For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi September 28th Episode: లాస్యకు భారీ ఎదురుదెబ్బ.. గృహలక్ష్మి సీరియల్ రికార్డు

  |

  తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో ఓ లుక్కేద్దాం పదండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. శృతి గురించి బాధ పడుతోన్న ప్రేమ్‌కు మాధవి విలువైన సలహాలు ఇస్తుంది. అసలు శృతి ఎందుకు వద్దని అనుకుంటుందో ముందు తెలుసుకోమని అతడికి సూచిస్తుంది. ఆ తర్వాత జీకే తన కుమార్తె అక్షరను తీసుకుని నందూ ఇంటికి వస్తాడు. ఆ సమయంలో ఆమె లాస్యను కాదని తులసి ఆశీర్వాదం తీసుకుంటుంది. అనంతరం కాఫీ పట్టుకుని వచ్చిన శృతి గురించి అక్షర తులసితో పాటు అందరినీ ప్రశ్నిస్తుంది. దీంతో ఆమె గురించి చెబుతుంది లాస్య. అప్పుడు అక్షర.. శృతిని చూస్తే తన ఫ్రెండ్‌లా ఉందని అంటుంది.

  అరాచకమైన ఫొటోలతో షాకిచ్చిన అమలా పాల్: బీచ్‌లో బికినీతో అందాలు మొత్తం కనిపించేంత ఘాటుగా!

  మౌనంగా ఉన్న ప్రేమ్.. అనుమానాలు

  మౌనంగా ఉన్న ప్రేమ్.. అనుమానాలు

  శృతి గురించి మాట్లాడిన తర్వాత ఆమె లోపలికి వెళ్లిపోతుండగా.. ప్రేమ్ ఆమెకు ఎదురుగా వస్తాడు. అప్పుడు అతడిని నందూ జీకేకు పరిచయం చేస్తాడు. అలాగే, వాళ్లకు కొడుకును కూడా పరిచయం చేస్తాడు. ఆ సమయంలో అందరూ మాట్లాడుతున్నా ప్రేమ్ మాత్రం నోరు విప్పడు. దీంతో అక్షర, జీకే ‘ఏంటి ప్రేమ్ ఏమీ మాట్లాడడం లేదు' అంటూ అనుమానంగా అడుగుతారు. దీనికి నందూ ‘మీరు కొత్త కదా అందుకే సైలెంట్‌గా ఉన్నాడు' అని బదులిస్తాడు. అప్పుడు అక్షర ‘మీరూ నాకు కొత్తే కదా అంకుల్. అయినా నేను కలిసిపోలేదా' అని అడుగుతుంది.

   ప్రేమ్‌ను అలా సర్‌ప్రైజ్ చేసిన అక్షర

  ప్రేమ్‌ను అలా సర్‌ప్రైజ్ చేసిన అక్షర

  ప్రేమ్ ఎంతకీ మాట్లాడకపోయే సరికి అక్షర ఓ అడుగు ముందుకేసి ‘డాడీ నేను ప్రేమ్‌తో పర్సనల్‌గా మాట్లాడాలి' అని అంటుంది. దీంతో నందూ అతడి వెళ్లమని చెప్పబోతాడు. అంతలో ప్రేమ్ అక్కడి నుంచి లేచి వెళ్లిపోతాడు. అతడి వెనుకే అక్షర కూడా వెళ్తుంది. అప్పుడు ‘ఏంటి ప్రేమ్ నువ్వు అంత సైలెంట్‌గా ఉండిపోయావు? నువ్వు నన్ను కలవడం ఇది రెండోసారి. ఫస్ట్ టైమ్ మనం కాఫీషాప్‌లో కలిశాం. అక్కడ నిన్ను నేను యూట్యూబర్‌లా వచ్చి ప్రేమ గురించి అభిప్రాయాలు చెప్పమని అడిగాను కదా' అంటూ చెప్పగానే అతడు సర్‌ప్రైజ్ అయిపోతాడు.

  అందాలన్నీ చూపిస్తూ రెచ్చిపోయిన పవన్ హీరోయిన్: బట్టలు ఉన్నా లేనట్లే.. మరీ ఇంత దారుణంగానా!

  నీతో లైఫ్ స్టార్ట్ చేయాలని ఉంది ప్రేమ్

  నీతో లైఫ్ స్టార్ట్ చేయాలని ఉంది ప్రేమ్


  ప్రేమ్‌తో మాట్లాడుతోన్న సమయంలోనే అక్షర ఎంతో సంతోషంగా కనిపిస్తుంది. అంతేకాదు, అప్పుడు అతడికి సారీ కూడా చెబుతుంది. ‘ప్రేమ్ నీకు సారీ చెప్పాలి. ఎందుకంటే ఆరోజు కాఫీషాప్‌కు యూట్యూబర్‌లా వచ్చాను. కానీ, నీతో మాట్లాడాలి అన్న ఆలోచనతోనే అలా నటించాను. నాకైతె ఎప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటానా? ఎప్పుడు నీతో కొత్త లైఫ్‌ను మొదలు పెడతానా అని ఎంతో ఆసక్తిగా ఉంది' అని ఏదేదో చెబుతుంటుంది. అంతలో కింద ఉన్న శృతిని చూసిన ప్రేమ్ అలా ఉండిపోతాడు. కానీ, అక్షర మాత్రం తన మనసులోని మాటలను చెబుతుంది.

