Intinti Gruhalakshmi September 27th Episode: లాస్యను దెబ్బకొట్టిన అక్షర.. శృతి గురించి తెలుసంటూ!

మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో ఓ లుక్కేద్దాం పదండి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ప్రేమ్ విషయంలో శృతి తీసుకున్న నిర్ణయంపై అసహనంగా ఉన్న తులసి.. ఆమెను దూరం పెడుతూ ఉంటుంది. దీంతో శృతి ఎంతగానో బాధ పడుతుంది. ఆ సమయంలో ఇద్దరి మధ్య చర్చ జరుగుతుంది. అనంతరం ఆమెకు పని అప్పగిస్తుంది తులసి. ఆ తర్వాత మాధవికి ఫోన్ చేసి ప్రేమ్ పెళ్లి చూపులకు రమ్మని తులసి కోరుతుంది. దానికి ఆమె అంగీకరించకపోవగా కోప్పడతుంది. కానీ, చివరకు ఆమెను ఒప్పిస్తుంది. ఇక, లాస్య అక్షరను పడేయడానికి డైమండ్ నెక్లెస్‌ను కొంటుంది. దీనికి భాగ్య ఆమెను ఎంతగానో పొగుడుతుంది.

 నందూను సూటిగా ప్రశ్నించిన మాధవి

నందూను సూటిగా ప్రశ్నించిన మాధవి

ప్రేమ్ పెళ్లి చూపులకు వేగంగా ఏర్పాట్లు జరుగుతుండగా మాధవి తన భర్త మోహన్‌తో కలిసి అక్కడికి వస్తుంది. అప్పుడు నందూ అక్కడకు చేరుకుని వాళ్లిద్దరి స్వాగతం పలుకుతాడు. ఆ సమయంలో మాధవి 'చాల్లే అన్నయ్య. నువ్వేమైనా మమ్మల్ని పిలిచావా? అయినా నీకు కొడుకు మనసు తెసుకోవడమే తెలీదు. ఈ ఫార్మాలిటీస్ ఏం తెలుస్తాయిలే' అని దెప్పొపొడుస్తుంది. దీంతో 'తులసి ఎలాగో చెప్పుంటుందని నేను చెప్పలేదు. అయినా అవన్నీ ఇప్పుడెందుకు పెళ్లి వాళ్లు వచ్చే టైం అయింది' అంటాడు నందూ. అప్పుడు తుసలి మాధవిని ఆపుతుంది.

 లాస్యకు కోలుకోలేని షాక్ ఇచ్చిన అక్షర

లాస్యకు కోలుకోలేని షాక్ ఇచ్చిన అక్షర

ఇంట్లో వాళ్ల మధ్య చర్చ జరుగుతోన్న సమయంలోనే జీకే తన కుమార్తె అక్షరను తీసుకుని అక్కడకు వస్తాడు. దీంతో అందరూ వాళ్లకు స్వాగతం పలికేందుకు బయటకు వెళ్తారు. ఆ సమయంలో శృతి వచ్చి అక్షర ముఖాన్ని చూడ్డానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు రాములమ్మ 'ఏంటి శృతమ్మా.. నాకు దక్కాల్సిన అదృష్టం ఎవరికి దక్కిందా అని చూస్తున్నావా' అని ప్రశ్నిస్తుంది. దీంతో అదేం లేదంటూ ఆమె బదులిస్తుంది. అనంతరం అక్షర లాస్యను కాదని తులసి దగ్గరకు వెళ్లి ఆశీర్వదించమని కోరుతుంది. దీంతో అక్కడున్న అందరూ షాకైపోయి నోరెళ్లబెట్టేస్తారు.

తులసికి సారీ చెప్పిన అక్షర.. అందుకే

తులసికి సారీ చెప్పిన అక్షర.. అందుకే

అక్షర వచ్చిన వెంటనే ఆమెను చూసిన శృతి ఏడుస్తూ లోపలికి వస్తుంది. దీంతో రాములమ్మ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత లోపలికి వచ్చిన అక్షర.. తులసితో 'సారీ ఆంటీ. మొన్న మీరు మా ఇంటికి వచ్చారంట. అప్పుడు పడుకుని ఉన్నాను. లేకుంటే అప్పుడే మనం పరిచయం అయ్యేవాళ్లం' అని అంటుంది. దీంతో పక్కనే ఉన్న అనసూయ 'అదేం లేదులేమ్మా.. పెద్దింటి పిల్లవు ఇలాంటివి అవసరం లేదు' అంటుంది. దీనికి 'ఎంత పెద్దిళ్లైనా అత్తగారింట్లో అనకువగా ఉండాలని డాడీ చెప్పారు. నేను అలాగే ఉంటాను' అంటూ బదులిస్తుంది అక్షర.

