతకు ఆ సమస్య అంటూ!

  కాబోయే కోడలికి లాస్య అదిరిపోయే గిఫ్ట్

  కాబోయే కోడలికి లాస్య అదిరిపోయే గిఫ్ట్

  పెళ్లి వాళ్ల కోసం వేచి చూస్తోన్న లాస్య.. భాగ్యతో చర్చలు జరుపుతుంది. ఈ క్రమంలోనే అక్షరకు ఇవ్వడానికి డైమండ్ నెక్లెస్ గిఫ్ట్‌గా ఇస్తున్నట్లు లాస్య చెబుతుంది. దీంతో భాగ్య ‘పెళ్లైన తర్వాత అన్నీ రాబట్టుకోడానికి ఇప్పుడు ఇది ప్లాన్ చేశావా?' అని అడుగుతుంది. అప్పుడామె ‘మరి ఇంత కష్టపడి ఆ ప్రేమ్ గాడిని ఒప్పించింది ఎందుకు అనుకున్నావ్? ఇప్పుడు ఈ మాత్రమైనా చేయకపోతే తర్వాత మనకు ఎలా లాభం వస్తుంది. అవన్నీ ఆలోచించే ఇప్పుడు ఇంత ఖర్చు చేస్తున్నా భాగ్య' అని అంటుంది. దీంతో భాగ్య లాస్య తెలివికి ఫిదా అయిపోతుంది.

  ఆ తులసిని పక్కన పెట్టకపోతే కష్టమే

  ఆ తులసిని పక్కన పెట్టకపోతే కష్టమే

  ఇద్దరి మధ్య చర్చ జరుగుతోన్న సమయంలోనే భాగ్య.. లాస్యకు ఓ సలహా ఇస్తుంది. ‘చూడు లాస్య నువ్వు ఇంత చేస్తున్నావు కానీ, ఎందుకో తేడా కొడుతుంది అనిపిస్తుంది. ఆ తులసక్క వల్ల నీకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. ఆమె మాటలకు ఆ జీకే పడిపోతే బావగారి పక్కనే ఆమెనే ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి నువ్వు ఆమెను దూరం పెడితేనే మంచిది' అని అంటుంది. అప్పుడు లాస్య ‘ప్రేమ్‌కు తల్లిదండ్రుల స్థానంలో నేను నందూ ఉండాలని జీకే ముందే చెప్పారు. సో.. ప్రేమ్‌కు తల్లి స్థానంలో నేను తప్ప ఆ తులసి ఎందుకు ఉంటుంది' అని చెబుతుంది.

  హాట్ హాట్ ఫోజులతో కాజల్ అగర్వాల్: పెళ్లైన తర్వాత తొలిసారి ఇంత ఘాటుగా.. ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు!

  తులసిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాధవి

  తులసిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాధవి

  ప్రేమ్‌కు పెళ్లి చూపులు జరుగుతుండగా తులసి.. మాధవికి ఫోన్ చేస్తుంది. మేనల్లుడి గురించి జరిగే శుభకార్యానికి రమ్మని ఆమెను ఆహ్వానిస్తుంది. అప్పుడామె ‘ఏంటి వదినా ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ప్రేమ్‌ గురించి తెలిసి కూడా దీనికి ఎందుకు ఒప్పుకున్నావు? అయినా అన్నయ్య నన్ను పిలవలేదు కదా నేను రాలేను' అంటుంది. అప్పుడు తులసి ‘చూడు మాధవి. ఇది నీ మేనల్లుడికి జరిగే వేడుక. మనమంతా వాడి దగ్గర ఉండకపోతే ఎలా? వాడు కూడా ఎంతో కష్టంగా దీనికి ఒప్పుకున్నాడు. దయచేసి త్వరగా బయలుదేరు' అని చెబుతుంది.

  Mahesh Babu Is The Brand Ambassador For Big C
  శృతిని మరింత అవమానించిన అంకిత

  శృతిని మరింత అవమానించిన అంకిత

  ఒంటరిగా ఉండి బాధ పడుతోన్న శృతి దగ్గరకు వచ్చిన అంకిత ‘హమ్మయ్యా నీ స్థాయి ఏంటి? నువ్వు ఎక్కడ ప్రేమ్‌ను పెళ్లి చేసుకుంటావో.. ఎక్కడ ఈ ఇంటికి కోడలివి అవుతావో అని భయపడేదాన్ని. కానీ, ఇప్పుడు సంతోషంగా ఉంది. ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు. నీ ముఖం చూడాలంటే చిరాకుగా ఉంది. ఇకపై నాకు అడ్డు రాకు. వచ్చావంటే ఎటూ కాకుండా పోతావు' అంటూ మరింతగా బాధ పెడుతుంది. దీంతో శృతి ‘అవును అంకిత.. ఆ దేవుడు నన్ను మరింతగా ఇబ్బంది పెడుతున్నాడు' అని అంటుంది. దీంతో ఈ ఎపిసోడ్ పూర్తైపోయింది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 434: Tulasi Ignored Shruthi about her Decision. Then She Feels Very Bad. Afer That Madhavi angry on Tulasi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X