Intinti Gruhalakshmi: చేయి కోసుకున్న జానూ.. నిజం తెలిసి అందరూ షాక్.. ఆ ఇంట్లో పనిమనిషిగా హనీ
ఇండియాలో ఎన్నో టెలివిజన్ ఇండస్ట్రీలు ఉన్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే: శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. విక్రమ్ విషయంలో దివ్య నిజంగానే తప్పు చేసిందేమో అనుకుంటున్న జానూ.. ఆమెతో చాలెంజ్ చేస్తుంది. ఆ తర్వాత సామ్రాట్ కంపెనీని లాక్కున్నామని సంతోషిస్తున్న రత్నప్రభ వాళ్లకు లాకర్ కీ తులసి దగ్గరే ఉందని తెలుస్తుంది. ఇక, జానూ బావను బుట్టలో వేసుకోవాలన్న ప్లాన్లు వర్కౌట్ కాకుండా దివ్య దెబ్బ కొడుతుంది. మరోవైపు, తులసి పక్కన ఉండడంతో నందూ కెఫే కాంట్రాక్టును దక్కించుకుంటాడు. తర్వాత ఎప్పుడూ తన పక్కనే ఉండమని అడగ్గా ఆమె కోప్పడుతుంది. అనంతరం తులసి కోసం నందూ వంట చేస్తాడు.
నిజం తెలిసి ఖంగుతిన్న నందూ: తులసిని ఎలాగైనా ఇంప్రెస్ చేయాలన్న ఉద్దేశంతో నందూ స్వయంగా వంట చేస్తాడు. అది చూసి ఆమె నవ్వుకుంటుంది. ఎన్నో కష్టాలు పడిన తర్వాత నందూ వంటలన్నీ రెడీ చేస్తాడు. ఆ తర్వాత అందరికీ స్వయంగా వడ్డిస్తాడు. అది తిన్న తులసి వాళ్లు అన్నీ సూపర్‌గా ఉన్నాయని నందూను పొగుడుతారు. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత నందూ కూడా తాను వండిన వంటలను ఒక్కొక్కటిగా ఉంటాడు. కానీ, అవేమీ అస్సలు బాగోవు. అప్పుడతను ఇంత ఘోరంగా ఉంటే లొట్టలేసుకుని మరీ తిన్నారు ఏంటి అని అనుకుంటాడు.
పెద్దాయనపై రత్నప్రభ కోపంగా: తులసి ఇంటికి వెళ్లొచ్చిన తర్వాత సామ్రాట్ బాబాయి ఒక్కడే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడకు రత్నప్రభ వస్తుంది. వెంటనే కారు డ్రైవర్‌ను పిలిచి ఈయన తులసితో మాట్లాడారా అని అడుగుతుంది. దీనికతడు అవును అనడంతో సామ్రాట్ బాబాయిపై ఆమె కోప్పడుతుంది. అప్పుడు ధనుంజయ్ 'తులసితో మాట్లాడటానికి వీల్లేదని చెప్పినా వినకపోతే ఎలా' అంటాడు. అప్పుడు రత్నప్రభ 'కావాలనే పెద్దాయన మొండితనం చేస్తున్నారు. మన సహనాన్ని పరీక్షిస్తున్నారు' అంటుంది. అప్పుడాయన ఎన్ని చెప్పినా రత్నప్రభ మాత్రం వినిపించుకోదు.
అందరూ తులసి దగ్గరయ్యేలా: ముసలాయనను తిట్టిన తర్వాత తులసిని కూడా దూరంగా ఉంచాలని రత్నప్రభ అంటుంది. దీంతో ధనుంజయ్ 'తులసిని దూరంగా ఉంచితే లాక్ గురించి తెలిసేది ఎలా' అంటాడు. దీంతో 'ఎలాగోలా మన అవసరం తీర్చుకుని ఆమెను దూరం చేయాలి' అంటుంది. వాళ్లు తులసి కోసం అలా మాట్లాడుతుండగా.. మరోవైపు నందూ ఆమె దగ్గరకు వచ్చి వంట బాగోలేదని చెప్తే ఏమౌవుతుంది అంటాడు. దీనికి తులసి 'మీరు మాకోసం ఆపేక్షగా వంట చేస్తే గుర్తించకపోతే ఎలా' అంటుంది. తర్వాత నందూ తన ప్రేమను వ్యక్తపరుస్తుండగా.. తులసి పట్టించుకోదు.