అక్షరకు లాస్య బహుమతి.. భాగ్య అలా

అక్షరకు లాస్య బహుమతి.. భాగ్య అలా

అక్షర వచ్చి తులసితోనే ఎక్కువగా క్లోజ్‌గా ఉంటుంది. దీంతో భాగ్య వచ్చి లాస్యతో 'ఇక నీ పనైపోయినట్లే లాస్య. ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్లుంది నీ పని. అన్నీ నువ్వు చేస్తే అక్షర వెళ్లి తులసితో మంచిగా ఉంటుంది' అని అంటుంది. దీనికి లాస్య 'తులసి మాటలతో పడేస్తే నేను గిఫ్ట్‌తో పడేస్తా' అంటూ అక్షరకు డైమండ్ నెక్లెస్ బహుమతిగా ఇస్తుంది. ఇది చూసి వెంటనే ఆమెకు థ్యాంక్స్ చెబుతుంది. ఆ సమయంలో లాస్య స్వయంగా దాన్ని అక్షర మెడలో అలంకరిస్తుంది. అప్పుడు అక్షర ఎంతగానో సంతోషిస్తుంది. దీనికి లాస్య, భాగ్య ఖుషీ అవుతారు.

ప్రేమ్‌కు మాధవి సలహా.. వినిపించదు

ప్రేమ్‌కు మాధవి సలహా.. వినిపించదు

శృతి ఫొటోను చూస్తూ బాధ పడుతోన్న ప్రేమ్‌ దగ్గరకు వచ్చిన మాధవి అతడిని ఓదార్చుతుంది. ఈ క్రమంలోనే 'ఇంకో అమ్మాయి మెడలో తాళి కట్టే వరకూ నీకు అవకాశం ఉంది. నీ ప్రేమ గురించి పోరాడు. శృతి ఒప్పుకోలేదు అని బాధ పడుతున్నావు. అసలు తను ఎందుకు ఒప్పుకోలేదని ఆలోచించావా? ఒకసారి శృతి వైపు నుంచి కూడా ఆలోచించు. దానికి సమాధానం వెతుకు. అంతేకానీ, నీ ప్రేమను చంపుకోకు. అక్షరను పెళ్లి చేసుకుంటే ఆమెను కూడా మోసం చేసినట్లే. అందుకే నీకు సమయం ఉంది కదా ఆలోచించు' అతడికి విలువైన సలహాలను ఇస్తుంది.

 మధ్యలో వచ్చిన శృతి.. అక్షర ప్రశ్నతో

మధ్యలో వచ్చిన శృతి.. అక్షర ప్రశ్నతో

ఇంట్లో వాళ్లతో జీకే మాట్లాడుతోన్న సమయంలో శృతి కాఫీ పట్టుకుని అక్కడకు వస్తుంది. అప్పుడామెను చూసిన వాళ్లిద్దరూ అలాగే ఉండిపోతారు. ఆ సమయంలో అక్షర 'ఇంట్లో అందరూ ఎవరికి ఏమవుతారో తెలిసింది. మరి ఈ అమ్మాయి ఎవరు' అంటూ అందరినీ ప్రశ్నిస్తుంది. అప్పుడందరూ మౌనంగా ఉండిపోతారు. అంతేకాదు, మనసులో శృతిని తిట్టుకుంటూ ఉంటారు. అలాగే ఏం జరుగుతుందా అని టెన్షన్ పడుతుంటారు. సరిగ్గా అప్పుడే లాస్య 'ఆమె తులసి వాళ్ల ఫ్రెండ్ కూతురు. అమ్మానాన్న లేకపోతే జాలితో ఇంటికి తీసుకొచ్చింది' అంటూ బదులిస్తుంది.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
తులసే కరెక్ట్ అన్న అక్షర.. శృతి ఫ్రెండ్

తులసే కరెక్ట్ అన్న అక్షర.. శృతి ఫ్రెండ్

శృతిని ఉద్దేశించి జీకే 'హో ఇంట్లో పనులు చేసే అమ్మాయా' అంటాడు. దీనికి అక్షర 'పనులు చేసే అమ్మాయి కాదు డాడీ.. ఎందుకో ఈమెను చూస్తే ఇంట్లో అమ్మాయిలానే అనిపిస్తుంది. పని వాళ్లైన మన వాళ్లలా భావించాలి' అంటుంది. దీనికి మోహన్ చప్పట్లు కొట్టి ఆమెను అభినందిస్తాడు. ఆ తర్వాత అక్షర.. శృతితో 'అవును.. మనిద్దరం ఎప్పుడైనా కలిశామా? పోనీ మాట్లాడుకున్నామా. ఎందుకనో నిన్ను చూస్తుంటే నా ఫ్రెండ్‌లా అనిపిస్తున్నావు. చాలా కాలంగా పరిచయం ఉన్న అమ్మాయిలా కనిపిస్తున్నావు' అంటుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X