  తృప్తిగా ఉందన్న జీకే.. ఎంగేజ్‌మెంట్

  తృప్తిగా ఉందన్న జీకే.. ఎంగేజ్‌మెంట్

  అక్షర, ప్రేమ్ పర్సనల్‌గా మాట్లాడుకుని వచ్చిన తర్వాత జీకే ‘నాకు చాలా తృప్తిగా ఉంది. మీ కుటుంబంలో ప్రేమానురాగాలు చూస్తుంటే.. నా కూతురిని ఎప్పుడు ఈ ఇంటికి కోడలిని చేయాలా అని ఆశగా ఉంది. మా ఇంట్లో ఇద్దరమే ఉంటాం కదా.. మీ ఇంట్లో ఇంత మంది ఉండే సరికి సంతోషంగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం ఆ ఎంగేజ్‌మెంట్, పెళ్లి పనులు కూడా చేసేస్తే మంచిది. పంతులు గారిని పిలిచి రేపే నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టుకుందాం ఏమంటారు నందూ' అని అడుగుతాడు. ఆ సమయంలో నందూ సహా ఇంట్లో వాళ్లంతా దానికి ఓకే చెప్పేస్తారు.

  Bigg Boss: ఐదో సీజన్‌లో విజేత ‘అతడే'నా.. అలా బయటకు వచ్చిన మేటర్.. బిగ్ బాస్ తీరుపై అనుమానాలు

  అప్పుడే వద్దన్న తులసి.. అంతా కలసి

  అప్పుడే వద్దన్న తులసి.. అంతా కలసి

  రేపే నిశ్చితార్థం చేయాలని జీకే అనడంతో తులసి మాత్రం తెగ కంగారు పడిపోతుంది. అప్పుడామె మాట్లాడుతూ ‘అన్నయ్య గారూ.. మరీ రేపే నిశ్చితార్థం అంటే ఎలా? ఒక్కరోజు సమయం సరిపోదు. ఇంట్లో పనులు చేసుకోవాలి.. బంధువులను ఆహ్వానించుకోవాలి. ఇవన్నీ జరగాలంటే వీలైనంత ఎక్కువ సమయం ఉండాలి కదా' అని అంటుంది. అప్పుడు నందూ, లాస్య, అనసూయలు మాత్రం ‘మనమంతా ఉన్నాం కదా. కలిసి పనులు చేసుకుంటే త్వరగానే అయిపోతాయి. అయినా నీకు ఎంతో కంగారు తులసి. ఏం కాదులే బాధపడకు' అని చెబుతారు.

  లాస్యకు కోలుకోలేని షాక్ ఇచ్చిన జీకే

  లాస్యకు కోలుకోలేని షాక్ ఇచ్చిన జీకే

  ఎంగేజ్‌మెంట్ గురించి చెప్పిన వెంటనే పెళ్లి విషయం కూడా మాట్లాడతాడు జీకే. ఆ సమయంలో పరందామయ్య పెళ్లికి కాస్త సమయం కావాలని అడుగుతాడు. అప్పుడు జీకే ‘గతంలో మాదిరిగా కాదండీ. ఈ మధ్య పెళ్లి చేయాలంటే ఏర్పాట్లు చేయడానికి చాలా మంది ఉన్నారు. వెంటనే అవన్నీ చేసేస్తారు. నందూ గారూ మీరు మీ ఆవిడ కలిసి దగ్గరుండి పెళ్లి చేయాలి' అని అడుగుతాడు. అప్పుడు లాస్య మాట్లాడుతుండగా.. జీకే ‘మీరెందుకు మాట్లాడుతున్నారు. నేను అన్నది నందూ, తులసి గారి గురించి. వాళ్లిద్దరే పెళ్లి చేయాలి' అంటూ చెప్పి షాకిస్తాడు.

  ప్రభాస్, ఎన్టీఆర్‌పై పవన్ కల్యాణ్ ఊహించని కామెంట్స్: సన్నాసుల్లారా అవి ఊరికే ఇవ్వలేదురా అంటూ!

  నందూకు జీకే కండీషన్ పెట్టడం వల్ల

  నందూకు జీకే కండీషన్ పెట్టడం వల్ల

  జీకే పెట్టిన కండీషన్‌కు ముందు షాకైన నందూ.. ఆ తర్వాత వెంటనే ఓకే చెబుతాడు. అయితే, తులసి మాత్రం దానికి మౌనంగానే ఉండిపోతుంది. ఆ సమయంలో జీకే మాట్లాడుతూ.. ‘ప్రేమ్‌ను కని పెంచావు. అతడికి కూడా తన తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి పెళ్లి చేయాలని ఉండదా చెప్పమ్మా' అని సర్ధి చెబుతాడు. దీనికి అనసూయ కూడా ఎందుకు ఆలోచిస్తున్నావు అని కంగారు పెడుతుంది. అప్పుడు మాధవి ‘నువ్వు ఆగమ్మా. వదినకు అభిప్రాయాలు ఉండవా' అని ప్రశ్నిస్తుంది. దీంతో తులసి మౌనంగానే ఉంటుంది. ఆ తర్వాత జీకే పెళ్లి గురించి మాట్లాడుకుందాం అంటూ ముగిస్తాడు. దీంతో ఈ ఎపిసోడ్ పూర్తైంది.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  రేటింగ్‌లో దూసుకుపోతోన్న గృహలక్ష్మి

  రేటింగ్‌లో దూసుకుపోతోన్న గృహలక్ష్మి

  అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ విషయానికి వస్తే.. ఈ ఏడాది 37వ వారంలో రూరల్ ప్రాంతంలో 12.24 రేటింగ్‌ను, అర్భన్ ప్రాంతంలో 11.61 రేటింగును సొంతం చేసుకొన్నది. గతవారం అంటే 36వ వారంలో రూరల్‌లో ఈ సీరియల్ 13.26 రేటింగ్, అర్బన్‌లో 12.73 రేటింగ్ నమోదు చేసుకొన్నది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 436: Lasya Upset for GK Decision on His Daughter Marriage. Then Akshara Feels Happy about her Engagement with Prem.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X