Intinti Gruhalakshmi: ఒక్కటైపోయిన దివ్య, విక్రమ్.. జానూకు రాజ్యలక్ష్మి ఝలక్.. నిజం దాచేసిన తులసి

సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే : బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. దివ్యతో గొడవ జరిగిన తర్వాత బాధగా బయటకు వచ్చిన విక్రమ్‌ను జానూ ఓదార్చుతుంది. ఆ సమయంలో విక్రమ్‌ను రెచ్చగొట్టి అతడికి దగ్గర అవ్వాలని అనుకుంటుంది. కానీ, విక్రమ్ మాత్రం తనకు దివ్యపై ప్రేమ ఉందనే అంటాడు. హనీని కలిసి వచ్చిన తులసి బాధగా ఇంటికి రావడం గమనించిన నందూ ఏమైందని అడుగుతాడు. తర్వాత నందూకు రత్నప్రభ ఫోన్ చేసి తులసికి శిక్ష పడబోతుంది అని బెదిరిస్తుంది. ఇక, భాగ్య ఇంట్లో తులసి తాగుతూ ఉంటుంది. భాగ్యను తనకు ఇష్టం వచ్చినవి వండి పెట్టమని అడుగుతుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode September 28th 2023

ఇంకెప్పుడూ నీకు దూరం కాను : విక్రమ్ ప్రేమను దివ్య అర్థం చేసుకుని ప్రేమగా మాట్లాడుతుంది. దీంతో విక్రమ్ 'నువ్వు నా మనసులో ఉన్నావని తెలుసుకోలేకపోయాను' అంటాడు. దీంతో దివ్య 'తెలుసుకోలేకపోవడం కాదు.. ఉక్రోషం కమ్మేసింది. ఇంకెప్పుడు నీకు దూరం కాను. ఆవేశంలో చేసిన చిన్న తప్పుకు చాలా పెద్ద శిక్ష అనుభవించాను. నువ్వంటే నిర్లక్ష్యంతో వదిలేసి పుట్టింటికి వెళ్లలేదు. నేను ప్రాణంగా ప్రేమించే విక్రమ్ అర్థం చేసుకోలేదని వెళ్లాను. వెంటనే విషయం అర్థం చేసుకుని నీకోసం తిరిగి వచ్చేశా. ఐలవ్యూ విక్రమ్. ఇది నిజంగా నా గుండెల్లో నుంచి వచ్చిన మాట' అంటుంది.

ఎవరి ఇంట్లో వాళ్లే చేసుకోవాలి : తులసి బండి మీద నుంచి కింద పడిపోతుంది. దీంతో ఆమెకు దెబ్బలు తగులుతాయి. అప్పుడు డాక్టర్ వచ్చి ఆమెను చూసి 'ఎవరి సపోర్టు తీసుకోకుండా బెడ్ మీద నుంచి కిందకు దిగకూడదు. ఇంట్లో పనులు కూడా చేయకూడదు' అని చెప్పేసి వెళ్లిపోతుంది. దీంతో పరందామయ్య, అనసూయలు నందూ వల్లే ఇలా జరిగిందని తిడుతుంటారు. అంతలోనే దివ్య తులసికి ఫోన్ చేస్తుంది. అప్పుడు తనకు దెబ్బలు తగిలిన విషయం దివ్యకు చెప్పొద్దని అనుకుంటుంది. ఇక, పండగ గురించి దివ్య చెప్పడంతో తులసి ఎవరింట్లో వాళ్ళే చేసుకోవాలని అనడంతో సరే అని చెబుతుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode September 28th 2023