చేతిని కోసేసుకున్న జాహ్నవి: తన గదిలో జాహ్నవి చేయి కట్ చేసుకుని రక్తపు మడుగులో పడి ఉంటుంది. అది చూసిన బసవయ్య కంగారుగా ఇంట్లో అందరినీ పిలుస్తాడు. జానూను అలా చూసి అందరూ షాక్ అవుతారు. ఆ వెంటనే దివ్య ఆమెకు ప్రథమ చికిత్స చేస్తుంది. తర్వాత 'బలవంతంగా చేయి కట్ చేసుకుంది నరాలు లోపలికి తెగలేదు. పెద్దగా ప్రమాదం ఏమి లేదు' అని వాళ్లకు చెప్తుంది. దీంతో జానూను పంపించేద్దామని బసవయ్య దంపతులు అనుకుంటారు. కొద్ది సేపటి తర్వాత జానూ స్పృహలోకి వస్తుంది. విక్రమ్ తనని పట్టుకోవాలని చూస్తుంటే ముట్టుకోవద్దని కోప్పడుతుంది.
నీవల్లే ఈ పని చేశాను అంటూ: ఆ తర్వాత జానూ 'నా గురించి ఎవరూ టెన్షన్ పడాల్సిన పని లేదు' అంటుంది. దీంతో విక్రమ్ 'ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు? చేయి కట్ చేసుకునేంత కష్టం ఏమొచ్చింది' అని ప్రశ్నిస్తాడు. దీనికామె 'అంత నీ వల్లే. ఈ ఇంట్లో ఎవరికీ అడ్డం కాకూడదని వెళ్లిపోతుంటే నువ్వే ఆపావు. నాతో ఎప్పటిలాగా ఉంటానని చెప్పి ఉండటం లేదు. నాకు వంట రాకపోయినా నీకోసం నేర్చుకుని ప్రేమగా వడ్డించి తీసుకొస్తే తినేశానని కసిరి పంపించావు. బావకి నా మీద ప్రేమ లేదనే మాట నేను తట్టుకోలేను. అందుకే ఈ పని చేశాను' అంటూ వివరించి చెప్తుంది. దీంతో విక్రమ్ 'సారీ జానూ.. ఆ సమయంలో మూడ్ బాగోలేక విసుక్కున్నా. ఇంకెప్పుడు అలా చేయను' అని మాట ఇస్తాడు. అది చూసి దివ్యకు కోపం వస్తుంది.
దూరంగా ఉండలేనన్న తులసి: ఇక, తులసికి ఒక కొరియర్ వస్తుంది. అది చూసిన నందూ తీసుకుని ఆమెకు అందిస్తాడు. తర్వాత అందులో ఏముంది అని అడుగుతాడు. అప్పుడు తులసి 'బొమ్మలు ఉన్నాయి. హనీకి ఇవ్వడం కోసం తీసుకున్నాను. తన బొమ్మలు పాతగా అయిపోయాయని కొత్త బొమ్మలు కొనివ్వమని అడిగింది. పాపం అనిపించి కొన్నాను' అంటుంది. దీంతో నందూ 'అంతగా కొనివ్వాలనుకుంటే వాళ్ళ ఇంటికే డెలివరీ పెట్టవచ్చు కదా' అంటాడు. దీంతో తులసి 'నా చేతులతో ఇవ్వడానికే ఇక్కడికి తెప్పించాను. అయినా నేను హనీకి దూరంగా ఉండలేను' అని తేల్చి చెప్తుంది.
హనీ పుస్తకాలను కాల్చేశారు: హనీ బయటకు వెళ్లడం వల్లే తులసిని కలుస్తుందని భావించిన రత్నప్రభ, ధనుంజయ్.. ఇకపై తనను స్కూల్‌కు పంపకూడదని డిసైడ్ అవుతారు. అప్పుడు 'ఈరోజు నుంచి హనీ స్కూల్ కి వెళ్ళడానికి వీల్లేదు. తను కనీసం గేటు దాటి బయటకి వెళ్ళడానికి కూడ వీల్లేదు. ఇది మా ఆర్డర్' అంటారు. దీంతో సామ్రాట్ బాబాయి వాళ్లను బ్రతిమాలతాడు. అయినా రత్నప్రభ 'దానికి ఇంటి పని వంట పని నేర్పిస్తాను. మీరు ఓవర్ యాక్షన్ చేయవద్దు' అంటుంది. అంతలో హనీ వచ్చి స్కూల్‌కు వెళ్తానంటే తన పుస్తకాలను ధనుంజయ్ కాల్చేస్తాడు. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











