For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: సామ్రాట్‌కు హనీ కూతురు కాదా? నిజం చెప్పడంతో కథలో ట్విస్ట్

  |

  తరాలు మారుతున్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసిని జనరల్ మేనేజర్‌ను చేయడంతో నందూ కోపంగా ఉంటాడు. అప్పుడు లాస్య అతడికి సర్ధి చెబుతుంది. అంతేకాదు, తులసితో ఏదైనా పొరపాటు చేయించి సామ్రాట్ ముందు దోషిగా నిలబెట్టాలని ప్లాన్ చేస్తుంది. ఆ తర్వాత అభికి ఇంట్లో వాళ్లు సర్ధి చెప్పే ప్రయత్నం చేస్తారు. దీంతో అతడు ఆవేదన చెందుతాడు. ఇక, హనీపై తులసి చూపిస్తున్న ప్రేమకు సామ్రాట్ ఫిదా అయిపోతాడు. అనంతరం హనీ కట్టు విప్పేసి తాను కోలుకున్నట్లు డాక్టర్ వెల్లడిస్తుంది. చివర్లో సామ్రాట్ ప్రెస్‌మీట్ పెట్టాలని అనుకుంటాడు.

  జాకెట్ లేకుండా శిల్పా చక్రవర్తి: అప్పటి స్టార్ యాంకర్.. ఇప్పుడిలా చేసిందేంటి!

   ప్రెస్‌మీట్‌కు సామ్రాట్ టీమ్ రెడీ

  ప్రెస్‌మీట్‌కు సామ్రాట్ టీమ్ రెడీ


  కంపెనీ విషయాలు చెప్పేందుకు సామ్రాట్ ప్రెస్‌మీట్‌కు రెడీ అవుతాడు. ఇంతలో తులసి వస్తుంది. అప్పుడామెతో 'ప్రెస్‌మీట్‌లో ఏం టెన్షన్ పడకండి. ఏ ప్రశ్నకైనా కూల్‌గా సమాధానం చెప్పండి' అని చెప్తాడు. దీంతో సరే అంటుందామె. ఇక, ప్రెస్‌మీట్ కోసం రిపోర్టర్లు వెయిట్ చేస్తుంటారు. అప్పుడు లాస్య 'తులసితో తన జీవితం పంచుకోవడానికి చెప్పడం కోసం ఈ ప్రెస్‌మీట్ పెట్టారేమో' అని నందూతో అంటుంది. ఆ తర్వాత హనీ నేను కూడా ప్రెస్‌మీట్‌లో కూర్చొంటా అంటుంది. దీంతో అందరూ వెళ్లి కూర్చుని కొత్త ప్రాజెక్టు గురించి చెప్తామని అంటారు.

  లాస్య చెప్పినట్లుగా ప్రశ్నలు వేసి

  లాస్య చెప్పినట్లుగా ప్రశ్నలు వేసి


  సామ్రాట్‌తో రిపోర్టర్లు మీరు అప్‌డేట్ ఇచ్చే ముందు మేము అడగాల్సిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి అని ఓ రిపోర్టర్ అంటుంది. ఆ వెంటనే ఆ రిపోర్టర్ 'భూమి పూజ జరిగిన రోజే తులసి గారు పార్టనర్‌షిప్ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు మళ్లీ మీ పక్కన కూర్చున్నారు. మీ పార్టనర్‌షిప్ కోసం మీరు ఏం చేశారు. ఆవిడ కాళ్లు పట్టుకున్నారా? తెర వెనుక ఏం జరిగింది సార్' అని సూటిగా అడుగుతుంది. దీంతో తులసి, సామ్రాట్ షాక్ అవుతారు. ఆ తర్వాత తులసి మీరు ప్రశ్నలు కొంచెం పద్ధతిగా అడగండి అని అంటుంది.

  ఎద అందాలు ఆరబోసిన హీరోయిన్: డ్రెస్ ఉన్నా లేనట్లే దారుణంగా!

  సామ్రాట్, తులసి పెళ్లి గురించి

  సామ్రాట్, తులసి పెళ్లి గురించి


  తులసి కోప్పడగానే ఆ రిపోర్టర్ 'సరే అది రూమరే అని అనుకుందాం. ఏమాత్రం చదువులేని తులసి గారిని ఆఫీసులో అతి పెద్ద పోస్ట్‌లో పెట్టడం కూడా రూమరేనా? ఎవరి మీదా చూపించని శ్రద్ధ మీరు కేవలం తులసి గారి మీదనే చూపించడం కూడా రూమరేనా' అంటూ ఒకరి తర్వాత ఒకరు ప్రశ్నల వర్షం కురిపిస్తారు. అప్పుడు సామ్రాట్ ఎందుకు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు అని అడుగుతాడు. దీంతో వాళ్లు 'మీకు నిజంగా తెలియదో.. తెలిసీ తెలియక నాటకం ఆడుతున్నారో కానీ.. మీ ఇద్దరి గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. మీరిద్దరూ ఒకరిని మరొకరు ఇష్టపడుతున్నారు. త్వరలోనే ఒక్కటి కాబోతున్నారని అని అనుకుంటున్నారు' అని చెబుతారు.