మహాలక్ష్మి చేతిలో పెట్టమని : జానూ, బసవయ్య చెస్ ఆడుకుంటూ ఉండగా రాజ్యలక్ష్మి వచ్చి దివ్య గురించి ప్లాన్లు చెప్తుంటుంది. అంతలోనే విక్రమ్ వచ్చి తల్లికి స్థలం తాలూకూ డాక్యుమెంట్స్ ఇవ్వబోతాడు. దీంతో అవి తనకు కాదని ఇంటి మహాలక్ష్మి దివ్య చేతిలో పెట్టమని చెప్తుంది. దీంతో జానూ షాక్ అవుతుంది. తల్లి చెప్పడంతో డాక్యూమెంట్లను విక్రమ్ దివ్యకు అందిస్తాడు. వాటిని తీసుకుని జాగ్రత్తగా దాచి పెట్టమని అంటుంది. అంతేకాదు, చవితి రోజు దేవుడి ముందు పూజలో పెట్టమని చెప్తుంది. దీంతో రాజ్యలక్ష్మి ప్రవర్తనలో ఏదో మార్పు వచ్చిందని, ఏదో ప్లాన్ చేసిందని దివ్య అనుకుంటుంది. ఇక, డాక్యూమెంట్లను తనకు ఇప్పించలేదని జానూ బాధపడుతుంది.

సేవలు చేసుకోనివ్వు తులసి : దెబ్బలు తగిలి మంచానికే పరిమితం అయిన తులసి నిరాశగా ఉంటుంది. అప్పుడు దాహం అవడంతో పక్కనే ఉన్న మంచి నీళ్ల బాటిల్‌ను అందుకోవాలని అనుకుంటుంది. కానీ, ఆ బాటిల్‌ను కింద పడేస్తుంది. అది విన్న వెంటనే నందూ కంగారుగా వస్తాడు. వచ్చి అది ఆమె చేతికి అందిస్తాడు. అంతేకాదు, 'నువ్వు కోలుకునే వరకూ సేవలు చేసుకోనివ్వు తులసి' అని అంటాడు. దీంతో వినాయక చవితికి కావాల్సిన పూజ సామాగ్రి మొత్తానికి తీసుకు రమ్మని నందూకు చెబుతుంది.

Intinti Gruhalakshmi Serial Today Episode September 28th 2023

ఆంటీని ఇబ్బంది పెట్టనని : రత్నప్రభ వాళ్లు హింసిస్తుండగా హనీ ఒంటరిగా కూర్చుని బాధ పడుతూ ఉంటుంది. అంతేకాదు, 'ఇకపై తులసి ఆంటీని ఇబ్బంది పెట్టను' అని అనుకుంటుంది. తర్వాత హనీ అన్నం తింటుంటే రత్నప్రభ వచ్చి తన ముందు ఉన్న ప్లేట్ లాగేసి పచ్చి కూరగాయ ముక్కలు పెడుతుంది. అంతేకాదు, 'ఇక నుంచి హనీ ఇవే తినాలి' అంటుంది. దీనికి సామ్రాట్ బాబాయి 'నీ ప్రతాపం ఏదైనా ఉంటే నా మీద చూపించు.. చిన్న పిల్ల మీద కాదు. దాని ఆస్తి మీద పెత్తనం చెలాయిస్తూ దాన్నే పస్తులు ఉంచుతావా' అంటూ ఆమెపై సీరియస్ అవుతాడు.

హనీ అలా.. తులసేమో ఇలా : సామ్రాట్ బాబాయి మాటలు విన్న రత్నప్రభ 'చాలా పెద్ద మాటలు వస్తున్నాయి. నోరు అదుపులో పెట్టుకోకపోతే చాలా జరుగుతుంది' అంటుంది. దీంతో హనీ వాటిని తినడం తనకు ఇష్టమే అని చెప్తుంది. మరోవైపు తులసి మంచం దిగడానికి ట్రై చేస్తుంటే మళ్ళీ నందూ ఫుడ్ పట్టుకుని వస్తాడు. ఆ తర్వాత ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటారు. తులసి భోజనం చేస్తూ ఉండగా ఆగిపోయి హనీ గుర్తుకు వచ్చిందని బాధపడుతుంది. తన గురించి చూసుకోవడానికి ఆ ఇంట్లో చాలా మంది ఉన్నారని అంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X