  సామ్రాట్ భార్య ప్రస్తావన తెచ్చి

  సామ్రాట్ భార్య ప్రస్తావన తెచ్చి

  అంతేకాదు, 'మీ బిజినెస్ పార్టనర్‌ను లైఫ్ పార్టనర్‌గా చేసుకుంటున్నారు ఓకే కానీ.. మీ భార్య సంగతి ఏంటి? దేనికీ సమాధానం చెప్పడం లేదంటే నిందలన్నీ నిజాలుగా ఒప్పుకున్నట్టేనా' అని ప్రశ్నిస్తారు. అప్పుడు తులసి 'అడిగే వాడికి చెప్పేవాడు ఎప్పుడూ లోకువే. ఊహించుకున్నదే నిజం అనుకుంటారు. వాళ్లేమనుకుంటున్నారు.. రూమర్లు, పుకార్లు అంటూ ఏదైనా అడగొచ్చు. తప్పు లేదు కానీ.. దాని తాలూకు బాధ భరించే వాళ్లకే తెలుస్తుంది. ఒక ఆడ, ఒక మగ కలిసి బిజినెస్ పార్టనర్స్‌గా ఉండటం తప్పా? అలా ఉంటే ఏదో సంబంధం ఉన్నట్టేనా' అని ప్రశ్నిస్తుంది.

  స్విమ్‌సూట్‌లో అమలా పాల్ పరువాల విందు: ఇంత హాట్‌గా ఇదే తొలిసారి

  వాళ్లను కూడా అలాగే ప్రశ్నిస్తారా

  వాళ్లను కూడా అలాగే ప్రశ్నిస్తారా


  రిపోర్టర్ల ప్రశ్నలపై తులసి 'ఎందుకు సూటిపోటి మాటలతో బాధిస్తారు. వాళ్ల బతుకులను వాళ్లను బతకనివ్వరా? మీ ముందు అగ్ని పరీక్షకు నిలబడాలా? తరతరాలుగా ఆంక్షలను, ఇనుప గోడల మధ్య మక్కిన ఆడది.. ఇప్పుడిప్పుడే అడుగులు బయటపెట్టి స్వేచ్ఛగా ఎగరాలని అనుకుంటోంది. ఎందుకు మిమ్మల్ని దోషులుగా నిలబెడుతున్నారు. మేము చేసిన తప్పులేంటి? నా ముందు కూర్చొన్న రిపోర్టర్లలో ఆడవాళ్లు కూడా ఉన్నారు. మీ కుటుంబంలో కూడా ఆడవాళ్లు ఉంటారు. ఉద్యోగం చేస్తుంటారు. వాళ్లను కూడా ఇలాంటి ప్రశ్నలు అడుగుతారా' అని క్లాస్ పీకుతుంది.

   రిలేషన్‌పై క్లారిటీ ఇచ్చిన తులసి

  రిలేషన్‌పై క్లారిటీ ఇచ్చిన తులసి


  ఆ తర్వాత తులసి 'ప్రతి మగాడిని చేతులు జోడించి అడుగుతున్నాను. దయచేసి ఆడదాన్ని నిందించకండి. గౌరవించండి. మీరు రాసే రాత ఆడదాని తలరాత మారుస్తుందని గుర్తుంచుకోండి. ఆడదాన్ని కూడా బతకనివ్వండి. బయట మా గురించి నలుగురు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు తెలియదు. పట్టించుకోను. మా ఇద్దరి మధ్య ఉన్నది కేవలం వ్యాపార భాగస్వామ్యం మాత్రమే. ఎవరికి నచ్చినా.. నచ్చకపోయినా.. అవునన్నా కాదన్నా ఆ భాగస్వామ్యం తెగిపోదు. ఎవరేమనుకున్నా వెనక్కి తగ్గేదే లేదు.. రాసుకోండి' అంటుంది. దీంతో రిపోర్టర్లు అందరూ చప్పట్లు కొడతారు.

  హాట్ షోతో పిచ్చెక్కిస్తోన్న నిహారిక: నెవ్వర్ బిఫోర్ ఫోజుతో అరాచకం

  అనుమానం.. సామ్రాట్ ఆవేదన

  అనుమానం.. సామ్రాట్ ఆవేదన


  రిపోర్టర్లు వెళ్లిపోయిన తర్వాత తులసిని ఇంట్లో వాళ్లు అందరూ అభినందిస్తారు. కానీ, అందరూ సామ్రాట్ ఎందుకు తన భార్య గురించి చెప్పలేకపోయాడో అని అనుకుంటారు. ఆ తర్వాత సామ్రాట్ హనీ నిద్ర పోతుండగా ఆమె దగ్గర కూర్చుంటాడు. అప్పుడు మనసులో 'నిప్పులాంటి నిజాన్ని నా మనసులోనే దాచుకొని నీ సంతోషం కోసం నేను తప్పు చేస్తున్నా. నాన్న కాని నాన్నను క్షమించమ్మా. ఈ అమ్మ ప్రేమను వదులకొని నా చెల్లి తన జీవితాన్ని కాదనుకొని వెళ్లిపోయింది. నీలో నా చెల్లిని చూసుకుంటున్నాను. నా చెల్లికి అందించాల్సిన ప్రేమను నీకు అందిస్తున్నాను. ఇది తప్పా ఒప్పా అనేది దేవుడే చెప్పాలి. భారమంతా ఆ దేవుడికే వదిలేస్తున్నాను' అని నిజం చెప్తాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 747: Reporters Asks to Tulasi About Annoying Questions. Then She Fires on Them. After That Samrat Feels Emotional About her Sister.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X